
Chalaki Chanti In Bigg Boss 6 Telugu: బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు చలకీ చంటీ. ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించినా ప్రముఖ కామెడీ షోతోనే చలాకీ చంటీ పాపులర్ అయ్యాడు. 2016 ఏప్రిల్‌లో ఇతనికి వివాహం జరిగింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే పలు టీవీ షోలతో అలరించే చంటీ బిగ్‌బాస్ సీజన్-6లో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడో చూడాల్సి ఉంది.