ఫ్రెండ్లీ మామ్‌.. | Mothers Day Special : SurekhaVani And her Daughter Supritha | Sakshi
Sakshi News home page

ఫ్రెండ్లీ మామ్‌..

Published Sun, May 10 2020 8:46 AM | Last Updated on Sun, May 10 2020 2:18 PM

Mothers Day Special : SurekhaVani And her Daughter Supritha - Sakshi

ఆధునిక కాలపు అమ్మ అదిరించేది.. బెదిరించేది కాదు.. ఆడించేది పాడించేది.. ఆట పట్టించేంది.. పాట కట్టించేది. అన్నింటా కూతురితో సరితూగేది. దీనికి నిదర్శనంగా  నిలుస్తారు సినీనటి సురేఖా వాణి. ఎంతో కాలంగా తన కుమార్తెతో కలిసి డ్యాన్సులు, పాటలతో సోషల్‌ వేదికలపై హల్‌చల్‌ చేస్తూ మోడ్రన్‌ మదర్‌కు స్ఫూర్తిగా నిలుస్తున్న సురేఖ.. లాక్‌డౌన్‌తో మరింతగా తన కూతురితో గడిపే సమయం దక్కిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మదర్స్‌ డే సందర్భంగా ‘సాక్షి’తో సురేఖ, ఆమె కూతురు సుప్రీతలు పంచుకున్న ముచ్చట్లు.. 

మర్యాద ఇచ్చి పుచ్చుకుంటాం.. 
నన్ను మా పేరెంట్స్‌ చాలా స్వేచ్ఛగా పెంచారు. మా అమ్మ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేది. ఏదైనా సరే.. పంచుకునే చనువు తనతో నాకు ఉండేది. నా కూతురుతో కూడా నేను అలాగే ఉంటున్నాను. తల్లిదండ్రులు అంటే బెదిరింపులు హెచ్చరికల ద్వారా వచ్చే భయం కన్నా గౌరవం ద్వారా పొందే భయం ఉండాలనేది నా అభిప్రాయం. తనను చిన్నప్పటి నుంచీ నాతో అరమరికలు లేకుండా ఉండేలా అలవాటు చేశాను. ఇద్దరం కలిసే షాపింగ్స్‌కి, టూర్స్‌కి, మూవీస్‌కి, పార్టీస్‌కి, పబ్స్‌కి వెళతాం. నాకు డ్యాన్స్‌ బాగా ఇష్టం. అందుకని అప్పుడప్పుడు తనతో కలిసి చేసేదాన్ని. ఒకసారి అలా చేసిన డ్యాన్స్‌ సరదాగా యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేస్తే బాగా వైరల్‌ అయింది అప్పటి నుంచి ఖాళీ దొరికనప్పుడల్లా డ్యాన్సుల వీడియోలు, టిక్‌టాక్‌ కలిసి చేస్తున్నాం. అయితే అవేవీ ప్లాన్‌ వేసుకుని చేస్తున్నవి కాదు. స్పాంటేనియస్‌గా చేస్తున్నవి మాత్రమే. తను తన ఫ్రెండ్స్‌తో ఎలా ఉంటుందో అలానే నాతో కూడా ఉంటుంది. ఇద్దరం ప్రేమాభిమానాలతో పాటు మర్యాద కూడా ఇచ్చి పుచ్చుకుంటాం. నాకైతే తనను సినిమాలకు పరిచయం చేయాలనే ఆసక్తి లేదు. ఒకవేళ తనకు ఇష్టం ఉంటే కాదనను. నాకు ఖాళీ దొరికితే తనతో స్పెండ్‌ చేయడం ఇష్టం. ఇప్పుడు లాక్‌డౌన్‌తో ఇంకా ఎక్కువ టైమ్‌ గడపగలుగుతున్నా. – సురేఖా వాణి 

ఇప్పుడు ఫుల్‌ టైమ్‌పాస్‌.. 
మామ్‌ను మించిన ఫ్రెండ్‌ నాకు ఇంకెవరూ లేరు. ఫ్రెండ్స్‌తో ఎంత బాగుంటానో అమ్మతో అంతకన్నా బాగుంటాను. మామ్‌ నాకన్నా బాగా డ్యాన్స్‌ చేస్తుంది. తనతో డ్యాన్స్‌ చేస్తుంటే చాలా హాయిగా స్వేచ్ఛగా అనిపిస్తుంది. నేను నేనుగా ఉన్నట్టు అనిపిస్తుంది. మామూలుగా తను చాలా బిజీగా ఉంటుంది. ఒకవేళ తనకు ఖాళీ దొరికినా నాకు దొరక్క పోవడం వంటివి ఉండేవి. ఇప్పుడు ఇద్దరం ఖాళీయే కాబట్టి ఫుల్‌గా టైమ్‌ పాస్‌ చేస్తున్నాం. ఓ 20 దాకా టిక్‌ టాక్‌లు చేసుంటాం. అయితే ఒకటే అప్‌లోడ్‌ చేశాం అనుకోండి. మామ్‌ వంట బాగా చేస్తుంది. తనకి స్నాక్స్‌గా సమోసాలు, గ్రిల్డ్‌ చికెన్‌ వంటి స్నాక్స్‌ కుక్‌ చేసి ఇవ్వడం నాకు చాలా ఇష్టం. తనెప్పుడూ నాకు అది చేయ్‌.. ఇది చేయెద్దు.. అని చెప్పలేదు. షార్ట్‌ ఫిలిమ్స్, వెబ్‌సిరీస్, మ్యూజిక్‌ వీడియోలు చేస్తున్నా. సినిమాల్లో కొందరు అడిగారు. అయితే మంచి పాత్రలైతే చేద్దామని ఉంది. – సుప్రీత 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

2
2/3

3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement