బిగ్‌బాస్‌-2 ఫైనల్‌ లిస్ట్‌! | Telugu Bigg Boss 2 Final List of Candidates | Sakshi
Sakshi News home page

Published Sun, Jun 10 2018 9:35 AM | Last Updated on Thu, Jul 18 2019 1:45 PM

Telugu Bigg Boss 2 Final List of Candidates  - Sakshi

మొదటి సీజన్‌ బంపర్‌ హిట్‌ కావటంతో బిగ్‌ బాస్‌ రియాల్టీ షో రెండో సీజన్‌పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. నేచురల్‌ స్టార్‌ నాని వ్యాఖ్యాతగా నేటి సాయంత్రం(ఆదివారం) రెండో సీజన్‌ ప్రారంభం కానుంది. అయితే గత కొంత కాలంగా ఇదే జాబితా అంటూ కొందరి పేర్లు వార్తల్లో ప్రముఖంగా వినిపించాయి. అయితే అవేం నిజం కాదని మొన్నామధ్య నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో నిర్వాహకులు, హోస్ట్‌ నాని స్పష్టం చేశారు. 

ఈ నేపథ్యంలో షో ప్రారంభానికి కొద్ది గంటల ముందు కొందరి పేర్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిని పరిశీలిస్తే... 

1. సింగర్‌ గీతా మాధురి.. టాలీవుడ్‌ పాపులర్‌ సింగర్‌
2. తేజస్వి మదివాడ... టాలీవుడ్‌లో చాలా చిత్రాల్లో నటించిన నటి.
3. నటుడు అమిత్‌ తివారీ.. విక్రమార్కుడు, ఖలేజా, అత్తారింటికి దారేది, టెంపర్‌ , సన్నాఫ్‌ సత్యమూర్తి, తదితర చిత్రాల్లో నటించాడు.
4. నటుడు తనీష్‌.. బాల నటుడిగా కెరీర్‌ను ప్రారంభించి, తర్వాత టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో హీరోగా కనిపించిన యువనటుడు.
5. నటుడు సామ్రాట్‌... అహనా పెళ్లంట, పంచాక్షరి లాంటి చిత్రాల్లో కనిపించారు. కొన్నాళ్ల క్రితం భార్యతో విబేధాల కారణంగా వార్తల్లో నిలిచారు. 
6. యాంకర్‌ దీప్తి... ఓ ప్రముఖ ఛానెల్‌లో యాంకర్‌గా పని చేస్తున్న దీప్తి నల్లమోతు. భద్ర, శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ లాంటి పలు చిత్రాల్లో కూడా ఆమె నటించారు.
7. బాబు గోగినేని... హ్యూమన్‌ రైట్స్‌ యాక్టివిస్ట్‌. 
8. రోల్‌ రిడా... రాహుల్‌ కుమార్‌ అలియాస్‌ రోల్‌ రిడా. రాప్‌ సింగర్‌. 
9. శ్యామల... యాంకర్‌ శ్యామల. పలు చిత్రాల్లో కూడా నటించారు.
10. కిరీటి ధర్మరాజు... పలు షార్ట్‌ ఫిలింస్‌. టాలీవుడ్‌ చిత్రాల్లో నటించిన క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌.  
11. దీప్తీ సునయన...  సోషల్‌ మీడియా సెన్సేషన్‌. డబ్‌ స్మాష్‌ వీడియోల‌తో బాగా పాపులర్‌. ఆ మధ్య నిఖిల్‌ కిర్రాక్‌ పార్టీలో కూడా ఓ పాత్రలో కనిపించారు.
12. సీరియల్‌ నటుడు కౌశల్‌
13. భాను... ???.

ఈ 13 మంది సెలబ్రిటీలు కాకుండా గణేశ్‌‌, సంజన, నూతన్‌ నాయుడు అనే ముగ్గురు కూడా హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే సమాచారం.  ఏది ఏమైనా మరికొద్ది గంటల్లో ఆ సస్పెన్స్‌కు తెర దించుతూ షో ప్రారంభం కాబోతోంది. సెకండ్‌ సీజన్‌ వంద రోజులపాటు సాగనుంది. ‘ఏదైనా జరగొచ్చు’ అంటూ ఈ సీజన్‌ ఎలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించబోతుందో చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement