తెలుగు రియాలిటీ షోల్లో బిగ్‌బాస్ షో క్రేజ్ డిఫరెంట్. ఎందుకంటే పాజిటివో నెగిటివో గానీ ఈ షో ద్వారా చాలామంది ఫేమ్ తెచ్చుకున్నారు. అలా నాలుగో సీజన్‌లో పాల్గొని మంచి క్రేజ్ తెచ్చుకున్న తెలుగమ్మాయి దివి. ఈ షోలో పాల్గొని బయటకొచ్చిన తర్వాత పలు సినిమాలు, సిరీసుల్లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. ఎందుకంటే ఈ ప్రేమకథలో అంత ట్రాజెడీ ఉంది మరి!
(ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఆ యాక్షన్ సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?)
'బీటెక్ చదివే రోజుల్లోనే మేం ప్రేమించుకున్నాం. ఎంటెక్ వరకు ఇద్దరం రిలేషన్‌లో ఉన్నాం. పెద్దలతో మాట్లాడిన తర్వాత పెళ్లికి కూడా అంగీకరించారు. ముహూర్తం కూడా పెట్టుకున్నాం. కానీ ఇంతలోనే అతడి తమ్ముడి.. అనారోగ్య సమస్యలతో చనిపోయాడు. అయితే నా బాయ్ ఫ్రెండ్ వాళ్ల తమ్ముడు నా కళ్ల ముందే చనిపోయాడు. ఎందుకంటే అతడి చివరి రోజుల్లో నేను దగ్గరే ఉన్నా. అలానే చనిపోయిన తర్వాత వాళ్ల ఇంటి దగ్గర చివరి కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యే వరకు నా బాయ్ ఫ్రెండ్‌కి తోడుగా ఉన్నాను'
'ఈ సంఘటన జరిగిన తర్వాత అతడు సొంతూరిలోనే తల్లదండ్రులకు తోడుగా ఉండిపోయాడు. నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉండాల్సి రావడంతో తప్పని పరిస్థితుల్లో ఇద్దరం విడిపోవాల్సి వచ్చింది. అయితే తనతో పాటు నన్ను కూడా ఊరికి తీసుకెళ్లపోతే నా కెరీర్ నాశనమవుతుందని అనుకున్నాడు. ఈ విషయం నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది. ఒకవేళ ఇది ముందే తెలుసుంటే అతడితో పాటు నేను వాళ్ల ఊరికి వెళ్లిపోయేదాన్నేమో' అని దివి తన ట్రాజెడీ ప్రేమకథ గురించి బయటపెట్టింది.
(ఇదీ చదవండి: బాత్రూమ్‌లో కాలుజారి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మృతి)
Comments
Please login to add a commentAdd a comment