వెండితెరపై సత్తా చాటి స్టార్స్‌గా వెలుగొందిన పలువురు టాలీవుడ్ నటులు..ఇప్పుడు బుల్లితెరపై కూడా తమ హవాని చాటుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, రానాలు పలు షోలకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించి, తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇటీవల నందమూరి బాలకృష్ట కూడా హోస్ట్ అవతారం ఎత్తాడు. ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ప్రసారమవుతున్న‘అన్ స్టాపబుల్’ టాక్ షోకి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు.
తనదైన డైలాగ్స్, పంచులతో ఈ టాక్ షోని విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు బాలయ్య. డిజిటల్ ప్లాట్ ఫాంలో ఈ టాక్ షో దూసుకెళ్తోంది. దీంతో మరో కొత్త షోని ప్రారంభించాలని ప్రయత్నిస్తుందట ‘ఆహా’టీమ్. ఈ సరికొత్త టాక్ షోకి విక్టరీ వెంకటేశ్‌ని హోస్ట్‌గా చేయించడానికి ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే ‘ఆహా’టీమ్ వెంకటేశ్‌ని సంప్రదించారట. ఆయనను ఒప్పించడానికి అల్లు అరవింద్ కూడా రంగంలోకి దిగారట. ఇదే నిజమైతే..త్వరలోనే వెంకీమామని మనం హోస్ట్‌గా చూడొచ్చు. ప్రస్తుతం వెంకటేశ్ ఎఫ్ 3 చిత్రంలో నటిస్తున్నాడు. దీంతో పాటు రానాతో కలిసి ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment