టాక్‌ షో హోస్ట్‌గా సమంత! | Akkineni Samantha Turns Talk Show Host | Sakshi
Sakshi News home page

టాక్‌ షో హోస్ట్‌గా మారనున్న సమంత!

Published Fri, Nov 6 2020 11:52 AM | Last Updated on Fri, Nov 6 2020 12:41 PM

Akkineni Samantha Turns Talk Show Host - Sakshi

ఇటీవల బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో సమంత సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ షో హోస్ట్‌ చేస్తున్న నాగార్జున సినిమా షూటింగ్‌ నిమిత్తం మనాలీ వెళ్లగా మామయ్య స్థానంలో సమంత బిగ్‌బాస్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. చేసిన ఒక్క ఎపిసోడ్‌లోనే ప్రేక్షకులను తనవైపు తిప్పుకొని సమంత మంచి పేరును సంపాదించింది. ఆమె చేసిన దసరా ఎపిసోడ్‌ టీఆర్‌పీ రేటింగ్‌లో దూసుకుపోయింది. బిగ్‌బాస్‌కు నాగార్జున కంటే సమంతనే కావాలని నెటిజన్లు కోరుతున్నారంటే ఆమె యాంకరింగ్‌ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో సమంత హోస్టింగ్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ వేదికగా త్వరలో ఓ షోకు వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారు. చదవండి: విడాకులు తీసుకోమ‌ని స‌ల‌హా: సమంత‌ రిప్లై

బాలీవుడ్‌లో కరణ్‌ జోహార్‌, నేహ ధూపియా మాదిరిగా టాక్‌ షో చేయనున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అయిన ఆహా తమ సబ్‌స్క్రిప్షనర్లను పెంచుకునేందుకు సమంతను తీసుకురానున్నారు. ఇందులో భాగంగా ఓ కాన్సెప్ట్‌తో ఆమె పలువురు సెలబ్రిటీలతో ముచ్చటించనున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ను ఇప్పటికే ప్రారంభించారు. మరింత సమాచారాన్ని నిర్మాత అల్లు అరవింద్‌, సమంత రేపు వెల్లడించనున్నారు. మరోవైపు ద ఫ్యామిలీ మెన్‌ అనే వెబ్‌ సిరీస్‌తో డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌లోకి అడుగుపెట్టనున్నారు. టీఆర్పీ‌లో నాగ్‌ను మించిపోయిన స‌మంత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement