Buzz: That Divorced Couple Noel Sean And Ester Noronha All Set To Enter In Telugu Bigg Boss 7? - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 : బిగ్‌బాస్‌లోకి విడాకులు తీసుకున్న జంట.. ప్లానింగ్‌ మామూలుగా లేదుగా!

Published Mon, Feb 13 2023 10:40 AM | Last Updated on Mon, Feb 13 2023 11:50 AM

Buzz Is That Divorced Couple All Set To Enter In Bigg Boss 7 Deets Inside - Sakshi

బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాలిటీ షోకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే తెలుగులో ఆరు సీజన్‌లు పూర్తికాగా, త్వరలోనే బిగ్‌బాస్‌-7 ప్రారంభం కానుంది. అయితే గత సీజన్లతో పోలిస్తే ఈసారి చాలా క్రేజీగా ప్లాన్‌ చేస్తున్నారట మేకర్స్‌.

గత సీజన్‌ అనుకున్నంత సక్సెస్‌ కాకపోవడంతో ఈసారి ఎలాగైనా సీజన్‌-7ను సూపర్‌ హిట్‌ చేయాలని గట్టిగా డిసైడ్‌ అయ్యారట. ఇందులో భాగంగా ఇప్పటికే యాంకర్‌ రష్మీని సంప్రదించినట్లు టాక్‌ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా నెట్టింట వైరల్‌ అవుతున్న న్యూస్‌ ప్రకారం.. ఈసారి విడాకులు తీసుకున్న ఓ సెలబ్రిటీ జంటను హౌస్‌లోకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారట.

ర్యాప్‌ సింగర్‌గా పాపులర్‌ అయిన నోయెల్‌, నటి ఎస్తేర్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ జంటను బిగ్‌బాస్‌లోకి పంపేందకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారట. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది? ఒకవేళ బిగ్‌బాస్‌ టీం వాళ్లని సంప్రదించినా నోయెల్‌-ఎస్తేర్‌లో ఒప్పుకుంటారా అన్నది సస్పెన్స్‌గా మారింది. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement