bhoomi
-
బుల్లితెర నటి బోల్డ్ పిక్స్.. నెటిజన్స్ దారుణ కామెంట్స్!
శాండల్‌వుడ్‌లో బుల్లితెరపై ఫేమ్ తెచ్చుకున్న నటి భూమి శెట్టి. కిన్నెర సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాల్లోనూ నటిస్తోంది. అంతే కాకుండా బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. గత కొన్ని రోజులుగా హాట్ గ్లామర్ పిక్స్ చేస్తూ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇటీవల భూమి తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోపై నెటిజన్స్ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులోనూ నిన్నే పెళ్లాడతా, అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు సీరియల్స్‌లో కనిపించింది. (ఇది చదవండి: బాలయ్య హీరోయిన్ ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్!) ఇటీవల భూమి మరింత బోల్డ్ లుక్స్‌తో ఫోటోలు షేర్ చేస్తోంది. భూమి ఫోటోలు చూసిన ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. అయితే కొందరు విమర్శలు చేయగా.. మరికొందరు ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ఆ ఫోటోలో భూమి శెట్టి టాప్ లెస్‌గా కనిపించింది. కేవలం లో దుస్తులు ధరించి కనిపించింది. దీనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇంతకు ముందు మంచి బట్టలు వేసుకునేదానివి.. ఇప్పుడు సగమే ధరిస్తున్నావా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో మీకు సరిపోయే డ్రెస్‌లు ఏ దుకాణంలో దొరకలేదా? అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఒక్క ఫోటో కాదు.. ఇటీవల భూమి శెట్టి షేర్ చేసిన వీడియోపై కూడా కామెంట్ చేస్తున్నారు భూమి శెట్టి 'కిన్నెరి' సీరియల్ తర్వాత.. తెలుగులో 'నిన్నే పెళ్లాడతా', 'అక్క చెల్లెలు' సీరియల్స్‌లో ప్రధాన పాత్రల్లో నటించింది. బిగ్ బాస్ సీజన్ -7 తర్వాత 'ఇక్కత్' సినిమాతో శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో భూమికి జోడీగా నాగభూషణ్ నటించారు. ప్రస్తుతం భూమి కన్నడలో 'కెందాడ సెరగు' సినిమాలో నటిస్తోంది. (ఇది చదవండి: జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు) View this post on Instagram A post shared by ಭೂMee (@bhoomi_shettyofficial) View this post on Instagram A post shared by kannada actress ❤️ (@sandalwood_actress_fans) -
వైరల్ : మొదటిసారి కూతురి ఫోటోను రివీల్ చేసిన హరితేజ
ప్రముఖ నటి, యాంకర్ హరితేజ ఇటీవలె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హరితేజ..అప్పుడప్పుడు కూతురిని తన భర్త దీపక్‌రావు ఆడిస్తున్న కొన్ని వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఈ మధ్యే కూతురికి బారసాల ఫంక్షన్ అయ్యిందని, చిన్నారికి భూమి దీపక్‌రావు అని నామకరణం చేసినట్లు వెల్లడించిన హరితేజ ఇప్పటివరకు పాప ఫోటోను రివీల్ చేయలేదు. దీంతో పలువురు నెటిజన్లు భూమిని ఎప్పుడు చూయిస్తారంటూ పలుమార్లు అడగగా, త్వరలోనే అని సమాధానం చెప్పేది. తాజాగా ఎట్టకేలకు హరితేజ తన చిన్నారి ఫోటోను రివీల్ చేసేసింది. మీట్ Miss భూమి దీపక్ రావ్ అంటూ కూతురి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా పలువురు బుల్లితెర ప్రముఖులు సహా నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భూమి పేరులానే పాప కూడా ఎంతో ముద్దుగుందంటూ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. బుల్లితెరపై సీరియల్స్‌లో నటించడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హరితేజ.. తర్వాత యాంకర్‌గా పాపులారిటీ సంపాదించుకుంది. ఆ గుర్తింపుతో బిగ్‌బాస్ 1లోకి వెళ్లి తనదైన నటనతో బుల్లితెర ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంది.2015లో దీపక్ రావును పెళ్లాడిన హరితేజ ఈ ఏడాది ఏప్రిల్ 5న పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. రాజా ది గ్రేట్, హిట్, సరిలేరు నీకెవ్వరు, ప్రతిరోజు పండగే, ఎఫ్ 2, అరవింద సమేత, యూటర్న్, శ్రీనివాస కళ్యాణం లాంటి సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో హరితేజ నటించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Hari Teja (@actress_hariteja) -
డైరెక్టర్‌గా మారిన యువ హీరో
ఛలో సినిమాతో సక్సెస్ సాధించి ఫుల్ జోష్‌లో ఉన్నారు నాగశౌర్య. ప్రస్తుతం ఈ కుర్ర హీరో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ మధ్యే కణం మూవీతో ప్రేక్షకులను పలకరించారు. త్వరలోనే అమ్మమ్మగారిల్లు సినిమాతో సందడి చేయనున్నారు. ప్రస్తుతం ఈ యువ హీరో మెగా ఫోన్ పట్టుకున్నారు. అయితే ఇది ఒక షార్ట్ఫిలిమ్ కోసం. రేపు( ఆదివారం) మాతృ దినోత్సవ సందర్భంగా మాతృ మూర్తులందరికి అంకితం చేస్తూ... భూమి అనే షార్ట్ ఫిలిమ్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ లఘుచిత్రాన్ని నాగశౌర్య డైరెక్ట్ చేశారు. ఆదివారం ఉదయం పది గంటలకు రిలీజ్ చేయనున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం నాగశౌర్య ‘నర్తనశాల’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. Strong women, strong mothers define the strength of our nation. Saluting all mothers this #MothersDay.#Bhoomi is our tribute to all the women on this day. Yours, Naga Shaurya. Releasing tomorrow morning at 10AM @https://t.co/6i1mAPmOuC pic.twitter.com/BG0WbIrRJ6 — Naga Shaurya (@IamNagashaurya) May 12, 2018 -
'నా వయసుకు తగ్గ పాత్రలు మాత్రమే చేస్తా'
జైలు జీవితం తరువాత బాలీవుడ్ హీరో సంజయ్ దత్ లీడ్ రోల్ లో తెరకెక్కిన సినిమా భూమి. ఈ సినిమాలో చెలియా ఫేం అదితిరావ్ హైదరి తండ్రిగా నటించాడు సంజయ్. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సంజయ్, తన భవిష్యత్ ప్రణాళికల గురించి వివరించారు. జైలు జీవితం తరువాత తనలో ఎంతో మార్పు వచ్చిందన్న సంజయ్, ఇక మీదట చెట్లుపుట్టల వెంట తిరుగుతూ పాటలు పాడనని క్లారిటీ ఇచ్చాడు. భవిష్యత్తులో తన వయసుకు తగ్గ పాత్రలు మాత్రమే ఎంచుకుంటానని తెలిపారు. ఇప్పటికే తొమ్మిది సినిమాలతో కమిట్ అయిన సంజయ్ దత్, నటుడిగా బిజీ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడు. అదే సమయంలో రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన బయోపిక్ లో అదితి పాత్రలో నటించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. -
సంజయ్ దత్ భూమి ఫస్ట్ లుక్
సంజయ్‌దత్ 58వ పుట్టినరోజు సందర్భంగా ఆయన తాజా చిత్రం `భూమి` చిత్ర ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ పోస్టర్ ను సంజయ్ దత్ స్వయంగా ఆయన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా రిలీజ్ చేశారు. సంజయ్ పోస్టర్ ట్వీట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే అది నేషనల్ లెవల్ లో ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ పోస్టర్లో సంజయ్ ముఖం మీద రక్తపు మరకలతో, చెదిరిన గడ్డంతో కనిపించారు. ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తరువాత సంజయ్ లీడ్ రోల్ లో తెరకెక్కిన తొలి సినిమా ఇదే. ఈ సినిమాకు ఒమాంగ్ కుమార్ దర్శకుడు. Here's presenting the first official poster of #Bhoomi! @BhoomiTheFilm @OmungKumar @TSeries @LegendStudios1 @aditiraohydari pic.twitter.com/GndKVEfZ6q — Sanjay Dutt (@duttsanjay) 29 July 2017 -
మదినిండుగా భూమిపండుగ
ఏజన్సీలో అడవిబిడ్డల ఆనందహేల విల్లంబులతో పురుషులు వేటకు పయనం ఆటపాటలతో మహిళల నృత్యాలు చింతూరు (రంపచోడవరం): ఆదివాసీలకు ఎంతో ప్రాముఖ్యం కలిగిన భూమిపండుగ వేడుక ఏజెన్సీ వ్యాప్తంగా కోలాహలంగా సాగుతోంది. తొలకరి ప్రారంభంలో మూడు రోజులపాటు ప్రతి పల్లెలో ఈ పండుగను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి తమ భూముల్లో సిరులు పండాలని కోరుకుంటూ కులదేవతలతో పాటు విత్తనాలకు, భూమికి పూజ నిర్వహించడమే ఈ పండుగ ప్రాముఖ్యత. మూడు రోజులపాటు నిర్వహించే పండుగ వాతావరణం ముగియగానే అందరూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతారు. సంప్రదాయ వేట, ఆటాపాటా మూడు రోజులపాటు పురుషులంతా కలసి విల్లంబులు చేతబూని సంప్రదాయ వేట నిమిత్తం అడవిబాట పడతారు. ఇదే సమయంలో మహిళలు పండుగ నిర్వహణ కోసం గ్రామ సమీపంలోని రహదారుల వద్దకు చేరుకుని రేల నృత్యం చేస్తూ, పాటలు పాడుతూ, వచ్చీ, పోయే వాహనాలను ఆపుతూ డబ్బులు అడుగుతారు. కొన్ని గ్రామాల మహిళలు మండల కేంద్రాలకు వచ్చి దుకాణాల వద్ద కూడా డబ్బులు అడుగుతారు. ఇలా మూడు రోజులపాటు వసూలైన డబ్బులతో పూజలకు కావల్సిన సామగ్రి కొనుగోలు చేసి పండుగ నిర్వహిస్తారు. ఇక ఉదయం వేటకు వెళ్లిన పరుషులు సాయంత్రానికి ఇళ్లకు చేరుకుంటారు. వేటలో భాగంగా ఏదైనా జంతువును వేటాడితే దానిని గ్రామస్తులంతా సమానంగా పంచుకుంటారు. ఏ జంతువును వేటాడకుండా ఖాళీ చేతులతో తిరిగి వచ్చిన పురుషులపై సంప్రదాయంలో భాగంగా మహిళలు పేడనీళ్లు జల్లి స్వాగతం పలుకుతారు. -
కూతురి కాళ్లు విరగ్గొడతాడట
జైలు నుంచి విడుదలైన తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న సంజయ్ దత్ తిరిగి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఆగ్రా పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న భూమి సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు ఖల్ నాయక్. అయితే ప్రస్తుతం సినిమాల కన్నా ఫ్యామిలీ లైఫే ఇంపార్టెంట్ అని భావిస్తున్న సంజయ్, ఎక్కువ సమయం కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడుతున్నాడు. అదే సమయంలో తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు తన పిల్లలకు ఎదురుకావొద్దన్న ఉద్దేశంతో వారి భవిష్యత్తు విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. తన తాజా చిత్రం తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతుండటంతో నిజజీవితంలో తన పిల్లల గురించి మీడియాతో మాట్లాడాడు. సినిమాలో తన కూతురి పాత్రకు నిజజీవితంలో తన కూతురి త్రిశాలకు చాలా పోలికలున్నాయన్నా సంజయ్ దత్. 'త్రిశల నటి కావాలని కలలు కంటోంది. కానీ నేను తన కాళ్లు విరగ్గొడదాం అనుకుంటున్నా' అన్నాడు. తన చదువు కోసం ఎంతో సమయం, శక్తి కేటాయించానన్న సంజూ భాయ్ తనని ఫోరెన్సిక్ సైన్స్ చదివించాలని భావిస్తున్నాడట. మరి త్రిశల తన పంతం నెగ్గించుకుంటుందో.. లేక తండ్రి మాట విని బుద్ధిగా చదువుకుంటుందో చూడాలి. -
నేను రెండు రాష్ట్రాల పౌరుడిని: సంజయ్ దత్
ఆగ్రా(ఉత్తర్‌ప్రదేశ్): తాను ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు చెందిన పౌరుడినని బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ చెప్పారు. తాజా చిత్రం ‘భూమి’లో షూటింగ్లో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ..తన నాయనమ్మ ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారని, తాత బిహార్‌కు చెందిన వారు అవ్వడం వల్ల తాను ఈ రెండు రాష్ట్రాలకు చెందినవాడినవుతానని తెలిపారు. భూమి సినిమాకు సంబంధించిన షూటింగ్ బాగా జరుగుతోందన్నారు. ఐదు సంవత్సరాల తర్వాత తొలిసారి పూర్తిస్థాయిలో కెమెరా ముందుకు వచ్చినట్లు తెలిపారు. చివరిసారి 2014లో ‘పీకే’ చిత్రంలో చిన్న పాత్రతో మెరిశాడు. భూమి చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అదితిరావు హైదరీ , శేఖర్ సుమన్ కీలక పాత్రలు చేస్తున్నారు. -
ఇదేమి జన్మభూమి?
‘జన్మభూమి’ సభను బహిష్కరించిన గిరిపుత్రులు రేషన్ కార్డులు ఇవ్వకుంటే ఈ సభలెందుకు? ప్రశ్నించిన ఎమ్మెల్యే రాజేశ్వరి...సభ బహిష్కరణ సాక్షి, రాజమహేంద్రవరం : గత జన్మభూమిలో రేషన్ కార్డుల కోసం చేసుకున్న దరఖాస్తులకు ఇప్పటివరకు అతీగతీ లేదని, ఈ నేపధ్యంలో మళ్లీ జన్మభూమి నిర్వహించాల్సిన అవసరం ఏముందని గిరిపుత్రులు మండిపడ్డారు. రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆధ్వర్యంలో బి.వెలమకోట, తామరపల్లి గ్రామ సభలను గిరిజనులు బహిష్కరించారు. రేషన్ కార్డులు ఇచ్చినప్పుడే గ్రామ సభ నిర్వహించాలని ఎమ్మెల్యే రాజేశ్వరి డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు దర ఖాస్తు చేసుకున్నా మరుగుదొడ్లు మంజూరుచేయనందుకు నిరసనగా ఏటపాక మండలం గన్నవరం గ్రామంలో మహిళలు చెంబులతో జన్మభూమి సభకు వచ్చి నిరసన తెలిపారు. రేషన్‌కార్డులు,పింఛన్లు మంజూరుకాక పేదలు మూడేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నారని ఉపసర్పంచ్ కందుకూరి మంగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారంపై స్పష్టమైన హామీ ఇచ్చిన తరువాతే సభను కొనసాగించాలని పట్టుబట్టారు. ∙తూర్పు ఏజెన్సీ రాజవొమ్మంగిలో అమీనాబాద్, జడ్డంగి, లబ్బర్తి, లాగరాయి జన్మభూమి గ్రామసభలను గిరిజనులు బహిష్కరించారు. మొదటి రెండు గ్రామాల ప్రజలు తమకు వెంటనే కుల«ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలన్న డిమాండ్ వ్యక్తం చేయగా, లబ్బర్తి, లాగరాయి ప్రజలు, గిరిజన రైతులు దాదాపు అర్ధశతాబ్దంగా తమ చిరకాల వాంఛ కిర్రాబు వద్ద పెద్దేరుపై ఆనకట్ట నిర్మించాలని ఆందోళనచేశారు. నేతల ఉపన్యాసాలతో గర్భిణులు, మహిళలకు ఇక్కట్లు కోరుకొండ మండలం గుమ్ములూరులో నిర్వహించిన జన్మభూమిలో సీమంతాలు, అన్నప్రాశన కార్యక్రమాలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నేతల జోరు ఉపన్యాసాలకు వేదికగా మారాయి. 32మంది గర్భిణులు, బాలింతలు మండుటెండలో ఉండలేక అవస్థలు పడ్డారు. ∙కోరుకొండకు చెందిన ఒక కన్నులేని గొల్ల మంగాయమ్మ సెప్టిక్ కావడంతో తన కుమార్తె గొంతిదేవి కాలు తీసేసినా కూడా వికలాంగ ఫించన్ ఇవ్వలేదని కోరుకొండ జన్మభూమి సభలో వాపోయింది. గండేపల్లి మండలం మల్లేపల్లిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో అధికారులకు సమస్యలు చెప్పుకునేందుకు వెళ్లిన ప్రజలను పోలీసులు అడ్డగించి వెనక్కి పంపించేశారు. అధికారుల నిలదీతలు.. రంగంపేట మండలం సుభద్రమ్మపేట గ్రామసభలో చాలాకాలంగా రేషన్‌కార్డులు ఇవ్వడంలేదని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ప్రజలు నిలదీశారు. కోరుకొండ మండలంలోని బుచ్చెంపేట జన్మభూమిలో సమస్యలు పరిష్కరించాలని అధికారులను స్థానికులు నిలదీశారు. రంగంపేట మండలం ముకుందవరం జన్మభూమి సభలో చాగల్నాడు పథకం కింద పిల్ల కాలువలు ఏర్పాటు చేయకపోవడంతో వర్షాకాలంలో సైతం నీటి ఎద్దడి ఎదుర్కోవలసి వస్తోందని మండల ప్రజా పరిషత్ ప్రతిపక్షనేత గుత్తుల సుబ్రహ్మణ్యం విమర్శించారు. అన్నవరంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో అర్హులకు పింఛన్లు, రేషన్‌కార్డులు అందజేయాలని వైఎస్సార్సీపీ నాయకులు అధికారులను నిలదీశారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నిర్వహించే జన్మభూమి సభలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవడమే తప్పా లబ్ధిదారులకు ఒక్కరికి ఇవ్వలేదని కె.పెదపూడిలో ఎంపీడీవోను, ఇతర అధికారులను ప్రజలు నిలదీశారు. గత ఏడాది జనవరి 6న జన్మభూమి సభ నిర్వహించి కొత్త రేషన్ కార్డులను రెండు రోజుల్లో పంపిణీ చేస్తామని చెప్పి ఏడాది కాలంగా ఎందుకు ఇవ్వలేదని అధికారులను, ప్రజాప్రతినిధులను సర్పంచ్ రాజారావు, ఎంపీటీసీ సభ్యుడు ఉందుర్తి ఆనందబాబుతో పాటు పలువురు లబ్ధిదారులు నిలదీశారు. -
స్టార్ హీరో మాస్ మూవీతో వస్తాడనుకుంటే..!
ముంబై: అతడి కెరీర్ వివాదాలమయం. ఇంకా చెప్పాలంటే స్టార్ హీరోగా కంటే ఇతర విషయాలతోనే తరచుగా వార్తల్లో నిలిచేవ్యక్తుల్లో సంజయ్ దత్ ఒకరు. చాలా గ్యాప్ తర్వాత ముఖానికి మళ్లీ మేకప్ వేసుకోవడానికి సంజూ సిద్ధమయ్యాడు. నిజ జీవిత గాథలతో కూడిన మూవీలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ పేరు తెచ్చుకున్న దర్శకుడు ఒమంగ్ కుమార్. మేరీ కోమ్, సరబ్జీత్ మూవీల తర్వాత సంజయ్‌తో కొత్త ప్రాజెక్టు 'భూమి' పట్టాలెక్కుతోంది. సంజయ్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే. ఓ రేంజ్ మాస్ మూవీతో వస్తాడనుకుంటే సంజయ్ ఓ క్లాస్ మూవీకి కమిట్ అయ్యాడు. 'శంకర్ దాదా' మూడో పార్ట్ తీసి తెరపై కనిపిస్తాడని ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుండగా లేటెస్ట్ మూవీ వివరాలతో వారు సంతృప్తి చెందుతున్నారు. భూమి మూవీ ఫస్ట్ లుక్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. భూమి మూవీలో తండ్రీకూతురు మధ్య అనుబంధాన్ని సున్నితంగా తెరకెక్కించనున్నట్లు డైరెక్టర్ ఒమంగ్ తెలిపారు. లోగోతో పాటు ఏడాది ఆగస్టు 4న మూవీని రిలీజ్ చేస్తామని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువ శాతం షూటింగ్ చేయనున్నారు. స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, త్వరలో షూటింగ్ స్టార్ట్ చేస్తామని వాస్తవ కథల దర్శకుడు వివరించారు. -
అభివృద్ధి ముసుగులో లొసుగులెన్నో..
రూ.10 కోట్ల విలువైన భూమిపై టీడీపీ నేతల కన్ను దశాబ్దాలుగా ఉన్న ‘ఉర్దూ’ కార్యాలయం నేలమట్టం భవన నిర్మాణ కాంట్రాక్టు అప్పగింత వాటిలో షాపింగ్ కాంప్లెక్సులకు వ్యూహం ప్రతినెలా అద్దెల రూపంలో లక్షల స్వాహాకు ఎత్తుగడ ఆందోళనలకు సిద్ధమవుతున్న మైనార్టీలు సాక్షి ప్రతినిధి, కాకినాడ : అది కాకినాడ నగరానికి నడిబొడ్డున అత్యంత ఖరీదైన ప్రభుత్వ స్థలం. అక్కడ గజం స్థలం కొనాలంటే రెండు లక్షలుపైనే పెట్టాలి. ఇప్పుడున్న ధరలతో లెక్కిస్తే రూ.10 కోట్లు విలువ చేస్తుంది. అటువంటి ప్రాంతం లో 500 గజాల స్థలంలో రెండు దశాబ్థాలుగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఉర్దూ స్కూల్స్ కార్యాలయం నడుస్తోంది. ఆ స్థలం తమకు వృత్తి విద్యా కళాశాల కోసం కావాలంటూ పిఠాపురం రాజా (పీఆర్) కళాశాల యాజమాన్యం పట్టుబట్టి స్కూల్ ఇన్స్పెక్టర్స్ ఆఫ్ ఉర్దూ కార్యాలయాన్ని ఖాళీ చేయించింది. బయటకు ఆ కళాశాల యాజమాన్యం కనిపిస్తున్నప్పటికీ దీని వెనుక కాకినాడ నగరంలోని అధికార పార్టీకి చెందిన ఒక ముఖ్యనేత, అతని అనుచరులు తెరవెనుక పావులు కదిపారు. ‘మహోప్రభో ఆదుకోండ’ంటూ కాకినాడ సిటీ ఎమెమల్యే వనమాడి కొండబాబు దగ్గరకు ముస్లింలు పరుగులు తీశారు. ‘మహారాజా ... అంటే మరి రెండు తన్నమన్నట్టు’గా మౌనం వహించడంతో తెలుగు తమ్ముళ్లు తమ పని తాము చక్కబెట్టుకున్నారు. అధికార బలానిదే పై చేయి కావడంతో ఉర్దూ కార్యాలయం నేటమట్టమయింది. అయినదే తడువుగా రూ.34.50 లక్షలు ఎస్ఆర్ఎంటీ నుంచి కార్పొరేట్ సోషల్ రెస్సాన్స్‌బులిటీ ఫండ్‌ను కూడా మంజూరు చేయించేశారు. ఉభయ గోదావరి జిల్లాలకు కలిపి ఉర్థూ కార్యాలయం కాకినాడలోనే ఉంది. ఖాళీగా ఉన్న మిగిలిన స్థలంలో ఉర్థూ అకాడమీ ప్రాంతీయ కార్యాలయం, మైనార్టీ కార్పొరేషన్, వక్స్S్ఫబోర్డు ఇలా...ఒకే కాంప్లెక్స్‌లో ముస్లిం మైనార్టీలకు సంబంధించిన కార్యాలయాలన్నీ ఏర్పాటు చేసుకోవాలని, ఎప్పటి నుంచో డైరెక్టర్ ఆఫ్ మైనార్టీస్‌కు వెళ్లిన ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిమాట ‘అల్లా’ ఎరుగు ఉన్న గూడు కూడా పోవడంతో మైనార్టీలు లబోదిబోమంటున్నారు. ఈ గోడు మధ్యనే ఆ భవనాల నిర్మాణ కాంట్రాక్టును అధికారపార్టీ నేతలే హస్తగతం చేసుకున్నారు. చుట్టా తెరచాపలు చుట్టేసి పనులు కూడా ప్రారంభించేశారు. గత ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు ఆ పార్టీకి అనుకూలంగా ఓటు వేయలేదనే కక్షతోనే ఇదంతా చేస్తున్నారని ఓ వర్గం ఆగ్రహంతో ఉంది. ఆ ముఖ్యనేత వ్యూహమిదీ... ఆ 500 గజాల్లో నిర్మించే భవనంలో తొలుత వృత్తి విద్యా కోర్సులకు రెండు గదులు నిర్మిస్తారు. ఇందుకు ఎస్ఆర్ఎంటీ సమకూర్చిన రూ.34.50 లక్షలు వెచ్చిస్తారు. ఇదంతా పక్కాగానే జరిగిపోతోంది. అసలు కిటుకు రెండో దశలోనే ఉంది. రెండో దశలో మెయిన్‌రోడ్డు వైపు షాపింగ్ కాంప్లెక్సు ఏర్పాటుచేసి సగం దుకాణాలు ఆ ముఖ్యనేత చెప్పిన వారికి కట్టబెట్టే ‘డీల్’ కుదిరిందని సమాచారం. ఆ స్థలం ఉన్న ప్రాంతం మెయిన్ రోడ్డులో అతి ప్రధానమైన కూడలిలో ఉండటంతో దుకాణాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఒక షాపునకు అడ్వాన్సుగా రూ.50 లక్షలు పైనే వస్తుంది. అలా మెయిన్ రోడ్డువైపు గ్రౌండ్‌ఫ్లోర్‌లో వచ్చే నాలుగు దుకాణాలపైనా రెండు కోట్లు అడ్వాన్సుగా నొక్కేయవచ్చని ఆ ముఖ్యనేత వ్యూహంగా కనిపిస్తోంది. పీఆర్ కాలేజీ స్థలంలో ముఖ్యనేతకు ఎలా దుకాణాలు కేటాయిస్తారనుకుంటున్నారా...? రెండో దశలో దుకాణాలు నిర్మాణం పూర్తయ్యాక నామమాత్రపు అద్దెకు ఇచ్చినట్టు రికార్డుల్లో చూపించి భారీగా అడ్వాన్సులు, అద్దెలు ఆ ముఖ్యనేతకు చేరేలా తెరవెనుక పావులుకదుపుతున్నారు. అందుకే ఆ ప్రజాప్రతినిధి అనచరుడు రెండు దశాబ్థాలుగా ఉంటున్న తమ కార్యాలయాన్ని ఉన్నఫళంగా ఖాళీ చేయించి భవనాన్ని యుద్ధ ప్రాతిపదికన కూల్చేశారని ముస్లింలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యూహం పక్కాగా భవిష్యత్తులో అమలు పరిచేందుకే రూ.34.50 లక్షలతో చేపట్టే భవన నిర్మాణాన్ని ఆ ముఖ్యనేత తన ప్రధాన అనుచరుడికి కట్టబెట్టేశారు. అతనేమైనా కాంట్రాక్టరా అంటే చిన్న వీధి కాలువ నిర్మించిన అనుభవం కూడా లేదు. నిర్మాణ దశ నుంచి తమ ఆధిపత్యం ఉంటేనే మెయిన్ రోడ్డువైపు దుకాణాల్లో కూడా చక్రం తిప్పవచ్చేనేది వారి వ్యూహం. దీనిపై ముస్లిం పెద్దలు జిల్లా కలెక్టర్‌ను కలిసి విన్నవించుకున్నాక భవిష్యత్ కార్యచరణ నిర్ణయిస్తామంటున్నారు. అపోహ మాత్రమే... పీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఒకేషనల్ కళాశాల కోసం నిర్మిస్తున్న భవనంలో షాపింగ్ కాంప్లెక్స్‌కు అనుమతి ఇస్తున్నామనేది పూర్తిగా అపోహ మాత్రమే. విద్యార్థులకు తరగతి గదులు లేకపోవడంతో ఎస్ఆర్ఎంటీ సంస్థను సంప్రదించగా సోషల్ రెస్పాన్స్‌బులిటీ పథకంలో భాగంగా రెండు తరగతి గదులు, ఒక హాలు నిర్మాణానికి 34 లక్షల 50 వేల రూపాయలును నిధులు అందజేశారు. త్వరలో ఈ పనులకు శంకుస్థాపన చేస్తాం – వి.కేశవరావు, పీఆర్ ఒకేషనల్ కళాశాల ప్రిన్సిపాల్ త్వరలో కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తా.. ఎన్నో ఏళ్ళుగా ఉన్న భవనం స్థానంలో యథావిధిగా కార్యాలయాన్ని నిర్మించాలి. ఈ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని త్వరలోనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం, యథాతథంగా అక్కడ కార్యాలయాన్ని నిర్మించాల్సిందిగా కోరతాం. అందుకు విరుద్ధంగా జరిగితే పోరాడేందుకు సిద్ధం.– అబ్దుల్ బషీరుద్దీన్, జిల్లా వక్ఫ్‌బోర్డు మాజీ అధ్యక్షుడు