Mothers Day Special
-
Famous Celebrities Mothers Photos: భారతీయులు గర్వించదగ్గ ప్రభావవంతమైన తల్లులు
-
తల్లీ.. నిన్ను దలంచి! దేశదేశాన మాతృవందనం!
ప్రేమ.. త్యాగం.. భరోసా.. భద్రత.. అని ఏ భాషలో గూగుల్ చేసినా వాటన్నిటికీ, అన్ని భాషల్లో ‘అమ్మ’ అన్న ఒకే మాటను చూపిస్తుందేమో గూగుల్! అలాగే బంధాలు, అనుబంధాల్లో టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయిందే అమ్మే! ఇంట్లో వాళ్ల గారాం.. మారాం.. అలక.. కోపం.. విసుగు.. చిరాకు– పరాకు.. ఆనందం.. అసహనం.. అలక్ష్యం.. అవమానం.. అవహేళన.. మోసం.. కుట్ర.. కుతంత్రం.. వంటి అన్ని భావోద్వేగాలుచ లక్షణాలకు బలయ్యేది అమ్మే! శక్తిసామర్థ్యాలు, ఓర్పు, ఔదార్యల్లో అమ్మను మించిన వారుండరేమో! అయినా ఆత్మగౌరవ విషయంలో అమ్మదెప్పుడూ లోప్రొఫైలే! అమ్మ లేకపోతే ఇంటికి ఆత్మ లేదు! అది హోమ్ కాదు గోడలు, చూరున్న ఒట్టి హౌస్ మాత్రమే!అందుకే తెలంగాణలో ఒక సామెత ఉంది.. ఏనుగంటి తండ్రి వెనుకపడ్డా.. ఎలుకంత తల్లి ముందుండాలి అని! తన సుఖదుఃఖాలు, సాధకబాధకాలతో సంబంధం లేకుండా.. ఇంటిల్లిపాది సంక్షేమం కోసం పాటుపడుతుంది. పిల్లల వృద్ధికి దారి చూపే మైలు రాయిలా నిలబడుతుంది! అందుకే అమ్మ సెంటిమెంట్ కాదు.. ఆలోచనాపరురాలు! తన సంతానంలోని హెచ్చుతగ్గులను బలమైన పిడికిలిగా మలచే నాయకురాలు! అమ్మకు ఆ సహనం ఉంది కాబట్టే కుటుంబం ఇంకా ఉనికిలో ఉంది! ఆమె నీడన సేదతీరుతోంది! అందుకే అమ్మ నిత్యపూజనీయురాలు! ఆమె పట్ల మనసులోనే దాచుకున్న ఆ ప్రేమను.. గౌరవాన్ని ఏడాదికి ఒక్కరోజైనా ప్రదర్శిద్దాం.. మాతృదినోత్సవంగా!ఆధునిక ప్రపంచంలో ‘మదర్స్ డే’కి అమెరికా నాంది పలికినా.. ఏనాటి నుంచో అమ్మ గొప్పదనాన్ని కొనియాడుతూ వాళ్ల వాళ్ల సంస్కృతీ సంప్రదాయ రీతుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్న దేశాలున్నాయి. ప్రాచిన గ్రీస్‌లో గాయియా(భూమాత), రియా(సంతాన దేవత)లకు ఏడాదికి ఒకసారి భారీ ఎత్తున పూజలందించేవారట. దీన్నే తొలి ‘మదర్స్ డే’ వేడుకగా భావిస్తారు గ్రీకు దేశస్తులు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ‘మదరింగ్ సండే’ కూడా ‘మదర్స్ డే’ లాంటిదే.అయితే వీటన్నిటికీ భిన్నమైంది మే రెండో ఆదివారం జరుపుకుంటున్న మోడర్న్ మదర్స్ డే కాన్సెప్ట్! అమెరికా, వర్జీనియాకు చెందిన ఏన్ రీవ్స్ జర్విస్ అనే సామాజిక కార్యకర్త.. ‘మదర్స్ డే క్లబ్స్’ పేరుతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తల్లులకు పిల్లల సంరక్షణ గురించి శిక్షణనిచ్చేది. పరిసరాల పరిశుభ్రతను బోధించేది. పోషకాహార లోపం, క్షయ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళా కార్మికుల కోసం విరాళాలు సేకరించి వారికి కావలసిన మందులు, పోషకాహారాన్ని సమకూర్చేది. ఆమె ఈ సేవకు స్థానిక వైద్యులు తమ వంతు సాయం అందించేవారు.ఇది క్రమంగా చుట్టుపక్కల పట్టణాలకూ విస్తరించింది. సివిల్ వార్ టైమ్‌లో ఈ క్లబ్బులు ఇరువర్గాల బాధితులకు ఆహారం, దుస్తులను అందించాయి. హింస ప్రజ్వరిల్లుతున్న ఆ సమయంలో శాంతి నెలకొల్పడానికి ఏన్ జర్వీస్ చాలా కృషి చేసింది. రాజకీయ సిద్ధాంతాలు, అభిప్రాయాలకు అతీతంగా తన చుట్టుపక్కల ప్రాంతాల తల్లులందరి మధ్య స్నేహసంబంధాలను నెలకొల్పడానికి ‘మదర్స్ ఫ్రెండ్షిప్ డే’ పేరుతో సభను ఏర్పాటు చేసింది. పెద్ద ఎత్తున హాజరైన తల్లులతో ఆ సభ విజయవంతమైంది. ఏటా అదొక ఈవెంట్‌లా కొన్నేళ్లపాటు కొనసాగింది. తర్వాత ఏన్ ఫిలడెల్ఫియాలోని తన కొడుకు, కూతుళ్ల దగ్గరకు వెళ్లిపోయి.. 1905, మే 9న కన్ను మూసింది.జీవితాన్ని సేవకే అంకితం చేసిన ఏన్ జర్విస్ సంస్మరణార్థం ఆమె కూతురు అనా జర్విస్ 1907, మే 12 న ఒక సభను ఏర్పాటు చేసింది. ‘మదర్స్ డే క్లబ్స్’ పేరుతో తన తల్లి అందించిన సేవలకు గుర్తుగా ‘మదర్స్ డే’కి జాతీయ గుర్తింపు రావాలని, ఆ రోజున తల్లులందరికీ సెలవు ఇవ్వాలనే క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఇది ఆరేళ్లపాటు కొనసాగింది. ఆమె పట్టుదల ఫలితంగా నాటి అమెరికా ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్.. ప్రతి మే రెండో ఆదివారాన్ని ‘మదర్స్ డే’గా.. జాతీయ సెలవుదినంగా ప్రకటించాడు. తర్వాత అనా ‘మదర్స్ డే ఇంటర్నేషనల్ అసోసియేషన్’ నూ స్థాపించింది. ఉన్నత∙ఆశయంతో మొదలైన ‘మదర్స్ డే’ 1920 కల్లా వ్యాపారానికి అనువైన వేడుకగా మారిపోయింది.ఆ రోజున గ్రీటింగ్ కార్డ్స్, పూలు, రకరకాల కానుకలను అమ్ముతూ క్యాష్ చేసుకోసాగాయి సదరు కంపెనీలు! అమ్మలకు గ్రీటింగ్ కార్డ్స్, పువ్వులు, కానుకలు ఇవ్వడమే ‘మదర్స్ డే’ సంప్రదాయమైంది. అంతేకాదు అనా జర్విస్ వాళ్లమ్మకు ఇష్టమైన పువ్వులంటూ కార్నేషన్ ఫ్లవర్స్ ప్రసిద్ధికెక్కాయి. ఈ ధోరణికి కంగారు పడిపోయింది అనా జర్విస్. ‘మదర్స్ డే’ అనేది ఓ సెంటిమెంట్‌గా ఉండి ఆ సెలవు అమ్మలకు కలసి వస్తుంది అనుకుంటే అదేదో మార్కెట్ ప్రాఫిట్ డేగా మారుతోందని కలత చెందింది. అందుకే తన శేష జీవితమంతా ఈ రకరమైన మార్కెట్ సెలబ్రేషన్స్‌ని వ్యతిరేకిస్తూ మళ్లీ ఓ క్యాంపెయిన్ నడిపింది అనా. అది ఫలించకపొగా గ్లోబలైజేషన్ తర్వాత మే రెండో ఆదివారం వచ్చే ‘మదర్స్ డే’ గ్లోబల్ ఈవెంట్ అయింది. ఈ కథనానికి సందర్భమూ అదే అనుకోండి!అయితే మొదట్లో ప్రస్తావించినట్టు చాలా దేశాలు తమ తమ సంస్కృతీ సంప్రదాయల నేపథ్యంలో భిన్న మాసాలు.. భిన్న తేదీల్లో విభిన్న రీతుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. మే రెండో ఆదివారం మదర్స్ డే చేసుకునే దేశాలతోపాటు ఆ విభిన్న రీతులేంటో కూడా చూద్దాం!ప్రతి సంవత్సరం.. ‘మదర్స్ డే’ నాడు ప్రపంచవ్యాప్తంగా 12.2 కోట్ల ఫోన్ కాల్స్ రికార్డ్ అవుతాయట.క్రిస్మస్, ఏnuజుజ్చుజి తర్వాత పూలు, మొక్కలు అత్యంతగా అమ్ముడుపోయే మూడో అతి పెద్ద వేడుక.. మదర్స్ డే!ఏడాది మొత్తంలో అమ్ముడు పోయే పూలల్లో నాలుగింట ఒక వంతు పూలు మదర్స్ డే రోజునే అమ్ముడుపోతాయి.ప్రపంచంలోని చాలా రెస్టారెంట్స్‌కి మదర్స్ డే బిజీయెస్ట్ డే.మదర్స్ డే సంప్రదాయ కానుక.. సింగిల్ కార్నేషన్.ప్రపంచంలోని చాలా భాషల్లో ‘అమ్మ’ అనే పదం ఎమ్తోనే మొదలవుతుందట.ఇటలీలో మదర్స్ డే రోజున రోజువారీ పనుల నుంచి అమ్మకు సెలవు దొరుకుతుంది. ఆ రోజు ఆమెను మహారాణిలా ట్రీల్ చేస్తారట కుటుంబ సభ్యులంతా!ఒంటరి తల్లులకు అండగా.. ఆస్ట్రేలియాలో 1924 నుంచి మే రెండవ ఆదివారం నాడు మాతృదినోత్సవ వేడుకలు జరుపుకోవడం ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధంలో చాలా మంది అమ్మలు తమ భర్తలను, కొడుకులను కోల్పోయారు. ఆ మాతృమూర్తుల విషాదాన్ని పంచుకుంటూ.. ఆ ఒంటరి తల్లులకు అండగా నిలబడింది జానెట్ హేడెన్ అనే మహిళ. ప్రతి మే నెల రెండో ఆదివారం నాడు జానెట్ ఆ అమ్మల దగ్గరకు వెళ్లి వాళ్లకు ధైర్యం చెబుతూ తనకు తోచిన కానుకలను అందించసాగింది. జానెట్‌ను చూసి స్ఫూర్తిపొందిన చాలా మంది ఆమెను అనుసరించడం మొదలుపెట్టారు. అలా ఏ ఏటికి ఆ ఏడు ఫాలోవర్స్ పెరిగి అదొక సంప్రదాయంగా స్థిరపడిపోయింది. అయితే ఆస్ట్రేలియాలో మే చలికాలం కాబట్టి ఆ సమయంలో అక్కడ విరగబూసే చేమంతులే మదర్స్ డే సంప్రదాయ పువ్వులుగా అమ్మల సిగల్లోకి చేరుతున్నాయి.పబ్లిక్ హాలీడే కాదు.. పోలండ్‌లో ‘మదర్స్ డే’ను మే 26న జరుపుకుంటారు. అయితే అదక్కడ పబ్లిక్ హాలీడే కాదు. సంప్రదాయ వేడుకలు, కానుకలు కామనే. ముఖ్యంగా పిల్లలు తాము స్వయంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్స్, పేపర్ ఫ్లవర్స్‌ని తమ తల్లులకు కానుకగా ఇస్తారు.బిజీయెస్ట్ డే ఆఫ్ ది ఇయర్!మెక్సికోలో మే 10న ‘మదర్స్ డే’ జరుపుకుంటారు. అక్కడిది అతి పెద్ద వేడుక. ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులంతా ఒక్కచోటికి చేరి తల్లితో గడుపుతారు. పువ్వులు, ఫుడ్‌తో సెలబ్రేట్ చేస్తారు. అమ్మ గుణగణాలను పాటలుగా రాసి బాజాభజంత్రీల మధ్య ఆలపిస్తారు. ఆ పాటలతోనే అమ్మను నిద్రలేపుతారు. కొంతమంది రకరకాల వంటకాలతో ఇంట్లోనే అమ్మకు పార్టీ ఇస్తారు. కొంతమంది రెస్టారెంట్స్‌కి తీసుకెళ్తారు. మదర్స్ డే.. మెక్సికోలోని రెస్టారెంట్స్ అన్నిటికీ బిజీయెస్ట్ డే ఆఫ్ ది ఇయర్ అని చెబుతారు స్థానికులు.మదర్ ఫిగర్స్ అందరికీ..నికరాగువాలో మే 30న ‘మదర్స్ డే’ జరుపుకుంటారు. కుటుంబమంతా కలసి గడపడానికి ఆ రోజున బడులకు, ఆఫీస్‌లకు సెలవు ఇస్తారు. ఒక్క అమ్మకే కాదు.. అమ్మమ్మ, నానమ్మ, పిన్ని, అత్త ఇలా వాళ్ల జీవితాల్లోని మదర్ ఫిగర్స్ అందరినీ ఆ రోజున కానుకలతో ముంచెత్తుతారు. వేడుకలతో అలరిస్తారు.రాణి పుట్టిన రోజు..థాయ్లండ్లో ఆ దేశపు రాణి.. క్వీన్ సిరికిట్ బర్త్ డే.. ఆగస్ట్ 12ను ‘మదర్స్ డే’గా పరిగణిస్తారు. ఇది వాళ్లకు జాతీయ సెలవు దినం. ఆమె ఆ దేశ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుందని, దేశాన్ని ఓ తల్లిలా కాపాడిందని ఆమె బర్త్ డేని ‘మదర్స్ డే’గా సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడ ఈ ఆచారం 1976 నుంచి మొదలైంది. అదొక స్వచ్ఛంద సేవా దినంగా ఉంటుంది. పిల్లలంతా మహిళా బౌద్ధ సన్యాసులకు అవసరమైన వస్తువులను తెచ్చిస్తారు. విరాళాలిస్తారు. సైనిక వందనం ఉంటుంది. బాణాసంచా కాలుస్తారు. దేశమంతటా జాతీయ జెండాలు రెపరెపలాడతాయి. క్వీన్ సిరికిట్ ఫొటోలు కొలువుదీరుతాయి. అంతేకాదు ఆ రోజున పిల్లలంతా తమ తల్లులకు.. స్వచ్ఛతకు చిహ్నమైన మల్లెపూలను కానుకగా ఇస్తారు.మూడు రోజుల వేడుక!ఇథియోపియాలో వర్షకాలపు చివరి రోజుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. వీళ్లకిది మూడు రోజుల వేడుక. ఈ మూడు రోజులూ మగవాళ్లు పాటలు పాడుతూ.. డాన్సులు చేస్తూ.. అమ్మతోపాటు భూదేవికీ గౌరవ వందనం సమర్పిస్తారు. ఈ దేశపు సంప్రదాయ వంటకాలైన ‘హష్’, ‘పంచ్’లను ఆరగిస్తారు. హష్ అంటే ఇథియోపియన్ మసాలాలు, చీజ్‌తో వండిన మటన్ లేదా బీఫ్. ఈ వంటకానికి కావల్సిన కూరగాయలు, చీజ్‌ని కూతుళ్లు, మాంసాన్ని కొడుకులు తెచ్చి, ఇద్దరూ కలసి దీన్ని వండటం వీళ్ల ఆచారం. పంచేమో నిమ్మకాయ, పైనాపిల్, రోజ్బెరీ, బత్తాయి, తెల్ల ద్రాక్షారసాల మిశ్రమం.కుటుంబ పండగబ్రెజిల్లో మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’ . దీన్ని ఇక్కడ అతిపెద్ద కమర్షియల్ హాలీడేగా వ్యవహరిస్తారు. చదువులు, కొలువుల రీత్యా ఎక్కడెక్కడో ఉన్న పిల్లలంతా ఆ రోజున తమ తల్లి దగ్గరకు వచ్చి ఆమెతో కలసి ఈ వేడుకను జరుపుకుంటారు. ఇదొక కుటుంబ పండగలా ఉంటుంది. బార్బెక్యూ వంటకాలతో విందు ఆరగిస్తారు. అన్నం, బీన్స్‌తో కలిపి వడ్డించే ఛిజిuటట్చటఛిౌ అనే గ్రిల్డ్ మీట్ ‘మదర్స్ డే’ స్పెషల్ డిష్ ఇక్కడ.వారం రోజులు..పెరూలోనూ మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’. వీళ్లకిది వారం రోజల పండగ. వైవిధ్యంగా జరుపుకుంటారు. తమ కుటుంబంలో.. కీర్తిశేషులైన తల్లులకు ఇష్టమైన పువ్వులను సమాధుల మీదుంచి వాళ్లకిష్టమైన వంటకాలు, డ్రింక్స్‌ను నైవేద్యంగా పెడతారు. వాళ్ల ప్రేమానురాగాలు, త్యాగాలను స్తుతిస్తారు. తర్వాత బతికున్న తల్లులకు కానుకలు, పుష్పగుచ్ఛాలు ఇస్తారు. ఆ రోజున అమ్మలందరూ తమకు నచ్చినట్టు గడుపుతారు.రూరల్ విమెన్స్ డే కూడా..మలావీలో అక్టోబర్ 15న మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది వీళ్లకు నేషనల్ హాలీడే. అక్టోబర్ 15 ‘రూరల్ విమెన్స్ డే’ కూడా కావడంతో దేశా«ధ్యక్షుడు అమ్మల ఔదార్యం, ప్రాధాన్యం గురించి బహిరంగ ప్రసంగం చేస్తాడు.రెడ్ కార్నేషన్తో.. జపాన్‌లో మొదట్లో.. వాళ్ల సామ్రాజ్ఞి కోజన్ పుట్టిన రోజు.. మార్చి 6ను ‘మాతృదినోత్సం’ కింద పరిగణించేవారు! అయితే 1949 నుంచి మే రెండో ఆదివారమే మదర్స్ డే జరుపుకోవడం మొదలుపెట్టారు. ఆ రోజున పిల్లలు రెడ్ కార్నేషన్ ఫ్లవర్‌తో తమ తల్లుల పట్ల తమకున్న ప్రేమానురాగాలు, గౌరవమర్యాదలను చాటుకుంటారు.రెండుసార్లు.. రష్యాలో మార్చి 8న, మే రెండో ఆదివారం రోజున.. రెండుసార్లు మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. మే రెండో ఆదివారం రోజున తల్లులకు సంబంధించిన ముఖ్యమైన సమస్యల మీద దృష్టి పెట్టి.. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. అమ్మ బాగుంటే కుటుంబం.. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో మాతృదినోత్సవం రోజున వేడుకల కంటే అమ్మలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికే మొగ్గు చూపుతారు.ఆఖరి ఆదివారంఫ్రాన్స్లో మే ఆఖరి ఆదివారమే ‘మదర్స్ డే’. ఆ రోజున పిల్లలంతా తమ తల్లులకు గిఫ్ట్స్, ట్రీట్స్ ఇస్తారు. ఇది ఒక కుటుంబ వేడుకగా జరుగుతుంది.స్వయంగా చేసి.. స్పెయిన్‌లో డిసెంబర్ 8న ‘మదర్స్ డే’ను సెలబ్రేట్ చేస్తారు. దీన్ని మదర్ మేరీకి సంబంధించిన పండగగా భావిస్తారు. పిల్లలంతా తమ తల్లులకు ఇష్టమైనవాటిని తామే స్వయంగా చేసి బహూకరిస్తారు. ఈ రోజున గీట్రింగ్ కార్డ్స్, చాక్లేట్స్, పువ్వుల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయట!జపాన్‌లో అమ్మకు రెడ్ కార్నేషన్ ఇస్తూ..తల్లులకు ఆసరాగా.. స్వీడన్లో మే ఆఖరి ఆదివారం ‘మదర్స్ డే’. ఈ రోజున స్వీడిష్ రెడ్ క్రాస్.. చిన్న చిన్న ప్లాస్టిక్ పూలను విక్రయిస్తుంది. వచ్చిన ఆదాయంతో పేద తల్లులను ఆదుకుంటుంది.ఎంత మంది పిల్లలు అనే లెక్కనజర్మనీలో మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’. ఫ్లవర్స్, కార్డ్స్, గిఫ్ట్లతోనే అమ్మలను గౌరవిస్తారు. అయితే రెండో ప్రపంచం యుద్ధంలో ఈ సీన్ వేరుగా ఉండేది. తల్లులను పితృభూమి కోసం పిల్లలను కనిచ్చే యంత్రాలుగా చూసేవారు. ఎంత మంది పిల్లల్ని కన్నారు అనే లెక్కన వాళ్లను మెడల్స్‌తో సత్కరించేవారట.రెండూ ఒకే రోజుఫిలిప్పీన్స్లో మే రెండో ఆదివారం నాడే మదర్స్ డే’ జరుపుకుంటారు. అయితే 1980లో అప్పటి అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కస్ డిసెంబర్ మొదటి సోమవారాన్ని మాతృ, పితృదినోత్సవం’గా ప్రకటించాడు. కానీ తర్వాత అధ్యక్షుడు కోరీ అక్వినో ఎప్పటిలాగే మే రెండో ఆదివారాన్ని ‘మాతృదినోత్సవం’గా, జూన్ మూడో ఆదివారాన్ని ‘పితృదినోత్సవం’గా ప్రకటించాడు. అయితే అయన తర్వాత వచ్చిన ప్రెసిడెంట్ జోసెఫ్ ఎస్ట్రాడా 1998లో మళ్లీ ఈ రెండిటినీ డిసెంబర్‌కే మార్చేశాడు. ఇదేలా ఉన్నా ఫిలిప్పినీస్ తమ తల్లిని ఇంటికి దీపంగా భావిస్తారు. ‘మదర్స్ డే’ రోజున ఫ్లవర్స్, చాక్లేట్స్, గిఫ్ట్‌లతో అమ్మ మీది ప్రేమను ప్రకటిస్తారు.స్కౌట్ మూవ్మెంట్ మద్దతుఆస్ట్రియాలో మదర్స్ డేని మొదటిసారిగా 1924లో జరుపుకున్నారు. ఆస్ట్రియన్ విమెన్స్ మూవ్మెంట్ వ్యవస్థాపకురాలు మరియాన్ హెయినిష్ ‘మదర్స్‌డే’ జరిపేందుకు చొరవ తీసుకుంది. దీనికి ఆమెకు స్కౌట్ మూవ్మెంట్ మద్దతు చ్చింది. ఇక్కడా మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’ సెలబ్రేట్ చేసుకుంటారు.పెరూలో కీర్తిశేషులైన తల్లులకు పువ్వులు అర్పిస్తూ..అమ్మను చూసే రోజు..నేపాల్‌లో మాతా త్రితా ఆన్సి (్చunటజీ) అనే పండగ రోజున ఇక్కడి మాతా త్రితా కోనేరు దగ్గరకు వచ్చి.. కీర్తిశేషులైన మాతృమూర్తులకు తర్పణం వదిలి వాళ్ల పట్ల ఉన్న తమ ప్రేమాభిమానాలను చాటుకుంటారు. దీన్ని ‘ఆమా కో ముఖ్ హెర్నే దిన్ (అంటే అమ్మను చూసే రోజు)’గానూ వ్యవహరిస్తారట. దీన్నే ‘మదర్స్ డే’ అనుకోవచ్చు అంటారు నేపాలీలు. అయితే ఆరోజున.. కీర్తిశేషులైన వాళ్లను తలచుకోవడంతో పాటు బతికున్న అమ్మలకు పాద పూజ చేస్తారు.ముస్తఫా అమిన్ వల్ల..ఈజిప్ట్, ఇరాక్, జోర్డాన్, లిబియా, లెబనాన్, కతార్, సిరియా కువైట్, మారిటేనియా, ఒమాన్, పాలెస్తీనా, సౌది అరేబియా, సొమాలియా, సుడాన్, యూఏఈ, యెమెన్ వంటి దేశాల్లో మార్చ్ 21న ‘మాతృదినోత్సవాన్ని’ జరుపుకుంటారు. ఈజిప్ట్ ఈ వేడుకను 1956లో జర్నలిస్ట్ ముస్తఫా అమిన్ పరిచయం చేశాడు. అప్పటి నుంచి చాలా అరబ్ దేశాలు ఈ వేడుకను జరుపుకుంటున్నాయి.నేపాల్‌లో మాతా త్రితా ఆన్సి పండగ..పిల్లల్ని రక్షించినందుకు..ఇజ్రాయెల్‌లో ‘మాతృదినోత్సవం’ క్రమంగా కుటుంబ దినోత్సవంగా మారింది. ఇది జ్యూయిష్ క్యాలెండర్ ప్రకారం షెవత్ 30న అంటే జనవరి 30 నుంచి మార్చి 1 మధ్యలో వస్తుంది. హెనుయెటా జోల్డ్ నాయకత్వం లోని యూత్ ఆలియా ఆర్గనైజేషన్.. నాజీల చెర నుంచి యూదు పిల్లలను రక్షించిన సాహసానికి గుర్తుగా దీన్ని జరుపుకుంటారు.ఇంకా ఈ దేశాల్లో.. నార్వేలో ఫిబ్రవరి రెండో ఆదివారం, అల్బేనియా, అర్మేనియా, అజర్బైజాన్, బెలారస్, బల్గేరియా, కజకిస్తాన్, మాల్డోవా, సైబీరియా, వియత్నాంలలో మార్చి 8, గర్నెసీ, ఐర్లాండ్, నైజీరియాల్లో ఫోర్త్ సండే ఆఫ్ లెంట్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలాల్లో మార్చి 10, అల్జీరియా, కేమరూన్, డొమినికన్ రిపబ్లిక్, హైతీ, మడగాస్కర్, మాలి, మారిషస్, మొరాకో, నిగర్, సెనెగల్, ట్యునీషియా దేశాల్లో మే ఆఖరి ఆదివారం నాడు మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. -
అమ్మా.. బాగున్నావా? ఆరోగ్యం జాగ్రత్త!
ఇంట్లో ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడుతూ, అందరి బాగోగులూ చూసే తల్లులు తమ ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోరు. అమ్మ తనని తాను పట్టించుకోదని వదిలేసి ఊరుకోలేము, ఊరుకోకూడదు కూడా. మనకోసం అహరహం తపించే మన కన్నతల్లిని కంటికి రెప్ప లా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై కూడా ఉంది. అందుకోసం ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం...రేపు అంతర్జాతీయ మాతృదినోత్సవం. ఈ నేపథ్యంలో అమ్మ గురించి, అమ్మ ఆరోగ్యం గురించి కాస్త శ్రద్ధ తీసుకోవడం చాలా మంచిది. రోజంతా రాత్రి, పగలు ఇంట్లోని వారందరి బాగోగులు చూసే తల్లులు తీరా తమ దగ్గరకొచ్చేసరికి అంతగా పట్టించుకోరు. దాంతో వారికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. వాటిని దూరం చేయాలంటే ఏం చేయాలో, వారు ఆరోగ్యంగా... ఆనందంగా ఉండేందుకు ఏమేం చర్యలు తీసుకోవాలో చూద్దాం...చురుగ్గా ఉండేలా...ఎవరైనా సరే, ఉత్సాహంగా... ఉల్లాసంగా ఉండడం చాలా ముఖ్యం. అమ్మ ఉత్సాహంగా ఉల్లాసంగా లేకపోయినా కనీసం చురుగ్గా అయినా ఉంటోందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఇందుకోసం రోజుకి 30 నుంచి 40 నిమిషాల పాటు ఆమె వాకింగ్ చేసేలా చూడాలి. దాని వల్ల బరువు అదుపులో ఉంటుంది. ఏవిధమైన ఇన్ఫెక్షన్లూ సోకవు. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి, తల్లులు సులువుగా చేయగలిగే కనీస వ్యాయామాలు చేసేలా చూడాలి. అలా చేయాలంటే మనం కూడా మన బద్ధకాన్ని వదలగొట్టుకుని శరీరానికి కొద్దిపాటి శ్రమ కలిగించే వ్యాయామాలు చేయడం అవసరం. మనల్ని చూసి మన తల్లులూ, మన పిల్లలూ కూడా వ్యాయామాలు చేసి ఆరోగ్యంగా... సరైన ఆకృతిలో ఉండేందుకు తప్పకఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటోందా?అమ్మలు మనం ఇష్టంగా తినేవాటిని ఎంతో శ్రమపడి వండి వారుస్తారు కానీ, వారి విషయానికొచ్చేసరికి సరిగా తినరు. అలా కాకుండా అమ్మ ఏమేం తింటోంది, ఎలా తింటోంది... అసలు సరిగ్గా తింటోందో లేదో పట్టించుకోవాలి. అమ్మ వండింది మనం కడుపునిండా తినడమే కాదు, అమ్మ ఏమైనా తింటోందో లేదో చూస్తూ, ఆమె ఇష్టాన్ని కనిపెట్టి వారికి నచ్చే ఆహారాన్ని బయటినుంచి కొని తీసుకు రావడమో లేదా వీలయితే మీరే ఒకరోజు సరదాగా వండిపెట్టడమో చేయాలి.వారు ఆరోగ్యంగా ఉండేందుకు హెల్దీ ఫుడ్‌ని అందించండి. వారి డైట్లో పాలు, గుడ్లు, నట్స్, సోయా వంటి ్రపోటీన్ రిచ్ ఫుడ్స్‌ని యాడ్ చేసుకోండి. తాజా పండ్లు, కూరగాయలు తినే చూడండి. దీంతో పాటు హైడ్రేటెడ్‌గా ఉండేలా నీటితో పాటు, గ్రీన్ టీ, హెర్బల్ టీలను తాగించండి. వీటితో పాటు హోల్ గ్రెయిన్స్, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటి ఫుడ్స్, అలానే కాల్షియం, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకునేలా చూడడం తప్పనిసరి.ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నారా? ఆరోగ్యమే మహా భాగ్యం అన్న సూక్తి చాలా పాతదే అయినప్పటికీ అది ఎల్లవేళలా అనుసరించవలసినదే. ఆరోగ్యాన్ని మించిన ధనం లేనేలేదు. అందువల్ల నేటి కాలంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. మనకెవరికైనా ఏమాత్రం ఆరోగ్యం బాగుండకపోయినా సరే, తల్లడిల్లిపోయే తల్లులు తమ ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి పట్టించుకోరు.మీరు అలా అని వదిలేసి ఊరుకోవద్దు. అమ్మకి తప్పనిసరిగా హెల్త్ చెకప్స్ చేయించండి. థైరాయిడ్, హైబీపి, షుగర్ వంటి సమస్యలేమైనా ఉంటే అవి ఏ మేరకు అదుపులో ఉన్నాయో ఈ టెస్ట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం ప్రతి 3 నెలలకి ఓ సారి చెకప్స్, ప్రతి సంవత్సరం బ్రెస్ట్ క్యాన్సర్ చెకప్స్, దీనికి సంబంధించిన సెల్ఫ్ టెస్ట్ ఇంట్లోనే 6 నెలలకి ఓసారి చేయించడం మంచిది.ప్రేమ పూరితమైన పలకరింపు!అన్నిటినీ మించి అమ్మ దగ్గర రోజూ కాసేపు కూర్చుని అమ్మను ప్రేమగా పలకరించి, ఆమెతో కాసేపు కబుర్లు చెప్పడం వల్ల ఎంతో సంతోషపడుతుంది అమ్మ. అమ్మ ఏమైనా చెప్పడానికి ప్రయత్నించినప్పుడు విసుక్కోవడం, కసురుకోవడం అసలు పనికిరాదు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం.. ఇలా మదర్స్‌డే, ఫాదర్స్‌డే వంటివి జరుపుకునేది విదేశాలలోనే కానీ, మనకెందుకులే అని పట్టించుకోకుండా ఊరుకోకండి.ప్రచార, ప్రసార మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా అమ్మలు కూడా అన్ని విషయాలూ తెలుసుకుంటున్నారనే విషయాన్ని గుర్తించండి. అమ్మకు తప్పనిసరిగా శుభాకాంక్షలు చెప్పి, ఆమె ఆశీర్వాదాన్ని అందుకోవడం మాత్రం మరచిపోవద్దు. విష్ యు ఏ హ్యాపీ మదర్స్ డే.. -
International Mothers Day: అమ్మ చిరునవ్వును చూద్దామా
ఆమెతో గడపాలి. ఆమె తన పిల్లలకు మనసులోది చెప్పుకునేలా చేయాలి. ఆమె మురిసి΄ోయే కానుక ఇవ్వాలి. ఎదురు చూస్తున్న విహారానికి ఆమెను తీసుకెళ్లాలి. అరె... ఆమెకు ఇష్టమైనది వండితే ఎంత బాగుంటుంది. మనమలు, మనమరాళ్లు ఆమె కాళ్ల దగ్గర చేరితే మరింత బాగుంటుంది. అమ్మకు ఏం కావాలి? చిన్న చిరునవ్వు తప్ప. మే 12 అంతర్జాతీయ మాతృదినోత్సవం. అమ్మను సంతోషపెట్టేందుకు ఇదే సమయం.అమ్మగా ప్రయాణం ప్రసవ వేదనతో మొదలవుతుంది. బిడ్డకు జన్మనివ్వడానికి వేదనకు సిద్ధమయ్యే అమృతమూర్తి అమ్మ. పుట్టాక బిడ్డ కేర్‌మన్నా, కేరింతలు కొట్టినా ఆమె పెదాల మీద చిర్నవ్వు. అంతవరకూ అనుభవించిన బాధను ఆమె మర్చి΄ోతుంది. ఆ తర్వాత ఆమె జీవితమంతా పిల్లల చుట్టే తిరుగుతుంది. వారు నవ్వితే నవ్వుతుంది. ఏడిస్తే ఏడుస్తుంది. సరిగా చదవక΄ోతే బాధ పడుతుంది. పూర్తిగా స్థిర పడక΄ోతే ఆందోళన పడుతుంది. వారి ఎదుగుదల, పెళ్ళిళ్లు, సంసారాలు, సంపాదనలు ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉంటుంది. ‘నా పిల్లలు చల్లగా ఉండాలి’ అని ్రపార్థనలు చేస్తుంది. చల్లగా ఉంటే సంతోషపడుతుంది. కాని పిల్లలు పెద్దవాళ్లయ్యాక... తాము తల్లిదండ్రులయిన తర్వాత... తల్లి నుంచి ΄÷ందిన ప్రేమంతా తమ పిల్లలకు ఇస్తారు తప్ప తల్లికి ఇవ్వడానికి బద్దకిస్తారు. ‘అమ్మంటే ప్రేమ కదా మనకు’ అనుకుంటారు తప్ప వ్యక్తీకరించరు. ఒకోసారి అమ్మనే మర్చి΄ోయేంత బిజీ అయి΄ోతారు. అలాంటి వారికి అమ్మను గుర్తు చేసేదే కదా ‘మదర్స్ డే’.» అమ్మ ఫోన్ ఎత్తుతున్నారా?లోకంలో ఎన్నో ఫోన్లు ఫస్ట్ కాల్కే ఎత్తుతారు చాలామంది. కాని అమ్మ చేస్తుంటే ‘అమ్మే కదా’ అని ఎత్తరు. అమ్మ ఫోన్లో పెద్ద విశేషం లేక΄ోవచ్చు. రొటీన్ కాలే కావచ్చు. ‘భోజనం చేశావా నాన్నా’ అనే అదే ప్రశ్నను అడుగుతుండవచ్చు. కాని అమ్మ కదా. కొడుకు ఎంత పెద్దవాడైనా, కూతురు ఎంత పెద్ద సమర్థురాలైనా వారు క్షేమంగా ఇల్లు చేరి నిద్రకు ఉపక్రమిస్తున్నారని తెలుసుకుంటే తప్ప ఆమె నిద్ర΄ోదు. ఆ విషయం తెలిసీ ఫోన్ ఎత్తరు. ఒకోసారి విసుక్కుంటారు. పిల్లలే ఫోన్ చేసి ‘అమ్మా అన్నం తిన్నావా?’ అని అడగడం ఎందరు అమ్మల విషయంలో జరుగుతున్నదో. పిల్లల పలకరింపే అమ్మకు అసలైన భోజనం.» అమ్మను మాట్లాడనిస్తున్నారా?అమ్మ మనసులో ఎన్నో ఆలోచనలు. ఆమె ఎంతో జీవితం చూసి ఉంటుంది. అనుభవం ఉండి ఉంటుంది. పిల్లల జీవితాల్లో జరుగుతున్న విషయాలు ఆమె చెవిన పడి చూపుకు అందుతుంటాయి. ఏదో చె΄్పాలని ఉంటుంది. తోబుట్టువుల ఫిర్యాదులు, పట్టింపులు ఒకరివి మరొకరికి చేరవేసి ప్రేమలు గట్టి పడాలని పరితపిస్తూ ఉంటుంది. భర్త గురించి కూడా పిల్లలకు ఏదో చెప్పుకోవాలని ఉంటుంది. పిల్లలు వింటున్నారా? నీ మనసులో ఏముందో చెప్పమ్మా అని తీరిగ్గా ఆమె పక్కన కూచుని అడుగుతున్నారా? ఆమెను అర్థం చేసుకుంటూ ఆమె చెప్పింది పాటిస్తున్నారా? పాటించడమే కదా ఆమెకు తెలుపగల కృతజ్ఞత. ఇవ్వగల గౌరవం.» అమ్మకు కానుకఅమ్మ డబ్బు దాచుకోదు. దాచుకున్నా పిల్లల కోసమే. అమ్మ తన కోసం ఏదీ కొనుక్కోదు. కొనుక్కున్నా పిల్లల కోసమే. తమకు పిల్లలు పుట్టాక తమ పిల్లలకు ఏమేమి కొనిపెడదామా అనుకునే తల్లిదండ్రులు తమకు జన్మనిచ్చిన తల్లికి ఏదైనా కొని పెడదామా అనుకోరు. ఒక మంచి స్మార్ట్ వాచ్ (ఆమె ఆరోగ్యాన్ని సూచించేది), పాటల పెట్టె (సారెగమా కారవాన్ రేడియో), మంచి ఫోన్ హెడ్‌ఫోన్స్‌తో పాటుగా (ప్రవచనాలు వినడానికి), ఆమెకు నచ్చిన బంగారు ఆభరణం, ఆమెకు ఆసక్తి ఉన్న చానల్స్ సబ్స్క్రిప్షన్, ఓటీటీల సబ్స్క్రిప్షన్, ఏదైనా మంచి ప్రకృతి వైద్యశాలలో రెండు వారాలు ఉండటానికి కావలసిన ఏర్పాట్లు, ఆమె ప్రముఖంగా కనిపించేలా ఫ్యామిలీ ఫొటో... ఇవన్నీ ఆమె మళ్లీ మళ్లీ చూసుకుని ఆనందించే కానుకలు. చిరునవ్వుల మాలికలు. ‘మా పిల్లలు కొనిచ్చారమ్మా’ అని వారికీ వీరికి చెప్పుకునే ఘన విషయాలు.» మనం తప్పఅమ్మకు పిల్లలు తప్ప వేరే ఏ ఆస్తిపాస్తులు పట్టవు. అమ్మకు నిత్యం కళ్ల ముందు పిల్లలు కనిపించాలి. ఆమె మీద ఫిర్యాదులు చేసి, సాకులు చూపి, లేదా తప్పనిసరయ్యి ఆమెకు దూరంగా ఉండాల్సి వస్తే ఆ దూరాన్ని దాని వల్ల వచ్చే లోటును పూర్తిగా పూడ్చేంతగా పిల్లలు అమ్మకు ఇవ్వాలి. ‘అమ్మ’ అని పిలుచుకునే అదృష్టంతో ఒక మనిషి మన కోసం ఉండటం వరం. ఆ వరం అపురూపం. అది గ్రహిస్తే చాలు–ఈ మదర్స్ డే రోజున. అమ్మతో ప్రయాణంసెలవులొస్తే అచ్చోటకి వెళ్దాం ఇచ్చోటకి వెళ్దాం అని ΄్లాన్ చేసుకునే ఓ పిల్లలూ... మీ ప్రయాణంలో ఎన్నిసార్లు అమ్మను తీసుకెళ్లారు? జీవితం మొత్తం పిల్లల కోసం ఆమె ఇంటికే పరిమితమైంది. ఇప్పుడైనా లోకం చూడాలని అనుకుంటోంది. ‘నువ్వు రాలేవు’, ‘నువ్వు తిరగలేవు’, ‘నిన్ను చూసుకోవడం కష్టం’ అని ఆమెను ఇంటికే పరిమితం చేస్తే ఆమె మనసు ఆహ్లాదం ΄÷ందేదెప్పుడు. ఆమెకు ఆటవిడుపు లభించేదెప్పుడు. ఆమెకు ఏదైనా ఆధ్యాత్మిక యాత్ర చింత ఉంటే అది తీరేదెప్పుడు. శ్రావణ కుమారుడిలా కావడిలో మోయక్కర్లేదు... రెండు రోజులు సెలవు పెట్టి ఆమెతో రైలు ప్రయాణమే ఆమెకు ఇవ్వగల వీక్షణ దరహాసం. -
Mother's Day 2023: వ్యాపార రంగంలో 'తల్లీ కూతుళ్ళ' హవా..
'అమ్మ' అనే పదాన్ని వర్ణించడానికి పదాలు చాలవు, శ్లోకాలు చాలవు ఆఖరికి గ్రంధాలు కూడా చాలవు. ఎంత చెప్పినా తక్కువే. భగవంతుడు సైతం అమ్మ ప్రేమకు బానిస అవుతాడు అనేది శాసనం. ఏ రంగంలో అయినా, ఏ సందర్భంలో అయినా.. భూమి నుంచి ఆకాశం వరకు ఏదైనా చెయ్యగలిగే శక్తి మాతృమూర్తి సొంత. ఇక వ్యాపార రంగంలో అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. 'మాతృ దినోత్సవం' సందర్భంగా వ్యాపార ప్రపంచంలో దూసుకెళ్తున్న నలుగురు తల్లీ కూతుళ్ళ ప్రయాణం గురించి ప్రత్యేక కథనం.. ఫల్గుణి & అద్వైత నాయర్ అమెరికాలో ఉద్యోగం వదిలి తన తల్లి ఫల్గుణి నాయర్ సహాయంతో వ్యాపార రంగంలో ప్రయాణం మొదలు పెట్టి ఈ రోజు వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించింది. ఫల్గుణి నాయర్ భారతదేశంలోనే అత్యంత ధనవంతురాలు. ఆమె 2021లో చాలా విజయవంతమైన IPO తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 36,000 కోట్లకు పైగా ఉన్న Nykaa CEO కూడా. ఈ కంపెనీకి అద్వైత నాయర్ నేతృత్వంలోని Nykaa ఫ్యాషన్ అనే ఫ్యాషన్ విభాగం తోడైంది. ఉన్నత చదువులు చదువుకున్న అద్వైత కంపెనీ అభివృద్ధికి ఎంతగానో సహాయపడింది. 10 మందితో ప్రారంభమైన వీరి కంపెనీ ఇప్పుడు 3000 మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. తల్లీ, కూతుళ్లు నైకా బ్రాండ్ కింద అనేక ఉత్పత్తులు విక్రయిస్తూ విజయాల బాటలో ప్రయాణిస్తున్నారు. 2022 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో వీరి ఆదాయం రూ. 724 కోట్ల కంటే ఎక్కువ. రానున్న రోజుల్లో ఈ ఆదాయాన్ని మరింత పెంచడానికి కృషి చేయడానికి కావలసిన ఎన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తం మీద ఫల్గుణి నాయర్ & అద్వైత భారతదేశంలో అత్యంత ధనవంతులైన మహిళల్లో ఒకరుగా ఉన్నారు. వీరి నికర ఆస్తుల విలువ రూ.20,000 కోట్లు. షహనాజ్ హుస్సేన్ & నెలోఫర్ కర్రింబోయ్ షహనాజ్ హుస్సేన్ భారతదేశంలోని షహనాజ్ హుస్సేన్ గ్రూప్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్. ఈమె హెర్బల్ బ్యూటీ కేర్ ఉద్యమానికి మార్గదర్శకత్వం వహించినందుకు, ఆయుర్వేదంలో భారతీయ మూలికా వారసత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్లినందుకు అంతర్జాతీయ ప్రశంసలు అందుకుంది. వాణిజ్య పారిశ్రామిక రంగంలో షహనాజ్ కృషికి భారత ప్రభత్వం పద్మశ్రీ పురస్కారం అందించింది. షహనాజ్ హుస్సేన్ కుమార్తె నెలోఫర్ కర్రింబోయ్ కూడా తల్లి మార్గంలోనే ముందుకు సాగుతోంది. ఈ తల్లీ కూతుళ్ల ద్వయానికి చెందిన బ్రాండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందింది. టెక్నాలజీ పట్ల నీలోఫర్స్కు ఉన్న ఆసక్తి ఆయుర్వేదం, బ్యూటీ రంగంలో మరింత మంచి భవిష్యత్తుకు మార్గదర్సకం కానుంది. శోభన కామినేని & ఉపాసన కామినేని కొణిదెల అపోలో హాస్పిటల్ సామ్రాజ్య స్థాపనకు కారకులైన కుటుంబానికి చెందిన శోభన కామినేని & ఉపాసన కామినేని కూడా చెప్పుకోదగ్గ వ్యక్తులు. అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ 'శోభనా కామినేని', అపోలో హాస్పిటల్స్‌లోని CSR వైస్ చైర్‌పర్సన్‌గా 'ఉపాసన కామినేని' పనిచేస్తున్నారు. ఉపాసన ప్రజలకు ఆరోగ్యం మీద శ్రద్ద వహించే మెళుకులను తెలియజేస్తూ.. మెగా కోడలిగా తన బాధ్యతలను నిర్వరిస్తోంది. జయ & శ్వేతా శివకుమార్ వై సో బ్లూ పేరుతో ఫ్యాషన్ బ్రాండ్ వ్యాపారాన్ని ప్రారంభించి ప్రముఖ వ్యాపారవేత్తలుగా మారిన తల్లీ కూతుళ్లే జయ & శ్వేతా శివకుమార్. వారి కుటుంభంలో ఒక విషాద సంఘటన జరిగిన తరువాత వారు ఈ సంస్థకు ప్రాణం పోశారు. ఆధునిక కాలంలో అద్భుతమైన డ్రెస్ బ్రాండ్ ప్రారంభించి వీరి జీవిత కాల కళను నెరవేర్చుకున్నారు. ప్రస్తుతం వారు అద్భుతమైన పర్యావరణ స్పృహతో కూడిన కాటన్ దుస్తుల బ్రాండ్‌ను సృష్టించి మంచి లాభాలను గడిస్తున్నారు. నాస్తి మాతృ సమం దైవం, నాస్తి మాతృ సమః పూజ్యో, నాస్తి మాతృ సమో బంధు, నాస్తి మాతృ సమో గురుః. (అమ్మతో సమానమైన పూజ్యులు గానీ దైవంగానీ లేరు. తల్లిని మించిన బంధువులుగానీ గురువులుకానీ లేరు) అన్న మాటలు ఇప్పటికే నిత్య సత్యాలే.. మాతృదినోత్సవం సందర్భంగా ప్రతి తల్లికి సాక్షి బిజినెస్ తరపున శుభాకంక్షాలు. -
ఈ సూపర్ మామ్స్‌కి కుడోస్.. మదర్స్ డే స్పెషల్
కోవిడ్ టైమ్‌లో.. ఇటు ఆఫీస్ బాధ్యతలు.. అటు పెరిగిన ఇంటి బాధ్యతలతో సతమతమవుతూ 51 శాతం వర్కింగ్ మదర్స్ ఉద్యోగం మానేస్తే బాగుండు అనే ఆలోచనలో పడ్డారు.కోవిడ్ తర్వాత.. దాదాపు ఎనిమిదివేల మంది వర్కింగ్ మదర్స్‌ను కదిలిస్తే.. అందులో 38.6 శాతం మంది తమకు అనుకూలంగా ఆఫీస్ పనివేళలను మార్చుకునే వీలుంటే బాగుండు అని అభిప్రాయపడ్డారు. 32.3 శాతమేమో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌ను కంటిన్యూ చేస్తే తాము ఉద్యోగం వదిలే ప్రసక్తి ఉండదని చెప్పారు. 17 శాతమేమో ఆఫీసుల్లో పిల్లలను చూసుకునే కేర్ సెంటర్స్ ఉంటే బాగుండనే కోరికను వెలిబుచ్చారు.12.1శాతం వర్కింగ్ మదర్సేమో ఇటు వర్క్, అటు కుటుంబం.. రెండూ తగు రీతిలో బ్యాలెన్స్ చేసుకుంటూ కెరీర్లో మరింత ముందుకు వెళ్లడానికి సైకలాజికల్ కౌన్సెలర్స్ సపోర్ట్ అవసరమని స్పష్టం చేశారు. అది జాబ్స్ ఫర్ హర్ అనే సంస్థ నిర్వహించిన సర్వే వివరం. కోవిడ్ తర్వాతే.. సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ కూడా ఓ సర్వే నిర్వహించింది. దాని ప్రకారం దేశంలోని వర్కింగ్ మదర్స్ కోవిడ్ సమయంలో పిల్లల సంరక్షణకోసం అదనంగా 360 గంటలు వెచ్చించారు. ఇది సగటు భారతీయ పురుషులు వెచ్చించే సమయానికన్నా పదింతలు ఎక్కువన్నమాట. అంటే వర్కింగ్ మదర్స్ తమ ఉద్యోగాల్లో.. లేదా కెరీర్లో నిలదొక్కుకోవాలంటే అదనంగా అన్ని గంటలు పనిచేయాలన్నమాట! ‘ప్రిడిక్మెంట్ ఆఫ్ రిటర్నింగ్ మదర్స్’ పేరుతో అశోక యూనివర్సిటీ చేసిన మరో సర్వేలో దేశంలో 30 ఏళ్ల వయసున్న దాదాపు 50 శాతం వర్కింగ్ మదర్స్ పిల్లల్ని చూసుకోవడానికి ఉద్యోగాలు వదిలేసినట్టు తేలింది. మిగిలిన 50 శాతంలో 48 శాతం వర్కింగ్ మదర్స్.. మెటర్నిటీ లీవ్, పాండమిక్ తర్వాత ఉద్యోగంలో చేరి.. కేవలం నాలుగు నెలలే పనిచేసి విధులకు రాజీనామా చేశారు. కుటుంబంలో.. పనిచేసే చోట కావల్సిన సపోర్ట్ దొరక్క! అయినా పనిచేస్తున్న ఆ రెండు శాతం తల్లులు కూడా పనిచేసే చోట.. బంధువుల్లో.. కుటుంబాల్లో వివక్షకు గురవుతున్నారు.. పిల్లల పెంపకం మీద శ్రద్ధ పెట్టక.. ఉద్యోగం, కెరీర్ అంటూ ఊరేగుతున్నారనే కామెంట్స్‌తో. ఇన్ని లెక్కలతో ఇంత ఉపోద్ఘాతం ఎందుకో అర్థమయ్యే ఉంటుంది పాఠకులకు! ఎస్.. ఈ రోజు మదర్స్ డే! ఆ సందర్భంగా వర్కింగ్ మదర్స్ ఎదుర్కొంటున్న కష్టాలు ఏకరువు పెట్టట్లేదు. కానీ వాళ్లకున్న ప్రతికూల వాతావరణాన్ని ఆ సర్వేల ఫలితాల ద్వారా తెలియజేసి.. ఆ ప్రతికూలతలను కూడా అనుకూలంగా మలచుకుంటూ.. ఉద్యోగిగా కాకపోతే అంట్రప్రెన్యూర్‌గా డిఫరెంట్ కెరీర్‌కి స్విచ్ ఆన్ అయిన వర్కింగ్ మదర్స్ పరిచయ ప్రయత్నమే ఈ కథనం.. మమీయూ ఇదో మెటర్నిటీ గార్మెంట్స్ బ్రాండ్. శాలినీ శర్మ బ్రెయిన్ చైల్డ్. మార్కెట్లోకి వచ్చి రెండేళ్లవుతోంది. మమీయూ కంటే ముందు శాలినీ రిక్రూట్మెంట్ స్పెషలిస్ట్‌గా పనిచేసేది. తను తల్లి కాబోతున్నానని తెలియగానే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసింది. ప్రెగ్నెన్సీ సమయంలో దుస్తుల విషయంలో చాలా అసౌకర్యం ఫీలైంది. ఎంతటి వదులు దుస్తులు వేసుకున్నా సౌకర్యంగా అనిపించలేదుట. ప్రసవమయ్యాకా అదే పరిస్థితి. ఆన్లైన్.. ఆఫ్‌లైన్ మార్కెట్ అంతా గాలించింది. ఆమెకు అనువైన దుస్తుల కోసం. పెద్ద పెద్ద బ్రాండ్స్‌లోనూ వెదికింది. ఫారిన్ బ్రాండ్స్‌లో ఉన్నాయి. కాని అవి తనకు నప్పే సైజుల్లో లేవు. ఆశ్చర్యపోయింది.. మన దగ్గర గర్భిణీకి.. బాలింతకు సౌకర్యంగా ఉండే దుస్తులే లేవా? అని. ఆ అసహనమే తల్లి అయిన శాలినీ శర్మలో కొత్త కెరీర్ ఆలోచనను రేకెత్తించింది. ‘మమీయూ’ను సృష్టించింది. ఈ రోజు ఆమెను ఓ అంట్రప్రెన్యూర్‌గా నిలబెట్టింది. ఆ ప్రయాణానికి ముందు మార్కెట్ రీసెర్చ్ చేసింది. ఢిల్లీ, గురుగ్రామ్ ప్రాంతంలోని 150 మంది గర్భిణీలను కలసి.. మెటర్నిటీ దుస్తుల అవసరం.. సౌకర్యం.. కొనుగోలు చేసే ఆర్థిక స్థితి వంటివన్నిటి మీదా ఆరా తీసింది. దాదాపు 87 శాతం మంది గర్భిణీలు దేశీ మెటర్నిటీ గార్మెంట్స్ అవసరం ఉందని చెప్పారు. తమకు నప్పే సైజుల్లో దొరికితే కొంటామనీ తెలిపారు. ఆ సమాధానాలు విన్నాక తన ఆలోచన సరైనదేననే నమ్మకం కుదిరింది శాలినీకి. ముందుకు కదిలింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా.. ఇటు గుజరాత్ నుంచి మిజోరమ్ దాకా.. ఆయా ప్రాంతాల్లో ఉన్న చేనేత మహిళా కార్మికులు అందరి చేనేత కళను తన సృజనలో భాగస్వామ్యం చేసింది. మమీయూను కమ్యూనిటీ బేస్డ్ క్లాతింగ్ బ్రాండ్‌గా మలచి.. తాలుకా, మండల, జిల్లా కేంద్రాల నుంచి మెట్రో నగరాల దాకా కొనుగోలుదార్లను క్రియేట్ చేసుకుంది. ఇలా గ్రామీణ మహిళా చేనేత కార్మికుల నైపుణ్యంతో పట్టణ మహిళల అవసరాన్ని తీర్చుతూ భారతీయ మార్కెట్లో మెటర్నిటీ గార్మెంట్స్‌కి కొరత లేకుండా చేసింది. ‘ఇలా బ్రాండ్‌ను లాంచ్ చేయగానే అలా లాభాలు వచ్చిపడలేదు. చాలా సవాళ్లనే ఎదుర్కొన్నాను. రిక్రూట్మెంట్ కన్సల్టెంట్‌గా దేశంలోని డిఫరెంట్ సిటీస్‌లో పనిచేయడం వల్ల.. ఎక్కడ ఏ స్కిల్ దాగుంది.. దాన్ని ఎలా వాడుకోవాలి వంటివన్నీ తెలియడం.. నా ఈ కొత్త కెరీర్‌కు చాలా హెల్ప్ అయింది. చాలెంజెస్‌ను హ్యాండిల్ చేయడమూ ఈజీ అయింది. నేను హిమాచల్ ప్రదేశ్‌లో పుట్టి పెరగడం వల్ల నా వర్క్ ప్లేస్‌నీ అక్కడే పెట్టుకున్నాను. ప్రస్తుతం మా బ్రాండ్ కోసం హిమాచల్, సోలన్ జిల్లాలోని పందొమ్మిది గ్రామాలకు చెందిన దాదాపు 450 మంది మహిళా చేనేత కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్లంతా 21 నుంచి 68 ఏళ్ల లోపు వారు. డిఫరెంట్ వర్క్ స్కిల్స్.. డిఫరెంట్ వర్క్ టైమింగ్స్‌లో పనిచేస్తూ మమీయూ బ్రాండ్ సక్సెస్‌కి తోడ్పడుతున్నారు’ అంటుంది అంట్రప్రెన్యూర్‌గా మారిన మదర్ శాలినీ శర్మ. జాబ్స్ ఫర్ హర్.. ఉపోద్ఘాతంలో ప్రస్తావించిన వర్కింగ్ మదర్స్ మీద సర్వే చేసిన సంస్థే ఇది. దీన్ని స్థాపించింది కూడా ఓ వర్కింగ్ మదరే. పేరు నేహా బగారియా. స్వస్థలం బెంగళూరు. ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్, ఎడ్యుకేషన్ అంట్రప్రెన్యూర్ కూడా! ఇద్దరు పిల్లలు పుట్టాక వాళ్లను చూసుకోవడానికి మూడేళ్లు విరామం తీసుకుంది. ఆ టైమ్‌లోనే.. లాయర్స్, ఆర్కిటెక్ట్స్, ఇంజినీర్స్, ఎంబీఏస్గా సక్సెస్ఫుల్ కెరీర్లో ఉన్న తన ఫ్రెండ్స్ కొంతమంది పిల్లలు పుట్టగానే ఉద్యోగాలకు రాజీనామా చేయడం.. వాళ్లు కాస్త పెద్దయ్యాక మళ్లీ ఉద్యోగంలో చేరడానికి ప్రయత్నించి విఫలమవడం చూసింది. ఆ వైఫల్యానికి కారణాలను వెదికింది.. అధ్యయనం చేసింది. ‘తల్లులు అయ్యాక మళ్లీ ఉద్యోగంలో జాయిన్ కావడానికి.. లేదా మళ్లీ కెరీర్ స్టార్ట్ చేయడానికి వాళ్లకు ఇంటి నుంచి సమాజం దాక ఎక్కడా సపోర్ట్ లేదు. అంతటా వాళ్లను ఓ గిల్ట్‌లోకి నెట్టే వాతావరణం.. వివక్షే! ఇంటి పట్టున బిడ్డ ఆలనా పాలనా చూసుకోక.. ఉద్యోగాలు ఏంటీ అని వాళ్లలో ఓ అపరాధభావాన్ని క్రియేట్ చేస్తున్నారు. దాన్ని లెక్కచేయకుండా ఉద్యోగాలు చేస్తున్న తల్లులను పంక్చువాలిటీ, పెర్ఫార్మెన్స్ పేరుతో ఆత్మన్యూనతకు, వివక్షకు గురిచేస్తున్నారు. దీంతో వాళ్లు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి తమకున్న నైపుణ్యాలను పట్టించుకోవట్లేదు. జాబ్, కెరీర్‌కి సంబంధించి అప్టు డేట్ కాలేకపోతున్నారు. అందుకే తల్లులు అవగానే దాదాపు యాభై శాతం మంది ఉద్యోగానికి ఓ దండం పెట్టేసి ఇంటి పట్టునే ఉండిపోతున్నారు. వీటిని అధిగమించడానికి కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడం.. స్కిల్స్‌ని పెంపొందించుకోవడం.. వివక్షను ఎదుర్కోవడానికి సంసిద్ధమవడం వర్కింగ్ మదర్స్‌కి తప్పనిసరి అని అర్థమైంది’ అంటుంది నేహా. దానికి తగిన శిక్షణ కావాలనీ గ్రహించింది. అలా వాళ్లను ట్రైన్ చేసి.. వాళ్ల చేత సెకండ్ కెరీర్ స్టార్ట్ చేయించాలనీ నిశ్చయించుకుంది. అటు వైపుగా రెండు అడుగులు వేస్తూ తనూ సెకండ్కెరీర్ను స్టార్ట్ చేసింది. అదే జాబ్స్ ఫర్ హర్ సంస్థ. మాతృత్వంతో ఉద్యోగం లేదా కెరీర్‌కి బ్రేక్ ఇచ్చి.. మళ్లీ ఎంటర్ కావాలనుకునే వాళ్లకు అన్నిరకాలుగా తర్ఫీదునిచ్చి.. దేశంలోని ఉద్యోగ అవాకాశాల గురించీ ఎరుకనిచ్చి వాళ్లు మళ్లీ ఆర్థికస్వావలంబన సాధించేలా కృషి చేస్తుందీ జాబ్స్ ఫర్ హర్ సంస్థ. దీన్ని మొదలుపెట్టే ముందు నన్ను నేను కూడా అన్ని ప్రతికూలతలకు సిద్ధం చేసుకున్నా. ఇటు అత్తిల్లు, అటు పుట్టిల్లు నుంచి బంధువులు, స్నేహితులు, నా ఇరుగు, పొరుగులతో ఒక సపోర్ట్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకున్నా. ఇదంతా ఇప్పుడు నేను మీకు చెప్తున్నంత తేలికగా సాగలేదు. అయినా నా ప్రయత్నం మానలేదు. నా సంస్థలో ఉద్యోగులకు.. తర్ఫీదు కోసం వచ్చే వారికీ ఇదే చెబుతా. ముందు మనకున్న భయాలను గుర్తిస్తే.. వాటిని ఎదుర్కొనే దారి దొరుకుతుంది. అదే మన విజయానికి మార్గం. అందుకే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.. భయమే గనుక లేకపోతే మీరేం సాధించాలనుకుంటున్నారు అని’ అంటూ వర్కింగ్ మదర్స్‌కి ధైర్యాన్నిస్తోంది నేహా బగారియా. మిష్రీ డాట్ కామ్ జర్నలిజంలో తనూ గంగూలీకి 20 ఏళ్ల అనుభవం. ఎన్డీటీవీ ఫుడ్ చానెల్‌కి పదేళ్లపాటు ఎడిటర్‌గా పనిచేసింది. ఆమెకు పదకొండేళ్ల కొడుకు ఉన్నాడు. పిల్లాడు పుట్టినప్పటి నుంచి అనుకునేది.. కెరీర్ మారాలి అని. ఎక్కడో ఉద్యోగం కంటే తనే సొంతంగా ఏదైనా మొదలుపెడితే.. ఇటు మాతృత్వాన్నీ ఆస్వాదించవచ్చు.. అటు ఆర్థిక స్వేచ్ఛనూ కాపాడుకోవచ్చు అని. తను ఫుడ్ చానెల్‌తో అసోసియేట్ అయ్యుండడం వల్ల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఎంతోమంది ఫుడ్‌కి సంబంధించి తనను ఎన్నో సలహాలు అడిగేవారు. ఎన్నో సందేహాలను తీర్చుకునేవారు. వాళ్లందరికీ ఆమె మీదున్న ఆ నమ్మకమే ఆమెలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ముందు సొంతంగా ఓ రెస్టారెంట్ పెట్టుకోవాలని యోచించింది. తర్వాత అది ఫుడ్ రివ్యూ వెబ్‌సైట్‌గా డిసైడ్ అయింది. అదే మిష్రీ డాట్ కామ్ . మొదలై నాలుగేళ్లవుతోంది. గృహిణులు, మదర్‌హుడ్ కారణంగా జాబ్ వదిలేసిన తల్లులు తమ కిచెన్ స్కిల్స్‌కు సానబెట్టుకునే అవకాశాన్ని కల్పించే వేదిక అది. దేశంలోనే.. ఫుడ్ ప్రొడక్ట్స్‌ని రివ్యూ చేసే తొలి వెబ్సైట్ కూడా! ‘మన ఎక్స్పీరియెన్సే మన ఆలోచనలకు ఓ రూపమిస్తుంది. అలా ఫుడ్ చానెల్లోని నా వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌నే నా ఈ ఫుడ్ రివ్యూ వెబ్సైట్ మీద ఇన్వెస్ట్ చేశా. సక్సెస్ చూస్తున్నా. ఈ వెబ్సైట్లో దాదాపు 90 శాతం ఉద్యోగులు మహిళలే. వాళ్లకు అనుకూలమైన టైమ్‌లోనే పనిచేస్తారు. ఎలాంటి ఒత్తిడీ ఉండదు’ అంటుంది తనూ గంగూలీ. వీళ్లు సరే... సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తమ మదర్ హుడ్‌తో ఇన్ఫ్లుయెన్స్ చేసి.. మామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా వేల.. లక్షల ఫాలోవర్స్‌తో సోషల్ మీడియా సెలిబ్రిటీలుగా మారిన అమ్మలూ ఉన్నారు. వాళ్లలో కొందరు ఇక్కడ.. అనుప్రియ కౌర్.. ఆమె ఇన్స్టాగ్రామ్ చూడగానే అర్థమవు తుంది.. ఆమె యాక్టివ్ అండ్ ఫిట్ అని! కార్పొరేట్ ఉద్యోగిని. పేరెంటింగ్ టిప్స్ నుంచి ఫిట్నెస్, శారీ ఫ్యాషన్ వరకు చాలా విషయాల మీద పోస్ట్‌లు పెడుతుంది. రిద్ధి డోరా సర్టిఫైడ్ పేరెంటింగ్ అండ్ లైఫ్ కోచ్. ముఖ్యంగా తొలి చూలు తల్లులకు పిల్లల పెంపకం మీద సలహాలు, సూచనలు ఇస్తూంటుంది. తన ఈ సేవలను సోషల్ మీడియాకే పరిమితం చేయకుండా కార్పొరేట్స్ కోసం బయట కూడా వర్క్‌షాప్స్ నిర్వహిస్తుంటుంది. ‘న్యూ మదర్స్.. ఎలాంటి ఒత్తిడి లేకుండా.. ప్రశాంతంగా.. సంతోషంగా మాతృత్వాన్ని ఆస్వాదించాలనే లక్ష్యంతో వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నాను’ అంటుంది. చావి మిత్తల్ ‘మామ్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్’విన్నర్. కంటెంట్ క్రియేటర్. ‘బీయింగ్ ఉమన్ (b్ఛజీnజఠీౌఝ్చn)’ వ్యవస్థాపకురాలు కూడా అయిన చావి.. పేరెంటింగ్‌కి సంబంధించి అన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. సరు ముఖర్జీ శర్మ ‘డైపర్స్ అండ్ లిప్స్టిక్స్’ పేరుతో పేరెంటింగ్ నుంచి ఫ్యాషన్, ఫిట్నెస్ దాకా అన్ని విషయాల మీద పోస్ట్‌లు పెడుతుంది. ‘అమ్మ అవగానే అన్నిటినీ వదిలేయాల్సిన అవసరం లేదు. మన మీద మనకూ శ్రద్ధ చాలా అవసరమని’ చెప్తుంది సరు .. తన బ్లాగ్‌లోని ‘బికాజ్ యూ ఆర్ మోర్ దాన్ జస్ట్ ఏ మామ్’ అనే స్టేట్మెంట్తో! శ్రద్ధ సింగ్.. యూట్యూబ్‌లో చాలా పాపులర్. ఇన్‌స్టాలో కూడా బ్యూటీ, ఫ్యాషన్, పేరెంట్‌హుడ్‌కి సంబంధించిన వ్లాగ్స్, పోస్ట్‌లను షేర్ చేస్తుంటుంది. ఆమెకు ఓ కూతురు.. పేరు.. కైనా... కికీగా ఇన్‌స్టాలో ప్రసిద్ధి. తన పేరు, తన కూతురు పేరుతో కికి అండ్ శ్రాడ్స్తో ఇంకో ఇన్‌స్టా అకౌంట్ కూడా ఉంది. అందుతో రోజూ తన కూతురు చేసే అల్లరి.. ముద్దు ముచ్చట్లను పోస్ట్ చేస్తూంటుంది. మదర్స్ డే గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన మరో సెలబ్రిటీ.. ‘మామ్.. షెఫ్.. బైకర్ గర్ల్.. స్కూబా డైవర్ అండ్ యాక్టర్’ సమీరా రెడ్డి! ఈ టైటిల్స్ అన్నీ ఆమె ఫేస్బుక్ ప్రొఫైల్‌లో ఉంటాయి. అన్నిట్లోకి మామ్ అంటూ తనకున్న ‘అమ్మ’ అనే హోదానే ముందు పెట్టుకుంది సమీరా. ఒకప్పుడు గ్లామర్ వరల్డ్‌లో మెరిసిన ఈ తార.. తల్లి అయిన తర్వాత శరీరాకృతిలో వచ్చిన మార్పుల దగ్గర్న నుంచి వయసుతో పాటు వచ్చే మార్పుల వరకూ ఎలాంటి ఫిల్టర్లు.. మేకప్ లేకుండా తనను తనలాగే ఇన్‌స్టాలో ప్రెజెంట్ చేసుకుంటుంది. గ్లామర్ రంగంలో వైట్ స్కిన్ పట్ల ఉన్న అబ్సేషన్ తనను బాధించినా.. తనకున్న డస్కీ స్కిన్‌ను ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా మలచుకుని బాడీ పాజిటివిటీకి ప్రతీకగా నిలిచింది. అందంగా కనిపించడం కోసం మేకప్ నుంచి కాస్మెటిక్ సర్జరీల దాకా వెళ్తున్న కాలం ఇది. దానికి సమీరా రెడ్డి ఫక్తు వ్యతిరేకి అని ఆమె ‘ఇంపర్ఫెక్ట్లీపర్ఫెక్ట్’ అనే హ్యాష్‌ట్యాగ్ క్యాంపెయినే చెప్తోంది. ఇవన్నీ సరే.. మానసిక అనారోగ్యాల పట్లా అంతే బోల్డ్‌గా పోస్ట్‌లు పెట్టి వాటి మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఎవరి కేస్ స్టడీలో తీసుకోకుండా తొలి ప్రసవం తర్వాత తాను అనుభవించిన పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ గురించే రాసి.. చర్చను లేవనెత్తింది. ‘మానసిక అస్వస్థత కనిపించదు.. అది ఉంటుంది అంతే. దాన్ని ఎదుర్కొని ఆరోగ్యవంతులం కావాలంటే ముందు ఆ మానసిక రుగ్మతల మీద మనకు అవగాహన రావాలి. అంతెందుకు నా విషయమే తీసుకుంటే నేను పోస్ట్‌పార్టమ్ స్ట్రెస్ నుంచి అంత త్వరగా బయటపడలేక పోయాను. కారణం దాని మీద నాకు సరైన అవగాహన లేకపోవడమే’ అంటుంది సమీరా రెడ్డి. ఇవన్నిటితోపాటు తన పిల్లలతో ఆమె చేసే రీల్స్‌కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. పెళ్లి, పిల్లలు కాగానే అప్పటిదాకా హీరోయిన్గా వెలిగిన నటికి తల్లి పాత్రలు.. కాస్త నాజూగ్గా ఉంటే అక్క, వదిన పాత్రల అవకాశాలు వస్తుంటాయి. అలాంటి స్టీరియోటైప్ క్యారెక్టర్లకు కాల్షీట్స్ ఇవ్వకుండా.. తల్లి అయిన తర్వాతా అభినయానికి అవకాశమున్న ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్న నటీమణులూ ఉన్నారు. రెండు డైలాగులు, నాలుగు పాటలకు పరిమితమయ్యే హీరోయిన్లుగా కాకుండా కథను ప్రభావితం చేసే ఇంకా చెప్పాలంటే కథానాయకుడి కన్నా ప్రాధాన్యమున్న భూమికల్లో నటిస్తున్నారు. గ్లామర్ గ్రామర్ని మార్చేస్తున్నారు. ఆ జాబితాలో బాలీవుడ్ ముందుంది. అందులో కాజోల్, కరీనా కపూర్, రాణి ముఖర్జీ, ఐశ్వర్యరాయ్ వంటివారు కనిపిస్తున్నారు. ఈ సూపర్ మామ్స్కీ కుడోస్.. బాక్సర్ మేరీ కామ్ అంటే తెలియని వాళ్లుండరు! 2012లో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ అందుకుంది తను తల్లి అయ్యాకే! 2007లో సిజేరియన్ ద్వారా కవలలకు జన్మనిచ్చిన మరుసటి ఏడాదే అంటే 2008లో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్ పోటీల్లో స్వర్ణం సాధించింది. ప్రసవం తర్వాత తను మళ్లీ బరిలోకి దిగుతాను అని మేరీకామ్ ప్రకటించగానే.. ఏదో ఉత్సాహపడుతుంది కానీ.. ఏం సాధిస్తుందిలే అని పెదవి విరిచిన క్రీడా విశ్లేషకులు.. క్రీడాభిమానులూ ఉన్నారు. వాళ్లందరికీ తన విజయాలతో సమాధానం చెప్పిందీ సూపర్ మామ్ మేరీ కామ్. ఈ వరుసలోనే సానియానూ కొనియాడాలి. ప్రసవానంతర మార్పులకు ఏ మాత్రం బెదరక అదే ఆట తీరుతో లాన్ టెన్నిస్ కోర్ట్‌లో సాధించిన విజయాలతో తన కొడుకు దోసిళ్లు నింపింది. ఆ స్ఫూర్తికి హ్యాట్సాఫ్! ఈ గెలుపు కథలు మచ్చుకు కొన్ని మాత్రమే! ఇలాంటి విజేతలైన అమ్మలు మనింట్లో.. మన చుట్టూరా ఉంటారు. కాకపోతే మనం చూడం! ఒకసారి తలెత్తి చూసి.. తలవంచి గౌరవించమనే ఈ కథన సారాంశం. -
International Mothers Day: ఆలోచింప చేసే అమ్మ కథ
‘అమ్మను మసిగుడ్డలా చూస్తున్నామా?’ అని ప్రశ్నిస్తుందో తెలుగు కథ. ‘ఇంట్లో నుంచి బయటకు పో అని అమ్మను నాన్న ఎందుకు అంటుంటాడు’ అని నిలదీస్తుంది మరో కథ. ‘అమ్మ ఒంటి నిండా మందులు చేరడానికి కారణం ఎవరు?’ అని వేదన చెందుతుంది ఇంకో కథ. ‘అమ్మకు కంటి నిండా నిద్రన్నా ఉంటుందా?’ అని కన్నీరు కారుస్తుంది కథ. ‘మదర్స్ డే’ రోజున అమ్మను తలచుకోవడం, గౌరవించడం అందరూ చేసేదే. కాని ఆమె గురించి ఆలోచించాలి. సరిగా ఆలోచించాలి. ఆమె శ్రమను, గౌరవాన్ని, స్థానాన్ని సమస్థాయిలో ఉంచడం గురించి తెలుగులో వచ్చిన కొన్ని గొప్ప కథల ప్రస్తావన... ఆమె పేరు ఏమిటో ఆమెకు గుర్తు లేదు. భర్త ‘అది’ అంటాడు. ఇంటికి రాగానే ‘అదెక్కడా?’ అని కొడుకును అడుగుతాడు. కొడుక్కు కూడా ‘అది’ అనడం అలవాటే. ‘పిల్లల బాధ నీకెందుకు? అది చూసుకుంటుంది కదా’ అని అంటుంటాడు. ఈ ‘అది’ ఆ ఇంట్లో ఏనాడూ కూచోవడానికి వీల్లేదు. నిలబడి చేస్తూ ఉండాల్సిందే. భర్త రిటైరైనా పార్ట్‌టైమ్ జాబ్ చేస్తూ సంపాదిస్తూ ఉంటాడు కాబట్టి అతను ఇంట్లో హాయిగా కూచోగలడు. కొడుకు, కోడలు ఉద్యోగాలు చేస్తారు. డబ్బు ఉంది. వాళ్లు కూచుంటారు. ఈ ‘అది’కే ఏ సంపాదనా లేదు. ‘నేను తల్లిని కదా’ అనుకుంటుంది. అయితే? ‘నేను అత్తగారిని, నానమ్మని కదా’ అనుకుంటుంది. అయితే? ఇంట్లో ఎవరికీ ఏ విలువా లేదు. ‘అది.. ఇది’ అనడమే. ఒకరోజు ఆమె గేటు దగ్గర నిలబడి ఉంటే ఇద్దరు పనమ్మాయిలు మాట్లాడుకుంటూ వెళుతుంటారు. ఒకమ్మాయి అంటుంటుంది– ‘ఆ ఇంట్లో పని మానేశాను. ఆదివారం కూడా చేయిస్తున్నారు’ అని. విన్న ఆమె దిగ్భ్రమ చెందుతుంది. ఇన్నేళ్లుగా ఇంత చాకిరీ చేస్తున్నా ప్రతిఫలం లేకపోగా చులకనగా చూడటమా? ఉన్నది ఉన్నట్టుగా ఆ పని మనుషుల వెంట నడుస్తుంది. ‘మనలాంటి వాళ్ల కోసం ఒక మేడమ్ మంచి హోమ్ నడుపుతున్నారు. అక్కడ చేర్పిస్తాం. పద’ అని వాళ్లు తీసుకెళ్లి చేర్పిస్తారు. ఆ మేడమ్ ఆమెను పేరు అడుగుతుంది. ఏనాడో మర్చిపోయిన పేరును గుర్తు చేసుకోవడం వల్ల ఆ తల్లి కొత్త అస్తిత్వం, ఆత్మగౌరవం పొందుతుంది. కె.రామలక్ష్మి రాసిన ‘అదెక్కడ’ కథ ఇది. ఇలా ఇంట్లో అమ్మను చూసుకుంటున్నవారు ఉంటే ఈ కథ చెప్పే నీతి ఏమిటో గ్రహించాలి. ఒక ఇంట్లో ఒక తల్లి మరణిస్తుంది. దుప్పటి తీసి చూసిన భర్త అదిరిపోతాడు. ఎందుకంటే ఆమె శరీరం మొత్తం సుద్దముక్కలా తెల్లగా అయిపోయి ఉంటుంది. ఇలా ఎందుకు జరిగింది? ఇదేం వింత జబ్బు? ఆ కాలనీలో ఉన్న ఒక చురుకైన అమ్మాయి ఆ తల్లి ఒంటి నుంచి చిన్న ముక్క తీసి ల్యాబ్‌కు పరిగెత్తి పరీక్ష చేయిస్తే ఆ ముక్క ‘ఆస్ప్రిన్’ టాబ్లెట్ అని తేలుతుంది. అంటే ఆమె శరీరం మొత్తం మందు బిళ్లలతో నిండిపోయిందా? అందుకే సుద్దముక్కలా మారిందా? నిజానికి ఆ చనిపోయినామెకు ‘సూపర్ మామ్’ అని పేరు. పిల్లల్ని బాగా పెంచేది. భర్తను బాగా చూసుకునేది. ఇల్లు బాగా పెట్టుకునేది. పైగా ఉద్యోగం చేస్తూ ఇవన్నీ చేసేది. పిల్లల్ని చదివించి, ప్రయోజకుల్ని చేసి, అమెరికా సంబంధాలు చూసి సెటిల్ చేసి... ఇన్ని చేసి అందరి ప్రశంసలు పొందిన ఆమె కొన్ని విషయాలు దాచింది. ఏమిటవి? ఆఫీసు పని వొత్తిడితో రోజూ ఒక తలనొప్పి మాత్ర వేసుకునేది. ఇంటి పనులకు ఆటంకం రాకుండా ఒళ్లు ఏమాత్రం వెచ్చబడినా ఒక మాత్ర వేసుకునేది. శుభకార్యాలకు అడ్డు రాకుండా నెలసరిని వెనక్కు నెట్టడానికి మాత్రలు వేసుకునేది. గర్భసంచి తీయించేస్తే సప్లిమెంట్లు తెగ మింగింది. హార్మోనల్ ఇంబేలెన్స్ అంటే అందుకు మళ్లీ మందులు. అనారోగ్యం గురించి చెప్పి భర్తను, పిల్లల్ని డిస్ట్రబ్ చేయకుండా ఏ ఇబ్బంది వచ్చినా మాత్రలే మాత్రలు. అందుకే మరణించగానే ఒళ్లు అలా తెల్లబడింది. తేలిపోయింది. ఇది అర్థమయ్యాక, ఆమె సూపర్‌మామ్ సిండ్రోమ్‌తో మరణించిందని అర్థమయ్యాక ఆ కాలనీ అమ్మాయి తన తల్లి దగ్గరకు పరిగెడుతుంది. ‘అమ్మా... నువ్వు గొప్పల కోసం నిన్ను నువ్వు బలిపెట్టుకోకు. కొద్దిగానే పని చెయ్. విశ్రాంతి తీసుకో. ఆరోగ్యం మెరుగు పర్చుకో’ అని చెప్పడానికి. కె.సత్యవతి రాసిన ‘సూపర్‌మామ్ సిండ్రోమ్’ ఇస్తున్న సందేశం అర్థమైందిగా. ఒక భర్త భార్య మీద కోపం వచ్చిన ప్రతిసారీ ‘పో నా ఇంటి నుంచి’ అంటుంటాడు. అది అతని ఊతపదం. ఏ ఇల్లయినా భర్తదే. భార్యది కాదు. తండ్రిదే. తల్లిది కాదు. అందుకే భర్తలు భార్యల్ని ఇంటి నుంచి గెంటేస్తుంటారు. లేదా గెంటేస్తానని బెదిరిస్తుంటారు. పిల్లల్ని కన్నా, పొదుపు చేసి ఆ డబ్బు భర్త చేతిలో పెట్టినా, ఇల్లు దగ్గరుండి కట్టించినా, అందులో సంసారం చేసినా ఆ ఇల్లు మాత్రం ఆమెది కాదు. అతనిదే. ఒకరోజు ఆమెకు చివుక్కుమంటుంది. ఇంటి నుంచి రెండు మూడు చీరలతో బయటపడి దూరంగా ఒక గది అద్దెకు తీసుకుంటుంది. చిన్న ఉద్యోగం వెతుక్కుంటుంది. స్టవ్వు గివ్వు పెట్టుకుని ఇంకెవరూ తనని బెదిరించ లేని తన ఇంట్లో ఉంటుంది. దాంతో ఆ భర్త తెగ కంగారు పడిపోతాడు. కాలనీ కంగారు పడుతుంది. బంధువులు కంగారు పడతారు. కాని ఆమె మాత్రం ‘అతడికి విడాకులు ఇవ్వను. కావాలంటే నా దగ్గరకు వచ్చి నా ఇంట్లో ఉండమనండి‘ అని వర్తమానం పంపుతుంది. ఏం కథ ఇది. ఏ ఇంట్లో అయినా అమ్మ ఈ మూడ్‌లో ఉందేమో ఎవరు గమనించాలి? ఇది కవన శర్మ ‘ఆమె ఇల్లు’ కథ. పాటిబండ్ల రజని రాసిన ‘జేబు’ కథ ఉంటుంది. అందులో ఒకామె అందరూ జేబు రమణమ్మ అని పిలుస్తూ ఉంటారు. దాని కారణం ఆమె తన బాల్యంలో తల్లి ప్రతి రూపాయి కోసం తండ్రి దగ్గర చేయిజాస్తూ ఉండటమే. అలా తాను ఉండకుండా తన రవికకో, చీర కుచ్చిళ్లకో ఒక జేబు ఉండాలని భావిస్తుందామె. అలా జేబులాంటి గుడ్డ సంచిని దోపుకునే బతుకుతుంది. పసుపు కుంకాలుగా కోడలు తెచ్చిన భూమిని భర్త, కొడుకు అమ్మబోతే వారించి ‘అది కోడలి ఆర్థిక భద్రత కోసం ఉండాలి’ అని గట్టిగా నిలబడుతుంది. అమ్మకు ఉండాల్సిన ఆర్థిక స్వాతంత్య్రం గురించి ఆర్థిక గౌరవం గురించి ఆలోచిస్తున్నామా మనం. ‘మసిగుడ్డ’ లేకుండా వంట చేయడం అసాధ్యం. కాని మసిగుడ్డకు ఏ విలుగా ఉండదు. పిల్లల్ని తల్లి పెంచుతుంది. కాని ప్రోగ్రెస్ కార్డ్ మీద తండ్రి సంతకం చేస్తాడు. పిల్లలకు తల్లి ఒండి పెడుతుంది. కాని పిల్లలు వెచ్చాలకు డబ్బులిచ్చే తండ్రినే గౌరవిస్తారు. బంధువులు శుభలేఖ ఇస్తూ దానిపై అతని పేరే రాస్తారు. ఆస్తిపన్ను, కరెంటు బిల్లు, ఇంటి గడపకు నేమ్‌ప్లేట్ అన్నీ అతనివే. ఆమె మసిగుడ్డ. కాని అది లేకపోతే ఏ పనీ జరగదు. కుప్పిలి పద్మ రాసిన ‘మసిగుడ్డ’ కథ ఇది. కిచెన్‌లోకి నేడు వెళ్లి చూసినా అమ్మ పాత జాకెట్టే మసిగుడ్డగా కనిపిస్తుంది. నాన్న పాత చొక్కా కాదు. అమ్మకు గౌరవం ఇవ్వలేమా? బతికినంత కాలం ఇంటి చాకిరీలో పడి, తెల్లవారుజామునే లేస్తూ, రాత్రి లేటుగా వంట గది సర్దుకుని పడుకుంటూ, చంటి పిల్లల వల్ల, వృద్ధులైన అత్తమామల వల్ల, వేరే సవాలక్ష బాధ్యతల వల్ల కంటి నిండుగా నిద్రపోని ఒక తల్లి తనకు నిద్ర కావాలని, కనీసం ఈ వృద్ధాప్యంలో అయినా హాయిగా నిద్రపోవాలని గుప్పెడు నిద్ర మాత్రలు మింగుతుంది. కంటి నిండా నిద్ర పోయే ‘లగ్జరీ’ ఇవాళ్టికీ అమ్మకు ఉందా? అమ్మ గురించి మదర్స్ డే సందర్భంగా ఆలోచిద్దాం. అమ్మను మొదట మనిషిగా చూస్తే, వ్యక్తిగా చూస్తే, పౌరురాలిగా చూస్తే ఆమె హక్కులు అర్థమవుతాయి. ఆ హక్కులు ఆమెకు మిగల్చడమే అందరి విధి. -
నేను మంచి కొడుకును కాదమ్మా.. అంటూ ఆర్జీవీ పోస్ట్
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది వెరైటీగానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో బర్త్‌డే సహా ప్రతీ వేడుకను సెలబ్రేట్ చేసుకుంటున్న వర్మ తాజాగా మదర్స్ డే రోజున అపురూమైన ఫోటోను షేర్ చేశారు. 'హ్యాపీ మదర్స్ డే అమ్మ. నేను మంచి కొడుకును కాదు కానీ తల్లిగా నువ్వు చాలా మంచిదానివి'.. అంటూ తల్లితో కలిసి దిగిన ఫోటోను ట్విటర్లో పంచుకున్నాడు. ఇందులో ఆర్జీవీ చేతిలో గ్లాస్ పట్టుకొని కనిపించడం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది చూసిన నెటిజన్లు.. మీరు కూడా విషెస్ చెబుతున్నారా.. అంతే ఆర్జీవీ ఎప్పటికీ అర్థం కాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Happy Mother’s Day Mom, I am not as good as a son but u are more than good as a mother 💐💐🙏 pic.twitter.com/uZ7E9ngeMy — Ram Gopal Varma (@RGVzoomin) May 8, 2022 -
తొలిసారి కొడుకు ఫోటోలు షేర్ చేసిన కాజల్ అగర్వాల్
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవలె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కొడుకుకు నీల్ కిచ్లూ అని ఇప్పటికే పేరు పెట్టేసింది. చిన్నారి రాకతో కాజల్ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. 2020లో గౌతమ్ కిచ్లు అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న కాజల్ ఆ తర్వాత కూడా సినిమాలు చేసింది. అయితే ప్రెగ్నెన్సీ తర్వాత మాత్రం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం మథర్‌వుడ్‌ని ఎంజాయ్ చేస్తోన్న కాజల్ డెలివరీ తర్వాత తొలిసారిగా ఒక ఫోటోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మథర్స్ డే సందర్భంగా తొలిసారి తన కొడుకు నీల్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. నిషా అగర్వాల్, ఆమె కొడుకు సహా కుటుంబసభ్యులు నీల్‌ను ఎత్తుకొని ముద్దుచేస్తున్న ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ సందర్భంగా తొలిసారి తల్లైన కాజల్‌కు ప్రముఖులు సహా నెటిజన్లు మథర్స్ డే విషెస్‌ను తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కాజల్ షేర్ చేసిన కొడుకు ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
వెండితెర తల్లులు.. ఆనాటి నుంచి ఈనాటి వరకు
శ్రీనివాసుడు తల్లి వకుళాదేవిగా నటించారు శాంతకుమారి. కృష్ణ, శోభన్‌బాబుల తరం రాగానే తల్లిగా మారారు అంజలీ దేవి. పండరీబాయి లేకుంటే ఎన్నో తల్లి పాత్రలు తెల్లముఖం వేసేవి. అమ్మంటే అన్నపూర్ణే అన్నట్టు ఒక కాలం గడిచింది. అమ్మ లేని కథ లేదు. అమ్మ లేని సినిమా ఉండదు. తెల్లజుట్టు అమ్మల కాలం నుంచి నల్లజుట్టు అమ్మలు వచ్చినా పాత్రల ప్రాభవం పోలేదు. నటీమణుల డిమాండ్ తగ్గలేదు. ఆ కాలం తల్లుల నుంచి ఈ కాలం తల్లుల వరకూ ‘మదర్స్ డే’ సందర్భంగా రీలు తిప్పేద్దామా? పౌరాణికాలలో ప్రేక్షకులు తప్పక మెచ్చే తల్లులు ఇద్దరు ఉన్నారు. ఒకరు కుంతీ దేవి. మరొకరు సీతమ్మ తల్లి. కుంతీదేవిగా అందరు నటీమణులు సరిపోరు. ఆ పాత్రలో రాజసం, అదే సమయంలో అమాయక తెగింపు ఉండాలి. ఎస్.వరలక్ష్మి ఆ పాత్రను ‘దానవీరశూరకర్ణ’లో గొప్పగా పోషించారు. ఇక సీతమ్మ తల్లి అంటే తెలుగువారికి అంజలీదేవే. ఆమె ‘లవకుశ’లో లవకుశుల తల్లిగా బిడ్డల కోసం పరితపించే మాతృమూర్తిగా చెరగని ముద్ర వేశారు. ‘భక్త ప్రహ్లాద’ను కన్నతల్లిగా కూడా అంజలీ ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించారు. ఇక అభిమన్యుడిని కన్న పౌరుషమూర్తిగా ‘మాయాబజార్’లో ఋష్యేంద్రమణి కనిపిస్తారు. అదే సినిమాలో శశిరేఖను కన్న లోకరీతి గల తల్లిగా ఛాయాదేవి కనిపిస్తారు. ఛాయాదేవి అంత చక్కగా ఒక్క తల్లి పాత్రలో కనిపించిన మొదటి, చివరి సినిమా అదే. పరమ గయ్యాళిగా భావించే సూర్యకాంతం ‘మాయాబజార్’లోనే అరమరికలు లేని తల్లిగా ఘటోత్కచునితో ‘ఇది నీకు తగదంటిని కదరా’ అని ఎంతో ఆత్మీయంగా అనిపిస్తారు. ∙∙ సాంఘికాలు వచ్చాక బ్లాక్ అండ్ వైట్ చిత్రాల కాలంలో తల్లి పాత్రలు సంఘర్షణతో, కథకు మూలస్తంభాలగానో నిలవడం పెరిగింది. ఈ కాలంలో కన్నాంబ, హేమలత, అంజలీ దేవి, సంధ్య, దేవిక... వీళ్లంతా తల్లి పాత్రల్లో రాణించారు. ఎన్.టి.ఆర్ ‘ఆత్మబంధువు’లో కడుపున పుట్టకపోయినా ఎన్.టి.ఆర్ మీద కన్నాంబ పెంచుకున్న మమత చాలా కదిలించేలా ఉంటుంది. ‘మిస్సమ్మ’లో తప్పిపోయిన కన్నకూతురిని తలుచుకుని బాధపడే ఋష్యేంద్రమణిని చూసి మహిళా ప్రేక్షకులు సానుభూతి చూపిస్తారు. హిందీలో వచ్చిన ‘మదర్ ఇండియా’ భారతీయ సినిమాలలో తల్లి పాత్ర రూపు రేఖలను మార్చేసింది. అంత ఉదాత్తమైన తల్లి పాత్రను తిరిగి తయారు చేయడం ఇప్పటికీ సాధ్యం కాలేదు. ఆ సినిమా రీమేక్‌గా తెలుగులో ‘బంగారు తల్లి’ నిర్మిస్తే హిందీలో నర్గిస్ చేసిన పాత్రను జమున చేశారు. సావిత్రి హీరోయిన్గా ఎంత రాణించారో తల్లి పాత్రల్లో కూడా అంతే రాణించారు. ‘అమ్మ మాట’, ‘కన్నతల్లి’.. రెండు సినిమాల్లోనూ ఆమెది మంచి తల్లి పాత్ర. ఆ తర్వాత ‘గోరింటాకు’ సినిమాలో శోభన్‌బాబుకు తల్లిగా కనిపిస్తారామె. కాని ‘మట్టిలో మాణిక్యం’ సినిమాలో భానుమతిది వదిన పాత్రే అయినా చలంను ఆమెను కొడుకులా చూసుకోవడం, వెనకేసుకు రావడం చాలా బాగుంటుంది. ఆ పాత్రను అలా ఆమె మాత్రమే చేయగలదు. ∙∙ అయితే డెబ్బైల తర్వాత వచ్చిన కమర్షియల్ సినిమాలన్నీ చిన్నప్పుడు కుటుంబానికి అన్యాయం చేసిన విలన్‌ను గుర్తు పట్టడానికి మాత్రమే ఆ తల్లి ఉండేది. హీరో పెద్దయ్యాక ‘చెప్పమ్మా... ఎవరు మనకింత అన్యాయం చేసింది’ అనంటే ఆ తల్లి విలన్ నాగభూషణం గురించో, రాజనాల గురించో చెబుతుంది. ఈ కాలంలో పండరి బాయి చాలా సినిమాలలో తల్లిగా కనిపిస్తారు. ఆ తర్వాత పుష్పలత, జయంతి, శారద, కాంచన ఆ పాత్రల్లో కనిపిస్తారు. ∙∙ కృష్ణ, శోభన్‌బాబుల తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వచ్చే సమయానికి ముందుతరం హీరోయిన్లు తల్లిపాత్రలకు సిద్ధంగా ఉన్నారు. వీరిలో జయసుధ ఎక్కువగా తల్లి పాత్రలలో ప్రేక్షకులకు నచ్చారు. ఆ తర్వాత జయచిత్ర, సుజాత, శ్రీవిద్య, మంజుల, వాణిశ్రీ... వీరందరూ చాలా సినిమాల్లో తల్లులుగా ఉన్నారు. జయచిత్ర నటించిన ‘అబ్బాయిగారు’ ఆమెను భిన్నమైన తల్లిగా చూపిస్తే మంజుల ‘ప్రేమ’ సినిమాలో కూతురి ప్రేమను అంగీకరించని తల్లిగా గట్టి పాత్రలో కనిపిస్తుంది. వాణిశ్రీ ‘సీతారత్నం గారి అబ్బాయి’ హిట్ అయ్యింది. శారద ‘అమ్మ రాజీనామా’తో పెద్ద హిట్ కొట్టారు. వీరు కాకుండా ‘ముందడుగు’ సినిమాతో గట్టి తల్లి పాత్రతో ముందుకు వచ్చిన అన్నపూర్ణ తెలుగు సినిమాల తల్లిగా ఒక కాలాన్ని ఏలారనే చెప్పాలి. ఆ తర్వాత సుధ ఎక్కువ మంది హీరోలకు తల్లిగా కనిపించారు ∙∙ ఇప్పుడు గ్లామర్ ఉన్న తల్లులు వెండితెర పై కనిపిస్తున్నారు. నదియ, తులసి, పవిత్ర లోకేష్, సుకన్య, రేవతి, రోహిణి, ప్రగతి వీరంతా తల్లులుగా కొత్త హీరోలతో కలిసి నటిస్తున్నారు. నటి శరణ్య గత పదేళ్లలో తెలుగు – తమిళ భాషల్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న తల్లి పాత్రధారిగా గుర్తింపు పొందారు. ఇక రమ్యకృష్ణ ‘బాహుబలి’లో రాజమాత శివగామిగా సంచలనమే సృష్టించారు.సృష్టి మొదలైనప్పటి నుంచి మదర్ సెంటిమెంట్ మొదలైంది. సినిమాలో ఆ సెంటిమెంట్ తప్పక పండుతుంది. నటీమణుల పేర్లు మారుతుండొచ్చు. అమ్మ పాత్ర మారదు. అది చిరకాలం ఉంటుంది. చిరంజీవ అని ఆశీర్వదిస్తూ ఉంటుంది. -
అమ్మ కోప్పడితే నాన్నకు కంప్లైంట్ చేస్తాను : సితార
నేను గర్వపడేలా చేశావు సితూ పాపా...నమ్రత ఎమోషన్ అయ్యారు...కూతుర్ని గట్టిగా హత్తుకున్నారు.అంతే.. సితూ పాప పిచ్చ హ్యాపీ.నువ్వు మా అమ్మలా ఉంటావు...అలా అంటూ కూతుర్ని ముద్దు చేస్తుంటారు మహేశ్‌బాబు. ఇంతకీ అమ్మ ఆనందపడేలా సితూ ఏం చేసింది?‘మదర్స్ డే’ సందర్భంగా తన తల్లి గురించి సితార చెప్పిన ముచ్చట్లు చదివితే తెలుస్తుంది. ►మదర్స్ డే ప్లాన్ గురించి? సితార: అమ్మ కోసం స్పెషల్ గిఫ్ట్ ఒకటి ప్లాన్ చేశాను. అది సర్ప్రైజ్. అలాగే ఆదివారం మొత్తం అమ్మతో స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యాను. ► ఇంట్లో నిన్ను ‘సితూ పాపా’ అని పిలుస్తారు. మీ అమ్మని ‘అమ్మా’ అనే పిలుస్తావా? మామ్ అని కాదా? అమ్మా అనే పిలుస్తాను. అలా పిలిపించుకోవడం అమ్మకు ఇష్టం. ► ఇంతకీ మీ అమ్మగారు ఎంత స్ట్రిక్ట్? అవసరమైనప్పుడు మాత్రమే స్ట్రిక్ట్. మిగతా సమయాల్లో మా అమ్మ చాలా స్వీట్. ► చదువు విషయంలో, స్పోర్ట్స్, డాన్స్ వంటివి నేర్చుకునే విషయంలో అమ్మ ప్రోత్సాహం ఎంతవరకూ ఉంటుంది? స్కూల్ నుంచి రాగానే హోమ్‌వర్క్‌కి స్పెషల్‌గా టైమ్ ప్లాన్ చేస్తుంది. ఆ టైమ్‌కి మేం హోమ్‌వర్క్ చేసేలా చూస్తుంది. ఇక పెయింటింగ్, డాన్సింగ్... ఇంకా స్కూల్ యాక్టివిటీస్ అన్నింటిలోనూ పార్టిసిపేట్ చేసేలా అమ్మ ప్రోత్సహిస్తుంది. ► ఎప్పుడైనా చదువుపట్ల నిర్లక్ష్యంగా ఉంటే మీ అమ్మగారి రియాక్షన్? నిర్లక్ష్యంగా ఉండే చాన్సే లేదు. రోజూ చదువుకోవడానికి ఒక టైమ్ కేటాయించిందని చెప్పాను కదా. ఆ టైమ్‌కి చదవుకోవాల్సిందే. తప్పించుకోవడానికి లేదు. ► అమ్మ కోప్పడినప్పుడు నాన్నకు కంప్లైంట్ చేయడం జరుగుతుందా? జరుగుతుంది. నాకేదైనా కావాలన్నప్పుడు అమ్మ ‘నో’ చెబితే అప్పుడు నాన్నకు కంప్లైంట్ చేస్తాను. ► మీ ఇద్దరి (సితార అన్నయ్య గౌతమ్)లో అమ్మ ఎవర్ని ఎక్కువగా గారాబం చేస్తారు? ఇద్దరంటే అమ్మకి చాలా ప్రేమ. కానీ నేను చిన్నదాన్ని కాబట్టి నన్ను ఎక్కువగా గారాబం చేస్తుంది... హహ్హహ్హా... ► మీ అమ్మగారి నుంచి తీసుకోవాల్సిన మంచి విషయాలు? పాజిటివ్‌గా ఉండాలని చెబుతుంది. అలాగే ఇతరుల పట్ల కైండ్‌గా ఉండాలని కూడా అంటుంది. మన దగ్గర ఉన్నవాటికి కృతజ్ఞతాభావంతో ఉండాలని అమ్మ ఎప్పుడూ చెబుతుంటుంది. ► పండగలప్పుడు ట్రెడిషనల్‌గా డ్రెస్ చేసుకుని, చక్కగా పూజలు చేస్తుంటావు.. అమ్మ నేర్పిస్తుంటారా? నా చిన్నప్పటి నుంచి అమ్మ మన కల్చర్ గురించి మంచి విషయాలు చెబుతూ ఉంది. కల్చర్ పరంగా మమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం అమ్మకి ఇష్టం. మా అమ్మ మహారాష్ట్రీయన్.. నాన్న తెలుగు అని మీ అందరికీ తెలిసిందే. అందుకే ఇంట్లో ఈ రెండు సంప్రదాయాలకు సంబంధించిన పండగలు చేసుకుంటాం. ఫెస్టివల్ సెలబ్రేషన్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తాం. ► మరి... మీ అమ్మగారి మదర్ టంగ్ మరాఠీ వచ్చా? మాట్లాడతాను కానీ అంత ఫ్లూయంట్‌గా రాదు. ► ఫ్రెండ్స్‌తో ఫుడ్ షేర్ చేయడం, కేరింగ్‌గా ఉండటం వంటివి కూడా అమ్మ చెబుతుంటారా? స్కూల్ లేక వేరే చోట ఫ్రెండ్స్‌తో స్పెండ్ చేసినప్పుడు తినడానికి నా దగ్గర ఏం ఉంటే అది వాళ్లతో షేర్ చేసుకుంటాను. నా దగ్గర తక్కువ ఉన్నా సరే షేర్ చేస్తాను. ఎందుకంటే ‘షేరింగ్ ఈజ్ కేరింగ్’ అని అమ్మ చెప్పింది. నేను ఫాలో అయిపోతున్నాను (నవ్వులు). ► మీ నాన్నమ్మలా ఉంటావు కాబట్టి మీ నాన్నగారు ఆ విషయం చెప్పి, గారాబం చేస్తుంటారా? ‘నువ్వు మా అమ్మలా ఉన్నావు’ అని నాన్న ఎప్పుడూ నాతో అంటుంటారు. బాగా ముద్దు చేస్తారు కూడా. కానీ నేను మా అమ్మలా కూడా ఉన్నానని అనుకుంటున్నాను ► నీ యూ ట్యూబ్ చానల్ సక్సెస్ వెనకాల అమ్మ హెల్ప్ ఉందా? అమ్మ బోలెడన్ని ఐడియాలు ఇస్తుంది. అది మాత్రమే కాదు.. షూట్ విషయంలో కూడా హెల్ప్ చేస్తుంది. ► మరి.. ‘సర్కారువారి పాట కోసం’ నువ్వు చేసిన ‘పెన్నీ..’ సాంగ్‌కి ఆమె హెల్ప్ చేశారా? ఆ పాటలో నీ డాన్స్ బాగుంది... ఆ పాట షూట్ మొదలుపెట్టినప్పటి నుంచి పూర్తయ్యేవరకు నా డాన్స్ టీచర్ అనీ మాస్టర్‌తో పాటు అమ్మ నాతోనే ఉంది. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి అనే విషయంలో గైడ్ చేసింది. అలాగే కెమెరా వెనకాల నన్ను చాలా ఎంకరేజ్ చేసింది. ► డాన్స్ మొత్తం పూర్తయ్యాక ఆమె ఏమన్నారు? నా ఫస్ట్ ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగా రావడంతో అమ్మ చాలా హ్యాపీ ఫీలయింది. ‘నన్ను గర్వపడేలా చేశావు’ అని గట్టిగా హత్తుకుంది. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ► పిల్లలకు ఆరోగ్యం బాగా లేనప్పుడు మీ అమ్మగారు ఎలా చూసుకుంటారు? అలాంటి సమయాల్లో మా అమ్మ మా పక్కనే ఉంటుంది. ఒంట్లో బాగాలేనప్పుడు ప్రత్యేకంగా డైట్ ప్లాన్ చేసి, మేం తినేలా చేస్తుంది. టైమ్‌కి టాబ్లెట్లు ఇచ్చి, చాలా కేరింగ్‌గా ఉంటుంది. ► నువ్వు, గౌతమ్ ఏం అడిగినా మీ అమ్మ కొనిపెడతారా? ఐస్‌క్రీములు, చాక్లెట్లు ఎక్కువగా తింటే ఒప్పుకుంటారా? మేం ఏం అడిగినా దాదాపు కాదనదు. అయితే ప్రతిదానికీ ఒక లిమిట్ ఉండాలంటుంది. మితి మీరితే ఏదీ మంచిది కాదని అమ్మ అంటుంది. నేను అమ్మ మాటని ఒప్పుకుంటాను. ► ఈ మధ్య ఫ్యామిలీ టూర్ వెళ్లారు కదా. ఆ విశేషాలు? మేం ప్యారిస్, బోర్దూ, ఫ్రాన్స్‌లోని లూర్దు వెళ్లాం. ఈఫిల్ టవర్ చూశాను. ఫుల్‌గా ఎంజాయ్ చేశాం. – డి.జి. భవాని . -
మదర్స్ డే: మమతల కోవెల..సేవే ‘సాధన’
సాధారణ పిల్లలతో పోలిస్తే intellectual disability(మేధో వైకల్యం) పిల్లలకి చాలాచాలా ప్రేమ కావాలి. ఆదరణ కావాలి. అలాగే ఇలాంటి పిల్లల విషయంలో తండ్రులతో పోలిస్తే తల్లులే ఎక్కువ బాధ్యత తీసుకుంటారు. స్పీచ్ థెరపీ అని, ఫిజియో థెరపీ అంటూ నానా కష్టాలు పడుతూ చాలా జాగ్రత్తగా వాళ్లని ఆసుపత్రులకు తీసుకెడుతున్న తల్లులు చాలామంది మన కంట పడతారు కదా? మరి అలాంటి పిల్లల్ని దాదాపు 148 మందిని అక్కున చేర్చుకుని ఆదరిస్తోంది సాధన హోం.. మెంటల్లీ చాలెంజ్డ్ కిడ్స్ కోసం ఎలాంటి వసతులు ఉన్నాయి. మానవతకు ప్రతీకగా నిలుస్తూ ఎంతో మంది జీవితాల్లో అమ్మగా వెలుగులు నింపుతున్న సురేఖ రెడ్డిని సాక్షి.కామ్ పలకరించింది. అసలు ఈ హోం ఏర్పాటు వెనక ఉన్న ఉద్ధేశ్యం ఏంటో తెలుసుకుందాం రండి. ఇక్కడ పిల్లల రోజువారీ అవసరాలకు అనుగుణంగా, శిక్షణ ఇస్తున్నారు. వారిలోని స్పెషల్ స్కిల్స్ గుర్తించి ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తారు. నిపుణులైన వైద్యుల ఆధ్వర్యంలో లాంగ్వేజ్, స్పీచ్ థెరపీ, ఫిజియో థెరపీ, లాంటివి కూడా ఉంటాయి. ఇక్కడున్న టీచర్స్ పిల్లల్నందరినీ ప్రత్యేక శ్రద్ధగా, అపురూంగా చూసుకుంటారు. మరోవిధంగా చెప్పాలంటే దేవుని బిడ్డలా భావిస్తారు. అంతేకాదు సంగీతం, డాన్సింగ్, సింగింగ్, ఫైన్ ఆర్ట్స్ , కంప్యూటర్ స్కిల్స్ లాంటివి నేర్పిస్తారు. వారిలో మరింత ఉత్సాహాన్ని నింపేందుకు, తమ జీవితాన్ని వారు స్వయంగా లీడ్ చేసేలా తీర్చి దిద్దుతారు. అలాగే వృద్ధుల కోసం కూడా ఇక్కడ ప్రత్యేక సదుపాయాన్ని ఏర్పాడు చేయడం విశేషం. ఈ సేవలకు గాను సాధనం హోం అనేక అవార్డులు, రివార్డులు గెల్చుకుంది. త్యాగానికైనా, ధైర్యానికైనా అమ్మ తరువాతే ఎవరైనా ఇల్లయినా, ఆఫీసైనా ఒంటిచేత్తో నడిపించే ‘బాహుబలి’ కష్టమొచ్చినా.. కన్నీరొచ్చినా ఏ మాత్రం వెరువని ధీశాలి అమ్మ అయితే ఒక చిన్న మాట ఈ ఒక్కరోజు అమ్మను తలచుకుని, ఒక పువ్వో, ఒక ముద్దో, ఒక హగ్గో ఇచ్చేస్తే సరిపోతుందా? ఎట్టి పరిస్థితుల్లోను కాదు. అయితే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ లాగా అమ్మను తీసుకోకుండా.. అమ్మ చాకిరీకి, త్యాగానికి విలువ ఇచ్చి.. హార్ట్‌ఫుల్‌గా అమ్మను ప్రేమించాలి. ఆమె మనసుకు కష్టం కలిగినపుడు నేనున్నాను అనే భరోసా ఇవ్వాలి.. అచ్చం అమ్మలాగా.. మాతృదినోత్సవం సందర్భంగా అమ్మలందరికీ విషెస్ అందిస్తోంది. -
పల్లెవెలుగు నుంచి ఏసీ వరకు.. అన్ని బస్సుల్లో తల్లులకు ప్రయాణం ఫ్రీ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని మే 8న ఆర్టీసీలోని అన్ని కేటగిరీ బస్సుల్లో అమ్మలు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని ఆర్టీసీ కల్పించింది. ఐదేళ్ల లోపు చిన్నారులతో ప్రయాణించే మాతృమూర్తులందరికీ ఈ వెసులుబాటు ఉంటుందని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ఒక ప్రకటనలో తెలిపారు. పల్లెవెలుగు మొదలు ఏసీ సర్వీసుల వరకు ఈ అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. #TSRTC is delighted to present a special offer to celebrate the day & give them a unique experience of FREE TRAVEL in all the bus services, including AC services. #mothers travelling with children below five years can avail the offer on 8th May, 2022 #MothersDay2022 pic.twitter.com/X1EpYeMt07 — V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) May 6, 2022 -
సూపర్ మామ్
-
నాకు ఇన్పిరేషన్ అమ్మే..
-
ఫ్రెండ్లీ మామ్..
ఆధునిక కాలపు అమ్మ అదిరించేది.. బెదిరించేది కాదు.. ఆడించేది పాడించేది.. ఆట పట్టించేంది.. పాట కట్టించేది. అన్నింటా కూతురితో సరితూగేది. దీనికి నిదర్శనంగా నిలుస్తారు సినీనటి సురేఖా వాణి. ఎంతో కాలంగా తన కుమార్తెతో కలిసి డ్యాన్సులు, పాటలతో సోషల్ వేదికలపై హల్చల్ చేస్తూ మోడ్రన్ మదర్‌కు స్ఫూర్తిగా నిలుస్తున్న సురేఖ.. లాక్‌డౌన్‌తో మరింతగా తన కూతురితో గడిపే సమయం దక్కిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మదర్స్ డే సందర్భంగా ‘సాక్షి’తో సురేఖ, ఆమె కూతురు సుప్రీతలు పంచుకున్న ముచ్చట్లు.. మర్యాద ఇచ్చి పుచ్చుకుంటాం.. నన్ను మా పేరెంట్స్ చాలా స్వేచ్ఛగా పెంచారు. మా అమ్మ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేది. ఏదైనా సరే.. పంచుకునే చనువు తనతో నాకు ఉండేది. నా కూతురుతో కూడా నేను అలాగే ఉంటున్నాను. తల్లిదండ్రులు అంటే బెదిరింపులు హెచ్చరికల ద్వారా వచ్చే భయం కన్నా గౌరవం ద్వారా పొందే భయం ఉండాలనేది నా అభిప్రాయం. తనను చిన్నప్పటి నుంచీ నాతో అరమరికలు లేకుండా ఉండేలా అలవాటు చేశాను. ఇద్దరం కలిసే షాపింగ్స్‌కి, టూర్స్‌కి, మూవీస్‌కి, పార్టీస్‌కి, పబ్స్‌కి వెళతాం. నాకు డ్యాన్స్ బాగా ఇష్టం. అందుకని అప్పుడప్పుడు తనతో కలిసి చేసేదాన్ని. ఒకసారి అలా చేసిన డ్యాన్స్ సరదాగా యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తే బాగా వైరల్ అయింది అప్పటి నుంచి ఖాళీ దొరికనప్పుడల్లా డ్యాన్సుల వీడియోలు, టిక్‌టాక్ కలిసి చేస్తున్నాం. అయితే అవేవీ ప్లాన్ వేసుకుని చేస్తున్నవి కాదు. స్పాంటేనియస్‌గా చేస్తున్నవి మాత్రమే. తను తన ఫ్రెండ్స్‌తో ఎలా ఉంటుందో అలానే నాతో కూడా ఉంటుంది. ఇద్దరం ప్రేమాభిమానాలతో పాటు మర్యాద కూడా ఇచ్చి పుచ్చుకుంటాం. నాకైతే తనను సినిమాలకు పరిచయం చేయాలనే ఆసక్తి లేదు. ఒకవేళ తనకు ఇష్టం ఉంటే కాదనను. నాకు ఖాళీ దొరికితే తనతో స్పెండ్ చేయడం ఇష్టం. ఇప్పుడు లాక్‌డౌన్‌తో ఇంకా ఎక్కువ టైమ్ గడపగలుగుతున్నా. – సురేఖా వాణి ఇప్పుడు ఫుల్ టైమ్‌పాస్.. మామ్‌ను మించిన ఫ్రెండ్ నాకు ఇంకెవరూ లేరు. ఫ్రెండ్స్‌తో ఎంత బాగుంటానో అమ్మతో అంతకన్నా బాగుంటాను. మామ్ నాకన్నా బాగా డ్యాన్స్ చేస్తుంది. తనతో డ్యాన్స్ చేస్తుంటే చాలా హాయిగా స్వేచ్ఛగా అనిపిస్తుంది. నేను నేనుగా ఉన్నట్టు అనిపిస్తుంది. మామూలుగా తను చాలా బిజీగా ఉంటుంది. ఒకవేళ తనకు ఖాళీ దొరికినా నాకు దొరక్క పోవడం వంటివి ఉండేవి. ఇప్పుడు ఇద్దరం ఖాళీయే కాబట్టి ఫుల్‌గా టైమ్ పాస్ చేస్తున్నాం. ఓ 20 దాకా టిక్ టాక్‌లు చేసుంటాం. అయితే ఒకటే అప్లోడ్ చేశాం అనుకోండి. మామ్ వంట బాగా చేస్తుంది. తనకి స్నాక్స్‌గా సమోసాలు, గ్రిల్డ్ చికెన్ వంటి స్నాక్స్ కుక్ చేసి ఇవ్వడం నాకు చాలా ఇష్టం. తనెప్పుడూ నాకు అది చేయ్.. ఇది చేయెద్దు.. అని చెప్పలేదు. షార్ట్ ఫిలిమ్స్, వెబ్‌సిరీస్, మ్యూజిక్ వీడియోలు చేస్తున్నా. సినిమాల్లో కొందరు అడిగారు. అయితే మంచి పాత్రలైతే చేద్దామని ఉంది. – సుప్రీత -
అమ్మకే అమ్మ అయ్యింది
బిడ్డల కోసం తల్లులు ఎంతటి త్యాగమైనా చేస్తారు. తమకు ఎంతటి కష్టమొచ్చినా పంటిబిగువున భరిస్తూ పిల్లల మొహాల్లో నవ్వులు చూడాలనుకుంటారు. వాళ్ల జీవితం బాగుండటానికి తమ జీవితమంతా ధారబోస్తారు. కానీ, ముప్పై ఏళ్లుగా తల్లిని కంటిపాపలా చూసుకుంటూ అమ్మకే అమ్మ అయ్యింది రాజేశ్వరి. వర్ధనమ్మ రెండవ సంతానంగా పుట్టింది రాజేశ్వరి. ఇద్దరూ ఆడపిల్లలే. ‘మా అక్క పదేళ్ల వయసులో రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆ ప్రమాదంలో అమ్మకూ దెబ్బలు తగిలాయి. ఆ సంఘటన తర్వాత అమ్మ మానసికంగా మామూలు మనిషి కాలేకపోయింది. అమ్మను డాక్టర్లకు చూపించాడు. కొద్ది కొద్దిగా మార్పు కనిపిస్తున్నట్టుగానే ఉండేది. నేను స్కూల్‌కి వెళుతుండేదాన్ని. ఇంటిపనులు, నాన్న పడుతున్న ఇబ్బందులు చూసి చదువు మానేశాను. అనువైన సంబంధమని ఇరవై ఏళ్ల వయసులో నాకు పెళ్లి చేశాడు నాన్న. అత్తగారింటికి వెళ్లిపోయాను. ఏడాది గడుస్తుండగా ఓ రోజు అమ్మ డాబా మీద నుంచి కింద పడింది అని తెలిసి వెంటనే పుట్టింటికి వచ్చేశాను. ఆ ఏడాదే పాత ఇల్లు పడగొట్టి కొత్తది కట్టించాడు నాన్న. మా ఇంటిపైన చుట్టూ రెయిలింగ్ పనులు పూర్తి కాలేదు. వేసవి కాలం రాత్రిపూట ఉక్కపోస్తుందని గాలి కోసం పైన కెళ్లి పడుకున్న అమ్మ నిద్రలో లే చి కిందకు రాబోతూ రెయిలింగ్ లేని చోట కాలు వేసిందట. అంత ఎత్తు నుంచి కింద పడటంతో వెన్నుపూస విరిగింది. ఆ దెబ్బతో మంచానికే పరిమితం అయ్యింది. అమ్మకు సపర్యలు చేస్తూ నేను పుట్టింట్లోనే ఉండిపోయాను. నా భర్త వచ్చాడు తీసుకెళ్లడానికి. అమ్మను ఆ పరిస్థితిలో వదిలి రాలేనని, కోలుకున్నాక వస్తానని చెప్పాను. అలా ఏడాది అయ్యింది. అమ్మకు అన్నీ మంచం మీదే. ఏడాదిన్నర అయ్యింది పుట్టింట్లో ఉండి. ఓ రోజు తెలిసింది నా భర్త మరో ఆమెను పెళ్లి చేసుకున్నాడని. ‘మేం ఎలాగోలా ఛస్తాం.. నిన్ను అత్తగారింట్లో దింపి వస్తా పద..’ అంటూ నాన్న నా మీద కోప్పడ్డాడు. నేనే వద్దన్నాను. నా కష్టం తన కష్టం అనుకున్నవాడు నాకు భర్త అవుతాడు కానీ, తన స్వార్థం చూసుకున్నవాడు ఏమీ అవడని. నాన్న నాకు తెలియకుండా మా అత్తగారింటికి ఒకట్రెండు సార్లు వెళ్లి వచ్చాడు. కానీ, నా భర్త మళ్లీ నన్ను తీసుకెళ్లడానికి రాలేదు. నేనూ వెళ్లలేదు. మా జీవితాలు ఇలా అయ్యాయే అనే బెంగ, నా కాపురాన్ని బాగు చేయలేక పోయానని నాన్న మానసికంగా కుంగిపోయాడు. ఆరోగ్యం దెబ్బతింది. కొన్నాళ్లకు అనారోగ్యంతో నాన్న దూరమయ్యాడు. అమ్మకు నా కష్టం చెప్పుకోలేను. చెప్పుకున్నా ఆమెకు అర్థం కాదు. అమ్మను చంటిబిడ్డలా తన అవసరాలన్నీ కనిపెట్టుకుని చూస్తూ ఉంటాను. కొన్నాళ్లుగా నమల గలిగే ఆహారం ఏదీ తినలేకపోతోంది అమ్మ. ఏదైనా మెత్తగా చేసి పెట్టాలి. కొన్నాళ్లు ఉద్యోగుల చిన్నపిల్లలు చూసుకోవడానికే ఇంట్లోనే కేర్‌సెంటర్ పెట్టాను. టైలరింగ్ పనులు చేశాను. ఇప్పుడవేవీ చేయడం లేదు. ఇంట్లో కొంత భాగాన్ని అద్దెకిచ్చాను. దీంతో మా జీవితాలు గడిచిపోతున్నాయి’ అంటూ వివరించింది యాభై ఏళ్ల రాజేశ్వరి. వర్ధనమ్మ వయసు ఇప్పుడు డెభ్బైకి పైనే ఉంటుంది. ‘అమ్మకు అమ్మనయ్యే భాగ్యం ఎంతమందికి వస్తుంది’ అనే రాజేశ్వరి ఉంటున్నది సికింద్రాబాద్ మల్కాజిగిరిలోని ఆనంద్‌బాగ్‌లో. తల్లిని కూతురుగా చూసుకుంటున్న రాజేశ్వరికి మదర్స్ డే సందర్భంగా అభినందనలు చెబుదాం. - ఆరెన్నార్ -
సర్వశక్తి స్వరూపిణి అమ్మ
తూర్పు సముద్రం అంచుల్లో దాగిన సూరీడు తల నిమిరి పెందలాడే నిద్ర లేపుతుంది అమ్మ. వీధి గుమ్మం తెరిచి ఇంట్లోకి ప్రాణవాయువును ప్రసరింపజేస్తుంది అమ్మ. కళ్లాపి జల్లి జగత్తును మంగళకరం చేస్తుంది అమ్మ. కసువు ఊడ్చి నేలన ఉన్న చెడును శుభ్రం చేస్తుంది అమ్మ. ఎవరో పురాణపురుషుడు భూమిని భుజాన మోశాడని అంటారు. నిత్యం దానిని తన కొంగున చులాగ్గా కట్టుకుని తిరిగే బలశాలి అమ్మ. అమ్మ నుంచి జీవం మొదలవుతుంది. అమ్మ నుంచి ఆయువు ఉనికిలోకి వస్తుంది. అమ్మ నుంచి ౖచైతన్యం అందుతుంది. అమ్మ నుంచి కంఠానికి నాలుగు మాటల మూట దొరుకుతుంది. పిల్లలకు రెక్కల సత్తువనిస్తుంది అమ్మ. నాన్నతో పాటు తాను కూడా గింజలకు ఎగురుతుంది అమ్మ. అనుక్షణం ఇంటిని తన రెక్కల కింద పొదువుకుంటుంది అమ్మ. అమ్మకు నిన్న తెలుసు. అమ్మకు రేపు తెలుసు. 365 రోజులు పొయ్యిని వెలిగిస్తూ ఉండే అగ్నిశక్తి అమ్మ. అందుకు కేలండర్ గళ్లలో వెచ్చాల పట్టీని ఎలా సర్దాలో స్పెషలైజేషన్ చేస్తుంది అమ్మ. ఇంటింట్లో ఉండే ఒక ఎమర్జెన్సీ ఫండ్ అమ్మ. అకస్మాత్తుగా వచ్చి పడే ఖర్చులను తన మంత్రదండాన్ని తిప్పి దాచిన సొమ్ముతో గట్టెక్కించేది అమ్మ. అమ్మ అక్షరాలు దిద్దించే టీచర్. అమ్మ పిల్లల తరఫున వాదనలు వినిపించే లాయర్. పంట పండించడం తెలిసిన ఫార్మర్. సమస్త కులవృత్తులలో నాన్నకు హెల్పర్, నాన్నతో పాటు కొంగు నడుమున బిగించి పనిలోకి దిగే పార్టనర్. అమ్మకు దిగుడుబావిలో దిగి నీరు మోయడం తెలుసు. ఆకాశానికి ఎగిరి విశ్వ రహస్యాలు శోధించడం తెలుసు. పశువులను మేతకు దారి చూపటం తెలుసు. గగనాన్ని చీలుస్తూ ప్రయాణికులను గమ్యానికి చేర్చడమూ తెలుసు. జబ్బు చేస్తే సూదిమందు వేయగలదు. ఆర్థికంగా జబ్బు చేస్తే నిపుణురాలై పరిష్కారం చూపగలదు. అమ్మకు ఇంటి పట్టున ఉండటం ఇష్టం. అమ్మకు ఒక మోటర్ సైకిల్ మీద హిమాలయాలు చుట్టి రావడం కూడా ఇష్టం. అమ్మకు తన బిడ్డలకు పాలివ్వడం ఇష్టం. అమ్మకు ప్రజలను పరిపాలించడం కూడా ఇష్టం. అమ్మకు అణువుగా ఉండటం ఇష్టం. అంతలోనే బ్రహ్మాండంగా మారడమూ ఇష్టం. అమ్మకు కుటుంబం ఇష్టం. అమ్మకు ప్రపంచమూ ఇష్టం. అమ్మ పూజలందుకునే దేవత. అమ్మ చెడును సంహరించే ఏలిక. ఆమే రక్ష. ఆమే దక్ష. అమ్మ.. రోజూ మన కళ్ల ముందు ఉండే అద్భుతం. అమ్మే ఎన్నటికీ అబ్బురం. ఆ సర్వస్రష్టకు వందనం. వేనవేల విధాలుగా అభివందనం. రాజమాత అమ్మ తాపత్రయం ఎప్పుడూ తన సంతానం కోసమే. అది ఒక్కోసారి ప్రేమలా కనిపించవచ్చు. ఒక్కోసారి స్వార్థంలా అనిపించవచ్చు. ఏం చేసినా దానిని తల్లి మనసుగా అర్థం చేసుకోవాలి. రామాయణంలో రాముడి తల్లి కౌసల్య రాముడు పట్టాభిషిక్తుడు కావాలని కోరుకుంది. కాని భరతుడి తల్లి కైకేయి భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి, సవతి కొడుకు అడవుల పాలవ్వాలని దురాలోచన చేసింది. లక్ష్మణుడి తల్లి సుమిత్ర నా కుమారుడు లక్ష్మణుడు అన్నగారికి అడవులలో సేవలు చేయాలని కోరుకుంది. భారతంలో వందమంది కౌరవుల తల్లి గాంధారి తన బిడ్డలు చేసే తప్పులను వ్యతిరేకించలేకపోయింది. ఆమెలోని మాతృప్రేమ ఆమెను గుడ్డిదాన్ని చేసింది. మాద్రి సంతానాన్ని కూడా తన బిడ్డలుగానే చూసుకుని పంచ పాండవులకు తల్లి అయింది కుంతి. బకాసురుడు ఇంటికొక మనిషిని ఆహారంగా కోరుకున్నప్పుడు ‘నాకు ముగ్గురు కుమారులు, మాద్రికి ఇద్దరు కుమారులు, నా కుమారులలో ఒకరిని ఆహారంగా పంపుతాను. అప్పుడు నాకు కూడా ఇద్దరు కుమారులు మిగిలినట్లు’ అని భీముడిని పంపింది. ఏ తల్లిలోనైనా కన్నపేగు కారణంగా స్వార్థం ఉంటుంది. మరి అన్ని సందర్భాలలోనూ తల్లి స్వార్థంగా ఉండకపోవడం కనిపిస్తుంది. కన్న మమకారం... పెంచిన ప్రేమ శ్రీకృష్ణుడిని కన్నతల్లి దేవకీ దేవి. కొడుకు ప్రాణాలతో ఉంటే చాలనుకుని పసికందుగా ఉన్నప్పుడే భర్త చేతికి ఇచ్చి నందుని ఇంట దింపి రమ్మంది. ఇక నందుని భార్య యశోదమ్మ అయితే తన చిన్ని కన్నయ్య పూతన విషపు పాలు తాగాడని తల్లడిల్లింది.. క్షేమంగా బయట పడినందుకు దిష్టితీసింది. బాలకృష్ణుడి అల్లరి అంతటినీ భరించింది. ఒకానొక సమయంలో అయితే ఓపిక చచ్చిపోయి రోటికి కట్టేసింది. ముల్లోకాలనూ పాలించేవాడికే కన్నతల్లి అయిన ఆ యశోదమ్మది ఎంతటి అదృష్టం! బాల్యం నుంచే నీకు దూరంగా ఉన్నాను కన్నయ్యా... నీ ముద్దుముచ్చట్లు ఎప్పుడు చూడాలి అని అడిగి మరుజన్మలో వకుళ మాతగా పుట్టింది దేవకీ దేవి. తన పెంపుడు కొడుకు ఆకాశరాజు కుమార్తెను చూసి ఇష్టపడి ఆ విషయం బయటకి చెప్పలేక మథన పడుతుండటాన్ని కనిపెట్టి, స్వయంగా ఆకాశరాజు వద్దకు వెళ్లి కొడుకు గుణగణాల గురించి వివరించి, నీ ప్రియపుత్రిక పద్మావతిని నా కుమారుడైన శ్రీనివాసునికిచ్చి పెళ్లి చేయమని అడిగిన ధైర్యశాలి. భాగ్యశాలి. బాణాసురుని తల్లి కోటర, తన కుమారుడికి, శ్రీకృష్ణుడికి జరుగుతున్న ఘోర యుద్ధంలో వెయ్యి చేతులూ తెగిపోయి శ్రీ కృష్ణుని చేతిలో హతం అవబోయే స్థితిలో కొడుకును కాపాడుకోవాలనుకుంది. వొంటిమీద వలువలు విప్పేసి, జుట్టు విరబోసుకుని హాహాకారాలు చేస్తూ కృష్ణునికి ఎదురుగా నిలబడింది. అప్పుడు కృష్ణుడు దయతలిచి ధనుస్సును పక్కన పెట్టి యుద్ధం ఆపేసి, బాణాసురుడు పారిపోయేందుకు అవకాశం ఇచ్చాడు. తల్లి ప్రేమ అంటే అది. -
కన్నతల్లి ప్రేమ కన్నా మిన్న ఏది?
ఈ భూమ్మీద కరోనా వైరస్ ఎక్కడైనా సోకగలదేమో కానీ.. తల్లిపాలను ‘అంటు’కోలేదు. అవును.. తల్లిపాలలో వైరస్ ఉండదు. ఒకవేళ కరోనా సోకిన తల్లైనా.. తన బిడ్డకు పాలివ్వవచ్చు. (అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని యూనిసెఫ్ ప్రకటించిన విషయమిది) సాక్షి, హైదరాబాద్: ‘భగవంతుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడంటారు. అమ్మ నడకనే కాదు నాగరికతనూ నేర్పిస్తుంది. అంతులేని ప్రేమానురాగాలకు, ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే’ అంటున్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు డాక్టర్ దశరథరామారెడ్డి. ‘అమ్మ కూడా చిన్నప్పుడు గారాల కూతురే. కానీ మనం పుట్టగానే అన్ని బాధ్యతలు తనపై వేసుకుని పెద్దరికంతో మనల్ని పెంచుతుంది. మన అల్లరినీ, కోపాల్నీ, అలకల్నీ భరిస్తుంది. మనం పెద్దయ్యాక.. మన ముందు పసిపాప అవుతుంది. కానీ మనమేం చేస్తున్నాం? చాలామంది పెద్దయ్యాక అమ్మని ‘వదిలించుకుంటున్నారు’. మనకు ఇష్టమైన వ్యక్తుల కోసం కష్టపడుతున్నప్పుడు గానీ మనకు అర్థమవ్వదు.. అమ్మ ఓపిక ముందు మనమెంత అని? కానీ, ఆ నిజం మనకు అప్పుడు అర్థం కాదు. జీవితంలో పెద్దయ్యాక.. ఏదోరోజున ‘అరె అమ్మని ఆనాడు కష్టపెట్టానే’ అని బాధపడిన రోజు తెలిసివస్తుంది అమ్మంటే ఏంటో. అలా మనం బాధపడే సందర్భం రాకూడదంటే అమ్మని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి. అమ్మనే కాదు, ఆమె ఆరోగ్యాన్నీ కనిపెట్టుకుని చూసుకుంటే మన జీవితాలకు కావాల్సినంత భరోసా లభిస్తుంది’ అంటున్నారాయన. ఆదివారం అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. కరోనాతో కళ్లు తెరుస్తున్న కుటుంబాలు మనం జీవితంలో ఎంత సాధించినా, ఎంత ఎదిగినా అమ్మ ఉన్నంత వరకు పిల్లలుగానే ఉంటాం. పిల్లల్లానే ఆలోచిస్తాం. మన కోసం సర్వస్వం ధారపోసి, పెంచి పెద్దచేసిన తల్లులను జీవిత చరమాంకంలో కళ్లలో పెట్టుకుని చూసుకోవడం ప్రతి ఒక్కరి ధర్మం. అమ్మను దూరం చేసుకొని బాధపడేవారు చాలామంది ఉన్నారు. డబ్బులు, ఆస్తులు సంపాదించుకోవడం గొప్ప కాదు. కానీ అమ్మ ఆప్యాయతను పొందడమే నిజమైన అదృష్టం. ప్రస్తుతం కరోనా వసుధైక కుటుంబం గొప్పదనాన్ని చాటిచెప్పింది. అందరూ ఇళ్లలో ఉండి అమ్మకు సమయం ఇస్తున్నారు. ఒక్కోసారి ప్రకృతి ఇటువంటి వాటిని సృష్టించి పరిస్థితిని సమం చేస్తుందంటారు. కరోనా అలానే చేస్తుందేమో.. తల్లుల ఆరోగ్యం కోసం బీమా... అమ్మ ఆరోగ్యం కోసం ప్రతీ ఏటా అవసరమైనప్పు డు తప్పనిసరిగా ఆరోగ్య పరీక్షలు చేయించాలి. ము ఖ్యంగా మహిళలకు సంబంధించిన ప్రత్యేక చెకప్ లు తప్పనిసరి. చాలా కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితు లు సరిగా లేక తల్లి అనారోగ్యానికి గురైతే వైద్యం చే యించలేని దుస్థితి..అందువల్ల తల్లితోపాటు కుటుంబసభ్యులంతా ఆరోగ్య బీమా చేయించుకో వాలి. దీనివల్ల అమ్మను అనారోగ్యాల నుంచి రక్షిం చుకోగలం. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్లతో పా టు విటమిన్ డీ, విటమిన్ బీ12 సమస్యలు ఎక్కువ. హార్మోన్లలో మార్పులు, పోషకాహార లోపం వల్ల ఇతరత్రా అనారోగ్యాలు అమ్మను కబళిస్తున్నాయి. వీటి నుంచి అమ్మను కాపాడుకోవాలి. కరోనా వేళ.. అమ్మ పైలం గర్భిణుల కోసం యూనిసెఫ్ ప్రత్యేక సూచనలు అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా యూనిసెఫ్ కీలక ప్రకటన జారీచేసింది. కరోనా సమయంలో బిడ్డలకు జన్మనిచ్చిన తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది. ఒక్క తెలంగాణలోనే ఈ ఏడాది మార్చి చివరి నుంచి మే నెలాఖరు వరకు ఏకంగా 1.1 లక్షల ప్రసవాలు జరుగుతాయని అంచనా. లాక్డౌన్లు, కర్ఫ్యూల వంటి నియంత్రణ చర్యల నేపథ్యంలో గర్భి ణుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు యూనిసెఫ్ విజ్ఞప్తి చేసింది. ► గర్భిణులకు యాంటెనాటల్ చెకప్‌లు, నైపుణ్యం కలిగిన డెలివరీ కేర్, ప్రసవానంతర సంరక్షణ సేవలు అందించడంతో పాటు కరోనా నుంచి భద్రత కల్పించాలి. వారిని పర్యవేక్షించే ఆరోగ్య కార్యకర్తలకు అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలను అందించాలి. ► ప్రసవ సమయంలో అన్ని ఇన్ఫెక్షన్ నివారణ, నియంత్రణ చర్యలు ఉన్నాయని గర్భిణులకు హామీనివ్వాలి. ► మారుమూల ప్రాంతాల్లోని గర్భిణులను ప్రసూతి కేంద్రాలకు వెళ్లాలని సూచించాలి. టెలి కన్సల్టేషన్, మొబైల్ ఆరోగ్య వ్యూహాలను వారికి తెలియజెప్పాలి. ► వైద్య ఆరోగ్య సేవలు అందనిపక్షంలో ఇంట్లోనే ప్రసవించేలా ఏర్పాట్లు చేయాలి. అందుకోసం ఆరోగ్య కార్యకర్తలకు మంచి శిక్షణతో పాటు తగిన సామగ్రి, రక్షణ అందించాలి. ► తల్లీపిల్లల ఆరోగ్యానికి, వారి ప్రాణాలను రక్షించే సేవలకు అవసరమైన నిధులు కేటాయించాలి. ► వైరస్ బారినపడకుండా తమను తాము రక్షించుకోవడానికి గర్భిణులు జాగ్రత్తలు పాటించాలి. ఆన్లైన్ ఆరోగ్య సేవలను ఉపయోగించుకోవాలి. ► గర్భిణులు వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తుంటే వారిలో ఎవరికైనా జ్వరం, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ► తల్లిపాలలో వైరస్ ఉండదు. కాబట్టి వారికి ఒకవేళ వైరస్ సోకినా బిడ్డకు తల్లిపాలను ఇవ్వనివ్వాలి. ► కరోనా ఉన్న తల్లులు బిడ్డకు ఆహారం ఇచ్చేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ► శిశువును తాకడానికి ముందు, తరువాత చేతులు కడుక్కోవాలి. -
మా అమ్మే మా స్టార్!
అమ్మంటే అనురాగం అమ్మంటే ఆనందం అమ్మంటే ఆత్మీయం అమ్మంటే ధైర్యం అమ్మంటే త్యాగం అమ్మంటే రక్షణ అమ్మంటే ఓదార్పు అమ్మంటే... చెప్పడానికి ఇలా ఎన్నో ఉంటాయి. ‘మదర్స్ డే’ సందర్భంగా ‘మా అమ్మే మా స్టార్’ అంటూ కొందరు సినీ స్టార్స్ పంచుకున్న విశేషాలు. మన తప్పులను ప్రేమించే వ్యక్తి అమ్మ: దేవిశ్రీ ప్రసాద్ ► అమ్మ గురించి మాటల్లో చెప్పడం అంత సులభం కాదు. కొన్ని వేల పాటలు చేసినా కూడా అమ్మ గురించిన కంప్లీట్ ఎమోషన్‌ను చెప్పలేం. ఎందుకంటే వారు చూపించే ప్రేమ అటువంటిది. అమ్మ చేసే త్యాగాలు అటువంటివి. మనం ఎన్ని తప్పులు చేసినా ఎప్పుడూ ఒకేలా మనల్ని ప్రేమించగల ఏకైక వ్యక్తి అమ్మ. అటువంటి ప్రేమకు ప్రతిరూపమైన మదర్స్ అందరికీ ‘హ్యాపీ హ్యాపీ మదర్స్ డే’. ► మా కుటుంబంలో మేమందరం సాధించిన ప్రతి విజయానికి కారణం మా అమ్మగారే. మా కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేశారు. మా అందరి పని కంటే మా అమ్మగారు మా కోసం చేసే పనే ఎక్కువ. ఏ పనినైనా చాలా అకింతభావంతో, ఏకాగ్రతగా చేస్తారు. ‘మీరు చేసే హార్డ్‌వర్క్, ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్లో మాకు పదిశాతం ఉన్నా మేం జీవితంలో ఇంకా ఉన్నత స్థాయికి వెళతాం’ అని మా అమ్మగారితో నేను అంటుంటాను. ఈ విషయాన్ని మా నాన్నగారు కూడా ఒప్పుకున్నారు. ‘మా ఆవిడకు నలుగురు పిల్లలండీ నాతో కలిపి’ అని మా నాన్నగారు అంటుండేవారు. మా నాన్నగారిని కూడా మా అమ్మగారు ఓ చిన్నపిల్లాడిలా చూసుకున్నారు. ► నా ఇంటిపైనే నా స్టూడియో ఉంటుంది. దాని పై నా పెంట్‌హౌస్ ఉంటుంది. కింద అమ్మ ఉంటారు. పైన నేను ఉంటాను. మాములుగానే లంచ్ టైమ్, డిన్నర్లను మా అమ్మగారితో చేస్తాను. ఈ క్వారంటైన్ సమయంలో అమ్మతో ఇంకా ఎక్కువసేపు స్పెండ్ చేస్తున్నాను. ఖాళీ సమయంలో నేను ఏదైనా వంటకాన్ని ట్రై చేద్దామన్నా కూడా అమ్మ ఒప్పుకోవడం లేదు. ► ఈ మదర్స్ డే రోజు మా అమ్మగారి గురించి మాట్లాడటం చాలా చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మగారి గురించి చెప్పమంటే నేను చెబుతూనే ఉంటాను. మా అమ్మగారు వంట చేసినప్పుడల్లా నేను ఓ కాంప్లిమెంట్ ఇస్తూనే ఉంటాను. ‘మమ్మీ వంటలో నువ్వు ఇళయరాజాగారిలా అని’. మ్యూజిక్ గురించి ఏదైనా పోల్చాలంటే నా దృష్టిలో ఇళయరాజాగారు నంబర్ వన్. ‘మ్యూజిక్‌లో ఇళయరాజాగారు ఎలానో వంటలో నువ్వు అలా’ అని మా అమ్మకు నేను కాంప్లిమెంట్ ఇస్తుంటాను. ► చిన్నతనం నుంచే మ్యూజిక్ పట్ల చాలా ఆసక్తికరంగా ఉండేవాడిని. చాలా ఎక్కువ టైమ్ స్పెండ్ చేసేవాడిని. స్కూలు, మ్యూజిక్ క్లాసులు, ఇంటికి వచ్చిన తర్వాత మ్యాండలిన్ శ్రీనివాస్‌గారి దగ్గర క్లాసులు, మళ్లీ ప్రాక్టీస్.. ఇలా వేళకు భోజనం చేయడానికి కుదిరేది కాదు. అందుకే ఇప్పటికీ నాకు డిఫరెంట్ టైమ్స్‌లో ఆకలి వేస్తుంది. అప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది. ఆశ్యర్యంగా అప్పుడే మా అమ్మగారు ఫోన్ చేసి ‘ఏరా.. ఆకలేస్తుందా’ అని అడుగుతారు. ఇది జరిగినప్పుడల్లా నాకు ఒళ్లు పులకరిస్తుంది. ‘నాకు ఆకలేస్తున్నట్లు మీకు ఎలా తెలిసింది?’ అంటే ‘ఏమోరా నాకు అనిపించింది’ అని చెబుతారు. ఇంకో విశేషం ఏంటంటే.. నేను ఏదైతే తినాలనుకుంటున్నానో మా అమ్మగారు ఆ డిష్ పేరు చెప్పి తింటావా? అని అడుగుతారు. ఉదాహరణకు నాకు ఎగ్ రైస్ తినాలనిపించిందనుకోండి.. ‘ఏరా ఎగ్‌రైస్ తింటావా?’ అని మా అమ్మగారు అడుగుతారు. అమ్మా నేను అదే అనుకుంటున్నాను అంటాను. చాలా ఆశ్చర్యపోతారు. ఇలాంటివి చాలా జరిగాయి. మనం అందరం అమ్మకు రుణపడి ఉండాలి. వారిని ప్రేమిస్తూ, బాగా చూసుకుంటూ, వారితో ఎక్కువ సమయం గడపడమే మనం చేయగలిగింది. ఎందుకంటే వారి స్థాయికి మనం ఎప్పుడూ చేరుకోలేం. హ్యాపీ మదర్స్ డే. విత్ లవ్ టు మై మదర్ శివమణి సత్యమూర్తిగారు. మళ్లీ మళ్లీ నీకే పుట్టాలనుకుంటున్నా: చిన్నికృష్ణ ► బుడి బుడి అడుగుల నుంచి పరుగుల వరకు.. జీవితంలో అమ్మ (లక్ష్మీ సుశీల) ఎన్నో పాఠాలు నేర్పింది. నా జీవిత ప్రయాణానికి కూడా గురువు అయ్యింది. మా ఇంటో ఓ కష్టం వస్తే.. దేశంలో ఉన్న ఎన్నో దేవాలయాలు తిప్పింది. అమ్మ వేలు పట్టుకుని అన్ని గుళ్లూ తిరిగాను. అప్పుడు ఎన్నో కథలు చెప్పింది. ఆ కథలే ప్రేక్షకులకు చెప్పే రచయితను చేశాయి. ► నేను సంపాదించడం మొదలుపెట్టాక ఏం కావాలని అడిగితే అమ్మ ‘కపిల గోవు’ని అడిగింది. మాకు గోశాల ఉండేది. అమ్మ అడిగిన గోవుని కొనిపెడితే సంబరపడిపోయింది. అమ్మకి తన పిల్లలు ఎప్పుడూ చిన్నవాళ్లే. ఇప్పటికీ నాకు అన్నం తినిపిస్తుంది. ► మానవత్వానికి, మంచితనానికి జంతువుల్లో ఆవుకి ప్రథమ తాంబూలం ఇస్తారు. అలా మానవత్వంలో మా అమ్మకు నేను ప్రథమ తాంబూలం ఇస్తాను. అందర్నీ సమానంగా చూడటం అనేది ఆమె దగ్గరే నేర్చుకున్నాను. వాళ్లూ వీళ్లూ అనే తేడా లేదు. మా అమ్మగారు ఆర్ఎస్ఎస్సా? మదర్ థెరిస్సానా? ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఆవిడకు అందరూ ఒకటే. ‘మానవకులం’ అనుకుంటుంది. చెడ్డవాళ్లల్లోనూ మంచిని చూసే మనిషి. చెడ్డవాళ్లకు దూరంగా ఉండకు. వీలైతే మంచివాళ్లలా మార్చు అని చెప్పింది. అందుకే ‘అమ్మా... మళ్లీ మళ్లీ నీ కడుపునే పుట్టాలనుకుంటున్నాను’. ► అమ్మ నా దగ్గరే ఉంటుంది. మా అన్నయ్య, చెల్లెలు తెనాలిలో ఉంటారు. వాళ్లతో, వాళ్ల పిల్లలతో ఉండాలని తెనాలి వెళ్లింది. జీవితంలో ఎన్నో ఆనందకరమైన విషయాలకు కారణంగా నిలిచిన అమ్మా... నీకు ‘హ్యాపీ మదర్స్ డే’. లక్ష్మీ సుశీల, చిన్నికృష్ణ చిన్నప్పటి రోజులకు వెళ్లిపోయాం: కాజల్ అగర్వాల్ ► నా పదేళ్ల కెరీర్లో ఇన్ని రోజులు ఇంట్లో ఉండటం ఇదే ఫస్ట్ టైమ్. ఇంట్లో వాళ్లతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తున్నాను. అమ్మ, నాన్న, నాన్నమ్మతో ఎక్కువ టైమ్ గడిపే వీలు దొరికింది. అలాగని సమయాన్ని వృథా చేయడం లేదు. నన్ను నేను బిజీగా ఉంచుకుంటున్నాను. అందరం కష్టకాలంలో, భయంలో ఉన్నాం. దీన్ని ఎలా అయినా దాటగలుగుతాం. ► నేను అమ్మకి చాలా క్లోజ్. నేను ఈరోజు మంచి పొజిషిన్‌లో ఉన్నానంటే దానికి కారణం కచ్చితంగా మా అమ్మే. నన్ను సరైన మార్గంలో గైడ్ చేస్తుంటుంది. నాకు వంట నేర్పించాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది అమ్మ. ఫైనల్‌గా ఇప్పుడు నేర్చుకుంటున్నాను. నేను వంట గది బాధ్యతలు తీసుకోవడం అమ్మకు చాలా సంతోషంగా ఉంది (నవ్వుతూ). ► మా చిన్నప్పుడు నేను, చెల్లెలు (నిషా అగర్వాల్) మదర్స్ డే కోసం స్పెషల్‌గా గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి, అమ్మకి ఇచ్చేవాళ్లం. అలాగే ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ మేమే తయారు చేసేవాళ్లం. అమ్మ గదిని బాగా అలంకరించేవాళ్లం. పెద్దయ్యాక లంచ్‌కి బయటికి తీసుకెళుతున్నాం. లాక్డౌన్ ముందు వరకూ మదర్స్ డే అంటే అవుటింగే. కానీ ఇప్పుడు చిన్నప్పటి రోజులకు వెళ్లిపోయాం. బయటికి వెళ్లలేం కాబట్టి, చిన్నప్పుడు చేసినట్లుగా మా అమ్మ రూమ్‌ని అందంగా డెకరేట్ చేశాం. బ్రేక్‌ఫాస్ట్ కూడా మేమే తయారు చేస్తాం. ► అమ్మకు బహుమతులంటే ఇష్టం ఉండదు. తనతో మేం ఉండటమే పెద్ద గిఫ్ట్ అనుకుంటుంది. ఈ లాక్డౌన్ వల్ల ఓ రెండు నెలలుగా అమ్మతోనే ఉంటున్నాను. ఆవిడకు చాలా ఆనందంగా ఉంది. తల్లి సుమన్ అగర్వాల్‌తో కాజల్ అమ్మ ఏం చెప్పినా వింటాను: నిధీ అగర్వాల్ ► సాధారణంగా షూటింగ్స్‌తో బిజీగా ఉండటంవల్ల ఇంటిపట్టున ఉండటానికి కుదరదు. ఇప్పుడు ఇంట్లో ఉండటం చాలా బావుంది. ఇంట్లో ఉండటం ఎవ్వరికైనా ఇష్టమే కదా. అమ్మ చేతి వంట తింటూ జాగ్రత్తగా ఉంటున్నాం. ఇంట్లో ఉంటే చాలా గారాభంగా చూస్తారు. ఇలా ఎక్కువ రోజులు ఇంట్లో ఉండి 2–3 ఏళ్లు అవుతోంది. షూటింగ్స్ వల్ల మహా అయితే 2 రోజులు కూడా ఉండటానికి కుదిరేది కాదు. ► చిన్నప్పుడు మదర్స్ డే అంటే అమ్మకి స్వయంగా గ్రీటింగ్ కార్డ్ తయారు చేసి ఇచ్చేదాన్ని. ఎలాంటి కార్డ్ తయారు చేయాలనే విషయంలో ముందు రోజంతా ఆలోచించేదాన్ని. అలాగే చిన్న చిన్న గిఫ్ట్స్‌తో సర్ప్రైజ్ చేసేదాన్ని. ► ఈ మదర్స్‌డేకి అమ్మకి ఏదైనా కొందామంటే బయటకు వెళ్లే వీలు లేదు. ఇవాళ అమ్మ ఏం చెప్పినా వింటాను (నవ్వుతూ). షూటింగ్స్ ఉన్నప్పుడు ఇంటికి ఫోన్ చేయడం కుదరదు. కొన్నిసార్లు ఇంటి నుంచి ఫోన్ వచ్చినా ఆన్సర్ చేయడం వీలవదు. కానీ ఈసారి నుంచి అమ్మ ఫోన్‌ని ఎప్పుడూ మిస్ చేయకూడదని నిశ్చయించుకున్నాను. ► అమ్మానాన్న ఇద్దరితోనూ నేను క్లోజ్. అమ్మతో మంచి అటాచ్మెంట్ ఉంది. అమ్మకు చిన్న వయసులోనే నేను పుట్టాను. మా ఇద్దరి మధ్య 20 ఏళ్ల వ్యత్యాసం కూడా ఉండదు. చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను అన్ని క్లాస్‌లకు పంపేది. కేవలం చదువు ఒక్కటే కాదు. మన పర్సనాలిటీ డెవలప్ అవ్వాలంటే అన్నీ నేర్చుకోవాలని డ్యాన్సింగ్ క్లాస్, స్పోర్ట్స్ క్లాస్ చేర్పించారు. ప్రస్తుతం నేను సినిమాలో ఈజీగా డ్యాన్స్ చేసినా, ఈజీగా ఎవ్వరితో అయినా కమ్యూనికేట్ అవుతున్నా అంటే చిన్నప్పుడు అమ్మ తీసుకున్న శ్రద్ధ వల్లే. మన ప్రవర్తన, అలవాట్లు ఇవన్నీ అమ్మ పెంపకం మీద ఆధారపడి ఉంటాయి. ఆ విధంగా చూస్తే ‘మై మమ్మీ ఈజ్ బెస్ట్’. మంచి చెబుతూ పెంచారు. ► లాక్డౌన్లో వంట గదిలో ఎక్కువ ప్రయోగాలు చేస్తున్నాను. ఇప్పటివరకూ 2 కేకులు బేక్ చేశాను. దోసె, గ్రీన్ చట్నీ, టీ తయారు చేశాను. అన్నింటికీ మా అమ్మ పదికి పది మార్కులు వేశారు. ఏదైనా పని చేస్తే పక్కాగా చేయాలి, లేదంటే పక్కన పెట్టేయాలి అనుకుంటాను నేను. ఆ అలవాటు అమ్మ వల్ల వచ్చింది. అలాగే మా అమ్మ అందర్నీ సమానంగా చూస్తారు. తననుంచి నేను నేర్చుకున్న మరొక విషయం అది. తల్లి ఇందూ అగర్వాల్‌తో నిధి -
అమ్మ కోసం ఓ పాట
పెరంబూరు: నృత్యదర్శకుడు, నటుడు, దర్శక నిర్మాత రాఘవలారెన్స్ అమ్మ కోసం ఒక పాటను రూపొందించారు. శ్రీరాఘవేంద్రస్వామి భక్తుడైన ఈయన తన తల్లిని కూడా దైవంగా భావిస్తారు. అందుకే ఆమెకు గుడి కూడా కట్టించారు. ఇక ఎందరో అనాథలను ఆదుకుంటూ, వారికి విద్య, వైద్యసేవలను అందిస్తూ ఆదుకుంటున్న రాఘవ లారెన్స్ తాజాగా లోకంలోని తల్లుల కోసం ఒక పాటను రూపొందించారు. దాన్ని ప్రపంచ మాతృదినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తన తల్లితో కలిసి పాల్గొన్న రాఘవ లారెన్స్ మరికొందరు వృద్ధాశ్రమ తల్లులను ఆహ్వానించి వారిని సత్కరించి కానుకలను అందించారు. రాఘవలారెన్స్ మాట్లాడుతూ ప్రప్రంచంలో అమ్మకు మించిన దైవం లేదని, అందుకే అమ్మలను ప్రతి ఒక్కరూ ప్రేమించాలని అన్నారు. దయచేసి తల్లిదండ్రులను అనాథాశ్రమాలకు పంపకండని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తల్లిదండ్రులను అనాథాశ్రమానికి పంపిన వారు ఈ తాయ్(తల్లి) పేరుతో తాను రూపొందించిన ఈ పాట విని వారిని తమ ఇళ్లకు తిరిగి తీసుకొస్తారని భావిస్తున్నానన్నారు. తాను తాయ్ పేరుతో ఒక ట్రస్టును ప్రారంభించినట్లు, తద్వారా తాను, తన తల్లి వీలు కుదిరినప్పుడల్లా అనాథాశ్రమాలకు వెళ్లి తల్లుల గురించి అవగాహనా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా వృద్ధాశ్రమంలోని వారి జీవనానికి తోడ్పడేలా పలు సేవాకార్యక్రమాలను నిర్వహించతలపెట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తాయ్ పేరుతో రూపొందించిన పాటను తన తదుపరి చిత్రంలో పొందుపరచనున్నట్లు చెప్పారు. -
మోస్ట్ ఇన్స్పైరింగ్ మదర్ స్రవంతి ఐతరాజు
-
మోస్ట్ ఇన్స్పైరింగ్ మదర్ స్రవంతి ఐతరాజు
చిన్న కష్టం వస్తే మానసికంగా కుంగిపోయి.. ఆ కష్టంలోనే జీవితాంతం కూరుకుపోయే వాళ్లు ఎటు చూసినా కనిపిస్తారు. జీవితకాలానికి సరిపడేంత కష్టం బిడ్డ రూపంలో తన కడుపులోనే పుడితే.. ఆ తల్లి కుంగిపోలేదు.. ఆ బిడ్డనే ఓ బహుమతిగా స్వీకరించారు. తనను చుట్టుముట్టిన కష్టాలనే తన విజయాలకు సోపానాలుగా మలచుకున్నారు. ఆ మెట్లపై తన బిడ్డను వేలుపట్టి నడిపిస్తున్నారు. శరీరం ఎదుగుతున్నా మనసు ఎదగని ఆ పసిబిడ్డ చుట్టూ అందమైన ప్రపంచాన్ని నిర్మించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తన విజయాలన్నీ ఆ బిడ్డ ఇచ్చినవే అని మురిపెంగా చెప్పే ఆ మాతృమూర్తిని ఈ మాతృదినోత్సవం రోజు పలకరించింది సాక్షి. డాక్టర్ ఐతరాజు స్రవంతి మదర్ ఆఫ్ చందన్.. అవును ఆమెకు ఇలా చెప్పుకోవడం ఇష్టం గర్వకారణం కూడా. తనను చందన్ తల్లిగా ఈ ప్రపంచం గుర్తిస్తే.. అది తన ద్వారా తన బిడ్డ సాధించిన గొప్ప విజయం అంటారు ఈ తల్లి. చందన్ ఆటిజంతో పుట్టిన బిడ్డ. 19 ఏళ్లొచ్చినా చంటిపిల్లాడే. బిడ్డతోపాటే కష్టాలూ పుట్టాయి. అద్దె ఇల్లు దొరికేది కాదు, దగ్గరి బంధువులు, స్నేహితులు శుభకార్యాలకు చందన్ వద్దని చెప్పేవారు. నా బిడ్డ ఏం తప్పు చేశాడు.. లోపం వీడిలో కాదు.. వీణ్ని చూస్తున్న సమాజంలోనే ఉందని చందన్ చిన్నప్పుడే గుర్తించారు స్రవంతి. అందుకే మరో మంచి బిడ్డను కనమని అంతా సలహా ఇస్తే.. ఇంత అద్భుతమైన కొడుకు నాకున్నప్పుడు మళ్లీ కనడమెందుకన్నారు. అప్పటికే ఆమె సైకాలజీ స్టూడెంట్.. చందన్ పుట్టాక, ఆ బిడ్డకు ఆటిజం అని తెలిశాక తన బిడ్డ మానసిక స్థితిని అర్థం చేసుకునేందుకు ఆటిజంలో పీహెచ్డీ చేశారు. అలా ఆంధ్రప్రదేశ్‌లో ఆటిజంపై కొన్ని వేల పుస్తకాలు సేకరించి, చదివి రీసర్చ్ చేసి డాక్టరేట్ పొందిన తొలి వ్యక్తి స్రవంతి. బిడ్డ కోసం నేను ఎన్నో నేర్చుకున్నానే తప్ప ఏదీ త్యాగం చేయలేదంటారు ఆమె. చిన్నప్పుడే నేర్చుకున్న కర్నాటక సంగీతాన్ని తన బిడ్డ.. మనసులో మాటల్ని చెప్పడానికి ఆయుధాల్లా మలచిన తీరు ఆమె మాటల్లో వినాల్సిందే. గొప్ప కుటుంబంలో పుట్టారు. తల్లిదండ్రులిద్దరూ సాహితీప్రియులు. తండ్రి ప్రొఫెసర్. శంకరంబాడి సుందరాచార్యుల వారికి స్వయానా మేనకోడలు. చిన్న వయసులోనే సంగీతం, సాహిత్యం అబ్బాయి. చదువు పూర్తయ్యాక సాంఘిక సంక్షేమ శాఖలో మంచి ఉద్యోగం చేస్తున్నారు. భార్యాభర్తలిద్దరూ చేతినిండా సంపాదిస్తున్నారు.. అయినా ఏ రోజూ నాకు ఇలాంటి బిడ్డ ఎందుకని కుంగిపోలేదు. పిల్లాడిలోని పిసితనాన్ని అర్థం చేసుకోవడానికి ఇంటినే ఆటిజం ప్రయోగశాలగా మలచారు. అలాగని తన వ్యాపకాలను పక్కనపెట్టలేదు. రచయితగా, కవయిత్రిగా అనేక పుస్తకాలను, నవలలను రాశారు. సైకాలజిస్టుగా వందలాది టీవీ, రేడియో కార్యక్రమాలు నిర్వహించారు. సంగీత సృజనకారిణిగా ఎన్నో ప్రయోగాలు చేశారు. రాష్ట్రంలోని ప్రఖ్యాత సైకాలజిస్టుల్లో ఒకరుగా పేరుతెచ్చుకున్నారు. రాష్ట్రపతి అవార్డు మొదలు.. ప్రఖ్యాత యూనిసెఫ్ ఇచ్చే ఉమెన్ ఎక్సలెన్స్ అవార్డు దాకా ఇంట్లో కొలువుదీరిన అవార్డులన్నీ ఆమె విజయాలకు దర్పణాలు. ఇవన్నీ.. బిడ్డకు అవసరమైనవి నేర్పుతూ.. తాను నేర్చుకుంటూ సాధించిన విజయాలుగా ఆమె చెప్తారు. సాధారణ మానసిక వికలాంగులపై ప్రభుత్వాలకు ఉండే శ్రద్ధ ఆటిజం చిన్నారుల విషయంలో ఉండదు. ప్రపంచంలోనే ఆటిజం బిడ్డలపై చెప్పలేనంత నిర్లక్ష్యం, అవగాహనారాహిత్యం ఉందంటారు స్రవంతి. అందుకే.. తన బిడ్డ తన ప్రయోగాలకు మూల వస్తువుగా ఉపయోగపడ్డాడని చెబుతారు. తన రీసెర్చ్ వర్క్ ఎంతోమంది ఆటిజం బిడ్డలకూ, వారి తల్లిదండ్రులకూ దిశానిర్దేశం చేసి వారికి మానసిక ప్రశాంతత ఇస్తుందంటారు స్రవంతి. గోల్డ్ మెడల్స్ సాధించి విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డ బిడ్డల తల్లిదండ్రులు ఎంత తృప్తిగా ఉంటారో.. తాను అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉన్నట్లు చెబుతున్నారు ఈ చందన్ తల్లి. డాక్టర్ ఐతరాజు స్రవంతి వల్ల చందన్ మోస్ట్ హ్యాపియస్ట్ బోయ్‌గా జీవిస్తున్నాడు... చందన్ కోసం ఆమె సాగించిన రీసెర్చ్ ఆటిజంతో పుట్టిన తల్లిదండ్రులకు ఓ వరం. ఆటిజంతో పుట్టిన ప్రతి బిడ్డా చందన్ అంత హ్యాపీగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అంటున్న స్రవంతి.. మోస్ట్ ఇన్స్పైరింగ్ మదర్. -
తల్లి మనసు
మాతృత్వం ఒక అద్భుతమైన వరం.సృష్టి కొనసాగాలంటే, తల్లుల వల్లనే సాధ్యమవుతుంది. తల్లిమనసు గురించిన ప్రస్తావన మన సాహిత్యంలో చాలానే ఉంది. తల్లుల మనసులో మమకారం మాటలకందనిది. అయితే, తల్లుల మనసుల్లోనూ ఆటుపోట్లు ఉంటాయి. అలజడులు ఉంటాయి. ఆందోళనలు ఉంటాయి. మహిళలు తల్లులయ్యేటప్పుడు వారిలో తలెత్తే మానసిక సమస్యలు, వాటి నివారణ, చికిత్స పద్ధతుల గురించి సమగ్రంగా తెలుసుకుందాం. గర్భం దాల్చాలంటే మహిళలు శారీరకంగా, మానసికంగా పరిపక్వతను కలిగి ఉండాలి. పద్దెనిమిదేళ్ల లోపు, ముప్పయి ఐదేళ్ల తర్వాత గర్భం దాల్చటం వల్ల రకరకాల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారికి పుట్టే పిల్లల్లో జన్యు లోపాలు, శారీరక, మానసిక వైకల్యాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముప్పయి ఐదేళ్ల వయసు దాటిన మహిళలు గర్భం దాల్చినట్లయితే, గర్భిణిగా ఉన్నప్పటి నుంచే వైద్యుల పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకుంటూ ఉండాలి. ప్రసవం కూడా వైద్యుల పర్యవేక్షణలోనే జరగాలి. పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలంటే గర్భిణులకు పోషకాహారం ముఖ్యం. ప్రొటీన్స్, విటమిన్స్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఐరన్, క్యాల్షియం పుష్కలంగా లభించే రాగులు, బెల్లం, జీడిపప్పు, బాదం వంటి నట్స్, ఖర్జూరాల వంటి డ్రైఫ్రూట్స్, పాలు, పాల ఉత్పత్తులు బాగా తీసుకోవాలి. పొగాకు, మద్యం, మాదకద్రవ్యాలు వంటి వ్యసనాలు ఉన్నట్లయితే, గర్భం దాల్చడానికి ముందే వాటిని మానుకోవాలి. గర్భిణుల్లోని దురలవాట్లు పుట్టే పిల్లల్లోని శారీరక, మానసిక, జన్యు లోపాలకు కారణమవుతాయి. మహిళలు స్థూలకాయులుగా ఉన్నట్లయితే, వారికి పుట్టే పిల్లల్లో ఆటిజం, నరాలకు సంబంధించిన ఇతర లోపాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. మహిళల్లో థైరాయిడ్ లోపాలు, శారీరక, మానసిక లోపాలు ఉన్నట్లయితే తొలి దశలోనే గుర్తించి, చికిత్స తీసుకోవాలి. శారీరక, మానసిక లోపాలతో బాధపడే మహిళలకు కుటుంబం మొత్తం ఆసరాగా నిలవాలి. అప్పుడే మహిళలు ఆరోగ్యవంతులైన తల్లులుగా, ఆరోగ్యవంతమైన సంతానాన్ని ఇవ్వగలుగుతారు. ఎంతో శక్తితో, ఉత్సాహంతో తమ పిల్లలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతారు. గర్భం ధరించాక తీసుకోవలసిన జాగ్రత్తలు గర్భం దాల్చిన మహిళల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. పైకి కనిపించే మార్పులతో పాటు శరీరంలోని హార్మోన్ల స్థాయి, రక్త పరిమాణం, గుండె వేగంలో మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు గర్భధారణకు అవసరం. అలాగే, ప్రసవం తర్వాత కూడా అనేక రసాయనిక, హార్మోన్ మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రసవానంతరం చోటు చేసుకునే మార్పులు శిశువు పోషణకు, లాలనకు అవసరం. గర్భిణి దశలోను, ప్రసవం తర్వాత చోటు చేసుకునే రసాయనిక మార్పుల ఫలితంగా తల్లుల మానసిక స్థితిలోనూ మార్పులు ఏర్పడతాయి. గర్భం దాల్చిన సమయంలోనూ, ప్రసవం తర్వాత కూడా తల్లులకు పోషకాహారం, ఆహ్లాదకరమైన వాతావరణం, కుటుంబ సభ్యుల ఆత్మీయత, సహకారం ఎంతో అవసరం. అలాగే, ఈ సమయంలో తగినంత వ్యాయామం కూడా అవసరం. గర్భం దాల్చిన తొలి మూడు నాలుగు నెలలూ ఎంతో కీలకమైనవి. ఈ సమయంలో గర్భంలోని శిశువు శరీర నిర్మాణం అత్యంత వేగంగా జరుగుతుంది. ఎదుగుతున్న ఈ శిశువుపై రసాయనాలు, మందులు, మద్యం, పొగాకు వంటి పదార్థాల ప్రభావం ప్రమాదకరంగా ఉంటుంది. కొన్ని ప్రమాదకరమైన పదార్థాల ప్రభావాన్ని ప్లాసెంటా ఆపగలిగినా, అది సంపూర్ణమైన రక్షణ కవచం కాదు. అందువల్ల ఈ సమయంలో వైద్యుల సలహా లేకుండా మందులు వాడటం మంచిది కాదు. శారీరక, మానసిక సమస్యలు ఉన్నవారు గర్భం దాల్చినప్పుడు వారు వాడుతున్న మందుల గురించి వైద్యులకు తెలియజేసి, వారు సూచించిన మేరకు తగిన మార్పులు చేసుకోవాలి. అప్పటి వరకు వాడుతున్న మందులకు బదులుగా గర్భస్థ శిశువులపై ప్రభావం చూపని లేదా తక్కువ ప్రభావం చూపే మందులను ఇస్తారు. గర్భ నిర్ధారణ జరిగిన వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరం. వాస్తవానికి శారీరక, మానసిక సమస్యలతో చికిత్స పొందుతున్న మహిళలు గర్భధారణకు సిద్ధపడే ముందే వైద్యులను సంప్రదించి, అప్పటి వరకు వాడుతున్న మందుల్లో మార్పులు చేయించుకోవడం మంచిది. మానసిక సమస్యలు ఉన్నవారు అసలు గర్భం దాల్చకూడదనేది అపోహ మాత్రమే. అయితే, వైద్యుల పర్యవేక్షణలో ముందుగా ప్లాన్ చేసుకుని, గర్భం దాల్చినప్పుడు సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని మందులు వాడుతూ గర్భం దాల్చినప్పుడు శిశువులో శారీరక లోపాలు, మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ముందుగానే వైద్యులను సంప్రదించడం అన్ని విధాలా మంచిది. అలాగే పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా మందులు వాడే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కొన్ని మందులు తల్లి పాల ద్వారా బిడ్డ శరీరంలోకి ప్రవేశించి, దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉంది. అందువల్ల వైద్యుల సలహాతో మందుల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ మహిళల్లోనూ సమస్యలు తలెత్తవచ్చు అంతకు ముందు మానసిక సమస్యలేవీ లేని సాధారణ మహిళలు కొందరిలో కూడా గర్భధారణ సమయంలోను, ప్రసవం తర్వాత మానసిక సమస్యలు తలెత్తవచ్చు. కొందరు సాధారణ మహిళల్లో సైతం గర్భధారణ సమయంలో డిప్రెషన్, స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్, యాంగై్జటీ డిజార్డర్, పానిక్ డిజార్డర్, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు వైద్యులను సంప్రదించి వారి పర్యవేక్షణలో తగిన చికిత్స పొందాలి. కొన్ని సమస్యలకు కాగ్నిటివ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ వంటి చికిత్సలు చేస్తారు. పరిస్థితిని బట్టి కొందరికి మందులను వాడాల్సి ఉంటుంది. సాధారణంగా వీలైనన్ని తక్కువ మందులు, తక్కువ మోతాదులు సూచించడం జరుగుతుంది. ప్రసవం తర్వాత మహిళల్లో హార్మోన్ల మార్పులు, రక్తస్రావం వంటి అనేక కారణాల వల్ల మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ప్రసవానంతరం తలెత్తే మానసిక సమస్యలను ‘పోస్ట్‌పార్టమ్ బ్లూస్’గా వ్యవహరిస్తారు. దాదాపు 80 శాతం మంది మహిళల్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసవం తర్వాత చిరాకు, కోపం, దిగులు, భయం, ఆందోళన వంటి భావోద్వేగాలు తాత్కాలికంగా అధికమయ్యే అవకాశం ఉంటుంది. చాలామందిలో ఈ పరిస్థితి రెండు వారాల కంటే తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. అలాంటప్పుడు ఎటువంటి చికిత్స అవసరం ఉండదు. కొద్దిమందిలో ఈ మార్పులు రెండు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగుతాయి. అలాంటప్పుడు వీటిని పోస్ట్‌పార్టమ్ మానసిక వ్యాధులుగా గుర్తించాలి. ప్రసవం తర్వాత కొద్ది మందిలో ఆందోళన, పానిక్ డిజార్డర్, స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్, సైకోసిస్ వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి. అలాంటప్పుడు వైద్యులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవలసి ఉంటుంది. పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ లేదా సైకోసిస్ తీవ్రస్థాయిలో కలిగినప్పుడు కొందరు తల్లుల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు రావడం, పుట్టిన బిడ్డకు హాని కలుగుతుందనే నిష్కారణమైన భయం కలగడం సంభవించవచ్చు. అందువల్ల కుటుంబ సభ్యులు తల్లికి, బిడ్డకు హాని జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తొలి కాన్పులో పోస్ట్‌పార్టమ్ మానసిక సమస్యలు తలెత్తిన వారికి, తర్వాతి కాన్పులోనూ అలాంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి మానసిక సమస్యలకు ఒక్కోసారి దీర్ఘకాలిక చికిత్స అవసరం కావచ్చు. వైద్యుల సలహా ప్రకారం క్రమం తప్పకుండా మందులు వాడినట్లయితే, వ్యాధి రాకుండా ఆపడానికి, ఒకవేళ వచ్చినా లక్షణాల తీవ్రతను గణనీయంగా తగ్గించడానికి, ఆత్మహత్య, ఇతరత్రా ప్రమాదకర పరిణామాలు సంభవించకుండా నివారించడానికి సాధ్యమవుతుంది. మన దేశంలో ప్రసవానంతరం మానసిక సమస్యలను ఎదుర్కొంటున్న మహిళలు 22 శాతం వరకు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజా అధ్యయనం వెల్లడించింది. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దక్షిణాదిలో 26 శాతం మంది తల్లులు ప్రసవానంతర మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. జనాల్లో అవగాహన లేమి, పల్లెల్లో వైద్య సౌకర్యాల కొరత వంటి పలు కారణాలు మానసిక సమస్యలతో బాధపడుతున్న మహిళల పరిస్థితిని మరింత జటిలంగా మారుస్తున్నాయని డబ్ల్యూహెచ్‌వో అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అధ్యయనం ప్రకారం భారత్‌లో ప్రసవానంతరం మహిళల్లో తలెత్తే మానసిక సమస్యలను మరింత జటిలంగా మారుస్తున్న కొన్ని ముఖ్యమైన కారణాలు... కుటుంబంలో కలతలు, కుటుంబ సభ్యుల అనాదరణ - గర్భం దాల్చక ముందే ఉన్న మానసిక సమస్యలకు తగిన చికిత్స పొందకపోవడం - ఆడ శిశువును ప్రసవించడం - పుట్టిన శిశువులో లోపాలు లేదా మృతశిశువు జననం - మాదక ద్రవ్యాలకు బానిసగా మారిన భర్త - భార్యా భర్తల మధ్య అనుబంధంలో అపశ్రుతులు - తగిన ప్రణాళిక లేకుండా గర్భం దాల్చడం గర్భం దాల్చాలంటే మహిళలు శారీరకంగా, మానసికంగా పరిపక్వతను కలిగి ఉండాలి. పద్దెనిమిదేళ్ల లోపు, ముప్పయి ఐదేళ్ల తర్వాత గర్భం దాల్చటం వల్ల రకరకాల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. అలాంటి వారికి పుట్టే పిల్లల్లో జన్యు లోపాలు, శారీరక, మానసిక వైకల్యాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముప్పయి ఐదేళ్ల వయసు దాటిన మహిళలు గర్భం దాల్చినట్లయితే, గర్భిణిగా ఉన్నప్పటి నుంచే వైద్యుల పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకుంటూ ఉండాలి. ప్రసవం కూడా వైద్యుల పర్యవేక్షణలోనే జరగాలి. పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలంటే గర్భిణులకు పోషకాహారం ముఖ్యం. ప్రొటీన్స్, విటమిన్స్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఐరన్, క్యాల్షియం పుష్కలంగా లభించే రాగులు, బెల్లం, జీడిపప్పు, బాదం వంటి నట్స్, ఖర్జూరాల వంటి డ్రైఫ్రూట్స్, పాలు, పాల ఉత్పత్తులు బాగా తీసుకోవాలి. పొగాకు, మద్యం, మాదకద్రవ్యాలు వంటి వ్యసనాలు ఉన్నట్లయితే, గర్భం దాల్చడానికి ముందే వాటిని మానుకోవాలి. గర్భిణుల్లోని దురలవాట్లు పుట్టే పిల్లల్లోని శారీరక, మానసిక, జన్యు లోపాలకు కారణమవుతాయి. మహిళలు స్థూలకాయులుగా ఉన్నట్లయితే, వారికి పుట్టే పిల్లల్లో ఆటిజం, నరాలకు సంబంధించిన ఇతర లోపాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. మహిళల్లో థైరాయిడ్ లోపాలు, శారీరక, మానసిక లోపాలు ఉన్నట్లయితే తొలి దశలోనే గుర్తించి, చికిత్స తీసుకోవాలి. శారీరక, మానసిక లోపాలతో బాధపడే మహిళలకు కుటుంబం మొత్తం ఆసరాగా నిలవాలి. అప్పుడే మహిళలు ఆరోగ్యవంతులైన తల్లులుగా, ఆరోగ్యవంతమైన సంతానాన్ని ఇవ్వగలుగుతారు. ఎంతో శక్తితో, ఉత్సాహంతో తమ పిల్లలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దగలుగుతారు. గర్భం ధరించాక తీసుకోవలసిన జాగ్రత్తలు గర్భం దాల్చిన మహిళల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. పైకి కనిపించే మార్పులతో పాటు శరీరంలోని హార్మోన్ల స్థాయి, రక్త పరిమాణం, గుండె వేగంలో మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు గర్భధారణకు అవసరం. అలాగే, ప్రసవం తర్వాత కూడా అనేక రసాయనిక, హార్మోన్ మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రసవానంతరం చోటు చేసుకునే మార్పులు శిశువు పోషణకు, లాలనకు అవసరం. గర్భిణి దశలోను, ప్రసవం తర్వాత చోటు చేసుకునే రసాయనిక మార్పుల ఫలితంగా తల్లుల మానసిక స్థితిలోనూ మార్పులు ఏర్పడతాయి. గర్భం దాల్చిన సమయంలోనూ, ప్రసవం తర్వాత కూడా తల్లులకు పోషకాహారం, ఆహ్లాదకరమైన వాతావరణం, కుటుంబ సభ్యుల ఆత్మీయత, సహకారం ఎంతో అవసరం. అలాగే, ఈ సమయంలో తగినంత వ్యాయామం కూడా అవసరం. గర్భం దాల్చిన తొలి మూడు నాలుగు నెలలూ ఎంతో కీలకమైనవి. ఈ సమయంలో గర్భంలోని శిశువు శరీర నిర్మాణం అత్యంత వేగంగా జరుగుతుంది. ఎదుగుతున్న ఈ శిశువుపై రసాయనాలు, మందులు, మద్యం, పొగాకు వంటి పదార్థాల ప్రభావం ప్రమాదకరంగా ఉంటుంది. కొన్ని ప్రమాదకరమైన పదార్థాల ప్రభావాన్ని ప్లాసెంటా ఆపగలిగినా, అది సంపూర్ణమైన రక్షణ కవచం కాదు. అందువల్ల ఈ సమయంలో వైద్యుల సలహా లేకుండా మందులు వాడటం మంచిది కాదు. శారీరక, మానసిక సమస్యలు ఉన్నవారు గర్భం దాల్చినప్పుడు వారు వాడుతున్న మందుల గురించి వైద్యులకు తెలియజేసి, వారు సూచించిన మేరకు తగిన మార్పులు చేసుకోవాలి. అప్పటి వరకు వాడుతున్న మందులకు బదులుగా గర్భస్థ శిశువులపై ప్రభావం చూపని లేదా తక్కువ ప్రభావం చూపే మందులను ఇస్తారు. గర్భ నిర్ధారణ జరిగిన వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరం. వాస్తవానికి శారీరక, మానసిక సమస్యలతో చికిత్స పొందుతున్న మహిళలు గర్భధారణకు సిద్ధపడే ముందే వైద్యులను సంప్రదించి, అప్పటి వరకు వాడుతున్న మందుల్లో మార్పులు చేయించుకోవడం మంచిది. మానసిక సమస్యలు ఉన్నవారు అసలు గర్భం దాల్చకూడదనేది అపోహ మాత్రమే. అయితే, వైద్యుల పర్యవేక్షణలో ముందుగా ప్లాన్ చేసుకుని, గర్భం దాల్చినప్పుడు సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని మందులు వాడుతూ గర్భం దాల్చినప్పుడు శిశువులో శారీరక లోపాలు, మానసిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ముందుగానే వైద్యులను సంప్రదించడం అన్ని విధాలా మంచిది. అలాగే పిల్లలకు పాలిచ్చే తల్లులు కూడా మందులు వాడే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కొన్ని మందులు తల్లి పాల ద్వారా బిడ్డ శరీరంలోకి ప్రవేశించి, దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉంది. అందువల్ల వైద్యుల సలహాతో మందుల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ మహిళల్లోనూ సమస్యలు తలెత్తవచ్చు అంతకు ముందు మానసిక సమస్యలేవీ లేని సాధారణ మహిళలు కొందరిలో కూడా గర్భధారణ సమయంలోను, ప్రసవం తర్వాత మానసిక సమస్యలు తలెత్తవచ్చు. కొందరు సాధారణ మహిళల్లో సైతం గర్భధారణ సమయంలో డిప్రెషన్, స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్, యాంగై్జటీ డిజార్డర్, పానిక్ డిజార్డర్, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు వైద్యులను సంప్రదించి వారి పర్యవేక్షణలో తగిన చికిత్స పొందాలి. కొన్ని సమస్యలకు కాగ్నిటివ్ థెరపీ, బిహేవియరల్ థెరపీ వంటి చికిత్సలు చేస్తారు. పరిస్థితిని బట్టి కొందరికి మందులను వాడాల్సి ఉంటుంది. సాధారణంగా వీలైనన్ని తక్కువ మందులు, తక్కువ మోతాదులు సూచించడం జరుగుతుంది. ప్రసవం తర్వాత మహిళల్లో హార్మోన్ల మార్పులు, రక్తస్రావం వంటి అనేక కారణాల వల్ల మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ప్రసవానంతరం తలెత్తే మానసిక సమస్యలను ‘పోస్ట్‌పార్టమ్ బ్లూస్’గా వ్యవహరిస్తారు. దాదాపు 80 శాతం మంది మహిళల్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసవం తర్వాత చిరాకు, కోపం, దిగులు, భయం, ఆందోళన వంటి భావోద్వేగాలు తాత్కాలికంగా అధికమయ్యే అవకాశం ఉంటుంది. చాలామందిలో ఈ పరిస్థితి రెండు వారాల కంటే తక్కువ సమయం మాత్రమే ఉంటుంది. అలాంటప్పుడు ఎటువంటి చికిత్స అవసరం ఉండదు. కొద్దిమందిలో ఈ మార్పులు రెండు వారాల కంటే ఎక్కువ కాలం కొనసాగుతాయి. అలాంటప్పుడు వీటిని పోస్ట్‌పార్టమ్ మానసిక వ్యాధులుగా గుర్తించాలి. ప్రసవం తర్వాత కొద్ది మందిలో ఆందోళన, పానిక్ డిజార్డర్, స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్, సైకోసిస్ వంటి మానసిక సమస్యలు తలెత్తుతాయి. అలాంటప్పుడు వైద్యులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవలసి ఉంటుంది. పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ లేదా సైకోసిస్ తీవ్రస్థాయిలో కలిగినప్పుడు కొందరు తల్లుల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు రావడం, పుట్టిన బిడ్డకు హాని కలుగుతుందనే నిష్కారణమైన భయం కలగడం సంభవించవచ్చు. అందువల్ల కుటుంబ సభ్యులు తల్లికి, బిడ్డకు హాని జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తొలి కాన్పులో పోస్ట్‌పార్టమ్ మానసిక సమస్యలు తలెత్తిన వారికి, తర్వాతి కాన్పులోనూ అలాంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి మానసిక సమస్యలకు ఒక్కోసారి దీర్ఘకాలిక చికిత్స అవసరం కావచ్చు. వైద్యుల సలహా ప్రకారం క్రమం తప్పకుండా మందులు వాడినట్లయితే, వ్యాధి రాకుండా ఆపడానికి, ఒకవేళ వచ్చినా లక్షణాల తీవ్రతను గణనీయంగా తగ్గించడానికి, ఆత్మహత్య, ఇతరత్రా ప్రమాదకర పరిణామాలు సంభవించకుండా నివారించడానికి సాధ్యమవుతుంది. -
‘నా విజయంలో అమ్మ పాత్ర కీలకమైంది : కలెక్టర్
వనపర్తి : ‘నా విజయంలో అమ్మ పాత్ర కీలకమైంది. మా అమ్మకు మేమిద్దరం ఆడపిల్లలం. మాకు అన్నదమ్ముళ్లు లేరు. చిన్నతనం నుంచే అమ్మ ఉన్నత చదువులు కోసం మామ్మల్ని ఎంతో ప్రోత్సహించారు.’ అని కలెక్టర్ శ్వేతామహంతి తనకు అమ్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆదివారం మదర్స్ డే సందర్భంగా శనివారం ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తల్లులందరికీ ఆమె మదర్స్ డే సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అమ్మే మొదటి గురువు ప్రతి ఒక్కరికీ మొదటి గురువు అమ్మ. మాట్లాడే మాటలు, నేర్చుకునే అక్షరాలను మొదట అమ్మే నేర్పిస్తారు. వారి ఆత్మధైర్యంతో పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. నా విషయంలో అమ్మ ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో ఉన్నతమైంది. మా సిస్టర్ ఐఐటీ చేసి అమెరికాలో స్థిరపడ్డారు. ప్రతి మదర్స్‌డే కు మేమిద్దరం అమ్మకు స్పెషల్‌గా విషెష్ చెబుతాం. మా అమ్మ లాగే నాకూ ఇద్దరు ఆడపిల్లలు. మగ సంతానం కలగలేదన్న ఆలోచన ఏనాడూ కలగలేదు. ఆడపిల్లలను ప్రోత్సహించాలి ఆడ పిల్లలకు అమ్మ ప్రోత్సాహం చాలా ముఖ్యమైంది. ప్రతిపనిలో నీవు ఆడపిల్లవు! అన్న మాటను ప్రస్తావించకూడదు. ఆడ.. మగ అనే వ్యత్యాసం అనుభవాలు చిన్నతనం నుంచే మనస్సులోకి రానివ్వకుండా పిల్లలను పెంచాలి. సొసైటీలో ఎప్పుడూ ఆడపిల్ల అన్న చులకన భావానికి స్వస్తి చెప్పాలి. విద్యావంతులు ఈ విషయంపై చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. అంతరాలు తొలగాలి.. ఎదుటివారు తప్పుచేసినా ఆడపిల్లను నిందించే సంస్కృతికి స్వస్తి చెప్పాలి. ఆడపిల్ల లేకుండా సమాజమే లేదన్న విషయం గుర్తించాలి. ఆడ.. మగ అనే అంతరాలు లేని సమాజాన్ని నిర్మించాలి. అవధుల్లేనిది అమ్మ ప్రేమ. మదర్స్ డే రోజున మీ అమ్మపై మీకు ఎంత ప్రేమ ఉందో తెలిసేలా శుభాకాంక్షలు చెప్పండి.