Surekhavani
-
డ్రీమ్ సిటీ..
హైదరాబాద్: ఓ వైపు టెక్ హబ్‌గా పేరు సాధించే దిశగా దూసుకుపోతున్నా ఇతర నేరాలతో పాటుగా సిటీలో సైబర్ క్రైమ్ గురించి వింటుంటే ఎంతో గగుర్పాటు, ఆందోళన కలుగుతోంది. దీన్ని అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టి సైబర్ సిటీ మంచి రిజల్ట్స్ సాధిస్తే అది దేశంలోనే నగరానికి ప్రత్యేకతను తీసుకొస్తుంది. అలాగే సోషల్ మీడియా వేధింపులు కూడా పెచ్చుమీరాయి. వ్యక్తుల పేరు ప్రతిష్టల్ని దిగజార్చేందుకు, వ్యక్తిత్వ హననం చేసేందుకు ఇదొక సులభమైన మార్గంగా మారింది. తరచుగా సెలబ్రిటీలు, యువత, మహిళలు బాధితులవుతున్నారు. దీనికి తోడు ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తదితర సాంకేతిక సాధనాలు కూడా ఎలా దుర్వినియోగం అవుతున్నాయో, సెలబ్రిటీలను ఎలా వేధిస్తున్నాయో చూస్తున్నాం. హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో నివసించేటప్పుడు అన్ని రకాలుగా భధ్రత లభిస్తుందని విశ్వసిస్తాం. ఆ విశ్వాసం నిలబడితేనే సిటీ పేరు ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. కలల నగరం అంటే కలల సాకారానికి అడ్డంకుల్లేని నగరం అని కూడా కదా... –సురేఖావాణి, సినీనటి -
Drugs Case: వీడియో రిలీజ్ చేసిన నటి సురేఖావాణి
-
కేపీ చౌదరితో సురేఖా వాణి కూతురి ఫోటో వైరల్
టాలీవుడ్లో డ్రగ్స్ కేసు పెను దుమారం రేపుతుంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితుడు సినీ నిర్మాత కేపీ చౌదరి విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి. కోర్టు అనుమతితో పోలీసులు నిందితుడిని రెండు రోజులు కస్టడీకి తీసుకుని లోతుగా ప్రశ్నించారు. దీంతో అతని ఫోన్లోని కాల్స్ లిస్ట్ చూస్తే పోలీసులకే దిమ్మతిరిగే విషయాలు బటయకొస్తున్నాయి. అతని ఫోన్లో పలువురి సెలబ్రిటీల ఫోటోలు కూడా ఉన్నాయి. కానీ వారందరికి అతను డ్రగ్స్ విక్రయించాడా..? అనే కోణంలో విచారణ జరుగుతుంది. (ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు విషయంలో వాస్తవం ఇదే.. స్పందించిన అషూరెడ్డి) తాజాగా ఇలాంటి సమయంలో సినీ నటి సురేఖావాణితో పాటు తన కూతురు సుప్రీత కూడా కేపీ చౌదరితో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక పార్టీలో సురేఖా.. అతనికి ముద్దు పెడుతూ ఉన్న ఫోటో వైరల్ కాగా.. మరో ఫోటోలో సుప్రీత కూడా కేపీ చౌదరికి దగ్గరగా ఉంది. దీంతో తల్లీకూతుళ్లు ఇద్దరికీ ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఉన్నారని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే అతనితో వీరికున్న రిలేషన్ ఏంటి అనేది మిస్టరీగా ఉంది. కేపీ చౌదరి తప్పు చేసినంత మాత్రాన అతనితో ఫోటోలు దిగినవారు కూడా తప్పు చేసి ఉంటారని ఎలా చెబుతారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా సురేఖావాణి రెస్పాండ్ అయితే కానీ అసలు విషయం తెలియదు. (ఇదీ చదవండి: డ్రగ్స్ లిస్ట్‌లో అషూరెడ్డితో పాటు మరో సీనియర్ నటి కూడా..) -
మూవీ ఆఫర్స్ రావట్లేదు.. ఎందుకో కారణం తెలీదు: సురేఖవాణి
ప్రముఖ నటి, క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాలతో కంటే సోషల్ మీడియాతో మరింత పాపులర్ అయిన సురేఖవాణి కూతురు సుప్రీతతో కలిసి నెట్టింట తెగ రచ్చ చేస్తుంటుంది. మోడ్రన్ డ్రస్సుల్లో కూతురితో పోటీపడుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారామె. ఈ క్రమంలో సురేఖ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఈమధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉన్న సురేఖవాణి ఇటీవలె స్వాతిముత్యం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సందర్భంగా మూవీ టీం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో పాల్గొన్న ఆమె సినిమాలు ఎందుకు చేయట్లేదనే విషయంపై క్లారిటీ ఇచ్చింది. 'చాలామంది సినిమాల్లో ఎందుకు కనిపించట్లేదు అని అడుగుతున్నారు. అసలు మాదాకా వస్తే కదా చేయడానికి? మా వరకు అసలు అవకాశాలు రావట్లేదు. అలా ఎందుకు అవుతుందో నాకు కూడా తెలియదు. నేను సినిమాలు మానేశాను అని అనుకుంటున్నారు. అస్సలు కాదు. మంచి ఛాన్సులు వస్తే తప్పకుండా నటిస్తా. స్వాతిముత్యం సినిమాలో నాకు మంచి రోల్ ఇచ్చినందుకు సినిమా టీమ్‌కు ధన్యవాదాలు' అంటూ సురేఖవాణి ఎమోషనల్ అయ్యింది. -
ఘాటు వ్యాఖ్యలు చేసిన సురేఖా వాణి కూతురు
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి సురేఖా వాణి. గత కొంతకాలంగా ఆమె సినిమాల్లో కనిపించడం లేదు గానీ, సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎల్లప్పుడూ చేరువగానే ఉంటున్నారు. తన ముద్దుల కూతురు సుప్రీతతో కలిసి వెకేషన్స్‌కు వెళ్తూ, ఆ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లను అలరిస్తున్నారు. గ్లామర్‌లో హీరోయిన్ల కంటే కూడా తక్కువేమీ కాదంటూ కితాబులు అందుకుంటున్నారు. ఇలా పైకి సంతోషంగానే ఉన్నట్లు కనిపిస్తున్నా భర్త అకాల మరణం తాలూకు విషాధ ఛాయలు సురేఖా వాణిని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయట. 2019లో ఆమె జీవిత భాగస్వామి మరణించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి కూతురే లోకంగా బతుకుతున్నారు సురేఖా వాణి. ఈ క్రమంలో కూతురి సలహాతో ఆమె రెండో పెళ్లికి సిద్ధమయ్యారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. సింగర్ సునీత- రామ్ వీరపనేని రెండో వివాహం నేపథ్యంలో సుప్రీత కూడా తల్లిని అదే బాటలో నడవాల్సిందిగా సూచించారంటూ గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లేశారు. వీటిని సురేఖా వాణి ఖండించారు కూడా. వదంతులు వ్యాప్తి చేయవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా సురేఖా వాణి కూతురు సుప్రీత ఇన్‌స్టా స్టోరీ చర్చకు దారితీసింది. ‘‘ఉన్న న్యూస్ చెప్పండి. కొత్తగా క్రియేట్ చేయకండి. కనీసం మిమ్మల్ని మీరు జర్నలిస్టులు అని చెప్పుకోకండి. ఆదాయం కోసం ఒక వ్యక్తి పరువు, ప్రతిష్టను ఎలా నాశనం చేస్తారు’’ అంటూ ఇన్‌స్టా వేదికగా ఫైర్ అయ్యారు సుప్రీత. దీంతో తల్లి గురించి వస్తున్న వార్తలపైనే ఆమె ఈ మేరకు ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది. చదవండి: ఫ్రెండ్లీమామ్.. సోషల్ మీడియాలో సెన్సేషన్ -
రెండో పెళ్లిపై స్పందించిన సురేఖ వాణి
సింగర్ సునీత రెండో పెళ్లి అనంతరం నటి సురేఖ వాణి పెళ్లిపై గాలి మళ్లింది. సునీత బాటలోనే సురేఖ కూడా త్వరలోనే కొత్త జీవితంలోకి అడుగుపెట్టనున్నట్లు ఇటీవల కొన్ని వార్తలు ప్రచురితమయ్యాయి. సురేఖ రెండో వివాహానికి సిద్ధమైందని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందనే విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే సునీత పెళ్లికి తన పిల్లలిద్దరూ ఎంకరేజ్ చేయడంతో ప్రస్తుతం సురేఖ కూతురు సుప్రీత కూడా తల్లిని మళ్లీ పెళ్లి చేసుకోవాలని సూచించినట్లు టాక్. దీంతో సురేఖ పెళ్లి విషయం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ విషయంపై సురేఖ వాణి స్పందించారు. తను రెండో పెళ్లి చేసుకోబోతుందన్న వార్తలను ఖండించారు. అవి కేవలం పుకార్లేనని, వాటిలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తన కూతురితో సంతోషంగా ఉన్నానని, సుప్రీత నుంచి పెళ్లి చేసుకోవాలన్న ఒత్తిడి ఏం లేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సురేఖ భర్త చనిపోయి కేవలం ఏడాది పూర్తయ్యింది. ఆమె భర్త సురేష్ తేజ 2019 మేలో అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. సురేష్ తేజ హాస్పిటల్ లో ఉన్న చివరి దశలో సురేఖ భర్త దగ్గరే ఉన్నారు. ఇక ప్రస్తుతం సురేఖ తన కూతురిని సినీ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ఆలోచనలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుప్రీత సోషల్ మీడియాలో రోజుకో ఫోటో పోస్ట్ పెడుతూ అదరగొడుతూ తన ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. అంతేగాక సుప్రీత నటన, డ్యాన్సు, డైలాగుల కోసం శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక కూతురు భవిష్యత్తులో సినిమాల్లోకి రావాలని అనుకుంటే.. తాను మాత్రం అడ్డు చెప్పానని.. అది తన కూతురి ఇష్టమని సురేఖ వాణి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
సునీత బాటలో సురేఖ.. రెండో పెళ్లికి సిద్ధం!
రియల్ లైఫ్‌లో ఎన్ని కష్టాలు ఉన్న తెరపై మాత్రం చాలా ఉత్సాహంగా కనిపిస్తారు సినీ కళాకారులు. ఎన్ని బాధలు ఉన్న దిగమింగుకొని తమ పాత్రలకు న్యాయం చేస్తుంటారు. ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా షూటింగ్ స్పాట్‌కు వస్తే మాత్రం అవన్ని మర్చిపోయి తమకు ఇచ్చిన క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతారు. అలాంటి కొద్ది మంది నటుల్లో ఒకరు సురేఖ వాణి. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆమె తెలుగు ప్రేక్షకులను బాగా సుపరిచితురాలు. చాలా సినిమాల్లో బ్రహ్మానందం భార్యగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో పాటు అందంలో కూడా నేటి హీరోయిన్లకు పోటీగా ఉంటుంది సురేఖ. చేతిలో పెద్దగా సినిమాలు లేకపోయినా సరే ఆమె మాత్రం పాపులరే. సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ఎప్పుడూ దగ్గరగా ఉంటోంది. ఇంత సంతోషంగా ఉన్న సురేఖను ఓ బాధ మాత్రం వేధిస్తునే ఉందట. ఆ బాధే భర్త అకాల మరణం. 2019లో అనారోగ్యం కారణంగా సురేఖ వాణి భర్త సురేష్ తేజ మరణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కూతురు సుప్రీతతో కలిసి ఉంటుంది. భర్త చనిపోయాక ఒకటి రెండు సినిమాల్లో నటించిన సురేఖకి ప్రస్తుతం పెద్ద అవకాశాలేమి రావడం లేదు. దీంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటుందట. భర్త మరణం,అవకాశాలు తగ్గడంతో సురేఖ బాధలో ఉన్నట్లు తెలుస్తుంది. తల్లి బాధను చూసిన ఆమె కూతురు మళ్ళీ పెళ్ళి చేసుకోమనే ప్రపోజల్ పెట్టిందంట. ఇటీవల సింగర్ సునీత రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అదే బాటలో నడవాలని తల్లికి సూచించిందట సుప్రీత. తానే దగ్గరుండి పెళ్లి చేస్తానని తల్లితో చెప్పిందట. కూతురు చెప్పడంతో సురేఖ కూడా రెండో పెళ్లి ఆలోచనలో పడిపోయినట్లు సమాచారం. అన్ని కుదిరితే త్వరలోనే సురేఖ వాణి కూడా రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే సురేఖ లేదా ఆమె కూతురు ప్రకటించేవరకు వేచి చూడాల్సిందే. చదవండి: షారూక్ ఖాన్ని కొనేసిన ప్రీతి జింటా.. శంకర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ -
మరీ అంత డర్టీ కాదు!
చిత్రం: ‘డర్టీ హరి’; తారాగణం: శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానీ శర్మ, సురేఖావాణి; సంగీతం: మార్క్ కె. రాబిన్; కెమెరా: బాలరెడ్డి; నిర్మాతలు: గూడూరు సతీశ్ బాబు, గూడూరు సాయిపునీత్; రచన, దర్శకత్వం: ఎం.ఎస్. రాజు; ఏ.టి.టి: ఫ్రైడే మూవీస్. ఒకటే పాట. అంతకు మించి పాటలు లేవు. కామెడీ లేదు. అడల్ట్ సీన్లు మినహాయిస్తే... రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో కనపడేవేవీ లేవు. ఒకరకంగా మొదలైన సినిమా మరో రకంగా ముగుస్తుంది. అయినా సరే, ఓ సినిమా మరీ అసంతృప్తికి గురి కానివ్వకపోవడం, జనాన్ని ఆద్యంతం కూర్చోబెట్టగలగడం విశేషమే. దర్శకుడిగా ఎం.ఎస్. రాజు చేసిన మ్యాజిక్... అదే ‘డర్టీ హరి’. బహుశా, అందుకే వివాదాస్పద వాల్ పోస్టర్లు, ట్రైలర్లతో వార్తల్లోకి వచ్చిన ‘డర్టీ హరి’ చూస్తున్నప్పుడు ఉన్నట్టుండి సర్ప్రైజ్ చేస్తుంది. అంతదాకా పెట్టుకున్న అంచనాలను మార్చేస్తుంది. అదే ఈ సినిమాకు ఉన్న బలం. కథేమిటంటే..: చేయి తిరిగిన చెస్ ప్లేయర్ హరి (శ్రవణ్ రెడ్డి). ఎలాగైనా జీవితంలో పైకి రావాలనే యాంబిషన్ ఉన్న ఆ కుర్రాడు అవకాశాల వేటలో హైదరాబాద్‌కు వస్తాడు. అక్కడ ఓ బడా కంపెనీ దంపతుల (అంబరీష అప్పాజీ, సురేఖావాణి) కుమార్తె – పెయింటరైన వసుధ (రుహానీ శర్మ)తో ప్రేమలో పడతాడు. మరోపక్క వసుధ కజిన్, హరికి స్నేహితుడూ అయిన ఆకాశ్ ఏమో సినిమాల్లోకి పైకి రావాలని ప్రయత్నిస్తున్న మోడల్ గర్ల్ జాస్మిన్ (సిమ్రత్ కౌర్)తో ప్రేమలో ఉంటాడు. వసుధతో ప్రేమ పెళ్ళి పీటలకెక్కే దశలో ఉన్నప్పటికీ, హరి మాత్రం తన స్నేహితుడి లవర్ మీద కన్నేస్తాడు. జాస్మిన్ కూడా హరికి లొంగిపోతుంది. తీరా ఆకాశ్‌తో ఆమె ప్రేమ బ్రేకప్ అవుతుంది. వసుధతో పెళ్ళయిపోయినా సరే జాస్మిన్‌తో ఎఫైర్‌ను మన యాంబిషియస్ హరి కొనసాగిస్తాడు. ఆ క్రమంలో జాస్మిన్ గర్భవతి అవుతుంది. ఆ వ్యవహారం చివరకు ఎక్కడ దాకా వెళ్ళింది, హరి వైవాహిక జీవితం ఏ మలుపు తిరిగింది, ఏమైంది అన్నది ఆసక్తికరంగా సాగే చివరి ముప్పావుగంట మిగతా కథ. ఎలా చేశారంటే..: దాదాపు రెండు గంటల సినిమాకు ప్రధాన బలం ప్రధాన పాత్రల్లో హరిగా నటించిన శ్రవణ్ రెడ్డి, జాస్మిన్‌గా కనిపించిన పంజాబీ పిల్ల సిమ్రత్ కౌర్. ఈ హీరోయిన్ గతంలో ‘పరిచయం’ లాంటి ఒకటీ అరా సినిమాల్లో చేసింది. కొంతకాలంగా ముంబయ్‌లో హిందీ సినిమాలు, సిరీస్‌లలో స్థిరపడ్డ తెలంగాణలోని కరీంనగర్ కుర్రాడైన శ్రవణ్ రెడ్డికి తెలుగులో ఇదే తొలి పెద్ద ఛాన్స్. అలా ఈ ప్రధాన పాత్రధారులిద్దరూ మన ప్రేక్షకులకు కొత్త ముఖాల కిందే లెక్క. అయినప్పటికీ, క్యారెక్టరైజేషన్లో కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ ఇద్దరూ తెరపై ఆకట్టుకుంటారు. ఫస్టాఫ్‌లో కథానుగుణంగా హీరో స్వభావాన్ని ఎస్టాబ్లిష్ చేసే క్లిష్టమైన అడల్ట్ సీన్లలో అచ్చంగా పాత్రలలానే ప్రవర్తించారు. ఇక, జీవితంలో పైకి ఎదగడానికి ఎత్తులు పైయెత్తుల ఆట, కళ్ళలోనే కనిపించేసే కామం, మనసులోని చెడును కనపడనివ్వకుండా పైకి మంచిగా ప్రవర్తించే తీరు, కోపం – ఇలా బోలెడన్ని వేరియేషన్లను హరి పాత్రలో శ్రవణ్ రెడ్డి బాగా చూపించారు. కడుపు పండాలని ఆరాటపడే అమ్మాయిగా రుహానీ శర్మ ఉన్నంతలో బాగానే చేశారు. మిగిలిన పాత్రలన్నీ కథానుగుణంగా వచ్చిపోతుంటాయి. చివరలో వచ్చే పోలీసు ఇంటరాగేషన్ సీన్ల లాంటివి మరికొంత బలంగా రాసుకొని ఉంటే ఇంకా బాగుండేది. ఎలా తీశారంటే..: ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి అభిరుచి గల చిత్రాలు నిర్మించి, భారీ విజయాలు అందుకున్న ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజుకు దర్శకుడయ్యాక లభించిన సక్సెస్ శూన్యం. ఈ నేపథ్యంలో ఆయన తన ట్రెండ్ మార్చి, ‘డర్టీ హరి’ లాంటి పేరుతో, పెద్దలకు మాత్రమే కంటెంట్‌తో న్యూ ఏజ్ సినిమా తీస్తుంటే సహజంగానే ఆశ్చర్యమేస్తుంది. తీరా సినిమా చూశాక కథాగమనం, కథలోని ట్విస్టులతో ఆశ్చర్యం పెరుగుతుంది. అందుకే, ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ – దర్శకుడు ఎం.ఎస్. రాజే! దర్శక – రచయిత, నిర్మాతలు ఎవరూ పైకి చెప్పకపోయినా, సినీ ప్రియులు ఈ కథకు మూలం ఇట్టే చెప్పేస్తారు. ఉడీ అలెన్ రచన, దర్శకత్వంలో పదిహేనేళ్ళ క్రితం వచ్చిన హాలీవుడ్ సినిమా ‘మ్యాచ్ పాయింట్’ (2005) కథను మనవాళ్ళు యథాతథంగా తీసుకొని, చివరి ఘట్టాలను మనదైన పద్ధతిలో మార్చేసుకున్నారు. ఆకట్టుకొనేలా, తెలివిగా ఆ కాపీ కొట్టడమే అసలైన సినీ ట్రేడ్ సీక్రెట్. హైక్లాస్ జీవితాన్ని చూపించే నేపథ్య నిర్మాణ విలువలు మొదలు కీలకమైన ఘట్టాల్లో రీరికార్డింగ్, కెమెరా వర్క్ దాకా అనేకం బాగా తీర్చిదిద్దారు. పనిలో పనిగా నవతరంలోని హైక్లాసు వర్గం వాడే అశ్లీల పదాలు ఈ సినిమాలో యథేచ్ఛగా వినిపిస్తాయి. ఫస్టాఫ్‌లో, అలాగే సెకండాఫ్ మొదట్లో కాసేపు శృంగారం మోతాదు మించి చూపించినా, చివరి ముప్పావుగంట థ్రిల్లింగ్ అంశాలు వాటిని మర్చిపోయేలా చేస్తాయి. ఒక్కమాటలో... ఫస్టాఫ్ డర్టీనెస్, క్లైమాక్స్ హెవీ హార్టెడ్నెస్ ఫీలింగ్! చూడడం పూర్తయ్యాక, సినిమా సంతృప్తిగా ఉందనే భావన కలిగిస్తాయి. చాలా గ్యాప్ వచ్చిన ఎం.ఎస్. రాజు మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చారనిపించేలా చేస్తాయి. అయితే, వచ్చిన చిక్కల్లా... థియేటర్లు పూర్తిగా ఓపెన్ కాని పరిస్థితుల్లో... ఎన్నిసార్లు చూస్తే, అన్నిసార్లు డబ్బులు కట్టి చూసే ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో, టెక్నికల్ ఇబ్బందులుండే కొత్త ‘ఎనీ టైమ్ థియేటర్’ (ఏ.టి.టి.) యాప్‌లో సినిమా రిలీజు చేయడం! అది ఈ సినిమాకు ఎంత వరకు కలిసొస్తుందో వేచి చూడాలి. కొసమెరుపు: ఎంగేజింగ్ ఎరోటిక్ క్రైమ్ థ్రిల్లర్! బలాలు: ఊహించని ట్విస్టున్న కథ ఆలోచింపనివ్వని కథనం ప్రధాన పాత్రధారుల నటన, రీరికార్డింగ్ ప్రొడక్షన్ విలువలు, చివరి ముప్పావుగంట సినిమా బలహీనతలు: పిల్లాపాపలతో చూడలేని అడల్ట్ సీన్లు క్యారెక్టరైజేషన్లో ఎగుడుదిగుళ్ళు పెద్దగా పరిచయం లేని నటీనటులు. – రెంటాల జయదేవ -
సురేఖావాణి కూతురు.. సుప్రీత బ్యూటీఫుల్ పిక్స్
-
సురేఖా వాణి కూతురు సుప్రీత గ్లామర్ ఫోటోలు
-
బిగ్‌బాస్: సురేఖవాణి ఎంట్రీ పై క్లారిటీ!
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌బాస్ సీజన్ 4 కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌కు సంబంధించిన కంటెస్ట్ంట్ల జాబితా గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్‌కు సంబంధించిన ప్రోమోలు కూడా విడుదల చేస్తూ బిగ్‌బాస్ 4 సందడి చేస్తోంది. ఈ సీజన్లో సినీనటి ప్రముఖ నటి సురేఖవాణి కూడా పాల్గొంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వార్తలపై సురేఖ వాణి కూతురు సుప్రీత స్పందించారు. సుప్రీత బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో మాట్లాడారు. ఈ వీడియోలో పలు ఆసక్తికర విషయాలను సుప్రీత వెల్లడించారు. తన తల్లి బిగ్‌బాస్‌లో పాల్గొనడం గురించి తనకు ఏమీ తెలియదని చెప్పింది. ఆ విషయం గురించి తన తల్లి తనకు ఏమీ చెప్పలేదని వెల్లడించింది. ఇక తన పెళ్లి గురించి అడగగా ప్రస్తుతం తన వయసు 20 ఏళ్లు మాత్రమేనని పెళ్లి చేసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉందని సమాధానం చెప్పింది. తనకు కాబోయే భర్త తనను అర్థం చేసుకునేవాడై ఉండాలని తెలిపింది. చదవండి: బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్‌కి కరోనా పాజిటివ్! -
ఫ్రెండ్లీ మామ్..
ఆధునిక కాలపు అమ్మ అదిరించేది.. బెదిరించేది కాదు.. ఆడించేది పాడించేది.. ఆట పట్టించేంది.. పాట కట్టించేది. అన్నింటా కూతురితో సరితూగేది. దీనికి నిదర్శనంగా నిలుస్తారు సినీనటి సురేఖా వాణి. ఎంతో కాలంగా తన కుమార్తెతో కలిసి డ్యాన్సులు, పాటలతో సోషల్ వేదికలపై హల్చల్ చేస్తూ మోడ్రన్ మదర్‌కు స్ఫూర్తిగా నిలుస్తున్న సురేఖ.. లాక్‌డౌన్‌తో మరింతగా తన కూతురితో గడిపే సమయం దక్కిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మదర్స్ డే సందర్భంగా ‘సాక్షి’తో సురేఖ, ఆమె కూతురు సుప్రీతలు పంచుకున్న ముచ్చట్లు.. మర్యాద ఇచ్చి పుచ్చుకుంటాం.. నన్ను మా పేరెంట్స్ చాలా స్వేచ్ఛగా పెంచారు. మా అమ్మ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేది. ఏదైనా సరే.. పంచుకునే చనువు తనతో నాకు ఉండేది. నా కూతురుతో కూడా నేను అలాగే ఉంటున్నాను. తల్లిదండ్రులు అంటే బెదిరింపులు హెచ్చరికల ద్వారా వచ్చే భయం కన్నా గౌరవం ద్వారా పొందే భయం ఉండాలనేది నా అభిప్రాయం. తనను చిన్నప్పటి నుంచీ నాతో అరమరికలు లేకుండా ఉండేలా అలవాటు చేశాను. ఇద్దరం కలిసే షాపింగ్స్‌కి, టూర్స్‌కి, మూవీస్‌కి, పార్టీస్‌కి, పబ్స్‌కి వెళతాం. నాకు డ్యాన్స్ బాగా ఇష్టం. అందుకని అప్పుడప్పుడు తనతో కలిసి చేసేదాన్ని. ఒకసారి అలా చేసిన డ్యాన్స్ సరదాగా యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తే బాగా వైరల్ అయింది అప్పటి నుంచి ఖాళీ దొరికనప్పుడల్లా డ్యాన్సుల వీడియోలు, టిక్‌టాక్ కలిసి చేస్తున్నాం. అయితే అవేవీ ప్లాన్ వేసుకుని చేస్తున్నవి కాదు. స్పాంటేనియస్‌గా చేస్తున్నవి మాత్రమే. తను తన ఫ్రెండ్స్‌తో ఎలా ఉంటుందో అలానే నాతో కూడా ఉంటుంది. ఇద్దరం ప్రేమాభిమానాలతో పాటు మర్యాద కూడా ఇచ్చి పుచ్చుకుంటాం. నాకైతే తనను సినిమాలకు పరిచయం చేయాలనే ఆసక్తి లేదు. ఒకవేళ తనకు ఇష్టం ఉంటే కాదనను. నాకు ఖాళీ దొరికితే తనతో స్పెండ్ చేయడం ఇష్టం. ఇప్పుడు లాక్‌డౌన్‌తో ఇంకా ఎక్కువ టైమ్ గడపగలుగుతున్నా. – సురేఖా వాణి ఇప్పుడు ఫుల్ టైమ్‌పాస్.. మామ్‌ను మించిన ఫ్రెండ్ నాకు ఇంకెవరూ లేరు. ఫ్రెండ్స్‌తో ఎంత బాగుంటానో అమ్మతో అంతకన్నా బాగుంటాను. మామ్ నాకన్నా బాగా డ్యాన్స్ చేస్తుంది. తనతో డ్యాన్స్ చేస్తుంటే చాలా హాయిగా స్వేచ్ఛగా అనిపిస్తుంది. నేను నేనుగా ఉన్నట్టు అనిపిస్తుంది. మామూలుగా తను చాలా బిజీగా ఉంటుంది. ఒకవేళ తనకు ఖాళీ దొరికినా నాకు దొరక్క పోవడం వంటివి ఉండేవి. ఇప్పుడు ఇద్దరం ఖాళీయే కాబట్టి ఫుల్‌గా టైమ్ పాస్ చేస్తున్నాం. ఓ 20 దాకా టిక్ టాక్‌లు చేసుంటాం. అయితే ఒకటే అప్లోడ్ చేశాం అనుకోండి. మామ్ వంట బాగా చేస్తుంది. తనకి స్నాక్స్‌గా సమోసాలు, గ్రిల్డ్ చికెన్ వంటి స్నాక్స్ కుక్ చేసి ఇవ్వడం నాకు చాలా ఇష్టం. తనెప్పుడూ నాకు అది చేయ్.. ఇది చేయెద్దు.. అని చెప్పలేదు. షార్ట్ ఫిలిమ్స్, వెబ్‌సిరీస్, మ్యూజిక్ వీడియోలు చేస్తున్నా. సినిమాల్లో కొందరు అడిగారు. అయితే మంచి పాత్రలైతే చేద్దామని ఉంది. – సుప్రీత -
క్యాంటీన్ సాంగ్‌కి సురేఖా వాణి కుమార్తె వీడియో
సెలబ్రిటీలకు ఫ్యాన్స్ ప్రాచుర్యం కలిగించడం తెలిసిందే. కానీ స్వయంగా సెలబ్రిటీలే తమ ఫ్యాన్స్‌కి ప్రచారం ఇవ్వడమే వింత. వండర్స్‌కి కేరాఫ్ అయిన సోషల్ మీడియా పుణ్యమాని అభిమానులకు ఈ అదృష్టం దక్కుతోంది. తమ ప్రతిభకు సెలబ్రిటీలు గులామ్ అయి సలామ్ చేయడం వారిని ఆనందంలో ముంచెత్తుతోంది. సినిమాల్లో హీరో హీరోయిన్లు చెప్పే డైలాగ్స్ నుంచి చేసే డ్యాన్స్‌ల దాకా మక్కీకి మక్కీ అనుకరించడం వాటి ద్వారా చుట్టుపక్కల వారి క్లాప్స్, కాంప్లిమెంట్స్ కొట్టేయడం ఫ్యాన్స్‌లో చాలా మంది చేసేదే. అయితే ఇప్పుడు సెలబ్రిటీలే తమ ఫ్యాన్స్ టాలెంట్‌ను స్వయంగా చూసి, క్లాప్స్, కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అంతేకాదు తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఫ్యాన్స్ ప్రతిభను పోస్ట్ చేస్తున్నారు. తద్వారా వారి ప్రతిభకు ప్రపంచవ్యాప్త ప్రచారం కలిగిస్తున్నారు. డియర్ కామ్రేడ్‌లోని క్యాంటీన్ సాంగ్‌కి సిటీ కాలేజీలో వీడియో రూపొందించిన సుప్రీతి (నటి సురేఖా వాణి కుమార్తె) ‘ఓ బేబీ’ని అనుసరించిన‘కామ్రేడ్’ అదే విధంగా ‘ఓ బేబీ’ మూవీ విడుదల సమయంలో సమంత ఫ్యాన్స్‌కి మరో ఆఫర్ ఇచ్చింది. తను సినిమాలో ధరించిన పాత్ర తరహాలో అభిమానులు కూడా తనను రెట్రో లుక్‌తో ఆకట్టుకోవాలని కోరింది. అలా రెట్రోలుక్తో అదరగొట్టిన అభిమానుల ఫొటోలు, వీడియోలను తన ఇన్‌స్ట్రాగామ్‌లో సమంత పోస్ట్ చేసింది. మరోవైపు ఈ ట్రెండ్‌ను అందిపుచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ తన ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో హిట్టయిన క్యాంటీన్ సాంగ్‌కి తమదైన శైలిలో డ్యాన్స్ చేయమంటూ ఫ్యాన్స్‌కి పిలుపిచ్చాడు. దీంతో సిటీలోని కాలేజీ క్యాంటీన్లు ఆట–ఆ పాటలతో ప్రతిధ్వనించాయి. దీనికి వచ్చిన క్రేజ్‌కి నిదర్శనం ప్రముఖ సినీ నటి సురేఖావాణి కుమార్తె, కాలేజీ విద్యార్ధిని సుప్రీతి తానూ డ్యాన్స్ చేసి విజయ్ దేవరకొండకు షేర్ చేయడం... చాలెంజ్ నుంచియూ టర్న్.. ఇది ఓ రకంగా సెలబ్రిటీలు చేసే చాలెంజ్‌కి స్వల్ప మార్పులతో కొనసాగింపు అని చెప్పొచ్చు. చాలా రకాలుగా యూత్ ట్రెండ్స్‌ని సృష్టించే స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని ఈ ట్రెండ్‌కు కూడా ఇక్కడ తానే శ్రీకారం చుట్టింది. తన సినిమా ‘యూటర్న్’ కోసం సమంత ది కర్మ థీమ్ సాంగ్‌కి డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. అది బాగా పాపులరైంది కూడా. దీంతో ‘ఆ థీమ్ సాంగ్‌కి మీరు కూడా డ్యాన్స్ చేసి...వాటిని నాకు పంపితే బాగున్న వీడియోస్‌కి నన్ను ట్యాగ్ చేయండి. నాకు నచ్చితే నా ప్రొఫైల్‌లో రీపోస్ట్ చేస్తా’ అని సమంత ఇచ్చిన ఆఫర్‌కి సిటిజనుల్లో బాగా క్రేజ్ వచ్చింది. దీనికి స్పందనగా వీడియోలు పంపిన సమంత అభిమానులతో పాటు సహ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, ప్రియమణి, హీరోలు అఖిల్, నవీన్ చంద్ర వంటి వారు సైతం ఉండడం విశేషం. ఓ సాకి సాకి హిందీ పాటకి వీడియో రూపొందించిన సిటీ యువతి శ్రుతీ మిట్టల్ త్రీ ఇన్ వన్ ట్రెండ్ ఈ తరహా పిలుపులకు ఫ్యాన్స్ భారీగా స్పందిస్తున్నారు. ఇవిసినీ తారలకు ఓ వైపు సినిమాప్రమోషన్స్కి మరోవైపు అభిమానులతో మరింత సన్నిహితం కావడానికి ఉపకరిస్తున్నాయి. అలాగే ఫ్యాన్స్‌కి కూడా అరుదైన అపురూప తమ ప్రతిభను ప్రపంచవ్యాప్తం చేసుకునే అవకాశం అందుతోంది. దీంతో రాను రాను ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. బాలీవుడ్కీసై అంటున్న సిటీ... గత కొన్ని నెలలుగా బాలీవుడ్ సైతం ఇదే బాట పట్టింది. పలు సినిమాలలోని తమ పాటలు, డైలాగ్స్...వగైరాలతో హీరో హీరోయిన్లు అభిమానులకు ఛాలెంజ్‌లు విసురుతున్నారు. సదరు నటీ నటులకు ఉన్న లక్షల సంఖ్యలోని ఫాలోయర్స్‌కు తమ ప్రతిభ సైతం పరిచయం అవుతుందనే సంతోషంతో ఫ్యాన్స్ భారీ సంఖ్యలో స్పందిస్తున్నారు. తాజాగా బాట్లా హౌజ్ బాలీవుడ్ సినిమాలోని ఓ సాకీ సాకీ అంటూ సాగే నోరా పటేíß (తార) డ్యాన్స్ ఐటమ్ సాంగ్‌కి సిటీలోని ఎమ్జె డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు డ్యాన్స్ చేశారు. -
సురేఖా వాణి భర్త మృతి
నటి సురేఖా వాణి భర్త, టీవీ షోల దర్శకుడు సురేష్‌తేజ (50) ఇకలేరు. సోమవారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సురేష్ తేజ పలు టీవీ, రియాలిటీ షోలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘మా టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్’ లాంటి టీవీ షోలకు సురేఖా వాణి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆ సమయంలోనే ప్రేమ చిగురించడంతో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. సురేష్‌తేజ అంత్యక్రియలు బుధవారం జరుగుతాయి. ఆయన మృతిపట్ల పలువురు సినీ, టీవీరంగ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
సురేఖ వాణి కుటుంబంలో విషాదం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సహాయ నటి సురేఖ వాణి భర్త సురేష్ తేజ సోమవారం మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. సురేష్ తేజ పలు టీవీ షోలకు డైరెక్టర్‌గా పనిచేశారు. సురేఖ, సురేశ్‌లది ప్రేమ వివాహం. సురేఖ టీవీ యాంకర్‌గా ఉన్న సమయంలోనే ఇద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరికి కుమార్తె సుప్రిత ఉన్నారు. సురేశ్ తేజ దర్శకత్వం వహించిన మా టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ లాంటి టీవీ కార్యక్రమాలకు సురేఖ వాణి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సురేష్ తేజ మరణం పట్ల సినీ, సీరియల్ నటులు సంతాపం వ్యక్తం చేశారు. భర్త మరణంతో విషాదంలో మునిగిపోయిన సురేఖ వాణికి సానుభూతి తెలిపారు. -
క్రిస్మస్కి భయపెడతారు
‘గీతాంజలి’ ఫేమ్ అంజలి లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం ‘లిసా’. బ్రహ్మానందం, సామ్ జోన్స్, మకరంద్ దేశ్‌పాండే, సలీమా, సబితా రాయ్, సురేఖ వాణి, కల్యాణి నటరాజన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. రాజు విశ్వనాథ్ దర్శకత్వంలో పీజీ మీడియా వర్క్స్ సమర్పణలో పి.జి.ముత్తయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో పూర్తయింది. రాజు విశ్వనాథ్ మాట్లాడుతూ– ‘‘100 రోజులకు పైగా ‘లిసా’ షూటింగ్ జరిగింది. ఒక సినిమా షూటింగ్ ఎంత కష్టమో తెలిసిందే. ఇక త్రీడీలో అయితే మరింత కష్టమైన పని. కానీ, పీజీ ముత్తయ్యగారి కష్టం వల్ల సజావుగా పూర్తయింది. తన పాత్రకి న్యాయం చేశారు అంజలి. నటి సలీమాగారు రెండు దశాబ్దాల తర్వాత మా చిత్రంలో నటించారు’’ అన్నారు. ‘‘లిసా’ చిత్రానికి నేను నిర్మాతగా, సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించాను. ఇండియాలో ఫస్ట్ స్టీరియోస్కోపిక్ 3డీ హారర్ మూవీగా హీలియం 8కే కెమెరాతో చిత్రీకరించాం. డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని ముత్తయ్య అన్నారు. ‘‘మొదటిసారి 3డీ చిత్రంలో నటించా. రాజు విశ్వనాథ్ వంటి దర్శకులు చాలా అరుదుగా ఉంటారు. ముత్తయ్య ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమా నిర్మించారు’’ అన్నారు అంజలి. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ దయానిధి. -
సురేఖ వాణి వీడియో వైరల్
బుల్లితెరపై మొగుడ్స్ పెళ్లామ్స్ కార్యక్రమంలో క్రేజ్ సంపాదించుకున్న వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ఓ ఇమేజ్ను సొంతం చేసుకున్న సురేఖవాణికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సురేఖా వాణి తన కూతురుతో కలిసి కాలా చష్మా మ్యూజిక్కు డ్యాన్స్ చేసింది. ఆ వీడియోలో ఆమె పొట్టి జీన్స్ వేసుకుని కళ్లజోడు పెట్టుకుని... కూతురితో పోటీ పడుతూ మరీ డ్యాన్స్ చేసింది. ఆ వీడియో ఇప్పుడూ వైరల్‌గా మారింది. కాగా కత్రినాకైఫ్, సిద్దార్థ్ మల్హోత్రా జంటగా రూపుదిద్దుకున్న ‘బార్ బార్ దేఖో’ చిత్రంలోని కాలా చష్మా పాటకి ఆన్లైన్లో మంచి పాపులారిటీ వచ్చిన విషయం తెలిసిందే. ఇక సెలబ్రెటీ స్టేటస్ ఉన్నవారు ఏం చేసినా అది వార్తే అనుకోండి. మరి సురేఖా వాణి డ్యాన్స్ చూడండి...