నందమూరి బాలకృష్ణ అటు హీరోగానే కాకుండా ఇటు హోస్టింగ్‌లోనూ అదరగొడుతున్నారు. బాలయ్య తొలిసారిగా హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే షో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తుంది. తనదైన స్టైల్‌లో బాలయ్య చేస్తున్న హోస్టింగ్‌కు నెటిజన్లే కాకుండా సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. ఇప్పటికే ఈ షోకు మోహన్‌బాబు, నాని, బ్రహ్మానందం, రవితేజ, అనిల్ రావిపూడి, పుష్ప టీం, రానా సందడి చేశారు.
ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో తనపై వచ్చిన రూమర్స్‌పై బాలయ్య స్పందించారు. 'ఇవాల్టి ప్రపంచంలో ప్రతివాడు సోషల్ మీడియాలో ఏం అనాలనిపిస్తే అది అంటున్నాదు. పేరు లేని, లికేషన్ తెలియని అడ్రస్‌లతో బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. బాలకృష్ణకి రవితేజకి పడదు.. చిరంజీవి, బాలకృష్ణ ఫోన్‌లో మాట్లాడుకోరు.. నా హీరో తోపు...నీ హీరో సోపు అంటూ పిచ్చిరాతలు రాస్తున్నారు.
లెఫ్ట్ హ్యాండ్ కూడా రెడీ అయిందీ .. దొరికితే దవడ పగిలిపోద్దీ'.. అంటూ ఫేక్ న్యూస్‌లు ప్రచారం చేస్తున్న వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే మనమీద వచ్చిన విమర్శలను ప్రేమించినప్పుడే కదా మనం అన్‌స్టాపబుల్ అవుతాం అంటూ తనదైన స్టైల్‌లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment