ప్రముఖ నటి, యాంకర్ హరితేజ ఇటీవలె పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హరితేజ..అప్పుడప్పుడు కూతురిని తన భర్త దీపక్‌రావు ఆడిస్తున్న కొన్ని వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఈ మధ్యే కూతురికి బారసాల ఫంక్షన్ అయ్యిందని, చిన్నారికి భూమి దీపక్‌రావు అని నామకరణం చేసినట్లు వెల్లడించిన హరితేజ ఇప్పటివరకు పాప ఫోటోను రివీల్ చేయలేదు. దీంతో పలువురు నెటిజన్లు భూమిని ఎప్పుడు చూయిస్తారంటూ పలుమార్లు అడగగా, త్వరలోనే అని సమాధానం చెప్పేది.
తాజాగా ఎట్టకేలకు హరితేజ తన చిన్నారి ఫోటోను రివీల్ చేసేసింది. మీట్ Miss భూమి దీపక్ రావ్ అంటూ కూతురి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా పలువురు బుల్లితెర ప్రముఖులు సహా నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భూమి పేరులానే పాప కూడా ఎంతో ముద్దుగుందంటూ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. బుల్లితెరపై సీరియల్స్‌లో నటించడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హరితేజ.. తర్వాత యాంకర్‌గా పాపులారిటీ సంపాదించుకుంది.
ఆ గుర్తింపుతో బిగ్‌బాస్ 1లోకి వెళ్లి తనదైన నటనతో బుల్లితెర ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకుంది.2015లో దీపక్ రావును పెళ్లాడిన హరితేజ ఈ ఏడాది ఏప్రిల్ 5న పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. రాజా ది గ్రేట్, హిట్, సరిలేరు నీకెవ్వరు, ప్రతిరోజు పండగే, ఎఫ్ 2, అరవింద సమేత, యూటర్న్, శ్రీనివాస కళ్యాణం లాంటి సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో హరితేజ నటించిన సంగతి తెలిసిందే.
నటి హరితేజ కూతురి ఫోటోను చూశారా?
Published Fri, Jul 9 2021 10:31 AM | Last Updated on Fri, Jul 9 2021 4:49 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment