దుబాయ్: భారత్ మరో క్రికెట్ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది ఇక్కడ పురుషుల వన్డే వరల్డ్‌కప్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఇది ముగిసే రెండేళ్లలోనే... 2025లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌కూ భారతే వేదిక కానుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భవిష్యత్ పర్యటనల కార్యక్రమం (ఎఫ్‌టీపీ) 2023–2027లో భాగంగా అమ్మాయిల మెగా ఈవెంట్లను ఖరారు చేశారు.
ముందుగా 2024లో బంగ్లాదేశ్ టి20 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తుంది. భారత్ మెగా ఈవెంట్ అనంతరం 2026లో మరో టి20 ప్రపంచకప్ ఇంగ్లండ్‌లో జరుగుతుంది. ఇవన్నీ రొటీన్ ఈవెంట్లు... అయితే ఈ ఎఫ్‌టీపీలో కొత్తగా మహిళల చాంపియన్స్ ట్రోఫీకి తొలిసారి చోటిచ్చారు. ఈ టోర్నీని 2027లో శ్రీలంకలో నిర్వహిస్తారు. టి20 ఫార్మాట్‌లో ఆరు జట్లే పాల్గొనే ఈ టోర్నీలో శ్రీలంక అర్హత సాధిస్తేనే ఆతిథ్య వేదికవుతుంది. లేదంటే మరో దేశానికి ఆతిథ్య అవకాశం దక్కుతుంది.
Comments
Please login to add a commentAdd a comment