
సెంటిమెంట్, ఎమోషన్ లేకపోతే జీవితం చాలా చప్పగా ఉంటుంది. కష్టాలు, కన్నీళ్లు లేని జీవితం చాలా సాఫీగా ఉంటుంది. అవి ఉంటేనే మజా.. వాటిని తట్టుకుని నిలబడడంలోనే మనిషి వ్యక్తిత్వం దాగి ఉంటుంది. అలాగే కలలు లేని జీవితం కూడా పెద్ద ఆసక్తిగా అనిపించదు. జీవితంలో సాధించడానికి ఏదో ఒక లేకపోతే జీవితం ఒక చోట ఆగిపోతుంది. ఈ మూడు విషయాలు కలిసిన కథ "జానకి కలగనలేదు".
ఎవరు ఎవరిని కలుస్తారో, ఎవరితో ఎవరికీ ముడి పడుతుందో ఎవరి ఊహకూ అందదు. కలిసే వరకూ ఏమీ తెలియకపోవడమే దాని అందం. తండ్రి వ్యాపారం కోసం తన చదువుని ఆపేసిన కుర్రాడు, ఉన్నత స్థాయిని చేరుకోవాలని ప్రతి క్షణం పుస్తకాలు వదలిపెట్టని అమ్మాయి.. ఈ ఇద్దరూ నడిపించే కథ. బాధ్యతకు కలకి మధ్య లో ఇరుక్కున్న ఆ ఇద్దరు ఎవరి కోసం ఒకరు ఏం చేసారు అనేదే ధారావాహిక. ఈ నెల 22న (సోమవారం) ఈ సీరియల్ ప్రారంభం అవుతోంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9 గంటలకు స్టార్ మా ప్రేక్షకులను అలరించబోతోంది.
Comments
Please login to add a commentAdd a comment