
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌బాస్ సీజన్ 4 కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌కు సంబంధించిన కంటెస్ట్ంట్ల జాబితా గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్‌కు సంబంధించిన ప్రోమోలు కూడా విడుదల చేస్తూ బిగ్‌బాస్ 4 సందడి చేస్తోంది. ఈ సీజన్‌లో సినీనటి ప్రముఖ నటి సురేఖవాణి కూడా పాల్గొంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వార్తలపై సురేఖ వాణి కూతురు సుప్రీత స్పందించారు. సుప్రీత బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో మాట్లాడారు.
ఈ వీడియోలో పలు ఆసక్తికర విషయాలను సుప్రీత వెల్లడించారు. తన తల్లి బిగ్‌బాస్‌లో పాల్గొనడం గురించి తనకు ఏమీ తెలియదని చెప్పింది. ఆ విషయం గురించి తన తల్లి తనకు ఏమీ చెప్పలేదని వెల్లడించింది. ఇక తన పెళ్లి గురించి అడగగా ప్రస్తుతం తన వయసు 20 ఏళ్లు మాత్రమేనని పెళ్లి చేసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉందని సమాధానం చెప్పింది. తనకు కాబోయే భర్త తనను అర్థం చేసుకునేవాడై ఉండాలని తెలిపింది.
చదవండి: బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్‌కి కరోనా పాజిటివ్!
Comments
Please login to add a commentAdd a comment