host
-
కొడుకు పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన సానియా మీర్జా.. వారం తర్వాత ఇలా (ఫొటోలు)
-
G7 Summit: మోదీకి ఆతిధ్యం ఇచ్చే రెస్టారెంట్ ఇదే..!
ఇటలీలో జరగనున్న జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తన బృందంతో కలిసి గురువారమే ఇటలీ చేరుకున్నారు. ప్రపంచనాయకులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు పాత్రికేయులకు కూడా ఎంట్రీ ఉంటుంది. ఈ ఏడాది ఇటలీలోని పుగ్లియా నగరంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మరీ ఈ సదస్సుకి హాజరుకానున్న మోదీకి ఇటలీలో ఉన్న ఏ భారతీయ రెస్టారెంట్ ఆతిధ్యం ఇవ్వనుందంటే..ఇటీలీలో ఈ జీ7 సదస్సు జూన్ 13 నుంచి జూన్ 15, 2024 వరకు జరుగనుంది. ఈ సదస్సులో ముఖ్యమైన చర్చల తోపాటు ప్రపంచ నాయకులకు ఇచ్చే ఆతిధ్యం కూడా హాటాటాపిక్గా ఉంది. నివేదిక ప్రకారం..ఇటలీ ప్రెసిడెంట్ సెర్గియో మట్టరెల్లా ఆహ్వానితుల కోసం అద్భుతమైన సీఫ్రంట్ గాలా డిన్నర్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇక అమెరికా అధ్యక్షుడు జోబైడన్, రిషి సునాక్ వంటి నాయకులు ఇటాలియన్ ప్రెసిడెంట్ బోర్గ్ ఎంగ్నాజియా రిసార్ట్‌లో ఆతిథ్యం ఏర్పాటు చేసినట్లు అదికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొనే భారత ప్రధాని మోదీకి ఇటలీలోని బారీలో ఉన్న భారతీయ రెస్టారెంట్ ఆతిథ్యం ఇవ్వనుంది. ప్రధాని మోదీ అతని బృందానికి రుచికరమైన భారతీయ వంటాకాలను ఈ రెస్టారెంట్ అందించనుంది. ఇటలీలో భారత్‌లోని అద్భుతమైన రుచులను అందించడానికి పేరుగాంచిన భారతీయ రెస్టారెంట్ ఇండియానో నమస్తే ప్రధాని మోదీ, అతని బృందానికి ఆతిథ్యం ఇస్తోంది. ఇది సుప్రసిద్ద పంజాబీ వంటకాలకు పేరుగాంచింది. ఇక్కడ స్పైసీ ఫుడ్స్, తందూరీ చికెన్, బిర్యానీలు మంచి ఫేమస్. నోరూరించే భారతీయ వంటకాలకు ఈ ఈ రెస్టారెంట్ కేరాఫ్ అడ్రస్ కూడా. ఇక్కడ ప్రతి కస్టమర్ ఆకలిని తీర్చేలా భోజనం ఉంటుంది. ముఖ్యంగా శాకాహార భోజనం కూడా అదరహో అన్న రేంజ్లో ఉంటుందట. గులాబ్జామున్, గజర్ కా హల్వా వంటి దేశీయ డిజార్ట్లు కూడా బాగా ఫేమస్. ఇటలీలోని భారత ప్రధాని మోదీకి సంప్రదాయ శాకాహార వంటకాలను అందించే మహత్తర బాధ్యతను ఈ రెస్టారెంట్ తీసుకుంది. ప్రధాని మోదీ, అతని బృందానికి తన పాకశాస్త్ర నైపుణ్యాన్ని చూపించేలా వంటకాలను అందించనుంది ఇండియానో నమస్తే రెస్టారెంట్. (చదవండి: ట్రెడ్మిల్ వర్సెస్ వాకింగ్: ఏది బెటర్? నిపుణులు ఏమంటున్నారంటే..) -
భారత్‌లో ‘మిస్ వరల్డ్-2024 ఈవెంట్, 28 ఏళ్ల తర్వాత
అందాల పోటీలకున్న క్రేజే అంతా ఇంతా కాదు. అందులోనూ ప్రపంచ అందగత్తెలంతా పోటా పోటీగా ఒక చోట చేరితే.. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత దేశంలో ఇదే జరగబోతోంది. 71వ ప్రపంచ సుందరి పోటీలకు ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. 1996 తరువాత మిస్ వరల్డ్ ఈవెంట్ జరగబోతోంది. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2022 సినీ శెట్టి మిస్ వరల్డ్ 2023కి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనుంది. ఈవెంట్ నిర్వాహకులు అందించిన సమాచారం ప్రకారం ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ పోటీలను అట్టహాసంగా నిర్వహించనున్నారు. మార్చి 9న నిర్వహించే ఫైనల్ పోటీలను రాత్రి 7.30 గంటల నుంచి 10.30 గంటల వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. . ఫిబ్రవరి 20న న్యూఢిల్లీలోని హోటల్ అశోకాలో ఇండియా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ITDC) ఆధ్వర్యంలో "ది ఓపెనింగ్ సెర్మనీ" , "ఇండియా వెల్కస్ ది వరల్డ్ గాలా"తో ఈవెంట్ షురూ అవుతుంది. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్ పర్సన్, సీఈవో జూలియా మోర్లీ స్వయంగా ఈ విషయాన్ని మిస్ వరల్డ్ అధికారిక పేజీ ట్విటర్ పేజీలో షేర్ చేశారు. మిస్ వరల్డ్‌కు ఆతిథ్యం ఇచ్చే దేశంగా భారతదేశాన్ని ప్రకటించడం గర్వంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశారు. అందం, వైవిధ్యం సాధికారత మేళవింపుగా జరగబోతున్న ఈ అద్భుతమైన ప్రయాణానికి సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్ చేసింది. 2017లో మానుషి చిల్లార్ తర్వాత మరో ఇండియన్, మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకోలేదు. Chairman of Miss World, Julia Morley CBE stated "Excitement fills the air as we proudly announce India as the host country for Miss World. A celebration of beauty, diversity, and empowerment awaits. Get ready for a spectacular journey! 🇮🇳 #MissWorldIndia #BeautyWithAPurpose — Miss World (@MissWorldLtd) January 19, 2024 అందాల రాణులుగా నిలిచిన భారతీయ భామలు ఎవరో తెలుసా? రీటా ఫరియా - 1966 ఐశ్వర్యా రాయ్ - 1994 డయానా హేడెన్ - 1997 యుక్తా ముఖి - 1999 ప్రియాంకా చోప్రా - 2000 మానుషి చిల్లార్ - 2017 -
'మీ తెలివితేటలు పరాకాష్ఠకు చేరాయి'.. అమర్‌దీప్‌పై నాగార్జున ఫైర్!
ఈ ఏడాది బిగ్ బాస్ రియాలిటీ షో సరికొత్త టాస్కులు, కంటెస్టెంట్స్ మధ్య ఎమోషనల్ సీన్స్‌తో కాస్తా ఆసక్తి పెంచుతోంది. ఇప్పటికే నాలుగు వారాల్లో నలుగురు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. మరీ ఇవన్నీ పక్కన పెడితే ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్నదానిపై ఆడియన్స్‌లో ఆసక్తి రేకెత్తిస్తోంది. గత మూడు నాలుగు వారాల్లో పవరస్త్ర గెలుచుకున్న సందీప్, శోభాశెట్టి, ప్రశాంత్ తప్ప మిగిలిన ఏడుగురు ఈ వారం నామినేట్ అయ్యారు. ఈ జాబితాలో ఓట్ల శాతం వారం మొత్తం పైకి కిందకు జరిగింది. శుక్రవారానికి వచ్చేసరికి శివాజీ టాప్‌లోనే ఉన్నాడు. తర్వాత స్థానాల్లో గౌతమ్, యవర్, శుభశ్రీ, టేస్టీ తేజ ఉన్నట్లు తెలుస్తోంది. చివరి రెండు స్థానాల్లో అమరదీప్, ప్రియాంక ఉన్నట్లు సమాచారం. అయితే ఈ వారం కూడా మహిళ కంటెస్టెంట్ ఎలిమినేట్ కానుందా? అన్న టాక్ వినిపిస్తోంది. (ఇది చదవండి: మూగ అమ్మాయితో సినిమాలా?.. నీకేమైనా పిచ్చా అన్నారు: అభినయ తండ్రి ఎమోషనల్! ) ఇదిలా ఉంచితే.. తాజాగా రిలీజైన ప్రోమో మరింత ఆసక్తిని పెంచుతోంది. అయితే ఇప్పటికే హౌస్‌మేట్స్‌ను బిగ్ బాస్ జోడీలుగా విభజించారు. అయితే వీరిలో ప్రిన్స్ యావర్, టేస్టీ తేజ జోడీని నాగ్ అభినందించారు. తేజ ఎంటర్టైన్ చేస్తానని మాట ఇచ్చావ్.. నీ మాటను నిలబెట్టుకున్నావ్ అంటూ ప్రశంసించారు. మీ ఇద్దరినీ చూస్తోంటే నాకు ముచ్చటేస్తోంది అని నాగ్ అన్నారు. కానీ మరో జోడీ ఆట సందీప్, అమర్‌దీప్‌పై మాత్రం నాగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అమర్దీప్ టాస్క్ మధ్యలో వ్యవహరించిన తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అమర్దీప్ టాస్క్ కంప్లీట్ చేయకుండా బెల్ కొట్టడం సబబేనా అని నాగ్ ప్రశ్నించగా.. అమర్దీప్ ఏదో సమాధానమిచ్చాడు. మీ తెలివితేటలు పరాకాష్ఠకు చేరాయంటూ.. టాస్క్‌కు సంబంధించిన వీడియోను కంటెస్టెంట్స్ అందరికీ చూపించారు. అయితే అందులో అమర్దీప్, శివాజీ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఈ టాస్క్‌కు సంచాలక్ ఎవరు? అని నాగార్జున కంటెస్టెంట్స్‌ను ప్రశ్నించారు. దీనికి ఎవరు లేరంటూ అందరూ సమాధానమిస్తారు. కానీ నాగ్ మాత్రం దీనికి అమర్దీప్ సంచాలక్ అని చెబుతారు. అంతే కాకుండా 'నువ్వు మాటిమాటికి బొక్కలో జడ్జిమెంట్ అంటావ్ కదా?.. నాగ్ ప్రశ్నిస్తాడు. నీది కూడా తొక్కలో సంచాలక్.. బొక్కలో జడ్జిమెంట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చివర్లో శివాజీ, పల్లవి ప్రశాంత్ జోడీ గురించి ప్రస్తావించగానే ప్రోమో ముగుస్తుంది. ఈ రోజు జరిగే ఎపిసోడ్లో ఇంకెన్ని ఆసక్తికర సంఘటనలు హౌస్‌లో వేచి చూద్దాం. (ఇది చదవండి: సిక్కిం వరదల్లో గల్లంతైన టాలీవుడ్ సీనియర్ నటి..!) -
ష్..! దేశమంటే ప్రాణం.. ఇది పుతిన్‌లో మరో కోణం..!
దేశమంటే ప్రాణం.. జాతీయ గీతం అంటే గౌరవం.. ఇదీ పుతిన్ నమ్మిన సిద్ధాంతం. ఓ వైపు పశ్చిమ దేశాలన్నీ కలిసి పగబట్టినా.. పట్టు వీడని మనస్థత్వం ఆయనది. ప్రపంచంలో రష్యా దేశ స్వాభిమానాన్ని నిలపడంలో అలిసిపోకుండా పోరాడుతున్నారు. అయినప్పటికీ ప్రతీ చిన్న విషయంలోనూ దేశ ప్రేమను వెలిబుచ్చుతున్నారు. ఇలాంటి వీడియోనే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ చిన్న సంఘటనతో దేశానికి ఆయన ఇచ్చే గౌరవం ఎంతటిదో అర్ధమవుతుంది. సెయింట్ పీటర్‌బర్గ్‌లో నిర్వహించిన ఓ జాతీయ వేడుకలో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పెట్రోలియం రిఫైనరీ కంపెనీ గాజ్ప్రోమ్ నెఫ్ట్‌కు చెందిన అధికారి ఎలెనా ఇల్యుఖినాతో కలిసి పడవపై నిలబడి ఉన్నారు. ఈ క్రమంలో జాతీయ గీతం ఆలాపన ప్రారంభమైంది. అదే సమయంలో పుతిన్‌తో ఎలెనా చర్చను ప్రారంభించారు. జాతీయ గీతానికి గౌరవంగా నిలబడిన పుతిన్..మాట్లాడొద్దంటూ మూతిపై వేలు చూపించారు. తప్పు చేసినదానిలా భావించిన ఎలెనా.. నిశ్శబ్దంగా పుతిన్ పక్కన నిలబడ్డారు. 22 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. Vladimir Putin 😎 reminds his talkative host not to speak during the Russian National Anthem pic.twitter.com/xMf7W8FeVH — Megh Updates 🚨™ (@MeghUpdates) June 18, 2023 అధ్యక్షుల వారి ఆంతర్యమేంటో..! మరో వేడుకలో పుతిన్ ఆ దేశ రక్షణ మంత్రికి వీపు చూపించిన వీడియో కూడా ఇటీవల బాగా వైరల్ అయింది. సైనికులకు బహుమతులు ఇవ్వడానికి మిలిటరీ ఆస్పత్రికి వెళ్లిన పుతిన్.. సైనికులతో మాట్లాడతారు. ఈ క్రమంలో పక్కనే నిల్చున్న రక్షణ మంత్రి సెర్జీ షోయిగు వైపు చూసి వెంటనే ముఖం తిప్పుకున్నారు. అంతటితో ఆగకుండా షోయిగుకు వీపు చూపించారు. వెనకనే ఉన్న మంత్రి ఎలా స్పందించాలో తెలియక తికమకపడ్డారు. దేశమే ప్రధానం.. ఆ తర్వాతే పుతిన్‌కు ఎవరైనా అనే విషయం ఈ ఘటనతో అర్థమవుతుంది. ఈ వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. అధ్యక్షుల వారీ ఆంతర్యమేంటో అని కామెంట్లు పెట్టారు. రక్షణ మంత్రి ఉద్యోగం ఊడినట్టేనని ఫన్నీగా స్పందించారు. అయితే.. ఉక్రెయిన్‌తో యుద్ధంలో సరైనా విజయాలు సాధించట్లేదనే మంత్రిపై ఆ విధంగా పుతిన్ ప్రవర్తించారని మరికొందరు కామెంట్ చేశారు. You don't have to be a body language expert to understand what Putin currently thinks about his Defence Minister Sergei Shoigu... 😅 pic.twitter.com/ZRfJaJDE1X — Jimmy Rushton (@JimmySecUK) June 12, 2023 ఇదీ చదవండి:రష్యా అధ్యక్షుడికి తిక్క రేగింది.. భారీ క్షిపణులతో దాడి.. -
మిస్‌వరల్డ్ పోటీలకు వేదికగా భారత్.. ఎంపిక జరుగుతుందిలా..
న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగనున్న ప్రపంచ సుందరి ఎంపిక పోటీలకు భారత దేశం వేదికగా నిలవనుంది. ఈ మేరకు గురువారం ఢిల్లీలో జరిగిన ఓ మీడియా సమావేశంలో మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్, సీఈవో జూలియా మోర్గే ప్రకటన చేశారు. అప్పుడెప్పుడో 1996లో.. ప్రపంచంలోని అందగత్తెలంతా ఒకచోట చేరి తమ అందచందాలతో హొయలొలికిస్తూ, తెలివితేటలను ఇనుమడింపజేస్తూ ఆయా దేశాల కీర్తి పతాకాలను రెపరెపలాడించే భిన్నమైన వేదిక. అయితే ఈసారి జరగబోయే పోటీలకు వేదికగా నిలవనుంది భారత దేశం. గతంలో 1996లో ప్రపంచ సుందరి పోటీలకు వేదికగ నిలిచిన భారత్ సరిగ్గా 27 సంవత్సరాల తర్వాత మరోసారి ఈ పోటీలకు ఆతిధ్యమివ్వనుంది. ఈ పోటీల్లో మిస్ ఇండియా వరల్డ్ సినీ శెట్టి భారత దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్ పర్సన్, సీఈవో జూలియా మోర్లే. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఈసారి పోటీలను భారతదేశంలో నిర్వహించడం చాలా సంతోషకరం. నవంబర్ నెలలో జరగబోయే 71వ ప్రపంచ సుందరి పోటీలకు సంబంధించిన వేదికతో పాటు తేదీ వివరాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. మొతం 130 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొననున్నారని తెలిపారు. పోటీల్లో భాగంగా సుందరీమణులు ప్రతిభా పాటవాలు, సేవాతత్వ దృక్పధం, క్రీడా ప్రతిభ తోపాటు ఇతర అంశాల్లో కూడా రౌండ్లవారీగా పోటీ పడతారు. మిస్ వరల్డ్ గా ఎంపికయ్యే సుందరీమణి మార్పునకు రాయబారిగా వ్యవహరించనున్నారు కాబట్టి ఈ అంశాలన్నిటినీ స్పృశించి ప్రపంచ సుందరిని ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు జూలియా. ఈ కార్యక్రమంలో 2022 ప్రపంచ సుందరి కరోలినా బియెలావ్ స్కా కూడా పాల్గొని.. నా చేతులతో నా వారసురాలికి ఈ కిరీటం ధరింపజేయడానికి ఎదురుచూస్తున్నానని సాంప్రదాయానికి ప్రతిరూపమైన భారత్‌లో ఈ పోటీలు జరగడం సంతోషంగా ఉందన్నారు. ఇది కూడా చదవండి: భారత విద్యార్థులకు భరోసానిచ్చిన కెనడా ప్రధాని -
ఫ్యాన్స్ కి నిద్ర కరువు.. మరో కొత్త షోకి హోస్ట్ గా ఎన్టీఆర్
-
రూ.20 లక్షలు గెలిచా.. ఒక్క పూటలో ఖతం చేశా: యాంకర్
ఫ్రెండ్స్‌తో డిన్నర్‌కు వెళ్తే ఎంత అవుతుంది? వందల్లో, లేదంటే వేలల్లో! కానీ ఓ యాంకర్ మాత్రం జస్ట్ డిన్నర్‌కే రూ.20 లక్షలు ఖర్చు పెట్టిందట! హిందీ బుల్లితెర యాంకర్ మిని మాథుర్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఈ విషయాన్ని బయటపెట్టింది. 'ఓ క్విజ్ షోలో నేను రూ.20 లక్షలు గెలుచుకున్నాను. ఇంకేముందీ, ఈ సంతోషంలో నా ఫ్రెండ్స్, దగ్గరివాళ్లు అందరినీ కలుపుకుని దాదాపు 22 మందిని డిన్నర్‌కు తీసుకెళ్లాను. ఓ పెద్ద ఫైవ్‌స్టార్ హోటల్‌కు వెళ్లి తిన్నాం. అలా నాకు వచ్చిన డబ్బంతా ఒక్కపూటలో ఖర్చైపోయింది. నేను ఎమ్టీవీలో పనిచేసిన తొలినాళ్లలో రూ.50,000 జీతం వచ్చేది. మిగతావాటితో పోలిస్తే అది కొంత తక్కువే! మోడలింగ్ విషయానికి వస్తే ఓ అనూహ్య ఘటన వల్ల మోడల్‌గా మారాల్సి వచ్చింది. ఓసారి ఏమైందంటే.. ఓ యాడ్ కోసం సుష్మితా సేన్ రావాల్సి ఉంది. ఆ ప్రకటనలో ఆమె ఓ పైలట్‌గా నటించాలి. టైం అవుతున్నా తను రాలేదు. ఆలస్యమవుతుండటంతో ఆమె స్థానంలో నన్ను పెట్టి చేశారు' అని చెప్పుకొచ్చింది. కాగా మిని మాథుర్.. ఇండియన్ ఐడల్ షో మొదటి మూడు సీజన్లకు, అలాగే ఆరో సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇదే కాకుండా మిస్ ఇండియా పేజెంట్, దిల్సే దిల్సే ఆజ్‌తక్, బాంబే బ్లష్, పాప్‌కార్న్ జూమ్, సిర్ఫ్ ఏక్ మినిట్ మె సహారా వన్ వంటి పలు షోలకు హోస్టింగ్ చేసింది. దిల్ విల్ ప్యార్ వార్, ఐ మే ఔర్ మే చిత్రాల్లో మైండ్ ద మల్హోత్రాస్ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించింది. -
అత్యధిక ‘ఆతిథ్య’ బుకింగ్స్ జాబితాలో హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పర్యాటకుల ఆసక్తిని దక్కించుకున్న అగ్రగామి ఆతిథ్య నగరాల్లో హైదరాబాద్ టాప్ 5గా నిలిచింది. ఈ విషయాన్ని పర్యాటకులకు హోమ్‌స్టేస్ అందించే ఆన్లైన్ వేదిక ఎయిర్ బిఎన్బి అధ్యయనం వెల్లడించింది. పర్యాటకాభిరుచుల గురించి గత ఏడాదికి సంబంధించి ఈ సంస్థ అధ్యయనం వెల్లడించిన పలు ఆసక్తికరమైన విశేషాల్లో... సోలో టూర్... సో బెటరూ... ఒంటరిగా ప్రయాణించడాన్ని అత్య«ధిక శాతం మంది ఇష్టపడుతున్నారని స్టడీ తేల్చింది. పర్యాటకశైలి ఆసక్తుల్లో సోలో ట్రావెల్ అత్యంత ప్రజాదరణ పొందిన అంతర్జాతీయ ప్రయాణ శైలిగా నిలవగా, తర్వాత స్థానాల్లో జంటగా చేసే కపుల్ ట్రావెల్, ఆ తర్వాత కుటుంబతో కలిసి చేసే ఫ్యామిలీ ట్రావెల్ లు ఉన్నాయి. మాదాపూర్ కు...ఆఫ్ బీట్ జర్నీ... అంతగా ప్రాచుర్యంలో లేని ప్రాంతాలను (ఆఫ్–ది–బీటెన్–పాత్ ) పర్యాటకులు అన్వేషించడం పెరిగింది. దేశీయంగా తమిళనాడు, మహారాష్ట్ర, మేఘాలయ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆఫ్–బీట్ గమ్యస్థానాలను టూరిస్ట్‌లు అన్వేషిస్తున్నారు అలా ప్రచారంలో లేని పర్యాటకస్థలాలకు వీరు ప్రయాణించడం ఆయా ప్రాంతాలకు ప్రయోజనంతో పాటు పర్యాటకరంగ పురోభవృద్ధికి దోహదం చేస్తోంది. దేశంలోనే టాప్ 5 ఆఫ్–ది–బీట్–పాత్ ట్రెండింగ్ గమ్యస్థానాలుగా నగరంలోని మాదాపూర్ తొలి స్థానంలో నిలవడం విశేషం ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడులోని రామేశ్వరం, వెల్లూరు, మేఘాలయలోని చిరపుంజి, మహారాష్ట్ర చించ్వాడ్లోని ఫింప్రిలు ఉన్నాయి. టాప్ సిటీస్‌కూ...సై అంతర్జాతీయ ప్రయాణం గత ఏడాది వేగవంతమైన పునరుద్ధరణను సాధించింది, ఈ పెరుగుదల ట్రెండ్ 2023లో కూడా కొనసాగనుంది భారతీయ పర్యాటకులు ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ నగరాల కోసం అన్వేషిస్తున్నారు. భారతీయ అతిథులు అత్యధికంగా శోధించిన అంతర్జాతీయ గమ్యస్థానాలలో వరుసగా దుబాయ్. లండన్. పారిస్. టొరంటో, న్యూయార్క్ లు ఉన్నాయి. ఆతిథ్యంలో ఢిల్లీ టాప్... చక్కని ఆతిథ్యం విషయానికి వస్తే అత్యధిక 5–స్టార్ రేటింగ్స్‌తో ఢిల్లీ, గోవా, కేరళ, మహారాష్ట్ర హిమాచల్ ప్రదేశ్లు అగ్రస్థానంలో ఉన్నాయి. అతిథులు నగర జీవితాన్ని ఆస్వాదించడానికి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై కోల్‌కతాలను ఎక్కువగా ఎంచుకున్నారని అధ్యయనం వెల్లడించింది. అలాగే తాము బస చేసే చోట ఈత కొలను పక్కన ఆసీనులవడం లేదా ఇసుక బీచ్‌లో కిరణాలతో స్నానించడం వంటి ఆసక్తులు ఎక్కువగా ప్రదర్శించారు. బుకింగ్స్‌లో హైదరాబాద్‌కు 5వ స్థానం.. గత ఏడాది అత్యధిక బుకింగ్‌లతో భారతదేశంలోని టాప్ 5 ఆతిధ్య నగరాలుగా ముంబై (మహారాష్ట్ర), న్యూఢిల్లీ (ఢిల్లీ), గౌహతి (అస్సాం), గోవా (హైదరాబాద్) నిలిచాయి. ఒకే ఏడాది అత్యధికంగా ప్రయాణించిన భారతీయ అతిథిగా 115 కంటే ఎక్కువ బుకింగ్‌లు చేసిన ఓ పర్యాటకుడు నిలిచాడు. -
హైదరాబాద్‌కు రాష్ట్రపతి.. వారం రోజుల పాటు ఇక్కడే బస
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక కోసం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ముస్తాబవుతోంది. ఈ నెల 26న శీతాకాల విడిది కోసం నగరానికి వస్తున్న రాష్ట్రపతి వారం రోజుల పాటు ఇక్కడ బస చేస్తారు. దీంతో బొల్లారంలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఆవరణలోని రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాలను భద్రతా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఆర్మీ, పోలీసు, రెవెన్యూ, కంటోన్మెంట్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సహా తదితర విభాగాల ఆధ్వర్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దక్షిణాది విడిది... ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌తో పాటు సిమ్లా, హైదరాబాద్‌లోనూ రాష్ట్రపతి అధికారిక నివాసాలున్నాయి. శీతాకాలంలో కనీసం వారం రోజుల పాటు హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేయడంతో పాటు ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించడం ఆనవాయితీ. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌తో పాటు దాదాపు అందరు రాష్ట్రపతులూ ఇక్కడ బస చేశారు. కోవిడ్ ఇతర కారణాల రీత్యా మూడేళ్ల పాటు రాష్ట్రపతి హైదరాబాద్ నివాసానికి రాలేదు. చివరిసారిగా 2019 డిసెంబర్లో నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని సందర్శించారు. రెండేళ్ల విరామానంతరం ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. 1860లో రెసిడెన్సీ హౌస్ పేరిట నిర్మాణం.. ►1860లో నాటి నిజాం నాజిర్ ఉద్దౌలా హయాంలో రెసిడెన్సీ హౌస్ పేరిట బొల్లారంలో భవనాన్ని నిర్మించారు. బ్రిటిష్ రెసిడెంట్ కంట్రీ హౌస్‌గా దీన్ని వినియోగించుకున్నారు. 1948లో ఆపరేషన్ పోలో అనంతరం హైదరాబాద్ భారత్‌లో విలీనమైంది. అనంతరం రెసిడెన్సీ హౌస్ రాష్ట్రపతి దక్షిణాది విడిదిగా కొనసాగుతోంది. ►90 ఎకరాల విస్తీర్ణంలో 16 గదులతో కూడిన భవనంతో పాటు పక్కనే సందర్శకులు, సిబ్బంది క్వార్టర్లు ఉన్నాయి. 150 మంది విడిది చేసేందుకు అనువైన ఈ భవనంలో దర్బార్, డైనింగ్, సినిమా హాళ్లు, ప్రధాన భవనానికి సొరంగ మార్గం ద్వారా అనుసంధానం చేసిన కిచెన్ హాల్ ఉన్నాయి. పూలు, పండ్ల తోటలు ►బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం వివిధ రకాల పూల మొక్కలతో పాటు మామిడి, దానిమ్మ, సపోటా, ఉసిరి, కొబ్బరి తోటలు, సుగంధ ద్రవ్యాల తోటలు, మంచినీటి బావులతో పల్లె వాతావరణం ఉట్టిపడేలా ఉంటుంది. 116 రకాల ఔషధ, సుగంధ ద్రవ్యాల మొక్కలతో కూడిన గార్డెన్ ప్రత్యేక ఆకర్షణ. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చొరవతో ఏర్పాటు చేసిన నక్షత్రశాలను 2015లో ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రారంభించారు. 27 నక్షత్రాలను ప్రతిబింబించేలా 27 రకాల విభిన్నమైన మొక్కలతో దీన్ని రూపొందించారు. చిట్టడవిని తలపించేలా.. ►నగరం నడిబొడ్డును చుట్టూ మిలిటరీ స్థావరాలు, బలగాల పహారాలో ఉండే రాష్ట్రపతి నిలయం ఓ చిట్టడవిని తలపిస్తుంది. పూలు, పండ్ల తోటల్లో పక్షుల కిలకిలారావాలతో పాటు మయూరాలు కూడా కనువిందు చేస్తాయి. వేకువజామున రాష్ట్రపతి వాకింగ్ చేసేందుకు అనువుగా వాకింగ్ ట్రాక్‌ను సైతం ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి నిలయం ఆవరణలో కోతులతో పాటు పాముల బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతియేటా రాష్ట్రపతి పర్యటనకు కొన్ని రోజుల ముందు నుంచే నెహ్రూ జూలాజికల్ పార్కు సిబ్బంది ఇక్కడికి చేరుకుని వాటిని నియంత్రించే పనిలో నిమగ్నమవుతారు. రాష్ట్రపతి పర్యటన ముగిశాక జనవరిలో సామాన్యుల సందర్శనకు అవకాశం కల్పిస్తారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో రిహార్సల్స్ హిమాయత్‌నగర్: ఈ నెల 27న నారాయణగూడలోని కేశవ మెమోరియల్ విద్యాసంస్థల విద్యార్థులతో ముఖాముఖి సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో శనివారం కాలేజీలో రిహార్సల్స్ చేశారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ నుంచి నారాయణగూడకు చేరుకున్న ప్రత్యేక బృందాలు పరిసర ప్రాంతాలను తమ అ«దీనంలోకి తీసుకున్నారు. కాలేజీలోని ప్రతీ అణువును జాగిలాలతో తనిఖీలు చేయించారు. కాలేజీ ఆడిటోరియంలో జరిగే సదస్సులో రాష్ట్రపతి హాజరు కానున్న నేపథ్యంలో ఆయా ఏర్పాట్లను ప్రత్యేక బృందాలు పరిశీలించాయి. -
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఇక దబిడి దిబిడే
-
భారత్‌లో 2025 మహిళల వన్డే ప్రపంచకప్
దుబాయ్: భారత్ మరో క్రికెట్ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది ఇక్కడ పురుషుల వన్డే వరల్డ్‌కప్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఇది ముగిసే రెండేళ్లలోనే... 2025లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌కూ భారతే వేదిక కానుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్టీపీ) 2023–2027లో భాగంగా అమ్మాయిల మెగా ఈవెంట్లను ఖరారు చేశారు. ముందుగా 2024లో బంగ్లాదేశ్ టి20 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తుంది. భారత్ మెగా ఈవెంట్ అనంతరం 2026లో మరో టి20 ప్రపంచకప్ ఇంగ్లండ్‌లో జరుగుతుంది. ఇవన్నీ రొటీన్ ఈవెంట్లు... అయితే ఈ ఎఫ్టీపీలో కొత్తగా మహిళల చాంపియన్స్ ట్రోఫీకి తొలిసారి చోటిచ్చారు. ఈ టోర్నీని 2027లో శ్రీలంకలో నిర్వహిస్తారు. టి20 ఫార్మాట్లో ఆరు జట్లే పాల్గొనే ఈ టోర్నీలో శ్రీలంక అర్హత సాధిస్తేనే ఆతిథ్య వేదికవుతుంది. లేదంటే మరో దేశానికి ఆతిథ్య అవకాశం దక్కుతుంది. -
'మోస్ట్ ఫియర్లెస్ షో'కు హోస్ట్‌గా కంగనా రనౌత్ !
Kangana Ranaut Is Confirmed As Host For Ekta Kapoor Show: బీటౌన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సమాజంలోని పరిస్థితులపై తనదైన శైలీలో కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడేస్తుూ ఉంటుంది. అలా మాట్లాడటంతో దేశంలోనే మోస్ట్ డేరింగ్ హీరోయిన్గా పేరు వచ్చింది. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీ క్వీన్‌గా రికార్డుకెక్కింది. ఏ విషయం గురించి అయినా ఎలాంటి భయం లేకుండా బయటకు చెప్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ వ్యాఖ్యలతో కంగనా రనౌత్ పలుసార్లు వివాదాలపాలైంది కూడా. కానీ కంగనా బోల్డ్ యాటిట్యూడ్ అనేకమంది దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం కంగనా టికు వెడ్స్ షెరు సినిమాతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా కంగనా ఒక మోస్ట్ డేరింగ్ షోకి హోస్ట్‌గా వ్యవహరించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ బుల్లితెర నిర్మాత ఏక్తా కపూర్ ఆల్ట్ బాలాజీ, ఎమ్ఎక్స్ ప్లేయర్ కోసం రూపొందించే ఒక 'ఫియర్లెస్ రియాలిటీ షో' కోసం కంగనాను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ మాదిరిగా ఉన్న ఈ షోను కంగనా హోస్ట్ చేయనుందని సమాచారం. ఈ విషయంపై త్వరలో అధికారికంగా ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఈ షో గురించి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన కంగనా తర్వాత ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. View this post on Instagram A post shared by ALTBalaji (@altbalaji) -
వెంకీమామతో సరికొత్త టాక్ షో.. రంగంలోకి అల్లు అరవింద్!
వెండితెరపై సత్తా చాటి స్టార్స్‌గా వెలుగొందిన పలువురు టాలీవుడ్ నటులు..ఇప్పుడు బుల్లితెరపై కూడా తమ హవాని చాటుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, రానాలు పలు షోలకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించి, తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇటీవల నందమూరి బాలకృష్ట కూడా హోస్ట్ అవతారం ఎత్తాడు. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ప్రసారమవుతున్న‘అన్ స్టాపబుల్’ టాక్ షోకి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. తనదైన డైలాగ్స్, పంచులతో ఈ టాక్ షోని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు బాలయ్య. డిజిటల్ ప్లాట్ ఫాంలో ఈ టాక్ షో దూసుకెళ్తోంది. దీంతో మరో కొత్త షోని ప్రారంభించాలని ప్రయత్నిస్తుందట ‘ఆహా’టీమ్. ఈ సరికొత్త టాక్ షోకి విక్టరీ వెంకటేశ్‌ని హోస్ట్‌గా చేయించడానికి ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే ‘ఆహా’టీమ్ వెంకటేశ్‌ని సంప్రదించారట. ఆయనను ఒప్పించడానికి అల్లు అరవింద్ కూడా రంగంలోకి దిగారట. ఇదే నిజమైతే..త్వరలోనే వెంకీమామని మనం హోస్ట్‌గా చూడొచ్చు. ప్రస్తుతం వెంకటేశ్ ఎఫ్ 3 చిత్రంలో నటిస్తున్నాడు. దీంతో పాటు రానాతో కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. -
చిరంజీవితో గొడవలు ఉన్నాయా? క్లారిటీ ఇచ్చిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ అటు హీరోగానే కాకుండా ఇటు హోస్టింగ్‌లోనూ అదరగొడుతున్నారు. బాలయ్య తొలిసారిగా హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తుంది. తనదైన స్టైల్లో బాలయ్య చేస్తున్న హోస్టింగ్‌కు నెటిజన్లే కాకుండా సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఈ షోకు మోహన్‌బాబు, నాని, బ్రహ్మానందం, రవితేజ, అనిల్ రావిపూడి, పుష్ప టీం, రానా సందడి చేశారు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో తనపై వచ్చిన రూమర్స్‌పై బాలయ్య స్పందించారు. 'ఇవాల్టి ప్రపంచంలో ప్రతివాడు సోషల్ మీడియాలో ఏం అనాలనిపిస్తే అది అంటున్నాదు. పేరు లేని, లికేషన్ తెలియని అడ్రస్‌లతో బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. బాలకృష్ణకి రవితేజకి పడదు.. చిరంజీవి, బాలకృష్ణ ఫోన్లో మాట్లాడుకోరు.. నా హీరో తోపు...నీ హీరో సోపు అంటూ పిచ్చిరాతలు రాస్తున్నారు. లెఫ్ట్ హ్యాండ్ కూడా రెడీ అయిందీ .. దొరికితే దవడ పగిలిపోద్దీ'.. అంటూ ఫేక్ న్యూస్‌లు ప్రచారం చేస్తున్న వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే మనమీద వచ్చిన విమర్శలను ప్రేమించినప్పుడే కదా మనం అన్‌స్టాపబుల్ అవుతాం అంటూ తనదైన స్టైల్లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. -
శ్రీరామచంద్రకు 'ఆహా' అనిపించే ఆఫర్.. ఏంటంటే ?
Sreerama Chandra To Host The Telugu Indian Idol On Aha: శ్రీరామ చంద్ర అంటే మొన్నటి వరకు పాపులర్ సింగర్ గానే తెలుసు. కానీ బిగ్‌బాస్ ఐదో సీజన్లో పాల్గొనడంతో మరింత పాపులర్ అయ్యాడు. తెలుగు ప్రేక్షకులకు చేరువ అవ్వాలన్న ఏకైక ఆశయంతో బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టిన శ్రీరామచంద్ర.. లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నాడు. బిగ్‌బాస్ 5వ సీజన్‌కు విన్నర్‌గా శ్రీరామ చంద్ర గెలుస్తాడని మొదట అందరూ ఊహించారు. కానీ అనూహ్యంగా మూడో స్థానంతో శ్రీరామ బిగ్‌బాస్ జర్నీకి బ్రేక్ పడింది. అలా జరిగిన కూడా ఆయన అభిమానులకు మాత్రం అతడే విన్నర్. అయితే ఈ విన్నర్ తాజాగా అదిరిపోయే ఆఫర్ అందుకున్నాడు. ప్రముఖ తెలుగు ఓటీటీ 'ఆహా' తర్వలో 'ఇండియన్ ఐడల్' కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా శ్రీరామచంద్రను సెలెక్ట్ చేశారు నిర్వాహకులు. దీనికి సంబంధించిన విషయాన్ని ట్విటర్ వేదికగా ప్రకటించారు ఆహా మేకర్స్. ఇదివరకు శ్రీరామచంద్ర 2013లో ఇండియన్ ఐడల్‌గా (హిందీ) గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయన గాత్రానికి అనేక మంది సంగీత దర్శకులు, సింగర్స్ మంత్రముగ్ధులయ్యారు. తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమానికి శ్రీరామచంద్ర హోస్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇండియన్ ఐడల్‌లో (హిందీ) సింగర్‌గా అలరించిన శ్రీరామచంద్రం హోస్ట్‌గా ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి. ప్రస్తుతం ఆడిషన్స్ జరుపుకుంటున్న తెలుగు 'ఇండియన్ ఐడల్' త్వరలోనే ప్రారంభం కానుంది. 🥁 CAN THIS GET ANY BETTER? #SreeramaChandra to host the first-ever #TeluguIndianIdol mee aha lo 🧡✨Are you excited or AREEE YOUU EXCITEEEDD!@fremantle_india @Sreeram_singer @instagram pic.twitter.com/0uBIIrjatZ — ahavideoIN (@ahavideoIN) December 26, 2021 -
అఫీషియల్: బిగ్‌బాస్-6 హోస్ట్ ఎవరో తెలిసిపోయింది
Bigg Boss 6 OTT Telugu Host: బిగ్‌బాస్ సీజన్-5 ముగిసింది. అయితే బిగ్‌బాస్ లవర్స్ కోసం అతి త్వరలోనే బిగ్‌బాస్ ఓటీటీ ప్రారంభం కానున్న సంగతి తెలిసింది. దీంతో సీజన్-6కి హోస్ట్‌గా ఎవరు చేయనున్నారనే దానిపై రకరకాల పేర్లు తెరమీదకి వచ్చాయి. అన్‌స్టాపబుల్ షోతో అదరగొడుతున్న బాలయ్య ఈ కొత్త సీజన్‌కి హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా డిస్నీ+హాట్‌స్టార్ నిర్వహించిన ప్రెస్మీట్లో దీనిపై క్లారిటీ వచ్చేసింది. మరో రెండు నెలల్లో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ ఓటీటీకి కూడా తానే హోస్టింగ్ చేయనున్నట్లు నాగార్జున స్వయంగా ప్రకటించాడు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్ తెలుగు.. ఇండియాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా నెంబర్1 షో. వీకెండ్ ఎపిసోడ్‌కి సుమారు 5-6కోట్ల మంది లైవ్ చూశారు. దీన్ని బట్టి బిగ్‌బాస్ తెలుగు సీజన్‌కు ఎంతమంది అభిమానులున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్ట్స్ సీజన్ ఓటీటీ వేదికగా ప్రసారం కానుంది. 24 గంటల పాటు లైవ్ స్ట్రీమింగ్ ఉండనుంది. ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ నాకు. ఆ 24 గంటలు చూసి అనాలసిస్ చేసి వీకెండ్ ఎపిసోడ్లో కంటెస్టెంట్లతో ముచ్చటించాల్సి ఉంటుంది' అని వివరించారు. -
భారత్‌లో గూగుల్, ఫేస్బుక్ ఆదాయం ఎంతో తెలుసా?
Google Facebook Income In India: సంప్రదాయ మీడియా సంస్థల్లో వచ్చే వార్తలను హోస్ట్ చేయడం ద్వారా ఫేస్బుక్, గూగుల్ వంటి దిగ్గజ టెక్ సంస్థలకు వస్తున్న ఆదాయం ఎంతో తెలుసా? ఈ మేరకు పార్లమెంట్ సాక్షిగా సమాధానం దొరికింది. ‘భారత్‌లో డిజిటల్ ప్రకటనల విపణిలో 75 శాతం వాటాను గూగుల్, ఫేస్బుక్ హస్తగతం చేసుకున్నాయి. ఏడాదికి గూగుల్ ఏకంగా రూ.13,887 కోట్లు, ఫేస్బుక్ రూ.9,326 కోట్లు పొందుతున్నాయి. అంటే మొత్తంగా రూ.23,313 కోట్లు. ఇది దేశంలోని టాప్–10 సంప్రదాయక మీడియా సంస్థల మొత్తం ఆదాయం(కేవలం రూ.8,396 కోట్లు) కంటే చాలా ఎక్కువ’ అని బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోదీ వివరించారు. ఈ మేరకు పలు కీలక అంశాలను మంగళవారం రాజ్యసభలో జీరో అవర్‌లో సుశీల్ మోదీ ప్రస్తావించారు. ఇక్కడ మూటకట్టిన ఆదాయంలో 90శాతం మొత్తాలను తన అంతర్జాతీయ అనుబంధ సంస్థకు ఫేస్బుక్ పంపుతోందని, గూగుల్ ఇండియా తన 87 శాతం రాబడిని మాతృసంస్థకు బదలాయిస్తోందని సుశీల్ వెల్లడించారు. కొంత భాగం.. సంప్రదాయక మీడియాకూ దక్కాలని బీజేపీ సీనియర్ నేత సుశీల్ మోదీ అభిప్రాయపడ్డారు. సంప్రదాయ మీడియా కంటెంట్ మూలంగా ప్రకటనల ద్వారా వేలకోట్ల ఆదాయం పొందుతున్న టెక్ సంస్థలపై, ఈ వ్యవస్థపై పర్యవేక్షణకు కొత్తగా స్వతంత్య్ర నియంత్రణ మండలిని నెలకొల్పాలని ఆయన సూచించారు. చదవండి: దిగ్గజ టెక్ కంపెనీలను వణికిస్తున్న "లాగ్4జే" లోపం -
మరోసారి బిగ్ బాస్ హోస్ట్‌గా...రమ్యకృష్ణ
కమల్‌హాసన్ కరోనాతో క్వారంటైన్లో ఉంటున్నందున ఆయన హోస్ట్‌గా చేస్తున్న ‘బిగ్ బాస్ 5’ పరిస్థితి ఏంటి? అనే చర్చ కోలీవుడ్‌లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాత్కాలిక హోస్ట్ లిస్ట్‌లో కమల్ కుమార్తె శ్రుతీహాసన్, రమ్యకృష్ణల పేర్లు వినిపించాయి. అయితే శ్రుతి తన సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండటంవల్ల ‘బిగ్ బాస్’కి డేట్స్ సర్దుబాటు చేయలేని పరిస్థితి అట. అందుకే నిర్వాహకులు రమ్యకృష్ణను ఖరారు చేశారు. గతంలో తెలుగు ‘బిగ్ బాస్ 3’ అప్పుడు హోస్ట్ నాగార్జున కొన్ని రోజులు బ్రేక్ తీసుకుంటే, ఆ స్థానంలో రమ్యకృష్ణ కొన్నాళ్ల పాటు షోను నడిపారు. ఇప్పుడు ఆమె తమిళ ‘బిగ్ బాస్’కి హోస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు. రమ్యకృష్ణను స్వాగతిస్తూ.. కమల్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను షేర్ చేశారు. -
బిగ్ బాస్‌కి హోస్ట్‌గా శ్రుతీహాసన్!
తమిళ ‘బిగ్ బాస్’ షోకి హీరోయిన్ శ్రుతీహాసన్ హోస్ట్‌గా వ్యవహరించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం ‘బిగ్ బాస్’ 5వ సీజన్ నడుస్తోంది. ఈ షోకి నటుడు కమల్‌హాసన్ హోస్ట్‌గా ఉన్నారు. అయితే కరోనా పాజిటివ్‌తో కమల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన స్థానంలో తాత్కాలికంగా కొత్త వ్యాఖ్యాత ఎవరు ఉంటారనే చర్చ జరుగుతోంది. కమల్ స్థానంలో ఆయన కుమార్తె శ్రుతీహాసన్‌ను తీసుకోవాలని ‘బిగ్ బాస్’ నిర్వాహకులు అనుకున్నారట. శ్రుతీని సంప్రదించారని కూడా టాక్. ఆమె కూడా షోను హోస్ట్ చేయడానికి ఆసక్తి చూపించినట్లు భోగట్టా. కాగా ‘బిగ్ బాస్’ తాత్కాలిక వ్యాఖ్యాత లిస్టులో హీరో సూర్య, నటి రమ్యకృష్ణల పేర్లను పరిశీలిస్తున్నట్లు కూడా ఓ వార్త వినిపిస్తోంది. మరి కమల్ ‘బిగ్ బాస్’కి వచ్చేవరకూ ఎవరు హోస్ట్ చేస్తారనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
వైరల్: తండ్రి లైవ్ ఇంటర్వ్యూలో కొడుకు చిలిపి చేష్టలు..
కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో కొన్ని నెలల పాటు అన్ని కార్యాలయాలు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో ప్రతి ఆఫీస్ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించింది. ఈ క్రమంలో అందరూ ఇంటి నుంచి పనులు చేసుకుంటారు. ఇప్పటికీ కొన్ని కార్యాలయాలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంనే కొనసాగిస్తున్నాయి. కరోనా దెబ్బతో పిల్లలకు క్లాస్‌లు, ఇంటర్వ్యూలు కూడా ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. అయితే ఇంట్లో నుంచి లైవ్ మీటింగ్‌లు, డిబెట్లు చేస్తుండగా కొన్నిఇబ్బందులు తలెత్తడం సహజమే. చదవండి: వైరల్: వరుడిని చూసి పట్టరాని సంతోషం.. గాల్లో ముద్దులు పంపి.. తాజాగా అలాంటి ఓ ఫన్నీ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి టీవీ ఛానల్‌కు లైవ్ ఇంటర్వ్యూ ఇస్తుండగా తన పిల్లలు అంతరాయం కలిగించాడు. తండ్రి వెనకాలకు వచ్చిన కొడుకు కెమెరాకు హాయ్ చెబుతూ కనిపించాడు. ఇది గమనించిన వ్యక్తి కొడుకును పక్కకు పంపేందుకు ప్రయత్నించగా అతడు వెళ్లిపోయాడు. అయితే మళ్లీ స్క్రీన్ ముందుకు వచ్చిన పిల్లవాడు తండ్రి వెనకాల డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. పిల్లవాడి చేష్టలకు చివరికి యాంకర్ కూడా నవ్వేశాడు. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. A special guest on @bsurveillance was very excited about Weidmann’s departure from the Bundesbank pic.twitter.com/o2sgMk2MK0 — Aggi (@aggichristiane) October 20, 2021 -
బిగ్‌బాస్: ఈసారి టీవీలో కాదు.. హోస్ట్‌ను మార్చేశారు..
ముంబై : ప్రముఖ రియాలిటీ షోలలో బిగ్‌బాస్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, హిందీ సహా ఇతర భాషల్లోనూ బిగ్‌బాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఇక హిందీలో ఇప్పటికే 14 సీజన్లను విజయవంతగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ షో త్వరలోనే 15వ సీజన్లోకి అడుగుపెడుతుంది. అయితే ఈ సీజన్‌ను మాత్రం మేకర్స్ మరింత కొత్తగా ప్లాన్ చేశారు. బిగ్‌బాస్ పేరు నుంచి కంటెస్టెంట్స్ ఎంపీక వరకు ఎన్నో మార్పులు తెచ్చిన మేకర్స్ బిగ్‌బాస్ హోస్ట్‌ని కూడా మార్చేశారు. గత 11 సీజన్లకు హోస్ట్‌గా షోను ఎంతగానో రక్తికట్టించిన సల్మాన్ ఖాన్ స్థానాన్ని ఇప్పుడు ప్రముఖ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ భర్తీ చేయనున్నారు. దీంతో బిగ్‌బాస్ సీజన్ 15కి హోస్ట్‌గా కరణ్ వ్యవహరించనున్నారు. అయితే ఇది సీజన్ మొత్తానికి కాదు. కేవలం తొలి ఆరు వారాలకు గాను కరణ్ హోస్ట్‌గా చేయనున్నారు. అంతేకాకుండా ఈ ఎపిసోడ్స్ నేరుగా టీవీలో కాకుండా ప్రముఖ ఓటీటీ సంస్థ వూట్(voot)లో 24×7 ప్రసారం కానుంది. ఆగస్టు 8నుంచి ఈ షో ప్రీమియర్ స్ట్రీమింగ్ కానుంది. మరో విశేషం ఎంటంటే ఈ సీజన్ కంటెస్టెంట్స్ ఎంపిక నుంచి ప్రతివారం వారికి ఇచ్చే టాస్క్‌ల వరకు ప్రతిది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుందని సమాచారం. ఇక బిగ్‌బాస్ ఓటీటీలో ప్రసారం కానున్న తొలి ఆరు వారాల ఎపిసోడ్‌కు గాను హోస్ట్‌గా సిధార్థ్ శుక్లా, ఫరా ఖాన్, రోహిత్ శెట్టి వంటి పేర్లు వినిపించాయి. కానీ తాజాగా మేకర్స్ కరణ్ జోహార్‌ను సీజన్15 హోస్ట్‌గా ప్రకటిస్తూ ఊహాగానాలకు చెక్ పెట్టారు. ఈ సందర్భంగా కరణ్ జోహార్ స్పందిస్తూ..'బిగ్‌బాస్ షోకి నేను, మా అమ్మ పెద్ద ఫ్యాన్స్. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా చూస్తాం. అంతేకాకుండా నేను ఎప్పటికైనా బిగ్‌బాస్ షోను హోస్ట్ చేయాలని మా అమ్మ కోరిక. అది ఇప్పుడు నెరవేరుతుంది. గతంలో ఎన్నో షోలకు హోస్ట్‌గా చేయడాన్ని ఎంజాయ్ చేశాను. కానీ ఇప్పుడు బిగ్‌బాస్ షోకు వ్యాఖ్యాతగా చేయడం మరింత ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తుంది' అంటూ పేర్కొన్నారు. ఇక ఓటీటీలో ప్రసారం అయ్యే తొలి ఆరు వారాల ఎపిసోడ్లకు మాత్రమే కరణ్ హోస్టుగా ఉంటాడనీ, అనంతరం 'కలర్స్' టీవీలో ప్రసారమయ్యే ఎపిసోడ్లకు మాత్రం మళ్లీ యథావిధిగా సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తాడని సమాచారం. -
గబ్బిలాల నుంచి కరోనా: చాలా తక్కువ మార్పులతో..
లండన్: కరోనా వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు కొద్దిపాటి మార్పులతో వ్యాపిస్తొందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే జన్యుక్రమంలో తేడాలున్నాయని తాజా అధ్యయనంలో బయటపడింది. ఈ అధ్యయనాన్ని పీఎల్ఓఎస్ బయోలజీ జర్నల్ ప్రచురించింది. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ కలిగించే సార్స్-కోవ్-2 వైరస్‌లో కూడా అనేక జన్యు రూపాలు ఉన్నాయని తెలిపింది. కరోనా వైరస్ వ్యాపించడం కంటే 11 నెలల ముందే సార్స్-కోవ్-2 వైరస్ ప్రత్యేక జన్యు రూపాన్ని గుర్తించినట్లు తెలిపారు. డీ614జీ మ్యూటేషన్ వైరస్‌లోని మార్పులను ప్రభావితం చేస్తుందని ఈ అధ్యయనం పేర్కొంది. ఈ మిగతా వైరస్ వలే సార్స్-కోవ్-2 వైరస్ కూడా కొన్ని మార్పులతో వ్యాపిస్తుందని స్కాట్లాండ్లోని గ్లాస్గో యూనివర్సీటీ ఫర్ వైరస్ రీసెర్చ్ శాస్త్రవేత్త ఆస్కార్ మాక్లీన్ తెలిపారు. కానీ, ఈ వైరస్ వ్యాప్తి చెందే విధానంపై శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాధారణంగా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే క్రమంలో దాని లక్షణాలు నెమ్మదిగా వ్యాప్తి చెందుతాయని, సార్స్-కోవ్-2 వైరస్ కూడా అటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉందని యూఎస్‌లోని టెంపుల్ యూనీవర్సీటి రచయిత సెర్గిపోండ్ తెలిపారు. సార్స్-కోవ్-2 వైరస్ మానవులకు సోకే సామర్థ్యం కలిగి ఉంటుందని, అయితే ఈ వైరస్ లక్షణాలు ముందుగా గబ్బిలాల్లో అభివృద్ధి చెందుతాయిని ఈ అధ్యయనంలో తెలిపారు. ఇది ప్రధానంగా మానవునిలో రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందని తెలిపారు. అయితే దేశంలో వీలైనన్ని ఎక్కువ వ్యాక్సిన్లు అభివృద్ది చేసి ప్రజలకు అందించాలని గ్లాస్గో యూనివర్సీటి పరిశోధకుడు డేవిడ్ ఎల్ రాబర్గ్సస్ పేర్కొన్నారు. చదవండి: పేదరికంలో మగ్గుతున్న గురువును ఆదుకోవటానికి.. -
టాక్ షో హోస్ట్‌గా సమంత!
ఇటీవల బిగ్‌బాస్ సీజన్ 4లో సమంత సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ షో హోస్ట్ చేస్తున్న నాగార్జున సినిమా షూటింగ్ నిమిత్తం మనాలీ వెళ్లగా మామయ్య స్థానంలో సమంత బిగ్‌బాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. చేసిన ఒక్క ఎపిసోడ్‌లోనే ప్రేక్షకులను తనవైపు తిప్పుకొని సమంత మంచి పేరును సంపాదించింది. ఆమె చేసిన దసరా ఎపిసోడ్ టీఆర్పీ రేటింగ్‌లో దూసుకుపోయింది. బిగ్‌బాస్‌కు నాగార్జున కంటే సమంతనే కావాలని నెటిజన్లు కోరుతున్నారంటే ఆమె యాంకరింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో సమంత హోస్టింగ్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదికగా త్వరలో ఓ షోకు వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారు. చదవండి: విడాకులు తీసుకోమని సలహా: సమంత రిప్లై బాలీవుడ్లో కరణ్ జోహార్, నేహ ధూపియా మాదిరిగా టాక్ షో చేయనున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ఆహా తమ సబ్స్క్రిప్షనర్లను పెంచుకునేందుకు సమంతను తీసుకురానున్నారు. ఇందులో భాగంగా ఓ కాన్సెప్ట్‌తో ఆమె పలువురు సెలబ్రిటీలతో ముచ్చటించనున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ను ఇప్పటికే ప్రారంభించారు. మరింత సమాచారాన్ని నిర్మాత అల్లు అరవింద్, సమంత రేపు వెల్లడించనున్నారు. మరోవైపు ద ఫ్యామిలీ మెన్ అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోకి అడుగుపెట్టనున్నారు. టీఆర్పీలో నాగ్‌ను మించిపోయిన సమంత -
105 రోజుల వినోద క్వారంటైన్
కరోనా వచ్చినా, వస్తుందనే సందేహం వచ్చినా క్వారంటైన్‌కి వెళ్లాలి. ఆ క్వారంటైన్ పద్నాలుగు రోజులే. కాని పదహారు మంది కంటెస్టెంట్లు 105 రోజుల క్వారెంటైన్‌కి వెళ్లే సీజన్ వచ్చింది. బిగ్‌బాస్ 4 సీజన్. ఇక వీరి ఆటలు, పాటలు, తగువులు, తీర్పులు, ఎంట్రీలు, ఎగ్జిట్లు అన్నీ ప్రేక్షకులవి కూడా కాబోతున్నాయి. కరోనా చికాకును కాస్తయినా దూరం చేసే భారీ డైలీ డ్రామా బిగ్‌బాస్ 4. కెమెరా కళ్లున్న ఇల్లు. అనుక్షణం నిఘా. ప్రతి కదలికను వెంటాడే చూపు. ప్రవర్తనపై తీర్పు. అంతలోనే స్నేహం. అంతలోనే వైరం. ఇంట్లోకి అడుగు పెడుతుంటే స్వాగతం. వీడ్కోలు తీసుకుంటూ ఉంటే దుఃఖం. స్టార్ మాలో ప్రసారం కానున్న బిగ్‌బాస్ షోలో లేని డ్రామా లేదు. అంత వరకూ ముక్కూముఖం అంతా తెలియని వారు, పాత స్నేహం ఉన్నవారు పూర్తిగా కొత్తగా మారి కొత్త జీవితం జీవించడమే ఈ షో విశేషం. అందరి లక్ష్యం ఒక్కటే. అంతిమ విజేతగా నిలవడం. కాని ఆ ప్రయాణం అంత సులువు కాదు. మనుషులను ఓడించి, జయించి, బాధించి, సంతోషపరిచి ఆ స్థానానికి వెళ్లాలి. ప్రతి సందర్భంలోనూ ఒకటే సవాల్. లోపల ఉన్న మంచిని బయటకు తేవాలా.. చెడును బయటకు తేవాలా. ఆ ప్రవర్తనకే ఓట్లు పడతాయి. ఆ వ్యక్తిత్వాన్నే ప్రేక్షకులు గెలిపిస్తారు. ఇదంతా ప్రతి రోజూ గుక్క తిప్పుకోనివ్వకుండా కొనసాగుతుంది. ఈసారి హోస్ట్ ఎవరు? బిగ్‌బాస్ షో నిర్వహణ ఎంత ముఖ్యమో హోస్ట్‌ను నియమించడం కూడా అంతే ముఖ్యం. ఎన్.టి.ఆర్ హోస్ట్‌గా పెద్ద బ్యాంగ్‌తో మొదలైన ఈ షో ఆ తర్వాత నాని, నాగార్జునలతో అదే మీటర్‌ను కొనసాగించింది. బిగ్‌బాస్ 4కు మళ్లీ ఎన్.టి.ఆర్ హోస్ట్ కావచ్చన్న వార్తలొచ్చాయి. ఒక దశలో మహేశ్‌బాబు పేరు వినిపించింది. కాని బిగ్‌బాస్‌కు హోస్ట్ చేసే చాన్స్ మళ్లీ నాగార్జునకే దక్కింది. కరోనా వల్ల సినిమా షూటింగ్‌లు నిలిచిపోయిన నేపథ్యంలో నాగార్జున కూడా మరోసారి ఈ షోను హోస్ట్ చేయడం ఒక ఆసక్తికర వృత్తిగత కార్యకలాపంగా భావించి ఉంటారు. నాగార్జున నిర్వహించిన బిగ్‌బాస్ 3 విజేతగా గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. ఈసారి ఎవరు నిలుస్తారో చూడాలి. కంటెస్టెంట్లు ఎవరు? పాల్గొనే వరకు కంటెస్టెంట్లు ఎవరు అనే విషయమై సస్పెన్స్ ఉంచడం బిగ్‌బాస్ షో ఆనవాయితీ. అయితే ఇంతకు ముందు పద్ధతి వేరు. ఇప్పుడు పద్ధతి వేరు. గతంలో కంటెస్టెంట్లను షోకు రెండు మూడు రోజుల ముందు తమ అధీనంలోకి తీసుకునేవారు. కాని ఇప్పుడు కరోనా వల్ల రెండు వారాల ముందు నుంచే వారిని తమ అధీనంలోకి తీసుకోవడం, పరీక్షలు నిర్వహించడం తతిమా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అందుకే ఆగస్టు నెలాఖరుకు టెలికాస్ట్ కావాల్సిన షో సెప్టెంబర్ 6కు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్ల పేర్లు కొన్ని బయటకు తెలియసాగాయి. నటుడు తరుణ్, నటి శ్రద్ధా దాస్, గాయని సునీతల పేర్లు మొదట వినిపించినా వారు తమ పార్టిసిపేషన్‌ను కొట్టి పారేశారు. ప్రస్తుతానికైతే వార్తల్లో ఉన్న పేర్లు ఇవి– 1. లాస్య మంజునాథ్ (టీవీ నటి), 2. మహాతల్లి జాహ్నవి (యూట్యూబర్), 3. గంగవ్వ (యూట్యూబర్– విలేజ్ స్టార్), 4.సుజాత (టివి యాంకర్), 5.అవినాష్ (స్టాండప్ కమెడియన్), 6. సత్య (న్యూస్ రీడర్), 7.సుహైల్ రెయాన్ 8. సూర్యకిరణ్ (డైరెక్టర్), 9. అభిజిత్ (హీరో), 10. అమ్మ రాజశేఖర్ (దర్శకుడు). 11. దివి వైద్య (నటి). మిగిలిన ఐదుగురిలో ఇద్దరు హీరోయిన్లు, ఒక మ్యూజిక్ చానెల్ యాంకర్ ఉంటారని తెలుస్తోంది. ఈ 16 మంది కాకుండా అడిషిషనల్ కంటెస్టెంట్లను కూడా సిద్ధంగా ఉంచుకున్నారు. కరోనా ఆటంకాల వల్ల, ఇతరత్రా ఇబ్బందుల వల్ల వీరిలో ఎవరు పాల్గొంటారో కొత్తగా ఎవరు జతవుతారో ఇవాళ సాయంత్రం తెలిసిపోతుంది. కత్తి మీద సాము ఏమైనా ఈసారి బిగ్‌బాస్ షో నిర్వహణ కత్తి మీద సాము. గెస్ట్‌లు హౌస్‌లోకి రావాలన్నా, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్‌లోకి రావాలన్నా అప్పటికప్పుడు అయ్యే పని కాదు. కరోనా ప్రొటోకాల్‌ను పాటించి చేయాలి. అదీగాక బిగ్‌బాస్ షో నిర్వహణ లో కనీసం వంద మంది శ్రమించాల్సి ఉంటుంది. వీరంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే హౌస్‌లో ఉన్నవారికి కూడా కరోనా రావచ్చు. ఎన్ని అడ్డంకులు ఉన్నా ప్రేక్షకులు ఉత్కంఠగా ఉన్నారన్నది వాస్తవం. ఇల్లు అంతగా కదల్లేని ఈ రోజుల్లో, థియేటర్ల మూసివేత కొనసాగుతున్న ఈ రోజుల్లో ఇంట్లోకి రానున్న వినోదం వారిని ఉల్లాసపరుస్తుందనే ఆశిద్దాం. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
మహిళల ఆసియా కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ‘ఆసియా కప్ మహిళల పుట్‌బాల్ టోర్నీ’ ఆతిథ్య హక్కులు 41 ఏళ్ల తర్వాత భారత్‌కు దక్కాయి. 2022లో నిర్వహించనున్న ఈ టోర్నీకి భారత్ వేదికగా నిలువనుందని ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫెడరేషన్ (ఏఎఫ్సీ) శుక్రవారం ప్రకటించింది. ‘ఏఎఫ్సీ మహిళల పుట్‌బాల్ కమిటీ సిఫార్సుల మేరకు టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్‌కు కట్టబెడుతున్నాం’ అని ఏఎఫ్సీ కార్యదర్శి డాటో విండ్సర్ జాన్ తెలపారు. భారత్ చివరిసారి 1979లో ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ఈ అవకాశమిచ్చిన ఎఎఫ్‌సీకి ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో మహిళల ఫుట్‌బాల్ అభివృద్ధికి, ఔత్సాహిక ఫుట్‌బాలర్లను ప్రోత్సహించేందుకు ఈ టోర్నీ ఎంతగానో ఉపయోగపడనుందని ఆయన పేర్కొన్నారు. 12 జట్లు తలపడనున్న ఈ టోర్నీలో ఆతిథ్య దేశం హోదాలో భారత్ నేరుగా అర్హత పొందుతుంది. 2023లో జరుగనున్న ‘ఫిఫా’ మహిళల ప్రపంచకప్ టోర్నీకి ఇదే అఖరి క్వాలిఫికేషన్ ఈవెంట్ కావడం గమనార్హం. -
ఈసారీ యాంకర్ లేని ఆస్కార్
అవార్డు ఫంక్షన్ అంటే స్టార్స్, వారి పెర్ఫార్మెన్స్లు, సర్ప్రైజ్లతో పాటు హోస్ట్ కూడా ముఖ్యం. అయితే యాంకర్ లేకుండానే గత ఏడాది ఆస్కార్ అవార్డు ఫంక్షన్‌ను నిర్వహించింది అకాడమీ సంస్థ. 1989 తర్వాత యాంకర్ లేకుండా ఆస్కార్ వేడుక జరిగింది 2019లోనే. ముందుగా అనుకున్న హోస్ట్ (కెవిన్ హార్ట్) అనుకోని వివాదంలో చిక్కుకోవడంతో యాంకరింగ్ చేసే బాధ్యతల నుంచి తప్పుకున్నారు. యాంకర్ సరదా మాటలు, సీరియస్ కామెంట్లు లేకుండానే గత ఏడాది వేడుక హిట్ కాబట్టి ఈ ఏడాది కూడా యాంకర్ లేకుండా వేడుకను నిర్వహించాలని నిశ్చయించుకుంది. ఏ అవార్డును ఎవరు అందజేయాలో వాళ్లు మాత్రం స్టేజ్ మీదకు వచ్చి అవార్డును అందించి వెళ్లిపోతారు. ‘‘ఈ ఏడాది ఆస్కార్స్‌లో స్టార్స్ ఉన్నారు. పెర్ఫార్మెన్స్లు ఉన్నాయి. సర్ప్రైజ్లు ఉన్నాయి. హోస్ట్ లేడు. ఫిబ్రవరి 9న కలుద్దాం’’ అని ట్వీటర్లో పేర్కొంది ఆస్కార్ అవార్డ్స్ అకాడమీ. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా ఆస్కార్ ఫంక్షన్‌ను వీక్షించే వాళ్ల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అయితే 2019లో మాత్రం వీక్షకుల సంఖ్య 18శాతం వరకూ పెరిగింది. దాంతో ఈ ఏడాది సంఖ్య పెరిగేలా వేడుకను ప్లాన్ చేస్తున్నారట నిర్వాహకులు. -
రంగంలోకి దిగుతున్నా!
ఓ పాతిక కిలోల వంకాయలు. గుడ్లు, బియ్యం.. ఇలా కిరాణా సామాన్లను బిజీబిజీగా కొనుగోలు చేస్తున్నారు నాగార్జున. ఇవన్నీ వాళ్ల ఇంటికోసం కాదు.. త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ హౌస్‌లోకి. ‘బిగ్‌బాస్’ సీజన్3కి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారని శుక్రవారం అధికారికంగా ప్రకటించింది ‘బిగ్‌బాస్’ బృందం. ‘ఈ సీజన్లోకి నేను రంగంలోకి దిగబోతున్నాను’ అంటూ నాగార్జున పలికే డైలాగ్ వీడియో ప్రోమోను రిలీజ్ చేశారు. త్వరలోనే ప్రారంభం కానున్న మూడో సీజన్ గురించి స్టార్ మా ప్రతినిధి మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకులకు బెస్ట్ ఇవ్వాలన్నదే మా లక్ష్యం. నాగార్జునగారు తోడవ్వడం ఈ సీజన్‌కు కొత్త ఫ్లేవర్ వస్తుందనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘కొత్త కొత్త విషయాలతో ప్రయోగాలు చేయడం నాకు ఇష్టం. అలాగే టెలివిజన్ కూడా నాకు కొత్తేం కాదు. ఆల్రెడీ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ చేసి ఉన్నాను. ‘బిగ్‌బాస్’ అనేది కొత్త ఎక్స్పీరియన్స్. చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అన్నారు నాగార్జున. -
హోస్ట్ దొరికెనోచ్
బిగ్‌బాస్ 3 సీజన్‌ను ఎవరు హోస్ట్ చేయబోతున్నారనేది బిగ్‌బాస్ ఫ్యాన్స్‌లో హాట్ డిస్కషన్. సెకండ్ సీజన్ తర్వాత మూడో సీజన్‌కు కొనసాగనని నాని చెప్పేశారు. దాంతో ఫస్ట్ సీజన్‌ను హోస్ట్ చేసిన ఎన్టీఆర్ మూడో సీజన్‌కు తిరిగొస్తున్నారన్నది ఒక వార్త. లేదు.. లేదు.. కొత్త హోస్ట్‌గా నాగార్జున బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారన్నది మరోటి . ఫైనల్‌గా సీజన్ 3ని నాగార్జున హోస్ట్ చేయనున్నారని తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇదివరకు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోను నాగార్జున విజయవంతంగా నడిపించిన తీరు గుర్తుండే ఉంటుంది. లేటేస్ట్‌గా బిగ్‌బాస్‌ను అలానే హ్యాండిల్ చేస్తారని ఊహించవచ్చు. ఆల్రెడీ ‘బిగ్‌బాస్’ హౌస్‌లో ఉండే అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే సీజన్ 3 స్టార్ట్ కానుంది. -
బెంగళూరులోనే ఏరో ఇండియా 2019
-
‘బిగ్‌బాస్’కు భారీ పారితోషికం..!
తిరువనంతపురం : ఇప్పటికే పలు భాషల్లో క్రేజీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్‌బాస్ ఈ ఏడాది మాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది. తొలి సీజన్‌తోనే ప్రేక్షకులకు చేరువ అయ్యేందుకు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌ను హోస్ట్‌గా ఎంచుకుంది బిగ్‌బాస్ టీమ్. ఆదివారం (జూన్ 24న) ప్రారంభమైన బిగ్‌బాస్ మొదటి రోజున 16 మంది పోటీదారులను మోహన్‌లాల్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. కేరళ సంస్కృతికి అద్దం పట్టేలా బిగ్‌బాస్ హౌజ్‌ను రూపొందించారు. తన సినిమాల్లోని ఫేమస్ డైలాగ్స్‌తో ప్రారంభమైన షోను ఆద్యంతం తనదైన స్టైల్లో ముందుకు నడిపించారు మోహన్‌లాల్. ‘లాల్ సలామ్’ అనే చిట్‌చాట్ షోతో బుల్లితెర ఎంట్రీ ఇచ్చిన మోహన్‌లాల్.. ప్రస్తుతం బిగ్‌బాస్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నందుకు భారీ పారితోషికం అందుకుంటున్నారని సమాచారం. మలయాళ నాట మోహన్‌లాల్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా 12 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు బిగ్‌బాస్ టీమ్ ఒప్పుకుందని ఓ జాతీయ మీడియా పేర్కొంది. -
బిగ్‌బాస్-2 ఫైనల్ లిస్ట్!
మొదటి సీజన్ బంపర్ హిట్ కావటంతో బిగ్ బాస్ రియాల్టీ షో రెండో సీజన్‌పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా నేటి సాయంత్రం(ఆదివారం) రెండో సీజన్ ప్రారంభం కానుంది. అయితే గత కొంత కాలంగా ఇదే జాబితా అంటూ కొందరి పేర్లు వార్తల్లో ప్రముఖంగా వినిపించాయి. అయితే అవేం నిజం కాదని మొన్నామధ్య నిర్వహించిన ప్రెస్ మీట్లో నిర్వాహకులు, హోస్ట్ నాని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో షో ప్రారంభానికి కొద్ది గంటల ముందు కొందరి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిని పరిశీలిస్తే... 1. సింగర్ గీతా మాధురి.. టాలీవుడ్ పాపులర్ సింగర్ 2. తేజస్వి మదివాడ... టాలీవుడ్లో చాలా చిత్రాల్లో నటించిన నటి. 3. నటుడు అమిత్ తివారీ.. విక్రమార్కుడు, ఖలేజా, అత్తారింటికి దారేది, టెంపర్ , సన్నాఫ్ సత్యమూర్తి, తదితర చిత్రాల్లో నటించాడు. 4. నటుడు తనీష్.. బాల నటుడిగా కెరీర్‌ను ప్రారంభించి, తర్వాత టాలీవుడ్లో పలు చిత్రాల్లో హీరోగా కనిపించిన యువనటుడు. 5. నటుడు సామ్రాట్... అహనా పెళ్లంట, పంచాక్షరి లాంటి చిత్రాల్లో కనిపించారు. కొన్నాళ్ల క్రితం భార్యతో విబేధాల కారణంగా వార్తల్లో నిలిచారు. 6. యాంకర్ దీప్తి... ఓ ప్రముఖ ఛానెల్లో యాంకర్‌గా పని చేస్తున్న దీప్తి నల్లమోతు. భద్ర, శంకర్‌దాదా ఎంబీబీఎస్ లాంటి పలు చిత్రాల్లో కూడా ఆమె నటించారు. 7. బాబు గోగినేని... హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. 8. రోల్ రిడా... రాహుల్ కుమార్ అలియాస్ రోల్ రిడా. రాప్ సింగర్. 9. శ్యామల... యాంకర్ శ్యామల. పలు చిత్రాల్లో కూడా నటించారు. 10. కిరీటి ధర్మరాజు... పలు షార్ట్ ఫిలింస్. టాలీవుడ్ చిత్రాల్లో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్. 11. దీప్తీ సునయన... సోషల్ మీడియా సెన్సేషన్. డబ్ స్మాష్ వీడియోలతో బాగా పాపులర్. ఆ మధ్య నిఖిల్ కిర్రాక్ పార్టీలో కూడా ఓ పాత్రలో కనిపించారు. 12. సీరియల్ నటుడు కౌశల్ 13. భాను... ???. ఈ 13 మంది సెలబ్రిటీలు కాకుండా గణేశ్, సంజన, నూతన్ నాయుడు అనే ముగ్గురు కూడా హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే సమాచారం. ఏది ఏమైనా మరికొద్ది గంటల్లో ఆ సస్పెన్స్‌కు తెర దించుతూ షో ప్రారంభం కాబోతోంది. సెకండ్ సీజన్ వంద రోజులపాటు సాగనుంది. ‘ఏదైనా జరగొచ్చు’ అంటూ ఈ సీజన్ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ను అందించబోతుందో చూడాలి. -
కౌంట్‌డౌన్ స్టార్ట్
గెట్ రెడీ! కౌంట్‌డౌన్ మొదలైంది. ఏదైనా జరగొచ్చు! మీ హౌస్‌లోకి బిగ్ బాస్ వస్తున్నాడు. ఎప్పటి నుంచో తెలుసా? జూన్ 10 నుంచి. అంటే సరిగ్గా.. ఇవాళ్టి నుంచి పదకొండు రోజుల తర్వాత. మరి.. బిగ్‌బాస్ సీజన్ ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా? వంద రోజులు. బిగ్ బాస్ హౌస్‌లో 16మంది పార్టిసిపెంట్స్ హంగామా చేసి వీక్షకులను అలరించబోతున్నారు. తొలి సీజన్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో సీజన్‌కు నానీ హోస్ట్. ‘‘జూన్ 10 నుంచి ప్రారంభం. 100 రోజులు. 16 సెలబ్రిటీలు. 1 బిగ్ బాస్ హౌస్’’ అని నానీ పేర్కొన్నారు. సో.. జూన్ 10 నుంచి సెకండ్ బిగ్ బాస్ హంగామా మొదలవుతుంది. అలరించే పార్టిసిపెంట్స్ ఎవరో కూడా అతి త్వరలో తెలిసిపోతుంది. -
మరోసారి బుల్లితెరపై సల్మాన్...
రియాలిటీ షో ‘బిగ్‌బాస్’కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా మరో కార్యక్రమం ద్వారా బుల్లితెరపై మెరవబోతున్నారు. విజయవంతమైన ‘దస్ కా దమ్’ మూడో సిరీస్‌కు సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నట్టు తెలిసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన తొలి ప్రోమోను ఈ కండల వీరుడు తన ట్విటర్ అకౌంట్లో షేర్ చేశారు. ఇలాంటి టీవీ షోలను ఆసక్తికరంగా నడిపించడంలో ఈ ‘దబాంగ్’ హీరోకు మంచి ప్రావీణ్యం ఉందనే చెప్పవచ్చు. తన ఆసక్తికర వాఖ్యలతో ప్రేక్షకులను కట్టిపడేయడం సల్మాన్‌కు వెన్నతో పెట్టిన విద్య. 20 వారాలపాటు ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికిగాను సల్మాన్ 78కోట్ల రూపాయలు తీసుకోనున్నట్లు సమాచారం. ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్ నుంచి ‘దస్ కా దమ్’ కార్యక్రమం ప్రారంభంకానున్నట్లు సమాచారం. ఈ సారి ‘దస్ కా దమ్’ కార్యక్రమంలో సామాన్యులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు టీవీ నటులు కూడా పాల్గొననున్నట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో నేషనల్ సర్వేకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతారు. సమాధానాలను శాతాలలో (పర్సంటేజ్) చెప్పాల్సి ఉంటుంది. సరైన లేదా సమీప సమాధానం చెప్పినవారు 10 వేల నుంచి 10 కోట్ల రూపాయల వరకూ గెలుచుకుంటారు. -
ఐపీఎల్లో తెలుగమ్మాయి
పోచారం: న్యూస్ రీడర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆమె యాంకర్‌గా మారారు. ఇప్పుడు ఐపీఎల్ హోస్ట్‌గా క్రికెట్ అభిమానులను ఆకర్షిస్తోంది వింధ్య విశాఖ. ఐపీఎల్ సీజన్–11లో తొలిసారిగా తెలుగు కామెంటరీకి శ్రీకారం చుట్టి తెలుగు భాషను గౌరవించింది స్టార్ సంస్థ. దాదాపు 20 మంది యాంకర్లను వెనక్కినెట్టి, వ్యాఖ్యాతగా అవకాశం దక్కించుకన్న మొదటి తెలుగమ్మాయిగా వింధ్య రికార్డు సృష్టించారు. ప్రస్తుత ఐపీఎల్లో 30 మ్యాచ్‌లకు హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. గత సంవత్సరం ప్రోకబడ్డీకి వ్యాఖ్యాతగా వ్యవహరించి స్టార్ స్పోర్ట్స్‌లోకి అడుగుపెట్టి తొలిసారి క్రీడాభిమానులను ఆకట్టుకున్నారు. యాంకరింగ్‌తో సంతృప్తి చెందుతూ.. ఈ రంగంలోనే మరింత రాణించాలని ఆశిస్తున్నానని నారపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె చెప్పారు. చదువులో చురుకుదనం.. వింధ్య ఘట్కేసర్కు చెందిన మేడపాటి వెంకటరెడి,్డ శేషారత్నం మనవరాలు మమతా సత్తిరెడ్డి కుమార్తె. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లిష్‌లో మాస్టర్స్ చేశారు. చిన్నప్పటి నుంచి అటు చదువులోను, ఇటు ఆటల్లోను చురుకుగా ఉండే వింధ్య, హైదరాబాద్‌లోని కస్తూర్బా గాంధీ కాలేజ్‌లో డిగ్రీ చదువుతున్న రోజుల్లో, అన్నా హజారే లోక్‌పాల్ బిల్లు కోసం చేసిన ఉద్యమానికి వలంటీర్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఈమె ప్రసంగాన్ని మెచ్చుకుని తొలిసారి హెచ్ఎంటీవీలో న్యూస్ రీడర్‌గా అవకాశం అందుకున్నారు. ఆ తర్వాత మోడల్‌గానూ అడుగులు వేశారు. మా మ్యూజిక్ ఛానల్లో ‘ఛాయ్ బిస్కెట్’, టీవీ–9లో హాట్ వీల్స్, ఈటీవీ 2లో సఖీ, మా టీవీలో మా ఊరి వంట వంటి కార్యక్రమాలతో పాటు పలువురు సినీరంగ సెలబ్రిటీల ఇంటర్వ్యూలను అందించి ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వింద్య. పేదలకు చేయూతనివ్వాలని.. తల్లిదండ్రులు పిల్లలకు స్వేచ్ఛనిస్తే కెరీర్లో రాణించగలరని, ముఖ్యంగా తాను ఎంచుకున్న రంగంలో ప్యామిలీ సపోర్ట్ ఎంతో ఉందని విద్య తెలిపారు. యాంకరింగ్ చేస్తూనే స్వచ్ఛ వెల్ఫేర్ ఫౌండేషన్ స్థాపించి, పేదలకు చేయూతనిస్తూ సేవాభావం చాటుకుంటున్నారామె. -
ఆతిథ్యం ఎంత శక్తిమంతం అంటే...
అతిథిరూపంలో ఆ పరమేశ్వరుడికన్నా గొప్పవాళ్ళు రావచ్చు. అందుకే పూజలో కూర్చున్నప్పుడు... శాస్త్రం మినహాయింపు ఇచ్చింది. పూజ చేస్తుంటే లేవకూడదన్నది నియమం. కానీ పూజచేస్తుండగా గురువుగారొచ్చినా, మహాత్ములు వచ్చినా పూజ విడిచిపెట్టి వెళ్ళి వారిని ఆదరించాలి. ఎందుకొచ్చారో కనుక్కుని పంపించి తరువాత పూజచేసుకోవాలి. అంతేతప్ప ‘నేను పూజలో ఉన్నాను కాబట్టి వారిని చూడను’ అని అనకూడదు. అతిథిరూపంలో వచ్చినవాడు మహాత్ముడయితే వారిని సేవించకుండా తనదగ్గర కూర్చోవడాన్ని పరమేశ్వరుడు కూడా సహించడు. గజేంద్రమోక్షం కథామూలం అదే కదా! ఒకానొకప్పుడు ద్రవిడదేశంలో ఇంద్రద్యుమ్నుడనే రాజు అంతఃపురాన్ని విడిచిపెట్టి ఒక కొండమీదున్న ప్రశాంత ప్రదేశంలో కూర్చుని జపం చేసుకుంటున్నాడు. ఆ సమయంలో మహాత్ముడయిన అగస్త్యుడొచ్చాడు. ఇంద్రద్యుమ్నుడు లేచి నమస్కరించి అర్ఘ్యపాద్యాలిచ్చి ఉంటే తరించిపోయి ఉండేవాడు. కానీ ఆయన వస్తే నాకేంటన్నట్లు ఉండిపోయాడు. ‘నీవు తమోగుణంతో ప్రవర్తిస్తున్నావు కాబట్టి వచ్చే జన్మలో ఏనుగువయి పుడతావు’ అని శపించాడు అగస్త్యుడు. అయితే ఈ జన్మలో జపతపాదులు చేసావు కాబట్టి నీ ప్రాణంమీదికి వచ్చినప్పుడు పరమేశ్వరుడు గుర్తొచ్చి శరణాగతి చేస్తావని వరమిచ్చాడు. అందుకని ఏనుగుగా పుట్టిన తరువాత మొసలికి చిక్కి ప్రాణం పోతున్న దశలో శరణాగతి చేసి విష్ణువుని పిలిచాడు. అతిథి దేవోభవ అని శాస్త్రం అన్నదంటే అంత మర్యాదతో కూడుకున్న వాక్యం అది. అమర్యాద అంటే–అతిథి పూజ చేయకుండుట–అంటే... ఇంటికొచ్చిన వాళ్ళకు అన్నం పెట్టకుండా ఉండడం అని కాదు. నువ్వు అన్నం పెట్టావా, ఫలహారం పెట్టావా ... అన్న లెక్క ఉండదు. నీ మర్యాద ఎటువంటిదన్నదే ప్రధానమయి ఉంటుంది. కుటిల బుద్ధులయిన వారి ఇండ్లకు పోవద్దంటూ దక్షయజ్ఞం ఘట్టంలో పరమేశ్వరుడు పార్వతీ దేవితో చెప్పిందదే... ‘‘వారేం నష్టపోతున్నారో వాళ్ళకు తెలియదు పార్వతీ... దుర్మార్గులైన వారేం చేస్తారో తెలుసా...పరమ భాగవతోత్తములు, పూజనీయులు ఇంటికొస్తే ఆదరబుద్ధితో తలుపు తీయరు. ‘రండిలోపలికి’ అని పిలవరు. తలుపుకొద్దిగా తీసి కనుబొమలు ముడేస్తారు, ఎందుకొచ్చారన్నట్లు చూస్తారు, నిన్ను పలకరించరు, నువ్వలా బయటే చాలాసేపు కూర్చుని ఉంటే... వస్తున్నా ఉండండి.. అని ... ఆ తరువాత ఎప్పుడో వచ్చి పలకరిస్తారు. ఆ తరువాత వారు నీకు అన్నం పెట్టినా, పరమాన్నం పెట్టినా... నీ మనసుకు తగిలిన గాయాన్ని తట్టుకోలేవు పార్వతీ! నా మాట విను. ఆదరబుద్ధి లేనివారి ఇంటికి వెళ్ళవద్దు.’’ అని పరమశివుడంతటివాడు చెప్పాడు. నీకు శక్తి ఉంది. అతిథికి మర్యాదలు ఘనంగా చెయ్యవచ్చు. శక్తిలేదు. అసలు చెయ్యలేకపోవచ్చు. చెయ్యలేకపోతే వచ్చిన నష్టం లేదు. చెయ్యలేకపోతున్నానన్నమాట పరమ మర్యాదతో చెప్పాలి. ‘అయ్యా! నన్ను మన్నించండి. మీవంటి మహాత్ములు వస్తే ఇవ్వాళ నేను ఆతిథ్యం ఇవ్వలేకపోతున్నా. ఫలానా నిస్సహాయ పరిస్థితిలోఉన్నా. క్షమించండి’’ అని ఒక్కమాట చెబితే వారు పరవశించి వెళ్ళిపోతారు. ఆతిథ్యం అనేది అంత శక్తిమంతం. - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
బిగ్‌బాస్-2.. హోస్ట్ దొరికాడు
సాక్షి, సినిమా : బుల్లితెర షో బిగ్ బాస్ మొదటి షో సక్సెస్ కావటంతో 2 సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ దఫా సీజన్‌కు హోస్ట్ ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఆ మధ్య మరికొందరు స్టార్ల పేర్లు తెరపైకి రాగా.. తాజాగా ఎన్టీఆర్ ఈ షో నుంచి దాదాపు అవుట్ అన్నది కన్ఫర్మ్ చేస్తూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అందుకు కారణం త్రివిక్రమ్ సినిమా త్వరలో మొదలు కావటమే. దీంతో నిర్వాహకులకు ఎన్టీఆర్ సారీ చెప్పేశాడని.. నేచురల్ స్టార్ నానిని సదరు ఛానెల్ సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. కృష్టార్జున యుద్ధం తర్వాత నాని నాగ్‌తో మల్టీస్టారర్ చేస్తున్నాడు. ఈ షూటింగ్ లో కాస్త గ్యాప్ దొరికే అవకాశం ఉండటంతో షో నిర్వహణకు వీలుంటుందని నాని కూడా భావిస్తున్నాడంట. దీంతో సెకండ్ సీజన్‌కు నాని దాదాపు ఖరారు అయినట్లేనని ఆ కథనాల సారాంశం. అయితే ఈ వార్తపై ఛానెల్ నుంచిగానీ, నాని తరపు నుంచి గానీ అధికారిక ప్రకటన వెలువడలేదు. -
ఇండియన్ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్
సాక్షి, స్పోర్ట్స్ : ఇండియన్ క్రికెట్ అభిమానులకు ఐసీసీ శుభవార్త అందించింది. 2023 వన్డే వరల్డ్ కప్‌ను భారత్‌లో నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బీసీసీఐ సర్వసభ్య సమావేశం అనంతరం అధికారికంగా ప్రకటించింది. దీంతో తొలిసారి పూర్తిస్థాయి ప్రపంచకప్‌నకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2023లో వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్‌కప్‌తోపాటు 2021 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా భారత్‌లో నిర్వహించబోతున్నారంట. ఇక గతంలో పలుసార్లు భారత్‌లో క్రికెట్ వరల్డ్ కప్ లు జరిగాయి. అయితే, ఆయా మ్యాచ్‌లకు భారత్ పూర్తి స్థాయి ఆతిథ్యం ఇవ్వలేదు. ఇతర దేశాలతో కలిసి వేదికను పంచుకుంది. 1987, 1996, 2011 లలో భారత్ వరల్డ్ కప్‌ను నిర్వహించింది. 1983, 2011లో భారత్ కప్‌లను కైవసం చేసుకుంది. దీంతోపాటు 2019-23 సంవత్సరాల కాలంలో భారత్ స్వదేశంలో మొత్తం 81 మ్యాచ్‌లు ఆడబోతుందని బీసీసీఐ వెల్లడించింది. 2019 ఐసీసీ వరల్డ్ కప్ ఇంగ్లాండ్‌లో నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. -
దలైలామాను కలిస్తే నేరమే
బీజింగ్: టిబెటిన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా(82)తో ఏ దేశాధినేత భేటీ అయినా, ఆయనకు ఆతిథ్యం ఇచ్చినా దాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని చైనా హెచ్చరించింది. వేర్పాటువాదిగా మారిన దలైలామా తమ నుంచి టిబెట్‌ను విడదీయటానికి యత్నిస్తున్నాడని ఆరోపించింది. ఇటీవల ప్రారంభమైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా యునైటెడ్ ఫ్రంట్ వర్క్ విభాగానికి చెందిన కార్యనిర్వాహక ఉపమంత్రి జాంగ్ ఇజియాంగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఏ దేశమైనా, ఏ సంస్థ లేదా వ్యక్తులైనా 14వ దలైలామాతో భేటీ కావడానికి యత్నిస్తే దాన్ని చైనా ప్రజల మనోభావాల దృష్ట్యా తీవ్రమైన నేరంగా పరిగణిస్తాం. చైనా సార్వభౌమాధికారాన్ని గుర్తించిన అనంతరం దలైలామాతో భేటీ కావడమన్నది అందుకు విరుద్ధమైన చర్య అవుతుంది. మా సార్వభౌమాధికారాన్ని గుర్తించి, మాతో సత్సంబంధాలు కోరుకునే దేశాలన్నీ ఈ విషయమై పునరాలోచించాలి. దలైలామాను ఆధ్యాత్మిక నేతగా పేర్కొంటూ విదేశీ నేతలు చేసే వాదనల్ని మేం ఎంతమాత్రం అంగీకరించబోం. ఆయన మతం ముసుగు కప్పుకున్న రాజకీయ నేత’ అని మండిపడ్డారు. భారత్‌ను నేరుగా ప్రస్తావించకుండా ‘1959లో మాతృభూమికి ద్రోహం చేసిన దలైలామా మరో దేశానికి పారిపోయి ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నార’ని విమర్శించారు. చైనా నుంచి టిబెట్‌ను విడదీయాలన్న వేర్పాటువాద అజెండాతో దశాబ్దాలుగా దలైలామా బృందం పనిచేస్తూనే ఉందని ఆరోపించారు. అసలు టిబెట్ బౌద్ధం అన్నది చైనాలోనే పుట్టిందని ఇజియాంగ్ తెలిపారు. -
మీ కలలు నెరవేరుస్తా!
ప్రముఖ హీరో చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి ఓసారి హాజరయ్యారు. అప్పుడు హోస్ట్ నాగార్జున ప్రశ్నలడిగితే.. హాట్ సీట్లో కూర్చున్న చిరంజీవి సమాధానాలు ఇచ్చారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. చిరంజీవి ప్రశ్నలు అడిగితే.. హాట్ సీట్లో కూర్చున్నవారు సమాధానాలు చెప్పనున్నారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ నాలుగో సీజన్‌కి చిరు హోస్ట్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ‘‘వెండితెర మీద మీరు (ప్రేక్షకులు) నన్ను గెలిపించారు. బుల్లితెర మీద మిమ్మల్ని గెలిపించడానికి, కోటీశ్వరులను చేయడానికి వస్తున్నాను’’ అంటున్నారు చిరంజీవి. ‘మేకింగ్ ద డ్రీమ్స్ విన్’ థీమ్‌తో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వాళ్లు ఈ నెల 11 నుంచి 18 వరకూ ‘మా’ టీవీలో చిరంజీవి అడిగిన ప్రశ్నలకు ఎస్సెమ్మెస్‌ల రూపంలో సమాధానాలు చెప్పడం ద్వారా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు. -
పెదరాయుళ్లు
మన సమస్య మనకు ఎప్పుడూ పెద్దగా అనిపిస్తుంది.. ఇతరుల సమస్య అర్థం చేసుకున్నప్పుడు మన సమస్య చిన్నగా అవుతుంది.. పెద్ద గీత ముందు చిన్న గీత లాగా! పెద్ద పెద్ద కష్టాలను చిన్నబోయేలా చేస్తున్నారు ప్రయోజనాత్మకమైన సృజనాత్మక టెలివిజన్ షోస్ హోస్ట్ చేస్తున్నారు! సుమలత, జీవితలు ఇతరుల సమస్యలు, కష్టాలను అర్థం చేసుకుని తమ కష్టాలుగా భావించి ‘జీవిత’ ‘సుమాలు’గా మారారు. • పెద్ద తెర నుంచి చిన్ని తెరకు ఎలా అడ్జస్ట్ కాగలిగారు? జీవిత: పెద్ద తెరకు ఇవాళ చిన్ని తెర ఏమాత్రం తక్కువ కాదు. గేమ్ షోస్, పర్పస్‌ఫుల్ షోస్ పెరుగుతున్నాయ్. చేసేది ప్రయోజనాత్మక కార్యక్రమం కాబట్టి చిన్ని తెర కోసం ప్రత్యేకంగా అడ్జస్ట్ కావల్సిన అవసరం ఏర్పడలేదు. నటిగా నేను సినిమాలు చేసింది ఎక్కువగా రాజశేఖర్ గారితోనే. ఆ తర్వాత దర్శకురాలిగా-నిర్మాతగా చేశాను. ఇప్పుడు బుల్లితెర ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. సుమలత: ప్యాషన్ ఉంది కాబట్టి ప్రత్యేకంగా అడ్జస్ట్ కావాల్సిన అవసరం రాలేదు. సినిమా, టీవీ దేని ప్రభావం దానిదే. టీవీకే రీచ్ ఎక్కువ. సినిమాలు చూడాలంటే ప్రేక్షకులు థియేటర్‌కి రావాలి. కానీ, టీవీతో మనం ప్రేక్షకుల ఇంట్లోకి వెళ్తాం. అందుకే ఒక కుటుంబ సభ్యుల్లా మన ల్ని చూస్తారు కాబట్టి హ్యాపీగా ఉంది. • టీవీ వాళ్లంటే సినిమా స్టార్స్‌కి చిన్న చూపు ఉంటుందేమో... సుమలత: ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు లేదు. పెద్ద పెద్ద స్టార్స్ టీవీలోకి వచ్చేశారు. అమితాబ్ లాంటి సూపర్ స్టార్ స్మాల్ స్క్రీన్ స్వరూపాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లారు. ఆయన ముందు మాలాంటి వాళ్లెంత. • ఈ ప్రోగ్రామ్ గురించి మీ భర్త అంబరీష్‌గారు ఏమంటారు? నిన్ను ఇంట్లో మహారాణిలా చూసుకుంటే నువ్వెందుకు అందరి సమస్యలు వింటూ ఇబ్బంది పడతావు అంటారు. కానీ సామాన్య జనాలతో కలవడం, వాళ్ల ప్రాబ్లమ్ వినడం, పరిష్కారాలు చెప్పడం నాకు చాలా సంతృప్తినిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలతో తప్ప వాళ్లను కలిసే అవకాశం ఎలా ఉంటుంది? ఆ మాటే అంబరీష్‌గారితో అన్నాను. దాంతో కన్విన్స్ అయ్యారు. ‘బాగా చేస్తున్నావ్’ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. మన చుట్టూ ఉన్న సమాజంలో జీవితాలు ఇలా కూడా ఉన్నాయా అన్నది తెలుస్తుంది. ఒక్కోసారి ఇంత కష్టాలు పడి మనుషులు బతుకుతున్నారా అనిపిస్తుంటుంది. వాళ్ల పెదాలపై చిన్న చిరునవ్వు కలిగిస్తే చాలనిపిస్తుంది. జీవిత: ఒకప్పుడు బిగ్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ అనే తేడా ఉండేది. ఇప్పుడలాంటిది లేదు. స్మాల్ స్క్రీన్‌కి బిగ్ స్టార్స్ వస్తున్నారు. దానివల్ల చిన్ని తెరకు క్రేజ్ పెరిగింది. చిన్న చూపు కూడా పోయింది. • ఎంటర్టైన్మెంట్ షోస్ ఉండగా సమస్యలను పరిష్కరించే షోని అంగీకరించడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? జీవిత:ఈ కార్యక్రమానికి సోషల్ కాజ్ ఉంది కాబట్టి ఒప్పుకున్నాను. జీ తెలుగువాళ్లు ‘బతుకు జట్కా బండి’ రెండోసారి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ షో దర్శకుడు కిశోర్ ‘జీవితగారు చేస్తే బాగుంటుంది’ అన్నారట. ఆ తర్వాత నన్ను కలిశారు. పదిమందికి ఉపయోగపడే షో అనే ఉద్దేశంతోనే అంగీకరించాను. సుమలత:హాలీవుడ్లో ఓప్రా విన్ఫ్రే చేసే టీవీ షోలు బాగుంటాయి. అలాంటి షో చేయాలనిపించింది. ఆ చాన్స్ దక్కినందుకు హ్యాపీగా ఉంది. ఇలాంటి కార్యక్రమా లు ఎన్ని ఎక్కువ వస్తే అంత మంచిది. విడిపోయిన కుటుంబాలు కలవడానికి మరిన్ని వేదికలు దొరుకుతాయి. • ఒక మహిళగా మీరు మహిళలకు ఎక్కువగా మద్దతిచ్చే అవకాశం ఉంటుందని కొందరి అభిప్రాయం? సుమలత: జనరల్‌గా ఆడ, మగ మధ్య సమస్య అంటే దానికి కారణం మగవాళ్లే అనే అభిప్రాయం ఉంటుంది. నిజానికి మహిళల వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. మా దగ్గరికి వచ్చే వాటిలో 80 నుంచి 90 శాతం కేసులు మహిళల గొడవలతోనే ఉంటున్నాయి. ఎవరి వైపు న్యాయం ఉందో వాళ్ల వైపే మాట్లాడతా. ప్రత్యేకంగా మహిళలకు సపోర్ట్ చేయడం అంటూ ఉండదు. • మీ దగ్గరకు వచ్చిన కేసుల్లో గుర్తుండిపోయిన కేసు ఏది? సుమలత: కర్నూలు నుంచి ఒక కేసు కౌన్సిలింగ్‌కు వచ్చింది. టైలర్ పని చేసుకునే పుట్టు మూగ, చెవిటి వ్యక్తికి ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. అమ్మాయి చాలా మంచిది. ఏమీ వినపడని, మాటలు రాని భర్తకి తనే అన్ని సేవలు చేసేది. అతని మూగ భాషను అర్థం చేసుకుంది. సైగలతో మాట్లాడటం నేర్చుకుంది. ఇద్దరికీ ఓ బాబు పుట్టాడు. అతను టైలర్ పని మానేస్తే... తనే ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించేది. ఇలా ఇరవై ఏళ్లు భర్తను కాపాడుకొచ్చింది. కొన్నేళ్ల తర్వాత భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. తన అంగవైకల్యం వల్ల భార్య మరో వ్యక్తిని ఇష్టపడుతుందేమోనన్న అనుమానం అతనిలో మొదలైంది. భార్యను తిట్టేవాడు, కొట్టేవాడు. అన్నీ సహించిందామె. ఈ కార్యక్రమానికి వచ్చారు. అతను విడాకులు కావాలన్నాడు. ఆమె నాకు కుటుంబమే కావాలంది. ఎందుకమ్మా ఇంకా ఇతన్ని భరిస్తావు? అని అడిగితే... ‘నేను లేకపోతే నా భర్తను ఎవరూ చూసుకోరు. ఆయన్ను నేను మాత్రమే కాపాడగలను’ అంది. ఆ అమ్మాయి మంచితనం, సహనం నా మనసుని క దిలించింది. కౌన్సిలింగ్ తర్వాత అతనిలో మార్పు వచ్చింది. మేం చేయాల్సిన సాయం చేశాం. ఇప్పుడు వాళ్లు కలిసి ఉంటున్నారు. జీవిత: ఓ కేసుని ఎప్పటికీ మర్చిపోలేను. పెళ్లయిన ఒక అమ్మాయి ఇద్దరు పిల్లలు పుట్టాక, తన భర్తని వదిలిపెట్టి వేరే ఎవరితోనే వెళ్లిపోయింది. ‘నా కోసం వద్దు. పిల్లల కోసమైనా వచ్చెయ్. నీ దారిన నువ్వు ఉండు. నీ జోలికి నేను రాను’ అని మా అందరి సాక్షిగా ఆ అమ్మాయి భర్త అన్నాడు. కానీ, ఆ అమ్మాయి మాత్రం పిల్లలు మొహం చూసో, భర్త కోసమో, సమాజం గురించి ఆలోచించో నిర్ణయం తీసుకోలేదు. ఎవరితో వెళ్లిపోయిందో అతనితోనే ఉంటానని చెప్పింది. ఈ అమ్మాయిని ఎవరైతే తీసుకెళ్లాడో అతన్ని మానవతా దృక్పథంతో ఆలోచించమంటే, ‘చచ్చినా.. బతికినా ఆ అమ్మాయితోనే. విడిపోయే ప్రసక్తి లేదు’ అని తెగేసి చెప్పాడు. పిల్లలు కూడా ‘రామ్మా..’ అని బతిమాలారు. కానీ, ఆ తల్లి కనికరించలేదు. కావాలంటే ‘మీరు రండి.. నాతో ఉండండి’ అంది. పిల్లలు మాత్రం ‘నువ్వూ, నాన్నా కలిసి ఉంటేనే మేం ఉంటాం. లేకపోతే నాన్నతోనే ఉంటాం’ అన్నారు. అప్పుడు నేను చెప్పిన తీర్పు ఏంటంటే.. ఆ అమ్మాయి భర్తను పిలిచి, ‘నీకు తగ్గ అమ్మాయిని, నీ పిల్లలను బాగా చూసుకునే అమ్మాయిని చేసుకో. నువ్ కాబట్టి ఆ అమ్మాయిని మళ్లీ తీసుకువెళతానంటున్నావ్. వేరేవాళ్లయితే ఒప్పుకోరు’ అన్నాను. జీవిత: దర్శక-నిర్మాతలు షో ప్రారంభానికి ముందు నా దగ్గర కేసు గురించి పది నిముషాలు వివరిస్తారు. దాంతో ఎవరు ఏంటో ఒక అవగాహన వచ్చేస్తుంది. ఆ తర్వాత షోలోకి వెళతాను. అక్కడ రెండు వర్గాలవాళ్లు చెప్పినవన్నీ వింటాను. మామూలుగా కొన్ని షోస్‌లో డెరైక్టర్ ఎలా చెబితే అలా చేయాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ నాకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఒక కేస్‌ని డీల్ చేసేటప్పుడు ఆడ, మగ అనేది ఉండదు. న్యాయంవైపే ఉంటాను. • ఇక్కడికొచ్చేవాళ్లు సమస్యలను కాస్త ఎక్కువ చేసి చెప్పే అవకాశం ఉంటుంది కదా? సుమలత: మేం ప్రశ్నించేటప్పుడు పూర్తిగా కాకున్నా 70 శాతం ఎవరు నిజం మాట్లాడుతున్నారు? ఎవరు అతిగా చెబుతున్నారనేది ఒక అంచనాకు వస్తాం. ఈ షో ప్రొడ్యూసర్స్ ఆ జంటలో ఎవరు తప్పు చేశారనేది ముందుగానే కనుక్కుంటారు. ఆ ఫీడ్‌బ్యాక్‌తో ఎవరు అతిగా చెబుతున్నారనేది తెలిసిపోతుంది. జీవిత: ఒకట్రెండు సార్లు చెప్పిన తర్వాత నాకు క్లారిటీ రాకపోతే.. ఒకటికి నాలుగు సార్లు అడుగుతాను. వాళ్లే కన్ఫ్యూజ్ అయ్యి అసలు విషయం చెప్పేస్తారు. ఏ విషయాన్నయినా అతిగా చెబితే ఇట్టే పట్టేయొచ్చు. 200 శాతం నేను కరెక్ట్‌గా జడ్జ్ చేస్తాను. • ఈ కార్యక్రమంతో మీరెంత సంతృప్తిగా ఉన్నారు? సుమలత: కౌన్సిలింగ్‌కు వచ్చిన చాలామంది.. మూడు నాలుగు నెలల తర్వాత మళ్లీ వస్తారు. ‘మేడమ్ ఇప్పుడు మా కుటుంబం బాగుంది’ అని చెబుతుంటారు. అప్పుడు నాకు దొరికే సంతృప్తి డబ్బుతో రాదు. ఒక కుటుంబాన్ని నిలబెట్టామనే సంతోషం వెల కట్టలేనిది. జీవిత: ఓ పెద్ద యూనివర్శిటీ వీసీ (వైస్ చాన్సలర్) ‘మేడమ్.. మీ షో చాలా బాగుంది. నేనా షోకి మా ఇంట్లో వాళ్లను తీసుకొచ్చే పరిస్థితిలో లేను. విడిగా మీరు టైమ్ ఇస్తే, నా కూతురు, అల్లుణ్ణి తీసుకువస్తాను. మీరు మాట్లాడితే సర్దుకుంటుందని నమ్ముతున్నాను’ అన్నారు. ఇంతకన్నా సంతృప్తి ఏముంటుంది? • ఇలాంటి షోస్ ఇంకా ఉన్నాయి కదా.. మరి పోటీ? జీవిత: ఎవరు షో ఎంత బాగా సక్సెస్ అయిందనే పోటీ ముఖ్యం కాదు. వచ్చిన వాళ్ల సమస్యలకు పరిష్కారం చూపించగలుగుతున్నామా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తాను. ఆ షో కన్నా మనం ఇంకా బాగా చేయాలి? అనుకోవడానికి ఇది నటన కాదు... జీవితం. సుమలత: ఇలాంటి షోస్ ఎన్ని ఉన్నా చాలదు. ఎందుకంటే ప్రపంచంలో బోల్డన్ని సమస్యలున్నాయి. ఒకవేళ లేకపోతే వీటి అవసరమే లేదు. ఎవరి షో వాళ్లదే. న్యాయ నిర్ణేతల మధ్య పోలికలు పెడుతున్నారు. ఆవిడ ఇలా చేస్తోంది? ఈవిడ ఇలా చేస్తోంది? అని మాట్లాడు కుంటారు. అది సహజం. మా మధ్య పోటీ లేదు. • మీ భర్త రాజశేఖర్‌గారు మీ ప్రోగ్రామ్ చూస్తుంటారా? ఆయన ప్రోత్సహించడంవల్లే చేస్తున్నాను. నాకూ వ్యక్తిగతంగా ఇష్టమే. షో చూసినప్పుడల్లా ‘నీ పెదరాయుడు తీర్పు ‘బతుకు జట్కా బండి’లో చూపించుకో. నా దగ్గర కాదు’ అని సరదాగా ఆటపట్టిస్తుంటారు. నా కూతుళ్లేమో ‘నువ్వేమైనా చేసుకో మమ్మీ. నువ్ మాత్రం మా బానిసవే’ అని నవ్వుతుంటారు. నేను కూడా ‘యస్.. నేను మీ బానిసనే’ అంటుంటాను. షో ఇంత సక్సెస్ అవు తుందని ఊహించలేదు. ఆ మధ్య ఓ పెళ్లికి వెళితే.. పెద్ద పోలీసాఫీసర్స్ ‘ఏమ్మా.. మా పని నువ్వే చేసేస్తున్నావ్. సమస్యలన్నీ తీర్చేస్తున్నావ్’ అని అభినందించారు. • ఒక్కోసారి సహనం కోల్పోయి తిట్టే స్థాయి వరకూ..? జీవిత: ప్రతి షో గురించి ప్రేక్షకులు, మీడియా మాట్లాడుకుంటారు. ఆ షోలో ఆ నటి కొట్టిందట.. మరో షోలో ఆ నటి బూతులు తిట్టిందట.. అని. జీవిత ఇలా మాట్లాడిందట అని తప్పు వెతికితే.. ఎవరో దగ్గర కాకుండా నేరుగా నా దగ్గరే ఆ మాట అంటే సమాధానం చెబుతా. మాస్, క్లాస్ విషయానికొస్తే.. నేను మాసే. సుమలత: కొన్నిసార్లు కోపం వస్తుంది. కానీ, కోపాన్ని ప్రదర్శించి డ్రామా క్రియేట్ చేయడం నాకిష్టం ఉండదు. అలా చేస్తే ఎక్కువ మంది నా ప్రోగ్రామ్ చూస్తారు. మా లక్ష్యం అది కాదు. వాళ్ల సమస్యను ఎలా పరిష్కరించగలం అని మాత్రమే ఆలోచిస్తాం. ఎవరినైనా తిట్టినా అది ఆపుకోలేని కోపమే గానీ వాళ్లను కించపరచాలని కాదు. - శివ మల్లాల -
ఉగ్రవాది అమరుడు కాలేడు
• ఆ విషయం పాక్‌కు చెప్పాం: పార్లమెంటులో రాజ్‌నాథ్ వెల్లడి • ఇస్లామాబాద్‌లో సార్క్ సదస్సు వివరాలపై ప్రకటన • పాక్‌లో తనకు సరైన ఆతిథ్యం ఇవ్వలేదని విమర్శ న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లో హతమైన హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వాని ఉదంతం నేపథ్యంలో.. ఒక దేశంలో ఉగ్రవాదిగా ఉన్న వ్యక్తి మరో దేశానికి అమరవీరుడు కాలేడని పాకిస్తాన్‌కు స్పష్టం చేసినట్టు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వెల్లడించారు. ఉగ్రవాదులను కీర్తించడం, ప్రోత్సహించడం మానుకోవాలని సార్క్ దేశాలను కోరినట్టు చెప్పారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో గురువారం జరిగిన సార్క్ దేశాల హోంమంత్రుల సమావేశానికి తాను హాజరైన అంశంపై రాజ్‌నాథ్ శుక్రవారం పార్లమెంటు ఉభయసభల్లో సుమోటోగా ప్రకటన చేశారు. బుర్హాన్‌ను అమరవీరుడిగా, దేశ భక్తుడిగా పాక్ కీర్తించటం.. దానిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగ్రవాదిని అమరవీరుడిగా కీర్తించటం తగదని పాక్‌కు చెప్పినట్లు రాజ్‌నాథ్ తెలిపారు. సార్క్ సదస్సులో ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, మనుషుల క్రయవిక్రయాల అంశాలపై చర్చించారని, చాలా దేశాలు అన్ని రూపాల ఉగ్రవాదాన్నీ ఖండించాయని చెప్పారు. నేర విషయాలపై సహకారానికి సంబంధించి సార్క్ సదస్సు తీర్మానాన్ని పాక్ ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశాలపై త్వరలో చర్యలు చేపడతామని పాక్ చెప్పిందని.. ఆ ‘త్వరలో’ అనేది నిజంగానే త్వరగా జరుగుతుందని ఆశిస్తున్నానన్నారు. ఉగ్రవాదం పట్ల మంచి ఉగ్రవాదం, చెడ్డ ఉగ్రవాదం అంటూ వివక్ష చూపొద్దన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న లేదా మద్దతిస్తున్న రాజ్య, రాజ్యేతర శక్తులపై అన్ని సమర్థవంతమైన చర్యలూ చేపట్టటం అవసరమన్నారు. ఉగ్రవాదులపై ప్రపంచ సమాజం విధించిన ఆంక్షలు, నిషేధాలను గౌరవించాలని సార్క్ మంత్రులకు తాను సూచించినట్లు చెప్పారు. అలాగే.. ఉగ్రవాద వ్యతిరేక వ్యవస్థ మెరుగుదల కోసం నిఫుణుల కమిటీ భేటీని ఈ ఏడాది సెప్టెంబర్ 22, 23 తేదీల్లో ఢిల్లీలో ఏర్పాటు చేసేందుకు భారత్ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు పేర్కొన్నారు. విందు కోసం వెళ్లలేదు.. పాక్ హోమంత్రి సార్క్ సదస్సుకు వచ్చిన అందరినీ విందుకు పిలిచిన మాట వాస్తమే అని.. తర్వాత ఆయన తన కారులో వెళ్లిపోవడంతో తానూ వెళ్లిపోయానని రాజ్‌నాథ్ చెప్పారు. పాక్‌లో తనకు సరైన ఆతిథ్యం ఇవ్వలేదన్నారు. అయితే విందు కోసం ఆ దేశానికి వెళ్లలేదంటూ దీనిపై ఫిర్యాదు చేయదలచుకోలేదని చెప్పారు. దీంతో సభ్యులు బల్లలపై చరుస్తూ మద్దతు తెలిపారు. సదస్సులో తాను ప్రసంగిస్తుండగా భారత మీడియాను అనుమతించలేదన్న ఎంపీల ప్రశ్నకు జవాబిచ్చారు. ‘ఆ అది లైవ్ టెలికాస్టా, కాదా.. అనేది తెలియదు. అయితే ఆ సమయంలో దూరదర్శన్, పీటీఐ, ఏఎన్ఐ ప్రతినిధులకు అనుమతి ఇవ్వలేదనేది వాస్తవం’ అని చెప్పారు. -
ఆకట్టుకున్న గిత్తల ర్యాంప్‌వాక్
-
ఈ ఆటలో ఆమే విజేత!
సంసారం సజావుగా సాగితే సంబరంలా ఉంటుంది. కానీ కలతలు వచ్చాయో కల్లోలమవుతుంది. చదరంగంలా గజిబిజిగా, గందరగోళంగా తయారవుతుంది. ఆ గందరగోళాన్ని తొలగించడం అంత సులభమైన పనేమీ కాదు. అయినా ఆ బాధ్యతని తలకెత్తుకున్నాయి కొన్ని టెలివిజన్ షోలు. వాటిలో ‘సంసారం ఒక చదరంగం’ ఒకటి. అయితే దీని సక్సెస్‌లో సగంపైన క్రెడిట్ హోస్ట్ సుమలతకే ఇవ్వాలి. గతంలో ‘బతుకు జట్కాబండి’ కార్యక్రమాన్ని నడిపారు సుమలత. ఆ తర్వాత ఈ షో బాధ్యతలు స్వీకరించారు. ఆవిడ తన బాధ్యతను ఎంతో సమర్థవంతంగా నిర్వరిస్తున్నారు. ఇరు వర్గాల వాదననూ ఓపికగా వినే విధానం, వారి వ్యక్తిత్వాలనూ ఆలోచనా విధానాలనూ అంచనా వేసే తీరు ఎంతో చక్కగా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆవిడ మాట తీరు గురించి చెప్పుకోవాలి. తప్పు చేసినవారితో సైతం ఎంతో మర్యాదగా మాట్లాడటం, ఎంత కోపంగా మందలిస్తున్నా ఎక్కడా మాట తూలకపోవడం ఆవిడలోని స్పెషల్ క్వాలిటీస్. ఆవిడ విజ్ఞత చూస్తుంటే హోస్ట్‌గా ఆవిడ్ని సెలెక్ట్ చేయడం నూరు శాతం కరెక్ట్ అనిపిస్తోంది. సంసారపు చదరంగంలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా... ఈ షో వరకూ మాత్రం ఆమే విజేత! -
2019లో ఏపీలో జాతీయ క్రీడలు
సాక్షి, విజయవాడ స్పోర్ట్స్: జాతీయ క్రీడలకు మరోసారి తెలుగురాష్ట్రం ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2019లో జరిగే 37వ జాతీయ క్రీడలను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించడానికి జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అంగీకరించింది. గువాహటిలో బుధవారం జరిగిన ఐఓఏ సమావేశంలో ఈ మేరుకు నిర్ణయం తీసుకున్నారని శాప్ చైర్మన్ పీఆర్ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి 2019లో జాతీయ క్రీడలు ఉత్తరాఖండ్‌లో జరగాల్సి ఉంది. అయితే తాము ప్రస్తుతం ఆ క్రీడలను నిర్వహించే పరిస్థితిలో లేమని ఆ రాష్ట్రం ఇటీవల తెలిపింది. దీంతో తాజాగా ఐఓఏ సమావేశంలో బిడ్లను పిలిచారు. ఏపీతో పాటు మేఘాలయా కూడా క్రీడల నిర్వహణకు ఆసక్తి చూపింది. అయితే ఏపీఓఏ ప్రతినిధులు మేఘాలయ అధికారులతో మాట్లాడటంతో వారు వైదొలిగారు. దీంతో ఏపీకి అవకాశం దక్కింది. ఏపీ ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల చెక్‌ను ఐఓఏకు శాప్ ప్రతినిధులు అందజేశారు. వాస్తవానికి బిడ్ మొత్తం ఐదు కోట్ల రూపాయలు ఐఓఏకు ఇవ్వాలి. మిగిలిన రూ.4.5 కోట్లకు త్వరలో చెక్ పంపుతామని ఏపీ ప్రతినిధులు చేసిన విజ్ఞప్తిని ఐఓఏ అధికారులు మన్నించారు. 2017లో గోవాలో జాతీయ క్రీడలు జరగాలి. అయితే పదే పదే వాయిదా పడటం జాతీయ క్రీడల ఆనవాయితీ. కాబట్టి 2019లోనే ఏపీకి ఈ అవకాశం దక్కుతుందా? లేక వాయిదా పడుతుందో చూడాలి. అలాగే జాతీయ క్రీడల నిర్వహణకు కావలసిన స్టేడియాల నిర్మాణం కూడా కొత్త రాష్ట్రంలో చాలా పెద్ద అంశం. -
జయతో ప్రధాని భేటీ
తమిళనాడు సీఎం నివాసంలో గంట సమావేశం అక్కడే లంచ్ చేసిన మోదీ చెన్నై: పార్లమెంటులో ప్రతిష్టంభన నెలకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పలు కీలక బిల్లుల ఆమోదం అగమ్యగోచరమైన నేపథ్యంలో.. ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితతో భేటీ అయ్యారు. మద్రాస్ విశ్వవిద్యాలయంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన నేరుగా జయ నివాసం పోయెస్ గార్డెన్‌కు వెళ్లారు. తొలిసారి తన ఇంటికి వచ్చిన మోదీకి గుమ్మం వద్దకు ఎదురెళ్లి జయ సాదర స్వాగతం పలికారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసిన మోదీ.. దాదాపు 50 నిమిషాల పాటు జయతో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తమిళనాడుకు ప్రయోజనం చేకూర్చే పలు డిమాండ్లను జయలలిత ప్రధాని ముందుంచారు. ఒక వినతిపత్రాన్ని సైతం అందించారు. బీజేపీలోని కీలక నేతల రాజీనామాలపై కాంగ్రెస్, లెఫ్ట్ సహా పలు విపక్షాలు పట్టువీడని వైఖరి అవలంబిస్తున్న పరిస్థితుల్లో జీఎస్టీ సహా పలు కీలక సంస్కరణాత్మక బిల్లులను ఆమోదింపజేసుకోవడం ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో జయతో మోదీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. జయ పార్టీ అన్నాడీఎంకేకు లోక్‌సభలో 37 మంది, రాజ్యసభలో 11 మంది సభ్యులున్నారు. వివాదాస్పద భూ సేకరణ బిల్లుకు లోక్‌సభలో అన్నాడీఎంకే మద్దతిచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రస్థాయిలో అన్నాడీఎంకే, బీజేపీల మధ్య ప్రత్యర్థులుగానే వ్యవహరిస్తున్నా.. ఇరువురు నేతల మధ్య మాత్రం సౌహార్ద సంబంధాలే నెలకొని ఉన్నాయి. 2011లో సీఎంగా జయ ప్రమాణ స్వీకారానికి గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో మోదీ హాజరుకాగా, ఆ తరువాత 2012లో గుజరాత్ సీఎంగా మోదీ ప్రమాణానికి జయలలిత హాజరయ్యారు. సహకరించండి! ప్రధానితో భేటీ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై జయలలిత మోదీ సాయం కోరారు. కర్నాటక, కేరళలతో అంతర్రాష్ట్ర నదీ జలాల సమస్యను పరిష్కరించాలని, శ్రీలంక తమిళుల సమస్యను అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తాలని ప్రధానికందించిన వినతితో కోరారు. కావేరీ నదీ జలాలపై మేనేజ్మెంట్ బోర్డ్‌ను, కావేరీ వాటర్ రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేయాలని, కేరళలోని అసాంఘిక శక్తుల నుంచి ముళ్లపెరియార్ డ్యామ్ భద్రత పెంచాలని విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ బిల్లు అమల్లోకి వస్తే తమిళనాడు ఏటా రూ. 9270 కోట్లు నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదేళ్లపాటు రాష్ట్రాలకు 100% పరిహారం ఇచ్చేందుకు రాజ్యాంగబద్ధ పరిహార విధానం కావాలని, పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాకూడదని అన్నారు. శ్రీలంకకు అప్పగించిన కచ్చతీవు ద్వీపాన్ని భారత్ తిరిగి స్వాధీనపర్చుకోవాలని కోరారు. చో రామస్వామికి మోదీ పరామర్శ జయలలిత నివాసం నుంచి ప్రధాని మోదీ సీనియర్ జర్నలిస్ట్, ‘తుగ్లక్’ పత్రిక ప్రధాన సంపాదకుడు చో రామస్వామి ఇంటికి వెళ్లారు. కొద్ది కాలంగా అస్వస్థతతో ఉన్న తన చిరకాల మిత్రుడు రామస్వామిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అక్కడ మోదీ దాదాపు 10 నిమిషాలు గడిపారు. -
హైదరాబాద్‌లో సౌత్‌జోన్ జూనియర్ అథ్లెటిక్స్
సాక్షి, హైదరాబాద్: మూడేళ్ల తర్వాత హైదరాబాద్ మరోసారి సౌత్‌జోన్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈనెల 13, 14వ తేదీల్లో జరిగే ఈ పోటీలకు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వేదికగా నిలువనుంది. తెలంగాణ అథ్లెటిక్స్ సంఘం (టీఏఏ) ఆధ్వర్యంలో జరిగే ఈ చాంపియన్‌షిప్‌లో 105 అంశాల్లో, ఎనిమిది వయోపరిమితి విభాగాల్లో పోటీలుంటాయి. సౌత్‌జోన్ అథ్లెటిక్స్ మీట్‌కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వడం ఇది నాలుగోసారి. తొలిసారిగా 1989లో, ఆ తర్వాత 2000, 2011లలో హైదరాబాద్‌లో ఈ పోటీలు జరిగాయి. రెండు రోజులపాటు జరిగే ఈ చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. అండమాన్ నికోబార్ దీవులకు చెందిన జట్టు కూడా ఈ పోటీల్లో పాల్గొనే అవకాశముందని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ 10కే రన్ ఫౌండేషన్ ఈ పోటీలకు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఆయా రాష్ట్రాల నుంచి మొత్తం 750 మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొనే అవకాశముంది. ఆయా విభాగాల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు నవంబరు 7 నుంచి 9 వరకు జార్ఖండ్‌లోని రాంచీలో జరిగే జాతీయ ఇంటర్ జోనల్ చాంపియన్‌షిప్‌లో సౌత్‌జోన్ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈసారి పోటీల్లో భారత్‌కు వివిధ అంతర్జాతీయ మీట్లలో ప్రాతినిధ్యం వహించిన పలువురు యువతారలు బరిలోకి దిగనున్నారు. మేమన్ పౌలోజ్ (కేరళ-110 మీటర్ల హర్డిల్స్; యూత్ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానం); మిత్రా వరుణ్ (తమిళనాడు-డిస్కస్ త్రో; యూత్ ఒలింపిక్స్‌లో ఐదో స్థానం); నసీముద్దీన్ (కేరళ-100 మీటర్ల హర్డిల్స్; లూసోఫోనియా గేమ్స్‌లో కాంస్యం); మహ్మద్ అఫ్జల్ (కేరళ-మిడిల్ డిస్టెన్స్; ఆసియా స్కూల్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం); లేఖా ఉన్ని (కేరళ-1500 మీటర్లు; ప్రపంచ స్కూల్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం) తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. -
హైదరాబాద్‌లో ఐపీఎల్ పండుగ
హైదరాబాద్: హైదరాబాద్‌కు పొట్టి క్రికెట్ పండుగ వస్తోంది. ఎన్నికల కారణంగా దుబాయ్, ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఐపీఎల్ ఏడో అంచె పోటీలు ఇక నగరంలో జరగనున్నాయి. హైదరాబాద్ టీమ్ సన్ రైజర్స్ ఆడే నాలుగు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 12, 14, 18, 20న ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయి. మ్యాచ్‌లకు భద్రత ఏర్పాట్లను సైబరాబాద్ పోలిస్ కమిషనర్ సీవీ ఆనంద్ సమీక్షించారు. 1500 మంది పోలీసు సిబ్బందితో భద్రత ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఒక్కో మ్యాచ్‌ను 39 వేల మంది వరకు స్టేడియంలో చూసే అవకాశముందని, అభిమానుల కోసం పార్కింగ్ పార్కింగ్ ఏర్పాటుచేశామని సీవీ ఆనంద్ తెలిపారు. స్టేడియం మొత్తం 58 సీసీ కెమెరాలు, స్టేడియం బయట ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని చెప్పారు. సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సహా ఎలక్ట్రానిక్ వస్తువుల్ని స్టేడియం లోపలికి అనుమతించబోమని సీవీ ఆనంద్ చెప్పారు. -
మరో అంతర్జాతీయ సదస్సుకు సిద్ధమైన హైదరాబాద్