Hotstar Press Meet: Nagarjuna Going To Host Bigg Boss 6 Telugu Officially Confirmed - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu OTT Host: బిగ్‌ అనౌన్స్‌మెంట్‌.. బిగ్‌బాస్‌-6 హోస్ట్‌ ఎవరంటే..

Published Fri, Dec 24 2021 1:24 PM | Last Updated on Fri, Dec 24 2021 2:50 PM

Hotstar Press Meet: Nagarjuna Going To Host Bigg Boss 6 Telugu Confirmed - Sakshi

Bigg Boss 6 OTT Telugu Host: బిగ్‌బాస్‌ సీజన్‌-5 ముగిసింది. అయితే బిగ్‌బాస్‌ లవర్స్‌ కోసం అతి త్వరలోనే బిగ్‌బాస్‌ ఓటీటీ ప్రారంభం కానున్న సంగతి తెలిసింది. దీంతో సీజన్‌-6కి హోస్ట్‌గా ఎవరు చేయనున్నారనే దానిపై రకరకాల పేర్లు తెరమీదకి వచ్చాయి. అన్‌స్టాపబుల్‌ షోతో అదరగొడుతున్న బాలయ్య ఈ కొత్త సీజన్‌కి హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా డిస్నీ+హాట్‌స్టార్‌ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో దీనిపై క్లారిటీ వచ్చేసింది.

మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న బిగ్‌బాస్‌  ఓటీటీకి కూడా తానే హోస్టింగ్‌ చేయనున్నట్లు నాగార్జున స్వయంగా ప్రకటించాడు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్‌ తెలుగు.. ఇండియాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా నెంబర్‌1 షో.  వీకెండ్‌ ఎపిసోడ్‌కి సుమారు 5-6కోట్ల మంది లైవ్‌ చూశారు. దీన్ని బట్టి బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌కు ఎంతమంది అభిమానులున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఇక నెక్ట్స్‌ సీజన్‌ ఓటీటీ వేదికగా ప్రసారం కానుంది. 24 గంటల పాటు లైవ్‌ స్ట్రీమింగ్‌ ఉండనుంది. ఇది బిగ్గెస్ట్‌ ఛాలెంజ్‌ నాకు. ఆ 24 గంటలు చూసి అనాలసిస్‌ చేసి వీకెండ్‌ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లతో ముచ్చటించాల్సి ఉంటుంది' అని వివరించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement