star maa tv
-
తల్లికి దూరమైన కుమారుడు ఏమయ్యాడు?.. ఆసక్తి పెంచుతోన్న సీరియల్!
అమ్మ అంటే దైవం. అమ్మ మన కళ్లు ముందు తిరిగే దేవత. అలాంటి అమ్మకి దూరమైన ఓ కొడుకు ఏమవుతాడు? అసలు ఎందుకు దూరమయ్యాడు? ఇదే "గుండె నిండా గుడిగంటలు" సీరియల్ కథ. విలక్షణమైన కథలతో ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ అందిస్తున్న స్టార్ మా ఈ సారి అమ్మ కథతో అలరించబోతోంది. తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న స్టార్ మా ఇప్పుడు మరిన్ని భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని అలరించబోతోంది. అనుబంధం ఎంత గొప్పదో ఈ కథ చెబుతుంది. కన్నీరు ఎంతగా తోడు నిలబడుతుందో ఈ పాత్రలు చెబుతాయి. ప్రేమను పంచడం అంటే ఎలా ఉంటుందో ఈ సీరియల్ సన్నివేశాలు చెబుతాయి. కఠినమైన మనసుని కరిగించే శక్తి ప్రేమకు మాత్రమే ఉంటుందని ఈ కథనం వివరిస్తుంది. అక్టోబర్ 2 నుంచి రాత్రి 9 గంటలకు ఈ సీరియల్ ప్రారంభం కాబోతోంది. దారి తప్పిన జీవితాన్ని ఒక గాడిలో పెట్టాలనుకునే అమ్మాయి ప్రయత్నం.. ఆ తల్లికి, కుమారుడికి మధ్య దూరాన్ని తగ్గించాలనుకునే తాపత్రయం, తల్లీ, కొడుకుల మధ్య అనూహ్యమైన సంఘటనలతో ఈ సీరియల్ పూర్తిగా కొత్త భావోద్వేగాల్ని అందించబోతోంది. ఒక పసివాడు తల్లి కోసం ఎంత ఆరాట పడతాడో.. తల్లి ఒకసారి కనిపిస్తే బాగుండు అని ఎంతగా కోరుకున్నాడో.. అతని తరవాతి జీవితం ఎలా గడిచిందో తెలియాలంటే "గుండె నిండా గుడి గంటలు" చూడాల్సిందే. -
పెళ్లయ్యాక కోడలిని చదవనిస్తారా?.. సరికొత్త కథనంతో 'మామగారు'!
తెలుగు రాష్ట్రాలలో బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోన్న స్టార్ మాలో మరో కొత్త సీరియల్ వచ్చేసింది. సరికొత్త కథనంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు "మామగారు" అనే సరికొత్త సీరియల్‌తో పలకరించింది. ఈ నెల 11 నుంచి ప్రతి రోజూ సాయంత్రం 6.30 గంటలకు ఈ సీరియల్ ప్రసారమవుతోంది. స్టార్ మాలో ప్రసారమయ్యే వినూత్నమైన కథనం కలిగిన ఈ సీరియల్.. అహంకారానికి - ఆత్మవిశ్వాసానికి నడుమ జరిగిన పోరులా ఉండనుంది. డిగ్రీని పూర్తి చేసి పీజీ చేయాలని.. ఉన్నత వుద్యోగం చేసి వికలాంగురాలైన చెల్లెలు, అమ్మ నాన్నలను కంటికి రెప్పలా చూసుకోవాలని కోరుకునే యువతి గంగ. బాగా చదువుకుని ఉద్యోగంలో చేరిన తర్వాత మాత్రమే ఒక పెద్ద కుటుంబంలో కోడలిగా అడుగు పెట్టాలని కోరుకుంటుంది ఆమె. చెంగయ్య , ఓ పెద్ద మనిషి. పేరున్న కుటుంబానికి చెందిన వ్యక్తి. తన మాటే చెల్లుబాటు కావాలనుకునే పంతం కలిగిన వ్యక్తి. ఆయన మూడో కుమారుడైన గంగాధరన్‌కు చదువుపై ఆసక్తి లేకపోవడంతో చిన్నతనంలోనే ఎలక్ట్రీషియన్‌గా పనికి వెళ్లాడు. తండ్రి చేత తిట్లు తినే అతను, ఈ బాధ ల నుంచి విముక్తి కావాలనుకుంటూ తప్పుడు సర్టిఫికెట్లు తో దుబాయ్‌కి వెళ్లాలని ప్రణాళిక చేస్తాడు. అయితే, అతను ఫోర్జరీ చేయాలనుకున్నది గంగకు చెందిన సర్టిఫికేట్లు కావటం... ఈ విషయం తెలిసి గంగ ఫిర్యాదు చేయటం తో , ప్రభుత్వం గంగాధరన్ పాస్‌పోర్ట్‌ను నిషేదిస్తుంది. పెళ్లి చేస్తే అయినా తమ కుమారుడు గంగాధరన్ మారతాడని భావించి.. చెంగయ్య తన సోదరి కుమార్తె సుభద్రతో గంగాధరన్‌కు వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ సుభద్ర గంగాధరన్‌ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తుంది. అయినప్పటికీ చెంగయ్య పెళ్లికి ఏర్పాట్లు చేస్తాడు. తన స్నేహితుడి కుమార్తె గంగతో గంగాధరన్ పెళ్లి చేయాలని చెంగయ్య ప్లాన్ చేస్తాడు. అదే సమయంలో గంగ తండ్రికి ప్రాణాపాయస్థితి ఏర్పడటం... డబ్బుకు ఇబ్బంది పడుతున్న గంగకు ధన సహాయం చేసి ఆమె తండ్రిని కాపాడి బదులుగా తన కుమారుడిని పెళ్లి చేసుకోవాలని కోరతాడు. తమ కూతురును చెంగయ్య కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని హామీ ఇచ్చిన గంగ తండ్రి, పెళ్లయ్యాక కూడా గంగను చదివించాలని కోరతాడు. ఇంట్లో ఆడపిల్లలెవరూ పెద్దగా చదువుకోకూడదని నిషేధం విధించిన చెంగయ్య .. సరేనంటూ తల ఊపుతాడు. నిజానికి పితృ స్వామ్య స్వభావం నరనరాన జీర్ణించుకున్న చెంగయ్య.. తన భార్య డాక్టర్ అనే సంగతి కనీసం కుటుంబ సభ్యులకు కూడా తెలియనియ్యడు. అలాంటి వాడు తన కోడలిని చదువుకోనిస్తాడా ? అనేది సీరియల్ చూస్తేనే తెలుస్తుంది. తానెవరిని పెళ్లి చేసుకుంటున్నాడో కూడా తెలియని గంగాధరన్, మంగళసూత్రం కట్టేటప్పుడు గంగ ముఖం చూస్తాడు. తన దుబాయ్ కలలు కల్లలు కావటానికి కారణమైన గంగను భార్యగా గంగాధరన్ అంగీకరించాడా ? ఒక పెద్ద ఇంటికి కోడలు కావాలనే కల సాకారమైనందుకు సంతోషంగా కొత్త ఇంటికి అడుగు పెట్టిన గంగ.. ఒక వైపు తనను అసహ్యించుకునే భర్త, మరోవైపు స్త్రీలను బానిసలుగా భావించే మామగారు... నడుమ తన కలను సాకారం చేసుకోవటానికి ఎలా పోరాడుతుంది ? ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో మామగారు సీరియల్ మిమ్మల్ని అలరించేందుకు వచ్చేసింది. -
Bigg Boss 5 Telugu: ఈసారి ఎవరు?
ఆకర్షణీయమైన నాలుగు గోడల ‘బందీఖానా వినోదం’కు మళ్లీ తెర లేవనుంది. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య స్నేహం, శతృత్వం, పోటీ, ప్రతీకారం... ఇవన్నీ జనం కుతూహలంగా చూడనున్నారు. మరో వారం రోజుల్లో సెప్టెంబర్ 5 నుంచి బిగ్‌బాస్ 5 తెలుగు. నాగార్జున యాంకర్ అని తెలుసు. కాని ఈసారి కంటెస్టెంట్లు ఎవరు? అసలు ఈ షో సక్సెస్ ఫార్ములా ఏమిటి? సండే స్పెషల్... ఎదుటివారి జీవితంలోకి తొంగి చూడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. పల్లెల్లో అయితే నిన్న మొన్నటి వరకూ బహిరంగ జీవితం ఉండేది. ఏ ఇంట్లో ఏ మంచి చెడు జరిగినా అందరికీ తెలిసిపోయేది. కాని ఇప్పుడు మనుషులు ‘ప్రయివేటు’గా ఉండటానికే ఇష్టపడుతున్నారు. జ్వరం వచ్చినా, ఆరోగ్యం బాగలేకపోయినా మన ఇంటి వరకే అనుకుంటున్నారు. సమస్యలు, సంతోషాలు కూడా దాచుకుంటున్నారు. ఇక నగరాల్లో ఎవరికి వారే మూసీకి నీరే. పక్క ఫ్లాట్‌లో ఏం జరుగుతున్నదో తెలిసే అవకాశమే లేదు. ఈ వెలితిని, మానవ స్వభావంలో ఉండే ‘పొరుగింటి కుతూహలాన్ని’ అడ్రస్ చేస్తూ సూపర్‌హిట్ అయిన షో ‘బిగ్‌బాస్’. మొదట హిందీలో మొదలయ్యి ఆ తర్వాత ప్రాంతీయ భాషల్లోకి మారిన ఈ షో ఇంటింటా రాత్రుళ్లు ‘ఇంకో ఇంటి’ని తీసుకొచ్చి ఆ ఇంటి సభ్యుల జీవితాన్ని పరిశీలించే వినోదాన్ని ఇస్తూ ఒక సీజన్ అయిన వెంటనే మరో సీజన్ ఎప్పుడూ అని ఎదురు చూసేలా చేస్తుంది. ఆ ఎదురు చూపులకు జవాబే వచ్చే వారం మొదలు కానున్న ‘బిగ్‌బాస్ 5’. 16 మనస్తత్వాల గేమ్ బిగ్‌బాస్ హౌస్‌లో భిన్న నేపథ్యాలు, సామాజిక జీవనాలు, సెలబ్రిటీ స్టేటస్లు, వయసులు, జెండర్లు ఉన్న కంటెస్టెంట్లను 16 మందిని ఒకచోట చేర్చి వారి ఇంటికి బయట నుంచి తాళం వేసి వారి మధ్య నడిచే ‘భావోద్వేగాల డ్రామా’ను లెక్కకు మించిన కెమెరాలతో రికార్డు చేయడమే బిగ్‌బాస్ షోలో విశేషం. ఒకసారి వచ్చిన వారు మరోసారి రారు కనుక ప్రతిసారీ కొత్త మనుషుల స్వభావాలను చూసే వీలు ఈ షోలో ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ వీరి మధ్య స్నేహాలు ఏర్పడతాయి. శతృత్వాలు ఏర్పడతాయి. కక్షలు క్షణికావేశాలు... ఇవన్నీ ఉత్కంఠను కలిగిస్తాయి. ఎంత సెలబ్రిటీ అయినా సగటు సందర్భాలలో ఎలా ప్రవర్తిస్తాడో చూపడమే ఈ షో ఫార్ములా. మానవ మనస్తత్వాన్ని గుర్తెరిగి ఎదుటివారి ప్రవర్తనకు చలించకుండా ఎవరైతే తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటారో లేదా తమ వ్యక్తిత్వాన్ని నిజాయితీగా ప్రదర్శనకు పెడతారో వాళ్లే ఈ షోలో విజేతలు అవుతారు. లేని వారు ఎలిమినేట్ అవుతూ వెళతారు. ఈసారి ఎవరు? బిగ్‌బాస్ షో మొదలయ్యే వరకు అందులో పాల్గొనేవారు ఎవరు అనే విషయాన్ని షో నిర్వాహకులు రహస్యంగా ఉంచుతారు. అయినా సరే ‘లీకుల’ కోసం ప్రయత్నించి కొద్దో గొప్పో సమాచారాన్ని, ఊహాగానాలు చేయడాన్ని ప్రతిసారీ చూడవచ్చు. షోను అద్యంతం ఆసక్తికరం చేయడానికి నిర్వాహకులు రకరకాల సెలబ్రిటీస్‌ను చివరివరకూ సంప్రదిస్తూనే ఉంటారు. కనుక ఫైనల్ లిస్ట్ అనూహ్యంగా ఉంటుంది. బిగ్‌బాస్ 5 కోసం ఎవవరెవరిని సంప్రదించారు అనే విషయంలో ఎవరెవరు పాల్గొంటారన్న విషయంలో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. వాటిలో సీనియర్ నటి సురేఖవాణి పేరు ఒకటి. టీవీ, సినిమాల్లో ఆదరణ పొందిన సురేఖవాణి మంచి మాటకారి. కనుక ఆమె షోలో ఆమె ఉండటం బాగుంటుందని భావించవచ్చు. అలాగే టీవీ, సినీ నటి ప్రియ కూడా కంటెస్టెంట్ల జాబితాలో ఉందని భోగట్టా. హుందా అయిన పాత్రలు చేసిన ప్రియ బిగ్‌హౌస్‌లో ఉండటం మహిళా ప్రేక్షకులకు నచ్చొచ్చు. టీవీ యాంకర్ల కోటాలో ఈసారి రవికి అవకాశం దక్కిందని అంటున్నారు. రవి కూడా మంచి మాటకారి కనుక ఈ షోకు ఎనర్జీ తెచ్చే అవకాశం ఉంది. గతంలో డాన్స్మాస్టర్లు బాబా మాస్టర్, అమ్మ రాజశేఖర్ల వరుసలో ఈసారి డాన్స్‌మాస్టర్ నట్రాజ్ పేరు వినిపిస్తోంది. అలాగే ఈసారి వినిపిస్తున్న మరోపేరు దీపక్ సరోజ్. ‘అతడు’ సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా బాలనటుడిగా కనిపించిన దీపక్ సరోజ్ ఆ తర్వాత ‘మిణుగురులు’ సినిమాలో నటించాడు. ఈసారి యూత్ ఐకాన్‌గా అతడు షోలో కనిపించవచ్చు. వీరు కాకుండా జబర్దస్త్ టీమ్ నుంచి పవన్, యాంకర్ లోబో పేర్లు కూడా వినపడుతున్నాయి. ఇంకా యూట్యూబ్ స్టార్లు కొందరు చోటు దక్కించుకోవచ్చు. సీనియర్లు కొందరు రంగప్రవేశం చేయొచ్చు కూడా. 100 రోజులు ఎవరిస్తారు? బిగ్‌బాస్ హౌస్‌లో కనీసం 100 రోజులు ఉండాలి. 100 రోజుల పాటు కుటుంబాన్ని, కెరీర్‌ను పక్కన పెట్టి ఈ షోలో పాల్గొనాల్సి ఉంటుంది. పైగా బిగ్‌బాస్ టాస్కుల్లో నచ్చినా నచ్చకపోయినా పాల్గొనాల్సి ఉంటుంది. సున్నిత మనస్కులకు ‘నామినేషన్’ ప్రక్రియ పెద్ద శిక్షే. అదీగాక ఈ షో వల్ల వచ్చే పాపులారిటీ బాగానే ఉన్నా అది కొత్తవారికి ఉపయోగపడినంతగా సీనియర్స్‌కు ఉపయోగపడదు. అందుకే షో తాలూకు సీజన్లు గడిచే కొద్దీ ‘తెలిసిన స్టార్లు’ తగ్గుతూ వెళ్లి పూర్తిగా కొత్త ముఖాలు చోటు చేసుకోవడం బిగ్‌బాస్ షో ట్రెండ్‌ను గమనించినవారికి అర్థమవుతుంది. గతంలోని బిగ్‌బాస్ సిరీస్‌ల వల్ల హరితేజ, రోల్ రైడ, రాహుల్ సిప్లిగంజ్, సోహైల్ తదితర యువతరం సెలబ్రిటీలే ఎక్కువగా లబ్ధి పొందారు. సెప్టెంబర్ 5 నుంచి మొదలు సెప్టెంబర్ 5 నుంచి ‘మా’ టీవీలో మొదలుకానున్న ఈ షో ఈసారి ఎన్ని సర్ప్రైజ్లను తేనుందో తెలియదు. యాంకర్‌గా నాగార్జున గత సీజన్లో మరింత ఈజ్‌తో షోను రక్తి కట్టించారు. ఆయనకు వీలు కాని రోజుల్లో ఒకసారి నటి రమ్యకృష్ణ, ఒకసారి సమంత షోను హోస్ట్ చేయడం కూడా విశేషం. ఈసారి ఆయన కాస్ట్యూమ్స్, లుక్ ఎలా ఉంటాయన్నది ఆసక్తికరమే. ఏమైనా ఒక పెద్ద వినోదానికి తెర లేవనుంది. నానా చికాకులతో ఉన్న నేటి ప్రేక్షక లోకానికి ఈ షో ద్వారా మంచి వినోదం అందుతుందనే ఆశిద్దాం. -
స్టార్ మా ‘డాన్స్ ప్లస్’ విజేత ఎవరో తెలుసా ?
స్టార్ మా లో ఈ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ‘డాన్స్ ప్లస్’ సంగ్రామం గ్రాండ్ ఫైనల్స్ అద్భుతంగా అలరించబోతున్నాయి. 21 వారాలపాటు ప్రతి శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రేక్షకులకు ఓ సరికొత్త డాన్స్ ప్రపంచాన్ని సృష్టించి, ఉర్రూతలూగించిన సెన్సేషనల్ షో ‘డాన్స్ ప్లస్’ విజేత ఎవరో తేల్చడానికి స్టార్ మా సర్వం సిద్ధం చేసింది. కొత్త టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేసిన ‘డాన్స్ ప్లస్’.. టైటిల్ ఎవరు గెలుస్తారా అన్న ప్రేక్షకుల ఎదురుచూపుకు ముగింపు పలుకుతోంది. దేశవ్యాప్తంగా వచ్చిన 5,344 డిజిటల్ ఎంట్రీల నుంచి ఆడిషన్స్ నిర్వహించి 18 టీమ్స్ తో మొదలైన ఈ రసవత్తరమైన పోటీ దేశంలోని రకరకాల ప్రాంతాల నుంచి ప్రతిభ గల డాన్సర్లకు ఓ మంచి మంచి వేదిక కల్పించింది. పాన్ ఇండియా డాన్స్ షో గా ప్రేక్షకుల అభిమానాన్ని ఆశీర్వాదాన్ని అందుకుంది. ఫైనల్స్ కి అర్హత సంపాదించిన 5 టీం లలో విజేతను తేల్చే ఫైనల్స్ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఒక పండగలా జరిగాయి. తను ఎక్కడున్నా ఎంతో సందడి చేసే ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ముఖ్య అతిధిగా వచ్చారు. ఇక ప్రతి టీం ని సపోర్ట్ చేసేందుకు బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునయన, స్టార్ మా సూపర్ హిట్ సీరియల్ "జానకి కలగనలేదు" హీరో అమరదీప్, "జాతిరత్నాలు" సినిమా హీరోయిన్ ఫారియా అబ్దుల్లా, ప్రముఖ నాట్యకారిణి సంధ్య రాజు, సినిమా సెలబ్రిటీ నటాషా దోషి ఫైనల్స్ ని పోటీ లా కాకుండా ఒక సంబరంలా మార్చేశారు. ఎంత పండగలా అనిపించినా పోటీని ఎదుర్కొనే ప్రతి కంటెస్టెంట్... తమ టాలెంట్ తో ఈ షోకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చారు. తనదైన శైలిలో ప్రతి ఎపిసోడ్ నీ ఇంటరెస్టింగ్ గా నడిపించిన దర్శకుడు ఓంకార్ ఫైనల్స్ ని మరింత పదునైన వ్యూహాలతో రసవత్తరంగా నడిపించారు. రఘు మాస్టర్, యష్ మాస్టర్, బాబా భాస్కర్ మాస్టర్, ముమైత్ ఖాన్, యాని మాస్టర్, మోనాల్ గజ్జర్ న్యాయ నిర్ణేతలుగా వున్న ఈ వేదిక టైటిల్ ని, 20 లక్షల రూపాయల నగదు బహుమతిని ఎవరికి అందచేసింది? ఎవరి హంగామా ఏమిటి? ఎవరు ఏయే పాటలకు ఎలాంటి కొత్త కొత్త స్టెప్స్ వేశారు? టీమ్స్ ని సపోర్ట్ చేయడానికి వచ్చిన సెలెబ్రిటీల హడావిడి ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే స్టార్ మా లో "డాన్స్ ప్లస్" ఫైనల్స్ తప్పక చూడాలి. గుర్తుంచుకోండి... ఈ ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి "డాన్స్ ప్లస్" గ్రాండ్ ఫినాలే మీకు పరిపూర్ణమైన వినోదాన్ని అందించబోతోంది. -
జానకి ఏమిటి? ఆమె కల కనకపోవడమేంటి?
సెంటిమెంట్, ఎమోషన్ లేకపోతే జీవితం చాలా చప్పగా ఉంటుంది. కష్టాలు, కన్నీళ్లు లేని జీవితం చాలా సాఫీగా ఉంటుంది. అవి ఉంటేనే మజా.. వాటిని తట్టుకుని నిలబడడంలోనే మనిషి వ్యక్తిత్వం దాగి ఉంటుంది. అలాగే కలలు లేని జీవితం కూడా పెద్ద ఆసక్తిగా అనిపించదు. జీవితంలో సాధించడానికి ఏదో ఒక లేకపోతే జీవితం ఒక చోట ఆగిపోతుంది. ఈ మూడు విషయాలు కలిసిన కథ "జానకి కలగనలేదు". ఎవరు ఎవరిని కలుస్తారో, ఎవరితో ఎవరికీ ముడి పడుతుందో ఎవరి ఊహకూ అందదు. కలిసే వరకూ ఏమీ తెలియకపోవడమే దాని అందం. తండ్రి వ్యాపారం కోసం తన చదువుని ఆపేసిన కుర్రాడు, ఉన్నత స్థాయిని చేరుకోవాలని ప్రతి క్షణం పుస్తకాలు వదలిపెట్టని అమ్మాయి.. ఈ ఇద్దరూ నడిపించే కథ. బాధ్యతకు కలకి మధ్య లో ఇరుక్కున్న ఆ ఇద్దరు ఎవరి కోసం ఒకరు ఏం చేసారు అనేదే ధారావాహిక. ఈ నెల 22న (సోమవారం) ఈ సీరియల్ ప్రారంభం అవుతోంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9 గంటలకు స్టార్ మా ప్రేక్షకులను అలరించబోతోంది. చదవండి: ‘ఆహా’లో జాంబిరెడ్డి, ఎప్పటినుంచంటే.. -
‘స్టార్ మా’ లో నయనతార కొత్త వేషం..!
ఆదివారాలు పాజ్ బటన్‌తో వస్తే ఎంత బావుంటుంది అన్నాడో ఆంగ్లేయుడు. కానీ కాలాన్ని మనం ఎలాగూ ఆపలేం. అయితే సమయాన్ని మరపురానిదిగా మలుచుకోవడం మాత్రం మన చేతిలో ఉంటుంది. ‘స్టార్ మా’ ఆదివారాలు ఇదే ఫార్ములాని అనుసరిస్తోంది. ఈ ఆదివారం (7వ తేదీ) సాయంత్రం 6 గంటలకు నయనతార ప్రత్యేక పాత్రలో నటించిన "అమ్మోరు తల్లి" చిత్రాన్ని ప్రసారం చేస్తోంది. ఎన్నో మంచి చిత్రాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నయనతార ముక్కుపుడక అమ్మవారిగా విభిన్నమైన హావభావాలతో కనువిందు చేయబోతోంది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా "అమ్మోరు తల్లి" చిత్రం రాబోతోంది. వినోదానికి కొత్త అర్ధం చెబుతున్న ఈ సంచలన చిత్రం ఓ వినూత్నమైన అనుభూతిని ఇవ్వనుంది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు "స్టార్ట్ మ్యూజిక్ " షో తో సుమ చేస్తున్న హంగామా ఆదివారానికే ఓ ప్రత్యేకం. 1.30 గంటలకు "కామెడీ స్టార్స్" చేసే పంచులు కోలాహలం అద్భుతం. మధ్యాహ్నం అంతా మజా మజా గా సాగే వినోదం.. సాయంత్రం నయనతార నట విశ్వరూపం. స్టార్ మా ప్రేక్షకులకు ఈ ఆదివారం వెరీ వెరీ స్పెషల్. చదవండి: ఆన్లైన్ క్లాసులు: షాకైన అమ్మోరు తల్లి -
కన్నులపండువగా స్టార్ మా సండే
మిగతా రోజుల కంటే ఆదివారం నాడు కాస్త ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కావాలనిపిస్తుంది. ఎందుకంటే రోజూ కంటే ఇంట్లో గడిపే సమయం ఎక్కువ ఉంటుంది గనక, ఆదివారం 'ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం, ఆదివారాన్ని మెమరబుల్ డే ని చెయ్యడం కోసం స్టార్ మా గ్రాండ్ ఈవెంట్ “100% లవ్” రెండో భాగంతో వస్తోంది. ఫిబ్రవరి 28న సా. 6 గం.లకు స్టార్ మా లో ప్రసారం కాబోతున్న ఈ ఈవెంట్లో తెరపైన జంటలు, అసలైన జంటలు మరింతగా కనువిందు చేయబోతున్నారు. పక్కా ఎంటర్టైన్మెంట్ అనడానికి అవసరమైన అన్ని అంశాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ఈవెంట్లో స్టార్ యాంకర్ ఓంకార్ పోటీని మరింత రసవత్తరంగా నడిపించబోతున్నారు. సై అంటే సై అంటున్న రెండు వర్గాల్లో కప్‌ని ఎవరు కొట్టబోతున్నారనెది ఉత్మంఠభరితంగా ఉండబోతోంది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు సుమ తన “స్టార్ మ్యూజికొతో మేజిక్, 1.30 గం.లకు కామెడీని పండించే రైతుల్లాంటి కామెడీ స్టార్స్ ఎలాగూ ప్రతి ఆదివారం టోటల్ ఫ్యామిలీ ప్యాక్ ఎంటర్స్టైన్మెంట్ని ఇస్తూనే ఉన్నాయి. ఈ ఆదివారం స్టార్ మాలో ఓహో అనిపించే వినోదం ప్రేక్షకుల కోసం సిద్ధంగా ఉంటుంది. ఆస్వాదించడమే ఆలస్యం. -
సండే స్టార్ మా లో ప్రేమలోకం !
ప్రేమంటే రెండు అక్షరాల మహాకావ్యం. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏం చెప్పినా చెప్పడానికి ఎంతో మిగిలే ఉంటుంది. అలాంటి ప్రేమని స్టార్ మా ఈ ఆదివారం ఓ కొత్త కోణంలో ఒక ఈవెంట్ గా అందించబోతోంది. ఆ గ్రాండ్ ఈవెంట్ పేరు "100% లవ్". తెరపైన జంటలకీ నిజ జీవితంలో జంటలకీ మధ్య ఆహ్లాదకరంగా సాగే ఈ ఈవెంట్ లో ఎన్నో ప్రత్యేకతలు! సగటు ప్రేక్షకుడు కోరుకునే అంశాలనే ఉంటూనే కుటుంబంలో ప్రతి ఒక్కరికీ వినోదాన్ని అందించడానికి "100% లవ్" అన్ని హంగులతో రాబోతోంది. సరదాగా ఆడుకునే ఆటలు, ప్రేమగా పంచుకునే మాటలు, రెండు హృదయాల మధ్య ఎన్నో స్వీట్ నథింగ్స్, ఉంగరాలు మార్చుకునే ఉద్వేగ క్షణాలు, కలిసి అడుగులు వేసే సంతోషాలు... ఇలాంటివి ఎన్నో ఈ ఈవెంట్ అందించబోతోంది. ఈ ఆదివారం (ఫిబ్రవరి 21న) సాయంత్రం 6 గంటలకు "100% లవ్" ఈవెంట్ స్టార్ మా లో ప్రసారమవుతుంది. -
మిస్ కాకండి స్టార్ మాలో ఈ సండేని..
సండే అంటే హాలిడే మాత్రమే కాదు.. ఎంటర్ టైనింగ్ డే అంటోంది స్టార్ మా ఛానల్. విలక్షణమైన వినోదాన్ని అందించడంలో ముందుండి, కొత్త రకం కంటెంట్‌తో ఎప్పటికప్పుడు ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తున్న స్టార్ మా ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు "బిగ్ బాస్ ఉత్సవం" పేరుతో ఒక అద్భుతమైన ఈవెంట్ ని ప్రసారం చేస్తోంది. రెండు కళ్ళూ చాలనంత మంది తీసుకొచ్చి ఒకే వేదికపై నిలబెట్టి, వినోదానికి అసలైన అర్ధం చెబుతోంది స్టార్ మా. స్టార్ మా లో ఇప్పటి వరకు నాలుగు సీజన్లు ప్రసారమై ప్రతి సీజన్ అంతకు ముందు సీజన్ కంటే ఎక్కువ స్థాయి వినోదం అందించిన బిగ్ బాస్‌లో సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 లో ప్రేక్షకుల్ని అలరించిన హౌస్ మేట్స్ అందరూ ఈ ఈవెంట్ లో ప్రధాన ఆకర్షణ కాబోతున్నారు. ఇంతమంది సెలెబ్రిటీలు ఒక చోట కలవడం, ఇన్నాళ్లకు మళ్ళీ కలిసిన ఆనందాన్ని షేర్ చేసుకోవడం, ఆటలు పాటలు అన్నీ కలిసి ఫిబ్రవరి 14న సాయంత్రం 6 గంటలకు మరపు రాని సాయంత్రంగా మలచబోతోంది "బిగ్ బాస్ ఉత్సవం”.ప్రతి ఆదివారం లాగే ఈ ఆదివారం కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు 3 గంటల పాటు స్టార్ట్ మ్యూజిక్, కామెడీ స్టార్స్ షోలు ఎప్పటిలాగే అలరించబోతున్నాయి. కాబట్టి .. మిస్ కాకండి స్టార్ మాలో ఈ సండేని. -
మోడ్రన్ వంటలక్కను చూశారా?
-
‘స్టార్ మా’ సరికొత్త రికార్డు
సాక్షి, హైదరాబాద్ : దేశంలోనే ఎక్కువ మంది వీక్షించే ఎంటర్టైన్మెంట్ ఛానెల్‌గా ‘స్టార్ మా’ అవతరించింది. తాజాగా విడుదల అయిన రేటింగ్స్ లో ఈ ఘనత సాధించినట్లు స్టార్ మా ఓ ప్రకటనలో తెలిపింది. అన్ని రీజినల్ చానెల్స్ లో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తూ ముందుకు వెళుతున్న స్టార్ మా సన్ టీవీని దాటి ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్‌గా మారింది. బ్లాక్ బస్టర్ సినిమాలు, ప్రముఖ తారలతో కూడిన ఈవెంట్లు, లైవ్ కార్యక్రమాలు స్టార్ మా లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. తెలుగులో పాపులర్ సీరియల్స్ తో స్టార్ మా ముందుంది. 42 శాతం వీక్షకులను ఆకట్టుకుంటున్న వదినమ్మ, కార్తీకదీపం, ఇంటింటి గృహలక్ష్మి, తాజాగా ప్రారంభమైన దేవత, కస్తూరి తదితర కార్యక్రమాలతో స్టార్ మా ముందుకు వెళ్తుంది. బిగ్‌బాస్, సిక్స్‌సెన్స్, ఇస్మార్ట్ జోడీ లాంటి రియాలిటీ షో లు కూడా మా టీవీని ప్రేక్షకులకు దగ్గర చేశాయి. -
రికార్డుల్ని బద్దలుకొట్టిన 'బిగ్‌బాస్' 4 లాంచ్
సాక్షి, హైదరాబాద్: బార్క్ 36వ వారం గణాంకాల ఆధారంగా, తెలుగు జనరల్ ఎంటర్టైన్మైంట్ ఛానళ్లలో స్టార్ మా అప్రతిహతంగా మొదటి స్థానంలో కొనసాగుతోంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 లాంచ్ అత్యధిక రేటింగ్స్ సాధించింది. రియాలిటీ షో లాంచ్‌లు సాధించిన అద్భుతమైన విజయాల్లో ఇది కూడా ఒకటి. ఈ సీజన్ ఒక సంచలనంతో మొదలైంది. బార్క్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, అత్యద్భుతమైన ఆరంభ విజయంగా అభివర్ణించిన ఈ తొలివారం లాంచ్‌ని 4.5 కోట్ల మంది ప్రేక్షకులు చూశారు. ఈ సీజన్ బిగ్‌బాస్ లాంచ్ ఇంతకుముందెన్నడూ లేని రేటింగ్స్ సాధించింది. లాంచ్ ఎపిసోడ్ 18.5 టీవీఆర్ నమోదు చేసింది. నాన్ ఫిక్షన్ షో కేటగిరీలో బార్క్ యూనివర్స్‌లో ఇప్పటివరకు రానంతగా అత్యధిక రేటింగ్స్ సాధించిన లాంచ్ ఎపిసోడ్‌గా మాత్రమే కాదు బిగ్‌బాస్ తెలుగు (తొలి సీజన్ నుంచి) చరిత్రలో ఏ సీజన్లోనూ చూడనంతగా ఈ లాంచ్ ఎపిసోడ్ అత్యుత్తమ రేటింగ్ సాధించింది. గణాంకాలను బట్టి స్టార్ మా గతంలో లేనంతగా అత్యధికంగా 1122 జీపీఆర్‌లతో తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో స్పష్టమైన లీడర్షిప్ స్థానంలో కొనసాగుతోంది. గత నాలుగువారాలతో పోలిస్తే స్టార్ మా సరికొత్త బ్రాండ్ ఐడెంటిటీ 18 శాతం అభివృద్ధి సాధించింది. (సరికొత్త గుర్తింపుని ఆవిష్కరిస్తోంది స్టార్ మా) -
సరికొత్త గుర్తింపుని ఆవిష్కరిస్తోంది స్టార్ మా
సాక్షి, హైదరాబాద్: మానవీయ స్ఫూర్తి సాధించిన అపురూపమైన విజయాలకు ఒక వేదిక కల్పించే సాహసోపేతమైన, స్ఫూర్తిదాయకమైన, వినోదాత్మకమైన కథల కలయికే స్టార్ మా. ఎన్నో విధాల పాత్రలు పోషిస్తూ, రకరకాల సమస్యలతో పోరాటం చేస్తూ ప్రతిరోజూ గెలుస్తున్న మా ప్రేక్షకుల నుంచే మేం ప్రేరణ తీసుకుంటున్నాం. గత నాలుగు సంవత్సరాలుగా తన ప్రేక్షకుల అంగీకారంతో, వారు అప్రతిహతంగా అందిస్తున్న ప్రేమతో తన ప్రయాణం కొనసాగిస్తున్న స్టార్ మా ఇప్పుడు సరికొత్త ముస్తాబుతో తన గుర్తింపులో కొత్త మార్పులు చేస్తోంది. ఈ రోజు ఆవిష్కరిస్తోన్న దృశ్యమూలాంశంలో ఆ ఆలోచన ప్రతిబింబించబోతోంది. మూడు ప్రముఖమైన అంశాల సమ్మేళనమే స్టార్ మా అని మా ప్రగాఢ విశ్వాసం. మన సంస్కృతీ సంప్రదాయాలు సగర్వ నేపథ్యంతో పురోగతివైపు పరుగులు తీసే కథనాలను అల్లుతోంది స్టార్ మా. ఈ మూడు అంశాల సమ్మేళనాన్ని సంబరం చేసుకునే విధంగా ప్రతి కథ ఉండేలా స్టార్ మా ప్రయత్నం చేస్తోంది. సరికొత్త స్టార్ మా గుర్తింపునకు ఇదే ఆధారం. మనలోని ప్రతి ఒక్కరిలో కొంచెం స్టార్ మా ఉంటుందని మేము నమ్ముతున్నాం. స్టార్ మాలోని ఛానళ్లు జనరల్ ఎంటర్టైన్మెంట్, మూవీస్, మ్యూజిక్ అనే మూడు విభిన్నమైన రీతుల్లో నిర్వహిస్తోంది. స్టార్ మా నిర్వహిస్తున్న మూడు విభిన్ ఛానళ్లు స్పష్టమైన లీడర్స్‌గా స్థానం సంపాదించాయి. 25శాతం మార్కెట్ షేర్‌తో తెలుగు టెలివిజన్ వ్యూయర్ షిప్లో అత్యధిక షేర్ని సొంతం చేసుకున్నాయి జనరల్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో స్టార్ మా 30 శాతానికి పైగా షేర్ మార్కెట్ సంపాదించుకుంది. విస్తృతమైన విలక్షణతతో , విభిన్నమైన కార్యక్రమాలతో స్పష్టమైన ఆధిపత్యం పొందింది. స్టార్ మా మూవీస్ అతిపెద్ద మూవీస్ ఛానల్‌గా, స్టార్ మా మ్యూజిక్ శక్తివంతంగా, యువతరానికి స్పష్టమైన డెస్టినేషన్‌గా రూపొందాయి. తెలుగు టెలివిజన్‌లో అతిపెద్ద షో 'బిగ్‌బాస్ 4' లాంచ్ ఎపిసోడ్లో స్టార్ మా బ్రాండ్ రిఫ్రెష్ జరగబోతోంది. బిగ్‌బాస్ 4 నిర్వహించబోతోన్న నాగార్జున లోగో లాంచ్ గురించి సంక్షిప్తంగా చెప్పారు. ఇప్పటికే ఎంతో శక్తివంతంగా ఉన్న బ్రాండ్ మరింత అద్భుతంగా చేసే ప్రయాణానికి ఇది కొత్త ఆరంభం అన్నారాయాన. ఈ సందర్భంగా స్టార్ మా ప్రతినిధి ఇలా అన్నారు. 'గత కొన్నేళ్లుగా ప్రేక్షకులు మాపై కురిపిస్తున్న ప్రేమను ఎంతో సవినయంగా స్వీకరిస్తున్నాం. ఈ సరికొత్త గుర్తింపుతో మా ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతున్నాం. ఎంతో గర్వంగా భావించే ఒక ఛానల్ వారి జీవితాల్లో భాగమయ్యేలా అందిస్తున్నాం. మా ప్రేక్షకులే మాకు స్ఫూర్తి. ఎంతటి ప్రగతి సాధిస్తున్నా సాంస్కృతికపరమైన మూలాలను ఏ మాత్రం వదలని మా ప్రేక్షకుల దక్షతే మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. తెలుగు నేల సాంస్కృతి వైభవాన్ని ప్రస్తుతించడమే ఈ మార్పు సంకల్పం. కేవలం వినోదాన్ని అందించే ఎంటర్టైన్మెంట్ బ్రాండ్‌గా మాత్రమే కాక, సమాజానికి ఓ కొత్త రూపునిచ్చే కథల్ని చెప్పే మాధ్యమంగా కూడా ఎదగాలన్నది మా ఉద్దేశ్యం'. -
బిగ్‌బాస్: సురేఖవాణి ఎంట్రీ పై క్లారిటీ!
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌బాస్ సీజన్ 4 కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌కు సంబంధించిన కంటెస్ట్ంట్ల జాబితా గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్‌కు సంబంధించిన ప్రోమోలు కూడా విడుదల చేస్తూ బిగ్‌బాస్ 4 సందడి చేస్తోంది. ఈ సీజన్లో సినీనటి ప్రముఖ నటి సురేఖవాణి కూడా పాల్గొంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వార్తలపై సురేఖ వాణి కూతురు సుప్రీత స్పందించారు. సుప్రీత బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో మాట్లాడారు. ఈ వీడియోలో పలు ఆసక్తికర విషయాలను సుప్రీత వెల్లడించారు. తన తల్లి బిగ్‌బాస్‌లో పాల్గొనడం గురించి తనకు ఏమీ తెలియదని చెప్పింది. ఆ విషయం గురించి తన తల్లి తనకు ఏమీ చెప్పలేదని వెల్లడించింది. ఇక తన పెళ్లి గురించి అడగగా ప్రస్తుతం తన వయసు 20 ఏళ్లు మాత్రమేనని పెళ్లి చేసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉందని సమాధానం చెప్పింది. తనకు కాబోయే భర్త తనను అర్థం చేసుకునేవాడై ఉండాలని తెలిపింది. చదవండి: బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్‌కి కరోనా పాజిటివ్! -
వినోదాల బిగ్‌బాస్ 4
‘‘వినోదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన అతి పెద్ద నాన్ ఫిక్షన్ షో బిగ్‌బాస్.. లె లుగు టెలివిజన్‌లో అత్యుత్తమమైన రేటింగ్స్ సాధించిన బిగ్‌బాస్ నాలుగో సీజన్ అతి త్వరలో ప్రారంభం కానుంది’’ అని స్టార్ మా ప్రతినిధులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే మూడు సీజన్లతో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించిన బిగ్‌బాస్ గతంలో కంటే ఈసారి మరింత ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అయ్యారు. బిగ్‌బాస్ 3వ సీజన్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన హీరో నాగార్జున 4వ సీజన్‌కి కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తారు. వరుసగా రెండోసారి బిగ్‌బాస్‌కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగార్జున మాట్లాడుతూ– ‘‘బిగ్‌బాస్ ప్రోమో కోసం మళ్లీ షూటింగ్‌కి రావడం చాలా సరదాగా అనిపించింది. గత సీజన్ గొప్ప విజయం అందుకుంది. ఇప్పుడు ప్రేక్షకులకు మరింత వినోదంతో పాటు సర్ప్రైజ్లు కూడా అందించే ప్రయత్నం చేయబోతున్నాం’’ అన్నారు. కాగా యంగ్, మిడిల్, ఓల్డ్ గెటప్స్‌లో నాగార్జున కనిపించిన 4వ సీజన్ ప్రోమోకి మంచి స్పందన లభించింది. -
మరోసారి బుల్లితెరపై బిగ్‌బాస్
కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌తో ప్రజలు ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. దీంతో ఇళ్లలో ఉన్నవారి కాలక్షేపం కోసం 30 ఏళ్ల కిందట ప్రజలను అలరించిన రామాయణం సీరియల్‌ను దూరదర్శన్ చానల్లో మరోసారి ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విధంగా ‘స్టార్ మా’ కూడా టీవీ వీక్షకులకు వినోదాన్ని పంచడానికి బిగ్‌బాస్ తెలుగు సీజన్-3ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలిపింది. సోమవారం నుంచి శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు బిగ్‌బాస్ తెలుగు సీజన్-3 మెమొరీస్‌ను ప్రసారం చేయనున్నట్టు స్టార్ మా వెల్లడించింది. ఈ మేరకు ట్విటర్లో ఒక ప్రకటన చేసింది. ‘21 రోజుల లాక్డౌన్ సమయంలో ప్రతిఒక్కరు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నట్టు అనుభూతి పొందుతున్నారు. అందుకే మరోసారి బిగ్‌బాస్ తెలుగు సీజన్-3 మెమొరీస్‌ని చూసేద్దాం’ అని పేర్కొంది. కాగా, నాగార్జున హౌస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ తెలుగు సీజన్-3 మూడు నెలలకు పైగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఇందులో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలువగా, శ్రీముఖి రన్నరప్‌గా నిలిచారు. -
బంగారు లక్ష్ములు
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మధురగా కల్పిత సుపరిచితమే. ఇప్పుడు చెల్లి లిఖిత ‘బంగారు పంజరం’తో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబవుతోంది. బెంగుళూరులో పుట్టి తెలుగు బుల్లితెర ద్వారా ఆకట్టుకుంటున్న ఈ అక్కాచెల్లెళ్ల టీవీ ప్రయాణం గురించి వారి మాటల్లోనే.. ‘మా నాన్న బిల్డింగ్ కాంట్రాక్టర్. అమ్మ గృహిణి. అక్క, నేను.. ఇదీ మా కుటుంబం. అక్క కాలేజీ రోజుల్లో నటిస్తూనే పీజీ పూర్తి చేసింది. ‘ఒకరికి ఒకరు’ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన కల్పిత కన్నడ సీరియల్స్‌లోనూ నటిస్తోంది. మా ఇంట్లో తను ఎంత చెబితే అంత. తనే నాకు అన్ని విషయాల్లో అడ్వైజర్. మోడల్. మంచితనమే ఆభరణంగా! ‘స్టార్ మా టీవీలో వచ్చే ‘బంగారు పంజరం’ సీరియల్లో మహాలక్ష్మిగా నటిస్తున్నాను. ఈ సీరియల్లోని ముగ్గురు అక్కాచెల్లెళ్లలో నేనే పెద్దదాన్ని. అమ్మానాన్నలు చనిపోవడంతో కుటుంబం అంతా తాత బ్రహ్మయ్య బొమ్మల తయారీమీద వచ్చిన ఆదాయంతోనే బతుకుతుంటుంది. తాత బొమ్మలతో పాటు చిన్న చిన్న నగలను కూడా తయారు చేసి అమ్ముతుంటాడు. పేదరికంలో ఉన్నా మా సంతోషాలకు ఎలాంటి లోటూ లేదు. ఒకసారి జమిందారీ కుటుంబం ఆ గ్రామంలోని దేవాలయంలో దేవతా విగ్రహాలను ప్రతిష్టించడానికి పూనుకుంటుంది. అందుకు విగ్రహాలు, నగలు చేయమని ఆ పనిని మా తాతకు అప్పజెబుతుంది. పని అంతా పూర్తి చేస్తాడు మా తాత. ఇది గిట్టని వాళ్లు విగ్రహప్రతిష్టకు ముందు రోజు నన్ను కిడ్నాప్ చేస్తారు. రోజంతా ఒక ఇంట్లో ఉంచి, మరుసటి రోజు వదిలేస్తారు. అందరూ మహాలక్ష్మి శీలాన్ని శంకిస్తుంటారు. దీంతో తాత బ్రహ్మయ్య చాలా బాధపడతాడు. తమవల్ల బ్రహ్మయ్య కుటుంబానికి చెడ్డ పేరు వచ్చింది కాబట్టి ఆ పేరు పోగొట్టడానికి తమ కంపెనీ మేనేజర్‌తో మహాలక్ష్మిని పెళ్లి చేసుకోమని చెబుతాడు జమిందార్. కానీ పెళ్లి సమయానికి ఆ మేనేజర్ పారిపోవడంతో జమిందారే మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. జమిందార్ ఇంట్లో ఇల్లాలిగా అడుగుపెట్టిన మహాలక్ష్మికి అప్పటికే అతనికి పెళ్లయ్యిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిసి షాకవుతుంది. అలా బంగారు పంజరంలో చిక్కుకుపోయి విలవిల్లాడుతుంది. ఎంతో అమాయకత్వం, మరెంతో మంచితనం గల అమ్మాయి మహాలక్ష్మి పాత్ర పోషిస్తున్నందుకు, ఇలా మీ ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చదువంటేనే ఇష్టం అక్క నటిగా మారి నాకూ ఓ మార్గం వేసింది.. అని ఈ సీరియల్ ద్వారా అర్థమైంది. నాచేత ఫొటో షూట్స్ చేయించడం, ఫొటోగ్రాఫ్స్ సీరియల్ టీమ్స్‌కి పంపించడం.. అన్నీ తనే చూసుకుంది. అయితే, ముందు ఇదంతా నాకు తెలియదు. తను చేయమన్నట్టు చేసేదాన్ని. ఒక రోజు సీరియల్ టీమ్ అడుగుతున్నారు, అందులో యాక్ట్ చే యాలి అని తను నన్ను అడిగినప్పుడు చదువంటేనే ఇంట్రస్ట్ అని చెప్పాను. అవకాశాలు అందరికీ రావు, వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి అని తనే నచ్చజెప్పింది. నా చదువుకి ఇబ్బంది లేకపోతే ఓకే అన్నాను. ఎందుకంటే ఇప్పుడు బీకామ్ సెకండియర్ చదువుతున్నాను. సీఎ చేద్దామన్నది నా ఫ్యూచర్ ప్లాన్. మా లెక్చరర్స్, ఫ్రెండ్స్‌ని కలిసి అక్కనే మాట్లాడింది. వాళ్లూ సపోర్ట్ చేస్తామన్నారు. అక్క నా పట్ల చూపిస్తున్న శ్రద్ధ కాదన లేక నటిగానూ ప్రూవ్ చేసుకుందామని ఇలా యాక్టింగ్ వైపు వచ్చాను. లలిత సంగీతం చదువుతోపాటు పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం, పెయింటింగ్స్ వేయడం.. వీటి కోసం ఎన్ని గంటల సమయమైనా కేటాయిస్తాను. సింగర్‌గానూ రాణించాలని తొమ్మిదేళ్ల పాటు లలిత సంగీతం నేర్చుకున్నాను. అక్క మాటను కాదనలేక ఒక సీరియల్ అనుకున్నాను. కానీ, నటిగా రాణించడంలోనూ, ప్రూవ్ చేసుకోవడంలోనూ నూటికి నూరుపాళ్లు ఇన్వాల్వ్ అవుతున్నాను. ఇదే ఇకముందు నా ప్రపంచం అనిపిస్తోంది. ఇప్పుడు బాగుంది. ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి. నేనూ అక్కలా పీజీ చేసి ఈ ఇండస్ట్రీలోనే స్థిరపడాలని, మరిన్ని మంచి ప్రాజెక్టులు చేయాలని ఇప్పుడు అనుకుంటున్నాను. – ఆరెన్నార్ ఇద్దరిదీ ఒకే మాట మా ఇద్దరి అక్కచెల్లెళ్లది ఒకే మాట. ఇద్దరం సీరియల్స్ చూస్తాం. సీరియస్‌గా డిస్కషన్ చేస్తుంటాం. అందులోని నటీనటుల యాక్టింగ్ గురించి, వారి క్యాస్ట్యూమ్స్ గురించి... ప్రతీది చర్చిస్తుంటాం. ఇద్దరం యాక్టింగ్ పీల్డ్‌లో ఉన్నాం కాబట్టి నటనలో మెలకువల గురించి, ఎలా చేస్తే ఫ్యూచర్ బాగుంటుందో మాట్లాడుకుంటూ ఉంటాం. మా అమ్మానాన్నలు మా ఇద్దరి గురించి ఎవరితోనైనా చెప్పేటప్పుడు ‘మా ఇంటి బంగారు లక్ష్ములు’ అని గర్వంగా చెబుతుంటారు. -
రంగంలోకి దిగుతున్నా!
ఓ పాతిక కిలోల వంకాయలు. గుడ్లు, బియ్యం.. ఇలా కిరాణా సామాన్లను బిజీబిజీగా కొనుగోలు చేస్తున్నారు నాగార్జున. ఇవన్నీ వాళ్ల ఇంటికోసం కాదు.. త్వరలో ప్రారంభం కానున్న బిగ్‌బాస్ హౌస్‌లోకి. ‘బిగ్‌బాస్’ సీజన్3కి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారని శుక్రవారం అధికారికంగా ప్రకటించింది ‘బిగ్‌బాస్’ బృందం. ‘ఈ సీజన్లోకి నేను రంగంలోకి దిగబోతున్నాను’ అంటూ నాగార్జున పలికే డైలాగ్ వీడియో ప్రోమోను రిలీజ్ చేశారు. త్వరలోనే ప్రారంభం కానున్న మూడో సీజన్ గురించి స్టార్ మా ప్రతినిధి మాట్లాడుతూ – ‘‘ప్రేక్షకులకు బెస్ట్ ఇవ్వాలన్నదే మా లక్ష్యం. నాగార్జునగారు తోడవ్వడం ఈ సీజన్‌కు కొత్త ఫ్లేవర్ వస్తుందనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘కొత్త కొత్త విషయాలతో ప్రయోగాలు చేయడం నాకు ఇష్టం. అలాగే టెలివిజన్ కూడా నాకు కొత్తేం కాదు. ఆల్రెడీ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ చేసి ఉన్నాను. ‘బిగ్‌బాస్’ అనేది కొత్త ఎక్స్పీరియన్స్. చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అన్నారు నాగార్జున. -
‘యాత్ర’కు ఈసీ గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: టీవీలో ప్రసారం కానున్న ‘యాత్ర’ చిత్రాన్ని అడ్డుకోవడానికి టీడీపీ నాయకులు చేసిన ప్రయత్నం విఫలమైంది. టీవీలో ప్రసారం కానున్న యాత్ర సినిమా ఏరకంగానూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో టీవీలో ఈ చిత్ర ప్రసారానికి అడ్డంకులు తొలగిపోయాయి. వివరాల్లోకి వెళితే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే యాత్ర శాటిలైట్ రైట్స్‌ను సొంతం చేసుకున్న స్టార్ మా చానల్.. ఈ చిత్రాన్ని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం చేయనున్నట్టు ప్రకటించింది. అయితే దీనిపై టీడీపీ అభ్యంతరం వ్యకం చేసింది. యాత్ర చిత్రాన్ని టీవీలో ప్రసారం చేయకుండా చూడాలని టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. టీడీపీ నేతల ఫిర్యాదుపై స్పందించిన ఈసీ.. టీడీపీకి సమాధానంగా మరో లేఖ రాసింది. యాత్ర చిత్ర ప్రదర్శనలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని ఈసీ ఆ లేఖలో తెలిపింది. టీవీ లేదా సినిమా థియేటర్లలో ప్రదర్శించే సినిమాలు తమ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. టీడీపీ నేతల ఫిర్యాదును తమ మీడియా సర్టిఫికేషన్ కమిటీ పరిశీలించిందనీ, అందులో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే అంశాలేవీ లేదని తేల్చిచెప్పింది. దీంతో రేపు మధ్యాహ్నం యాత్ర చిత్రం స్టార్ మాలో ప్రసారం కానుంది. #Yatra World Television Premiere..This Sunday at 12 PM on @StarMaa#YatraOnMaa pic.twitter.com/wOLIyda7Vx — STAR MAA (@StarMaa) April 4, 2019 -
ఇద్దరిలో బిగ్‌బాస్ ఎవరు?
బాలీవుడ్లో బిగ్‌బాస్ సూపర్ హిట్. దీన్ని సౌత్ ఇండియాలో కూడా పరిచయం చేయాలని నిర్వాహకులు భావించారు. కన్నడం, తమిళంలో కూడా ఈ షోను పరిచయం చేశారు. అక్కడా హిట్టే. ఆ తర్వాత తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్‌గా ఈ షో ఆరంభమైన విషయం తెలిసిందే. షో సూపర్ హిట్. ఎన్టీఆర్ హోస్ట్‌గా పర్ఫెక్ట్ అన్నారు. షో మొదటి ఎపిసోడ్ సుమారు 16.18 టీఆర్పీ (టెలివిజన్ రేటింగ్ పాయింట్), మొదటివారం 9.24 టీఆర్పీను నమోదు చేసింది. ‘నా టీవి’ అనే ఎన్టీఆర్ మేనరిజమ్ బాగా క్లిక్ అయింది. ప్రతి సినిమా షెడ్యూల్, ఫ్యామిలీకి టైమ్ కేటాయించడం కుదరకపోవడంతో సెకండ్ సీజన్లో హోస్ట్‌గా తప్పుకున్నారు ఎన్టీఆర్. కొత్త హోస్ట్‌గా నాని ఎంట్రీ ఇచ్చారు. ‘నా నీ టీవీ’ అంటూ నాని మేనరిజమ్ కూడా ఆకట్టుకుంది. సెకండ్ సీజన్ కూడా మంచి హిట్టే. సెకండ్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ 15.05, మొదటి వారంలో 7.93 టీ ఆర్పీ నమోదయ్యాయి. తర్వాతి సీజన్లో కనిపించబోనని షో ఫైనల్ రోజే నాని స్పష్టం చేశారు. మూడో సీజన్ జూన్‌లో స్టార్ట్ కానుంది. ప్రస్తుతం హోస్ట్ ఎవరన్న టాపిక్ మొదలైంది. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ కారణంగా ఈసారి కూడా ఎన్టీఆర్ ‘బిగ్‌బాస్’ను మిస్ అవుతారని వినిపిస్తోంది. అయినప్పటికీ ఎన్టీఆర్‌ను తీసుకురావాలని ‘బిగ్‌బాస్’ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. మరోవైపు నాగార్జున కూడా బిగ్‌బాస్ హోస్ట్‌గా కనిపిస్తారని టాక్. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తెలుగు వెర్షన్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ను నాగార్జున సక్సెస్‌ఫుల్‌గా నడిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ‘బిగ్‌బాస్’కు హోస్ట్‌గా నాగ్ కూడా పర్ఫెక్ట్ అని పలు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ ఇద్దరిలో బిగ్‌బాస్ హోస్ట్ ఎవరన్నది మాత్రం నిర్వాహకుల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. జూన్‌లో ప్రారంభం కాబోయే మూడో సీజన్ ప్రీ–ప్రొడక్షన్ పనులు నడుస్తున్నట్టు, సెట్ ఎక్కడ వేయాలి? కంటెస్టెంట్స్ ఎవరనే డిస్కషన్స్ జరుగుతోందని సమాచారం. -
కన్నడ కోయిలమ్మ
సంగీతమే ప్రాణంగా ‘కోయిలమ్మ’ సీరియల్లోని చిన్ని పాత్ర ఉంటుంది. స్టార్ మా టీవీలో వచ్చే ఈ సీరియల్ ద్వారా చిన్ని పాత్రతో తెలుగింటికి పరిచయం అయ్యింది తేజస్విని. అందంలోనూ, అభినయంలోనూ భేష్ అనిపించుకుంటున్న ఈ కన్నడ కోకిల ‘సాక్షి’తో పంచుకున్న ముచ్చట్లు... మీరు కన్నడ, తెలుగు బుల్లి తెరకు ఎలా పరిచయం అయ్యారు? బెంగుళూరులోని థియేటర్ ఆర్ట్స్‌లో జాయిన్ అయ్యాను. అంతకు మూడునెలల ముందు ‘బిలీ హెన్సీ’ అనే కన్నడ ప్రాజెక్ట్‌లో వర్క్ చేశాను. థియేటర్ ఆర్ట్స్ నుంచే నాకు ‘కోయిలమ్మ’ సీరియల్ ఆఫర్ వచ్చింది. తెలుగింటికి పరిచయం చేసిన ‘స్టార్ మా’ వాళ్లకు ముందుగా థాంక్స్. ఈ ప్రాజెక్ట్‌కు ముందు ‘కోయిలమ్మ’ సీరియల్ చూశాను. బాగా నచ్చింది. పెద్దయ్యాక ‘చిన్ని’గా నేను ఎలా ఉంటానో, ఆ పాత్ర ద్వారా తెలుగువారు నన్ను రిసీవ్ చేసుకుంటారోలేదోనని నాలుగు వారాలు చాలా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు బయటకు వెళితే ‘చిన్ని చిన్ని’ అని పిలుస్తున్నారు. ఈ పాత్ర ద్వారా నాకు మంచి పేరు వస్తున్నందుకు ఆనందంగా ఉంది. మీ ఫ్యామిలీ గురించి.. నేను, అమ్మ భ్రమరాంబ బెంగుళూరులో ఉంటాం. అమ్మ సివిల్ ఇంజనీర్‌గా జాబ్ చేస్తున్నారు. అమ్మనాన్నలకు నేను ఒక్కత్తే కూతురుని. ఐదేళ్ల క్రితం మా నాన్నగారు(మల్లికార్జున్) చనిపోయారు. టీవీ ఇండస్ట్రీకి రాకముందు సాఫ్ట్వేర్ ఉద్యోగిని. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడంలో ఆసక్తి ఉండటం వల్ల డ్యాన్స్ నేర్చుకున్నాను. జాబ్ మానేసి థియేటర్ ఆర్ట్స్‌లో జాయిన్ అయ్యాను. సీరియల్లో మాదిరిగానే లైఫ్‌లో మలుపులు.. (నవ్వుతూ) సీరియల్లో చాలా ట్విస్టులు ఉన్నాయి. నా జీవితంలో అలాంటివేవీ లేవు. చాలా సింపుల్‌గా గడిచిపోతోంది. నన్ను ఈ రంగంలోకి పంపే ముందు అమ్మ కొంత ఆలోచించారు. కానీ, సాంస్కృతిక రంగం పట్ల నాకుండే ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు. ఇక్కడ షూటింగ్ వారం విడిచి వారం ఉంటుంది. అందువల్ల వారానికి ఓసారి హైదరాబాద్ వచ్చి వర్క్ చేసుకొని వెళతాను. ‘చిన్ని’పాత్ర సింగర్.. బయట ? నాకు సంగీతంలోనూ ప్రవేశం ఉంది. మ్యూజిక్ నేర్చుకున్నాను. ‘కోయిలమ్మ’ కూడా సింగింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్. నాకు నచ్చిన కాన్సెప్ట్ అవడంతో మరింత హ్యాపీ. ఈ పాత్ర ద్వారా తెలుగింటి వారినుంచి మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది. జనాలంతా గుర్తించాలి. ఈ ఇండస్ట్రీకి రాకముందు డ్యాన్స్, మ్యూజిక్ ..అంటే ఇష్టం ఉండేది. ఇప్పుడు వీటితో పాటు ఈ ఇండస్ట్రీయే నా ఇంట్రస్ట్ గా మారిపోయింది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అంటుంటారు. ‘సాఫ్ట్వేర్ రొటీన్ ఫీల్డ్. నువ్వు లక్కీ. నచ్చిన క్రియేట్ ఫీల్డ్‌ను ఎంచుకున్నావు..’ అంటూ మెచ్చుకుంటూ ఉంటారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మీ అందరి మనసుల్లో నిలిచిపోవాలన్నదే నా లక్ష్యం. – నిర్మలారెడ్డి -
హాస్యం ఎక్కాల పుస్తకం కాకూడదు
సిల్వర్ స్క్రీన్‌పై బ్రహ్మాండంగా నవ్విస్తున్న బ్రహ్మానందం ఇప్పుడు స్మాల్ స్క్రీన్‌కి రానున్నారు. అయితే నవ్వించడానికి కాదు.. నవ్వించేవారిని ‘జడ్జ్’ చేయడానికి. ‘ది గ్రేట్ తెలుగు లాఫ్టర్ చాలెంజ్’ షోలో కనిపించనున్నారు బ్రహ్మానందం. ఈరోజు ‘స్టార్ మా’లో ఈ షో స్టార్ట్ అవుతున్న సందర్భంగా బ్రహ్మానందంతో స్పెషల్ టాక్. ► ఇన్ని రోజులు వెండితెరపై ప్రేక్షకులను నవ్వించిన మీరు ఇప్పుడు తొలిసారి బుల్లితెరపైకి రాబోతున్నారు. ఈ అనుభూతి మీకు ఎలా అనిపిస్తోంది? నవ్వించేవాళ్లను జడ్జ్ చేయబోతున్నాను. ఈ షోలో అద్భుతమైన ప్రతిభ ఉన్న కుర్రాళ్లు స్టాండప్ కామెడీ చేయబోతున్నారు. ఎవరు బాగా నవ్వించారో వాళ్లను ఎంపిక చేయాలి. ► జడ్జ్మెంట్ అనేది కష్టం అంటారు? నవ్వొస్తే బాగుందని చెబుతాం. నవ్వు రాకపోతే బాగోలేదు అంటాం. దీనిని జడ్జ్ చేయడానికి మనకు ఓ సీట్ కేటాయించారు. లెక్కలేసుకుని ‘నవ్వు’కి జడ్జిమెంట్ ఇవ్వకూడదు. హాస్యం ఎక్కాల పుస్తకం కాకూడదు. పెద్ద బాల శిక్షలా ఉండాలి. ► ఈ షోను అంగీకరించడానికి కారణం ఏంటి? నేను ఒకప్పుడు మిమిక్రీ కళాకారుడిని. మిమిక్రీనే స్టాండప్ కామెడీ అంటుంటారు. ఇప్పుడు కుర్రాళ్లు చాలామంది స్టాండప్ కామెడీ చేసి నవ్వించడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లను ప్రోత్సహించాలి. ఎవరో ప్రోత్సహించే కంటే అనుభవం ఉన్న నాలాంటివాళ్లు ఆ బాధ్యతను తీసుకుంటే బాగుంటుందనిపించింది. వాళ్లకూ ఉత్సాహంగా ఉంటుంది. ► మీరు బ్రహ్మాండంగా నవ్విస్తారు. ఈ షోలో పాల్గొనేవారు మిమ్మల్ని నవ్వించగలరని నమ్ముతున్నారా? నవ్వడం అనేది పెద్ద విషయమో, లేక పెద్ద పెద్ద బరువులు ఎత్తడమో కాదు. నవ్వినోళ్లు మళ్లీ నవ్వకూడదని ఏమీ లేదు. నవ్వొస్తే ఎవరైనా నవ్వుతారు. ఆ నవ్వు వస్తే దేశ ప్రధాని అయినా నవ్వుతాడు. సామాన్యులూ నవ్వుతారు. నవ్వు అందరికీ కామన్. పెద్ద కమెడియన్ నవ్వకూడదని కాదు. ► అన్ని రసాల కన్నా హాస్య రసం కష్టం అంటారు.. నవ్వించడం బ్రహ్మానందానికే కాదు ఎవరికైనా కష్టమే. నవరసాల్లో హాస్యరసాన్ని పండించడం అంత ఈజీ కాదు. జుగుప్సాకరంగా కాకుండా అందంగా నవ్వించి, ప్రేక్షకులు హాయిగా నవ్వుకునేలా చేయడం అనేది గొప్ప విషయమే. ► మరి ‘జుగుప్సాకరమైన హాస్యం’ ఉండకూడదని నిర్వాహకులతో మీరు చెప్పారా? నా దగ్గరకు నిర్వాహకులు రావడానికి, నేను ఈ షో అంగీకరించడానికి మొదటి కారణం అదే. ఇంటిల్లిపాదీ చూస్తూ కామెడీని ఆనందించే షోకే నేను జడ్జ్‌గా చేస్తాను. అలా కాకుండా భిన్నమైన మార్గాల్లో నవ్వించాలని ప్రయత్నిస్తే అదే రోజు మానేస్తానని కూడా చెప్పాను. ► ఫైనల్లీ ఈ షో వల్ల మీకెలాంటి అనుభవం దొరకుతుందని అనుకుంటున్నారు? కొత్త కుర్రాళ్లకు వాళ్ల ప్రతిభను నిరూపించుకోవడానికి ఒక మంచి వేదిక దొరికింది. ఉదాహరణకు.. పాటలు పాడేవారు, మిమిక్రీ చేసేవారు.. ఇలా విభిన్న రంగాల్లో ప్రతిభ ఉన్నవాళ్లు ఉన్నారు. అత్త కూడా ఒకప్పటి కోడలే అంటారు కదా... ఇంకా చానెల్స్ రానప్పుడు డీడీ 8లో నేనూ స్టాండప్ కామెడీ చేసినవాడినే. ఒక్కసారి ఆ పూర్వపు రోజులను గుర్తు చేసుకున్నట్లు ఉంటుంది. ఇప్పుడు ఈ షోలో పాల్గొనబోయే వాళ్లలో ప్రతిభ ఉన్న వారు రేపు మంచి స్థాయికి వెళితే సంతోషపడతాను. -
బిగ్‌బాస్-2 ఫైనల్ లిస్ట్!
మొదటి సీజన్ బంపర్ హిట్ కావటంతో బిగ్ బాస్ రియాల్టీ షో రెండో సీజన్‌పై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా నేటి సాయంత్రం(ఆదివారం) రెండో సీజన్ ప్రారంభం కానుంది. అయితే గత కొంత కాలంగా ఇదే జాబితా అంటూ కొందరి పేర్లు వార్తల్లో ప్రముఖంగా వినిపించాయి. అయితే అవేం నిజం కాదని మొన్నామధ్య నిర్వహించిన ప్రెస్ మీట్లో నిర్వాహకులు, హోస్ట్ నాని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో షో ప్రారంభానికి కొద్ది గంటల ముందు కొందరి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిని పరిశీలిస్తే... 1. సింగర్ గీతా మాధురి.. టాలీవుడ్ పాపులర్ సింగర్ 2. తేజస్వి మదివాడ... టాలీవుడ్లో చాలా చిత్రాల్లో నటించిన నటి. 3. నటుడు అమిత్ తివారీ.. విక్రమార్కుడు, ఖలేజా, అత్తారింటికి దారేది, టెంపర్ , సన్నాఫ్ సత్యమూర్తి, తదితర చిత్రాల్లో నటించాడు. 4. నటుడు తనీష్.. బాల నటుడిగా కెరీర్‌ను ప్రారంభించి, తర్వాత టాలీవుడ్లో పలు చిత్రాల్లో హీరోగా కనిపించిన యువనటుడు. 5. నటుడు సామ్రాట్... అహనా పెళ్లంట, పంచాక్షరి లాంటి చిత్రాల్లో కనిపించారు. కొన్నాళ్ల క్రితం భార్యతో విబేధాల కారణంగా వార్తల్లో నిలిచారు. 6. యాంకర్ దీప్తి... ఓ ప్రముఖ ఛానెల్లో యాంకర్‌గా పని చేస్తున్న దీప్తి నల్లమోతు. భద్ర, శంకర్‌దాదా ఎంబీబీఎస్ లాంటి పలు చిత్రాల్లో కూడా ఆమె నటించారు. 7. బాబు గోగినేని... హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. 8. రోల్ రిడా... రాహుల్ కుమార్ అలియాస్ రోల్ రిడా. రాప్ సింగర్. 9. శ్యామల... యాంకర్ శ్యామల. పలు చిత్రాల్లో కూడా నటించారు. 10. కిరీటి ధర్మరాజు... పలు షార్ట్ ఫిలింస్. టాలీవుడ్ చిత్రాల్లో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్. 11. దీప్తీ సునయన... సోషల్ మీడియా సెన్సేషన్. డబ్ స్మాష్ వీడియోలతో బాగా పాపులర్. ఆ మధ్య నిఖిల్ కిర్రాక్ పార్టీలో కూడా ఓ పాత్రలో కనిపించారు. 12. సీరియల్ నటుడు కౌశల్ 13. భాను... ???. ఈ 13 మంది సెలబ్రిటీలు కాకుండా గణేశ్, సంజన, నూతన్ నాయుడు అనే ముగ్గురు కూడా హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే సమాచారం. ఏది ఏమైనా మరికొద్ది గంటల్లో ఆ సస్పెన్స్‌కు తెర దించుతూ షో ప్రారంభం కాబోతోంది. సెకండ్ సీజన్ వంద రోజులపాటు సాగనుంది. ‘ఏదైనా జరగొచ్చు’ అంటూ ఈ సీజన్ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ను అందించబోతుందో చూడాలి. -
జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త అవతారం
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త అవతారం ఎత్తబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ త్వరలో బుల్లితెర మీద ప్రత్యక్షం కానున్నారు. సోనీ చానల్లో బహుళ ప్రజాదరణ పొందిన బిగ్‌బాస్ తెలుగు వెర్షన్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని ‘ స్టార్ మా’ టీవీ త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. హిందీలో ఈ బిగ్ బాస్ కు కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది, ఈ షోకు ఎన్టీఆర్ పారితోషికం ఎంత తీసుకుంటున్నాడు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. కాగా ఇప్పటికే అక్కినేని నాగార్జున మా టీవీలో ’మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రామ్ ద్వారా బుల్లితెరకు అడుగు పెట్టి తనదైన శైలిలో మెప్పించారు కూడా. ఇక ఇప్పటికే తమిళంలో అగ్రనటుడు కమల్ హాసన్ ...‘బిగ్ బాస్’ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా మారిన విషయం తెలిసిందే.