![Buzz Is That Bigg Boss Season 7 Is Going To Host Manchu Vishnu - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/30/vish.jpg.webp?itok=5YWPVt1O)
బుల్లితెరపై బిగ్‌బాస్ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని భాషల్లో బిగ్‌బాస్ సూపర్ హిట్ అయ్యింది. ఇక తెలుగులోనూ ఈ షోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే 6సీజన్‌లు విజయవంతంగా పూర్తవగా త్వరలోనే బిగ్‌బాస్ తెలుగు సీజన్-7 ప్రారంభం కానుంది. ఈ క్రమంలో హోస్ట్ ఎవరన్నదానిపై నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతుంది.
ప్రస్తుతం నెట్టింట అందుతున్న సమాచారం ప్రకారం.. నాగార్జున బిగ్‌బాస్7కు హోస్ట్‌గా వ్యవహరించే అవకాశం లేన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో బాలయ్య, రానా పేర్లు తెరమీదకి వచ్చాయి. తాజాగా బిగ్‌బాస్ హోస్ట్‌గా మంచు విష్ణు వ్యవహరించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే బిగ్‌బాస్ టీం ఆయన్ను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఇదే గనుక నిజమైతే హోస్ట్‌గా విష్ణు ఎలా మెప్పిస్తారన్నది చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment