
మీ కలలు నెరవేరుస్తా!
ప్రముఖ హీరో చిరంజీవి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి ఓసారి హాజరయ్యారు. అప్పుడు హోస్ట్ నాగార్జున ప్రశ్నలడిగితే.. హాట్ సీట్‌లో కూర్చున్న చిరంజీవి సమాధానాలు ఇచ్చారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. చిరంజీవి ప్రశ్నలు అడిగితే.. హాట్ సీట్‌లో కూర్చున్నవారు సమాధానాలు చెప్పనున్నారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ నాలుగో సీజన్‌కి చిరు హోస్ట్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ‘‘వెండితెర మీద మీరు (ప్రేక్షకులు) నన్ను గెలిపించారు.
బుల్లితెర మీద మిమ్మల్ని గెలిపించడానికి, కోటీశ్వరులను చేయడానికి వస్తున్నాను’’ అంటున్నారు చిరంజీవి. ‘మేకింగ్ ద డ్రీమ్స్ విన్’ థీమ్‌తో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వాళ్లు ఈ నెల 11 నుంచి 18 వరకూ ‘మా’ టీవీలో చిరంజీవి అడిగిన ప్రశ్నలకు ఎస్సెమ్మెస్‌ల రూపంలో సమాధానాలు చెప్పడం ద్వారా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు.