సాక్షి, హైదరాబాద్: మానవీయ స్ఫూర్తి సాధించిన అపురూపమైన విజయాలకు ఒక వేదిక కల్పించే సాహసోపేతమైన, స్ఫూర్తిదాయకమైన, వినోదాత్మకమైన కథల కలయికే స్టార్ మా. ఎన్నో విధాల పాత్రలు పోషిస్తూ, రకరకాల సమస్యలతో పోరాటం చేస్తూ ప్రతిరోజూ గెలుస్తున్న మా ప్రేక్షకుల నుంచే మేం ప్రేరణ తీసుకుంటున్నాం. గత నాలుగు సంవత్సరాలుగా తన ప్రేక్షకుల అంగీకారంతో, వారు అప్రతిహతంగా అందిస్తున్న ప్రేమతో తన ప్రయాణం కొనసాగిస్తున్న స్టార్ మా ఇప్పుడు సరికొత్త ముస్తాబుతో తన గుర్తింపులో కొత్త మార్పులు చేస్తోంది. ఈ రోజు ఆవిష్కరిస్తోన్న దృశ్యమూలాంశంలో ఆ ఆలోచన ప్రతిబింబించబోతోంది. మూడు ప్రముఖమైన అంశాల సమ్మేళనమే స్టార్ మా అని మా ప్రగాఢ విశ్వాసం. మన సంస్కృతీ సంప్రదాయాలు సగర్వ నేపథ్యంతో పురోగతివైపు పరుగులు తీసే కథనాలను అల్లుతోంది స్టార్ మా. ఈ మూడు అంశాల సమ్మేళనాన్ని సంబరం చేసుకునే విధంగా ప్రతి కథ ఉండేలా స్టార్ మా ప్రయత్నం చేస్తోంది. సరికొత్త స్టార్ మా గుర్తింపునకు ఇదే ఆధారం. మనలోని ప్రతి ఒక్కరిలో కొంచెం స్టార్ మా ఉంటుందని మేము నమ్ముతున్నాం.
స్టార్ మాలోని ఛానళ్లు జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్, మూవీస్, మ్యూజిక్ అనే మూడు విభిన్నమైన రీతుల్లో నిర్వహిస్తోంది. స్టార్ మా నిర్వహిస్తున్న మూడు విభిన్ ఛానళ్లు స్పష్టమైన లీడర్స్‌గా స్థానం సంపాదించాయి. 25శాతం మార్కెట్ షేర్‌తో తెలుగు టెలివిజన్ వ్యూయర్ షిప్‌లో అత్యధిక షేర్‌ని సొంతం చేసుకున్నాయి జనరల్ ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీలో స్టార్ మా 30 శాతానికి పైగా షేర్ మార్కెట్ సంపాదించుకుంది. విస్తృతమైన విలక్షణతతో , విభిన్నమైన కార్యక్రమాలతో స్పష్టమైన ఆధిపత్యం పొందింది. స్టార్ మా మూవీస్ అతిపెద్ద మూవీస్ ఛానల్‌గా, స్టార్ మా మ్యూజిక్ శక్తివంతంగా, యువతరానికి స్పష్టమైన డెస్టినేషన్‌గా రూపొందాయి.
తెలుగు టెలివిజన్‌లో అతిపెద్ద షో 'బిగ్‌బాస్ 4' లాంచ్ ఎపిసోడ్‌లో స్టార్ మా బ్రాండ్ రిఫ్రెష్ జరగబోతోంది. బిగ్‌బాస్ 4 నిర్వహించబోతోన్న నాగార్జున లోగో లాంచ్ గురించి సంక్షిప్తంగా చెప్పారు. ఇప్పటికే ఎంతో శక్తివంతంగా ఉన్న బ్రాండ్ మరింత అద్భుతంగా చేసే ప్రయాణానికి ఇది కొత్త ఆరంభం అన్నారాయాన.
ఈ సందర్భంగా స్టార్ మా ప్రతినిధి ఇలా అన్నారు. 'గత కొన్నేళ్లుగా ప్రేక్షకులు మాపై కురిపిస్తున్న ప్రేమను ఎంతో సవినయంగా స్వీకరిస్తున్నాం. ఈ సరికొత్త గుర్తింపుతో మా ప్రేక్షకులకు ధన్యవాదాలు చెబుతున్నాం. ఎంతో గర్వంగా భావించే ఒక ఛానల్ వారి జీవితాల్లో భాగమయ్యేలా అందిస్తున్నాం. మా ప్రేక్షకులే మాకు స్ఫూర్తి. ఎంతటి ప్రగతి సాధిస్తున్నా సాంస్కృతికపరమైన మూలాలను ఏ మాత్రం వదలని మా ప్రేక్షకుల దక్షతే మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. తెలుగు నేల సాంస్కృతి వైభవాన్ని ప్రస్తుతించడమే ఈ మార్పు సంకల్పం. కేవలం వినోదాన్ని అందించే ఎంటర్‌టైన్‌మెంట్ బ్రాండ్‌గా మాత్రమే కాక, సమాజానికి ఓ కొత్త రూపునిచ్చే కథల్ని చెప్పే మాధ్యమంగా కూడా ఎదగాలన్నది మా ఉద్దేశ్యం'.
Comments
Please login to add a commentAdd a comment