డైరెక్టర్‌గా మారిన యువ హీరో | Naga Shourya Directed A Short Film Bhoomi | Sakshi
Sakshi News home page

Published Sat, May 12 2018 7:42 PM | Last Updated on Sat, May 12 2018 7:52 PM

Naga Shourya Directed A Short Film Bhoomi - Sakshi

ఛలో సినిమాతో సక్సెస్‌ సాధించి ఫుల్‌ జోష్‌లో ఉన్నారు నాగశౌర్య. ప్రస్తుతం ఈ కుర్ర హీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ మధ్యే కణం మూవీతో ప్రేక్షకులను పలకరించారు. త్వరలోనే అమ్మమ్మగారిల్లు సినిమాతో సందడి చేయనున్నారు. ప్రస్తుతం ఈ యువ హీరో మెగా ఫోన్‌ పట్టుకున్నారు. 

అయితే ఇది ఒక షార్ట్‌ఫిలిమ్‌ కోసం. రేపు( ఆదివారం) మాతృ దినోత్సవ సందర్భంగా మాతృ మూర్తులందరికి అంకితం చేస్తూ... భూమి అనే షార్ట్‌ ఫిలిమ్‌ను రిలీజ్‌ చేయనున్నారు. ఈ లఘుచిత్రాన్ని నాగశౌర్య డైరెక్ట్‌ చేశారు. ఆదివారం ఉదయం పది గంటలకు రిలీజ్‌ చేయనున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం నాగశౌర్య ‘నర్తనశాల’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement