శాండల్‌వుడ్‌లో బుల్లితెరపై ఫేమ్ తెచ్చుకున్న నటి భూమి శెట్టి. కిన్నెర సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాల్లోనూ నటిస్తోంది. అంతే కాకుండా బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. గత కొన్ని రోజులుగా హాట్ గ్లామర్ పిక్స్ చేస్తూ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇటీవల భూమి తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోపై నెటిజన్స్ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులోనూ నిన్నే పెళ్లాడతా, అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు సీరియల్స్‌లో కనిపించింది.
(ఇది చదవండి: బాలయ్య హీరోయిన్ ఎంగేజ్‌మెంట్.. ఫోటోలు వైరల్!)
ఇటీవల భూమి మరింత బోల్డ్ లుక్స్‌తో ఫోటోలు షేర్ చేస్తోంది. భూమి ఫోటోలు చూసిన ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. అయితే కొందరు విమర్శలు చేయగా.. మరికొందరు ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ఆ ఫోటోలో భూమి శెట్టి టాప్ లెస్‌గా కనిపించింది. కేవలం లో దుస్తులు ధరించి కనిపించింది. దీనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇంతకు ముందు మంచి బట్టలు వేసుకునేదానివి.. ఇప్పుడు సగమే ధరిస్తున్నావా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో మీకు సరిపోయే డ్రెస్‌లు ఏ దుకాణంలో దొరకలేదా? అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఒక్క ఫోటో కాదు.. ఇటీవల భూమి శెట్టి షేర్ చేసిన వీడియోపై కూడా కామెంట్ చేస్తున్నారు
భూమి శెట్టి 'కిన్నెరి' సీరియల్ తర్వాత.. తెలుగులో 'నిన్నే పెళ్లాడతా', 'అక్క చెల్లెలు' సీరియల్స్‌లో ప్రధాన పాత్రల్లో నటించింది. బిగ్ బాస్ సీజన్ -7 తర్వాత 'ఇక్కత్' సినిమాతో శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో భూమికి జోడీగా నాగభూషణ్ నటించారు. ప్రస్తుతం భూమి కన్నడలో 'కెందాడ సెరగు' సినిమాలో నటిస్తోంది.
(ఇది చదవండి: జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు)
Comments
Please login to add a commentAdd a comment