Kangana Ranaut Is Confirmed As Host For Ekta Kapoor Show: బీటౌన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సమాజంలోని పరిస్థితులపై తనదైన శైలీలో కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడేస్తుూ ఉంటుంది. అలా మాట్లాడటంతో దేశంలోనే మోస్ట్ డేరింగ్ హీరోయిన్గా పేరు వచ్చింది. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీ క్వీన్‌గా రికార్డుకెక్కింది. ఏ విషయం గురించి అయినా ఎలాంటి భయం లేకుండా బయటకు చెప్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఈ వ్యాఖ్యలతో కంగనా రనౌత్ పలుసార్లు వివాదాలపాలైంది కూడా. కానీ కంగనా బోల్డ్ యాటిట్యూడ్ అనేకమంది దృష్టిని ఆకర్షించింది.
ప్రస్తుతం కంగనా టికు వెడ్స్ షెరు సినిమాతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా కంగనా ఒక మోస్ట్ డేరింగ్ షోకి హోస్ట్‌గా వ్యవహరించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ బుల్లితెర నిర్మాత ఏక్తా కపూర్ ఆల్ట్ బాలాజీ, ఎమ్ఎక్స్ ప్లేయర్ కోసం రూపొందించే ఒక 'ఫియర్లెస్ రియాలిటీ షో' కోసం కంగనాను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్ మాదిరిగా ఉన్న ఈ షోను కంగనా హోస్ట్ చేయనుందని సమాచారం. ఈ విషయంపై త్వరలో అధికారికంగా ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల ఈ షో గురించి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన కంగనా తర్వాత ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment