Bold
-
జుట్టు లేకపోయినా మోడల్‌గా రాణించి శభాష్ అనిపించుకుంది!
‘‘నిర్దిష్టమైన లక్షణాలు, ముఖ కవళికలు అందాన్ని నిర్వచించలేవు. ఎందుకంటే జుట్టు ఉన్నా లేకపోయినా గుండెల్లో ఆత్మవిశ్వాసం... పెదవులపై చిరునవ్వూ ఉంటే అందంగానే ఉంటారు’’ అని నిరూపించి, ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది కేతకీ జానీ. నలభైఏళ్ల వయసులో అలోపేసియా వ్యాధితో కేతకీ జుట్టు రాలిపోయినప్పటికీ కృంగిపోకుండా హెయిర్‌లెస్ మోడల్‌గా రాణిస్తూనే అలోపేసియా బాధితులకు అవగాహన కల్పిస్తూ ధైర్యాన్ని నూరిపోస్తోంది. అహ్మదాబాద్‌లో పుట్టిన కేతకీ జానీ పుణెలో పెరిగింది. స్కూలు విద్యాభ్యాసం పూర్తయ్యాక బిఏ, బిఈడీ, ఎమ్ఏ చేసింది. మహారాష్ట్ర టెక్ట్స్‌బుక్ ప్రొడక్షన్లో ప్రత్యేక అధికారిగా పనిచేసేది. ఉన్నట్టుండి కేతకీ జుట్టు రాలిపోవడం మొదలైంది. అలా రాలిపోయిన ప్రదేశంలో కొత్త వెంట్రుకలు వచ్చేవి కావు. విచిత్రంగా అనిపించింది. జుట్టు ఇలా రాలిపోవడానికి అలోపేసియా అంటే పేనుకొరుకుడు వ్యాధి కారణమని డాక్టర్ చెప్పారు. ఈ సమస్యకు తాత్కాలిక ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం లేదని తెలిసి కేతకి తీవ్రనిరాశకు గురైంది. జుట్టు రాలిపోయి తను అసహ్యంగా మారిపోతుందేమో అని భయపడిపోయింది. ఒకపాప, బాబుకు తల్లి అయిన కేతకికి భర్త కూడా మద్దతుగా నిలవకపోవడం, బంధువులు, ఇరుగు పొరుగు క్యాన్సరా? అని అడగడం, అంతా అవహేళన మాటలు, చూపులు... దాంతో తీవ్ర మనస్తాపానికి గురై జీవితాన్ని త్యజించాలనుకుంది. కానీ తను లేకపోతే పిల్లల పరిస్థితి ఏమవుతుందో తలచుకుని తన నిర్ణయాన్ని మార్చుకుంది. వ్యాధితోనే పోరాడుతూ బతకాలని నిర్ణయించుకుంది. గుండులా మారిన తలపైన టాటూలతో అందంగా అలంకరించుకుని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. అవహేళన కాదు అండగా నిలవండి.. ‘‘ఎంతో ఒత్తుగా ఉండే నా జుట్టు 2010 నుంచి ఊడిపోవడం మొదలైంది. దీంతో తీవ్ర నిరాశలో కృంగిపోయాను. అందరూ నన్ను అదోరకంగా చూస్తుండడంతో ఆఫీసుకు త్వరగా వెళ్లి త్వరగా వచ్చేసేదాన్ని. ఇలా కొన్నాళ్లు భయంభయంగా గడిపాను. జుట్టు లేకపోతేనేం? గుండు మీద టాటూలు వేసుకుంటే అందంగా కనిపించవచ్చన్న ఆలోచన వచ్చింది. వెంటనే టాటూలు వేసుకున్నాను. ఫరవాలేదనిపించి ధైర్యంగా మోడలింగ్‌లో అడుగు పెట్టాను. అక్కడ దక్కిన గౌరవంతో హెయిర్‌లెస్ మోడల్‌గా ఎదిగాను. నాలో ఆత్మవిశ్వాసం పెరిగిన తరువాత... నాకున్న సమస్య గురించి వివరించి చెప్పడం మొదలు పెట్టాను. అలోపేసియా గురించి అవగాహన కలిగించి గుండెల్లో ధైర్యం నింపితే బాధితులకు ఊరటగా ఉంటుంది’’ అని కేతకీ జానీ కోరుతోంది. యాడ్ చూసి... ఒకరోజు మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ కాంపిటీషన్ యాడ్ చూసి కాంపిటీషన్లో పాల్గొంది. ఆ పోటీలో పాల్గొన్న తొలి అలోపేసియా బాధితురాలిగా నిలిచింది. ఆ తర్వాత మిసెస్ యూనివర్స్ కాన్ఫిడెంట్‌గా, మిసెస్ పూనె, మిస్ అండ్ మిసెస్ పూనే ఇంటర్నేషనల్, మిసెస్ పాపులర్ వంటి అనేక టైటిల్స్‌ను వరుసగా గెలుచుకుంటూ వస్తోంది. కొప్పున్నా లేకున్నా ఆత్మవిశ్వాసమే అందం అని నిరూపించింది. హెయిర్‌లెస్ మోడల్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కేతకి తనలా మరెవరూ బాధపడకూడదన్న ఉద్దేశ్యంతో అలోపేసియా గురించిన అవగాహన కల్పిస్తోంది. వివిధ కార్యక్రమాల ద్వారా ఎంతోమంది బాధితులకు ధైర్యాన్ని నూరిపోస్తోంది. (చదవండి: ఆమె మదర్ ఆఫ్ 'పిల్'! శక్తిమంతమైన మార్పుకి నిలువెత్తు నిదర్శనం!) -
పెళ్లికి ముందు అలాంటి రిలేషన్ ఓకేనా?.. హీరోయిన్ కామెంట్స్ వైరల్!
కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ అతుల్య. 2017లో కాదల్ కన్ కట్టుడే అనే తమిళ సినిమాతో కోలీవుడ్లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అదే ఏడాదిలోనే కథానాయకన్ చిత్రంలో నటించారు. అంతేకాకుండా కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లోకి రాకముందు అతుల్య పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో సినిమాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ ఏడాదికి మూడు నాలుగు సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతుల్యకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: ఓ ఇంటివాడు కాబోతున్న మానస్.. హల్దీ వేడుకలు షురూ) ఇంటర్వ్యూలో పాల్గొన్న అతుల్య రవికి కన్యత్వంపై ప్రశ్న ఎదురైంది. వర్జినీటి కోల్పోవడానికి సరైన వయస్సు ఏదని మీరు అనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. దీనికి ఆమె బదులిస్తూ.. 'ఈ విషయంలో నా అభిప్రాయం ప్రకారం 21 నుంచి 25 ఏళ్లు వయస్సు కరెక్ట్ అనిపిస్తోంది.' అని చెప్పింది. ఆ తర్వాత పెళ్లికి ముందు లైంగిక చర్యలో పాల్గొనడం సరైందేనా? లేక పెళ్లి తర్వాత మంచిదా? అని ప్రశ్నించగా.. దీనికి కూడా నటి సూటిగానే స్పందించింది. అతుల్య రవి మాట్లాడుతూ.. "నా అభిప్రాయం ప్రకారమైతే పెళ్లి తర్వాతే లైంగికపరమైన రిలేషన్షిప్ ఉత్తమం. ఇది మన ఆచార వ్యవహారాలు, సంస్కృతికి అద్దం పడుతోంది. అయితే ప్రస్తుతం లివ్ ఇన్ రిలేషన్ షిప్స్(సహజీవనం) వల్ల ఈ మధ్య కాలంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ జనరేషన్లో రిలేషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకరితో రిలేషన్లో ఉండడమనేది అది వారి వ్యక్తిగత నిర్ణయం. దీనిపై ఎవరికీ అధికారం లేదు. అయితే వివాహమే అన్నింటికంటే ఉత్తమమైన రిలేషన్ " అని అన్నారు. (ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్ మూవీ, మరో థ్రిల్లర్ సిరీస్ కూడా!) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) -
'రేపు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు'.. ఆరోగ్యంపై నటి షాకింగ్ కామెంట్స్!
షార్ట్ ఫిల్మ్స్‌తో కెరియర్ స్టార్ట్ చేసి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి గాయత్రి గుప్తా. ఆ తర్వాత ఫిదా, కొబ్బరి మట్ట, ఐస్ క్రీం లాంటి చిత్రాల్లో నటించింది. అయితే గాయత్రి గుప్తా హీరోయిన్గా చేయకపోయినప్పటికీ చాలా చిత్రాల్లో కనిపించింది. మాస్ మహారాజా రవితేజ మూవీ అమర్ అక్బర్ ఆంటోనీ, బుర్రకథ, ఐస్‌క్రీమ్-2, దుబాయ్ రిటర్న్, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీతా అన్ ది రోడ్, కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ లాంటి సినిమాలు చేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ తన గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అంతే కాకుండా తన ఆరోగ్యం గురించి ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేసింది. (ఇది చదవండి: ఐకాన్ స్టార్ 'పుష్ప-2'.. ఆ ఫోటో లీక్ చేసిన శ్రీవల్లి!) గాయత్రి గుప్తా మాట్లాడుతూ..'ప్రస్తుతం నా హెల్త్ కండీషన్ క్రిటికల్ గానే ఉంది. రేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. నా ఆరోగ్యం కోసం విరాళాలు సేకరించాలనుకుంటున్నా. అంతే కాకుండా తన తండ్రిని నేను ఎప్పుడు కూడా ఫాదర్‌గా భావించలేదు.' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతే కాకుండా ఆమెను బోల్డ్ అనడంపై స్పందించింది. డైరెక్టర్స్‌కు కావాల్సిన క్యారెక్టర్‌కు తగినంత పొటెన్షియల్ ఉన్నవాళ్లనే సెలెక్ట్ చేసుకుంటారంటూ తెలిపింది. గతంలో ఆమె ఓ వీడియో ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. మరి ఇంత బోల్డ్ వీడియో చేయడమేంటని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా గతంలో తన బాయ్‌ఫ్రెండ్ తనను మోసం చేశాడని తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య, విష్ణుప్రియ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన వెబ్ సిరీస్‌లో గాయత్రి గుప్తా నటించింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్‌పామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. (ఇది చదవండి: 'స్వీటీ చాలా అందంగా కనిపించింది'.. రాజమౌళి ట్వీట్ వైరల్! ) -
బుల్లితెర నటి బోల్డ్ పిక్స్.. నెటిజన్స్ దారుణ కామెంట్స్!
శాండల్‌వుడ్‌లో బుల్లితెరపై ఫేమ్ తెచ్చుకున్న నటి భూమి శెట్టి. కిన్నెర సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాల్లోనూ నటిస్తోంది. అంతే కాకుండా బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. గత కొన్ని రోజులుగా హాట్ గ్లామర్ పిక్స్ చేస్తూ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇటీవల భూమి తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోపై నెటిజన్స్ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులోనూ నిన్నే పెళ్లాడతా, అత్తారింట్లో అక్కా చెల్లెళ్లు సీరియల్స్‌లో కనిపించింది. (ఇది చదవండి: బాలయ్య హీరోయిన్ ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్!) ఇటీవల భూమి మరింత బోల్డ్ లుక్స్‌తో ఫోటోలు షేర్ చేస్తోంది. భూమి ఫోటోలు చూసిన ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. అయితే కొందరు విమర్శలు చేయగా.. మరికొందరు ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ఆ ఫోటోలో భూమి శెట్టి టాప్ లెస్‌గా కనిపించింది. కేవలం లో దుస్తులు ధరించి కనిపించింది. దీనిపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇంతకు ముందు మంచి బట్టలు వేసుకునేదానివి.. ఇప్పుడు సగమే ధరిస్తున్నావా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో మీకు సరిపోయే డ్రెస్‌లు ఏ దుకాణంలో దొరకలేదా? అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఒక్క ఫోటో కాదు.. ఇటీవల భూమి శెట్టి షేర్ చేసిన వీడియోపై కూడా కామెంట్ చేస్తున్నారు భూమి శెట్టి 'కిన్నెరి' సీరియల్ తర్వాత.. తెలుగులో 'నిన్నే పెళ్లాడతా', 'అక్క చెల్లెలు' సీరియల్స్‌లో ప్రధాన పాత్రల్లో నటించింది. బిగ్ బాస్ సీజన్ -7 తర్వాత 'ఇక్కత్' సినిమాతో శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో భూమికి జోడీగా నాగభూషణ్ నటించారు. ప్రస్తుతం భూమి కన్నడలో 'కెందాడ సెరగు' సినిమాలో నటిస్తోంది. (ఇది చదవండి: జబర్దస్త్ అవినాష్ తల్లికి గుండెపోటు! స్టంట్స్ వేసిన వైద్యులు) View this post on Instagram A post shared by ಭೂMee (@bhoomi_shettyofficial) View this post on Instagram A post shared by kannada actress ❤️ (@sandalwood_actress_fans) -
అలాంటి సీన్స్ చేయాలంటే నా డ్రెస్ మాత్రం తీయను: హీరోయిన్
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఓటీటీల హవా నడుస్తోంది. పెద్ద సినిమాలు థియేటర్లో సందడి చేస్తుండగా.. చిన్న సినిమాలు మాత్రం నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. అయితే ఓటీటీలో వచ్చే సినిమాలకు సెన్సార్ లేకపోవడంతో కొన్ని సీన్స్ మరింత బోల్డ్‌గా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఓటీటీలో వచ్చే సినిమాల్లో శృంగార సన్నివేశాలు ఎక్కువగానే చూపిస్తున్నారని అన్నారు. (ఇది చదవండి: లేటు వయసులో నటుడి పెళ్లి.. మళ్లీ హనీమూన్ కూడానా?) అయితే ఓటీటీలో అలాంటి సీన్స్ పట్ల తాజాగా తన అభిప్రాయం చెప్పుకొచ్చింది నర్గీస్ ఫక్రీ. అయితే ప్రస్తుతం నర్గీస్ ఫక్రీ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నటి ఓటీటీలో బోల్ట్ కంటెంట్‌పై పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. వెబ్ సిరీస్‌లో శృంగార సన్నివేశాల్లో నటించాల్సి వస్తే తన దుస్తులు తీసివేయనని స్పష్టం చేసింది. ఇంటర్వ్యూలో నర్గీస్ మాట్లాడుతూ.. 'నాకు నగ్నంగా ఉండాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏ ప్రాజెక్ట్‌లోనూ నగ్నంగా నటించను. అలాంటి సీన్స్ చేయాల్సి వస్తే తన దుస్తులు మాత్రం తీసివేయను. అంతే కాకుండా స్క్రీన్‌పై లెస్బియన్‌గా నటించడం, మరొక స్త్రీని వివాహం చేసుకున్న స్త్రీగా చూపించడం తనకు ఇష్టముండదు. నేను దానిని పట్టించుకోను కూడా. ఏ పాత్ర అయినా అది కచ్చితంగా నటనలో ఓ భాగం.' అని అన్నారు. (ఇది చదవండి: టమాటా ధరల ఎఫెక్ట్.. స్టార్ హీరో అభిమానులు ఏం చేశారంటే?) కుటుంబ సభ్యులతో కలిసి ఓటీటీ కంటెంట్ చూడటం అసౌకర్యంగా అనిపిస్తోందా? అని ప్రశ్నించగా.. అది వారి వ్యక్తిగత విషయమని చెప్పుకొచ్చింది. కాగా.. నర్గీస్ ఫక్రీ త్వరలోనే పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లులో కనిపించనుంది. అంతే కాకుండా ఓటీటీల వల్ల నటీనటులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. విభిన్నమైన పాత్రల్లో నటించేందుకు అవకాశముందని చెప్పారు. -
నటి బోల్ట్ అవుట్‌ఫిట్... ఉర్ఫీ జావెద్‌ను ఫాలో అవుతున్నారుగా!
బాలీవుడ్ బుల్లితెర భామ నియా శర్మ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. ఆమె ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై, జమై రాజా, ఇష్క్ మే మార్జవాన్, నాగిన్ -4 సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఆమెకు ఇన్‌స్టాలో దాదాపు 8 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్కడికెళ్లినా ప్రతిసారి ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ ముద్దు గుమ్మ షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: లేటు వయసులో నటుడి పెళ్లి.. మళ్లీ హనీమూన్ కూడానా?) తాజాగా ఆమె తన స్నేహితుడి పుట్టినరోజు పార్టీలో నియా శర్మ బ్యాక్‌సైడ్ ఎలాంటి దుస్తులు లేకుండా కనిపించి అభిమానులకు షాకిచ్చింది. అయితే ఆ వీడియోలో నియా శర్మ పూర్తిగా బ్యాక్ లెస్‌గా కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ రాస్తూ ఉర్ఫీ జావెద్‌ను ఆదర్శంగా తీసుకున్నారా? అంటూ రాసుకొచ్చాడు. ఆమెకు కనీసం దుస్తులు వేసుకోనేందుకు కూడా టైం లేదా అంటూ రాశారు. అంతేకాకుండా మరో నెటిజన్ రాస్తూ ఏకంగా దుపట్టానే డ్రెస్‌గా మార్చిసేంది అంటూ కామెంట్ చేశాడు. మరికొందరేమో చీప్ డ్రెస్సింగ్ అంటూ ట్రోల్స్ చేశారు. కాగా.. 'ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై' షోతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె రవి దూబేతో కలిసి 'జమై రాజా' అనే ప్రముఖ షోలో కనిపించింది. నియా శర్మ బాక్స్ క్రికెట్ లీగ్, ఖత్రోన్ కే ఖిలాడీ -8, బిగ్ బాస్ ఓటీటీ లాంటి రియాలిటీ షోలలో పాల్గొంది. (ఇది చదవండి: 14 సార్లు ప్రయత్నించా.. కానీ స్టార్ హీరో వల్లే తల్లినయ్యా: బుల్లితెర నటి) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
'ఇంకోసారి ఆ డ్రెస్సులు వేసుకుంటే చంపేస్తాం'... నటికి వార్నింగ్
పొట్టి పొట్టి డ్రెస్సులతో ఎప్పుడు వివాదాల్లో వినిపించే నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ ఉర్ఫీ జావెద్. మరీ ఆమె వేసుకున్న డ్రెస్సులు అలా ఉంటాయి. ఆమె ఫ్యాషన్‌ను మరెవ్వరూ కూడా ఫాలో కాలేరు. ఆమె డ్రెస్సింగ్ చూసి ఇదేం ఫ్యాషన్ రా బాబు ముక్కున వేలేసుకోవడం ఖాయం. ఆ డ్రెస్సులతో అంతలా ఫేమస్ అయింది ఈ భామ. కాగితాలతో, వైర్లతో, చైన్లతో, అద్దాలతో, గోనె సంచితో ఇలా ఒక్కటేమిటి.. రకరకాల డ్రెస్సులతో కళ్లకు కనిపించిన దేన్నీ వదిలిపెట్టలేదు ఈ బిగ్ బాస్ బ్యూటీ. (చదవండి: Urfi Javed: అందరి కళ్లు ఉర్ఫీ డ్రెస్సుల మీదే, డిజైనర్ ఎవరో తెలుసా?) తాజాగా ఆమె విచిత్రమైన ఫ్యాషన్ దుస్తులపై హిందుస్థానీ భావు అనే వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. బోల్డ్ దుస్తుల్లో కనిపించడం మానేయాలని ఓ వీడియోలో ఆమెను బెదిరించారు. ఇది భారతీయ సంస్కృతికి విరుద్ధమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉర్ఫీని బెదిరించడంతో హిందుస్థానీ భావుపై ఆమె ఆగ్రహం వ్యక్తంచేసింది. సోషల్ మీడియా వేదికగా ఆమె అతనికి వార్నింగ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో అందరూ నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారని, మానసికంగా వేధిస్తున్నారని హిందుస్తానీ భావును ఉద్దేశించి ఉర్ఫీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నటి తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాస్తూ.. 'ఇప్పుడు మీరు నన్ను బహిరంగంగా బెదిరించారు. నేను తలచుకుంటే మిమ్మల్ని కటకటాల వెనక్కి నెట్టగలనని మీకు తెలుసు. ఏది ఏమైనా నాకు ఏది నచ్చిదే అది వేసుకుంటూనే ఉంటా.' అంటూ రాసుకొచ్చింది ఈ భామ. ఇలాంటి పరిణామాలతో తన భద్రతపై ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
మోహన్ లాల్ తో వెరీ బోల్డ్ క్యారెక్టర్ చేస్తున్న : మంచు లక్ష్మి
-
ఫోటోషూట్ నార్మల్‌గా ఉంటే బాగోదనే ఇలా..!
ఫోటోషూట్ నార్మల్‌గా ఉంటే ఏం బావుంటుంది అనుకున్నారేమో ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు న్యూడ్ ఫోటోషూట్స్‌తో హంగామా సృష్టిస్తున్నారు. ఆమధ్య బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నగ్న ఫోటోషూట్ ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత కొందరు హీరోలు కూడా దీన్ని ఫాలో అయ్యారు. తాజాగా ఈ ట్రెండ్‌ను అనుసరిస్తూ నగ్నంగా ఫోటోకి ఫోజులిచ్చింది ఓ హీరోయిన్. ఆమె ఎవరో కాదు లారిస్సా బోనెసి. ఈ బ్యూటీ పేరు చెప్పగానే టక్కున గుర్తుపట్టడం కష్టమే కానీ తిక్క సినిమా హీరోయిన్ అంటే వెంటనే గుర్తుపడతారు. సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటించిన ఈ బ్యూటీ హాట్ ఫోటోలతో నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ అమ్మడు ఒంటిపై ఒక్క నూలుపోగు కూడా లేకుండా షాకిచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోను నెట్టింట షేర్ చేస్తూ.. నేను ఒక మిస్టరీలా ఉందామనుకుంటున్నా అంటూ క్యాప్షన్ ఇచ్చింది. -
ఎవరివైనా.. ఎవరికైనా.. అవయవాలు అందరికీ..
సాక్షి సెంట్రల్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వివిధ కారణాలతో అవయవాలు దెబ్బతిని దాతల కోసం ఎదురుచూస్తున్నారు. తమ శరీరంతో మ్యాచ్ అయ్యే అవయవం ఎప్పుడు దొరుకుతుందా అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకీడుస్తున్నారు. మనుషుల్లో వేర్వేరు గ్రూపుల రక్తం ఉండటం, ఆ రక్తానికి అనుగుణంగానే అవయవాలన్నీ అభివృద్ధి చెంది ఉండటమే దీనికి కారణం. అదే ఎవరి అవయవమైనా, ఎవరికైనా అమర్చగలిగితే.. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలను కాపాడొచ్చు. ఈ అద్భుతాన్ని సాకారం చేసేదిశగా అడుగులు పడుతున్నాయ్. ఆ వివరాలేమిటో తెలుసుకుందాం.. చదవండి: ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ హాయిగా బరువు తగ్గండి.. అవయవాలు ఉన్నా.. అమర్చలేక.. ఏదైనా ప్రమాదంలోనో, బ్రెయిన్‌డెడ్ వంటి కారణాలతోనో చనిపోతున్నవారి అవయవాలను అవసరమైన వారికి అమర్చలేని పరిస్థితి అన్నిచోట్లా ఉంది. అవయవాలు ఎక్కువసేపు జీవంతో ఉండకపోవడం, వాటి పరిమాణం కూడా ఎక్కువ తక్కువగా ఉండటం, తగిన స్వీకర్తలు సమీపంలో లేకపోవడం కూడా దీనికి కారణం. ఈ నేపథ్యంలోనే.. ఏ గ్రూపు రక్తం వారి అవయవాన్ని అయినా.. మరే గ్రూపువారికైనా అమర్చగలిగే విధానంపై అమెరికాలోని టొరొంటో యూనివర్సిటీ అజ్మెరా ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్ శాస్త్రవేత్తలు పరిశోధన చేపట్టారు. పలువురు దాతల నుంచి సేకరించిన ఊపిరితిత్తులను ‘యూనివర్సల్ లంగ్స్ (ఏ రక్తం గ్రూపువారికైనా అమర్చగలిగే ఊపిరితిత్తులు)’గా మార్చగలిగారు. ఏ రక్తం వారికి.. ఎలా? సాధారణంగా మన ఎర్రరక్త కణాలపై, రక్తనాళాల లోపలి పొరలపై.. ఏ, బీ అనే రెండు రకాల యాంటీజెన్లు ఉంటాయి. ఇందులో ‘ఏ యాంటీజెన్’ ఉన్న రక్తాన్ని ‘ఏ’ గ్రూప్‌గా.. ‘బీ యాంటీజెన్’ ఉన్న రక్తాన్ని ‘బీ’ గ్రూప్‌గా.. రెండు యాంటీజెన్లు ఉన్న రక్తాన్ని ‘ఏబీ’ గ్రూపుగా.. అసలు యాంటీజెన్లు లేని రక్తాన్ని ‘ఓ’ గ్రూప్‌గా వర్గీకరించారు. ►మరోవైపు మన శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మజీవులు, ఇతర జీవకణాలను నాశనం చేసే యాంటీబాడీలు కూడా రక్తంలో ఉంటాయి. ఇవి రక్తం, ఇతర కణాలపై ఉండే యాంటీజెన్లను గుర్తించి.. అవి మన శరీరానివి కాకుండా, వేరే విధంగా ఉంటే దాడి చేస్తాయి. ►ఉదాహరణకు.. రాజు రక్తం ‘ఏ’ గ్రూప్‌కు చెందినది. ఆయనకు ‘బీ’ గ్రూప్ రక్తం ఎక్కిస్తే.. ఈ రక్తంలోని ‘బీ’ యాంటీజెన్పై రాజు శరీరంలోని యాంటీబాడీలు దాడి చేస్తాయి. దీనితో రక్తం గడ్డ కట్టి మరణించే ప్రమాదం ఉంటుంది. కృత్రిమ పరికరంలో అమర్చి.. సాధారణంగా దాతల నుంచి సేకరించిన ఊపిరితిత్తులను కొంత సమయం పాటు సజీవంగా ఉంచడానికి ‘ఎక్స్ వివో లంగ్ పర్ఫ్యూజన్ (ఈవీఎల్పీ)’ అనే పరికరాన్ని వినియోగిస్తారు. దాని ద్వారా పోషకాలను, నీటిని ఊపిరితిత్తులకు అందజేస్తారు. టొరొంటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కూడా ఈ పరికరంలో ఊపిరితిత్తులను ఉంచి ప్రయోగం చేశారు. మన జీర్ణవ్యవస్థలోని బ్యాక్టీరియాలతో.. ‘ఏ, బీ, ఏబీ’ గ్రూపుల రక్త కణాలపై ఉండే యాంటీజెన్‌ను తొలగించి.. ‘ఓ’ గ్రూపుగా మార్చడంపై ఇప్పటికే బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. ఇలా మార్చితే.. సదరు రక్తాన్ని ఎవరికైనా ఎక్కించేందుకు వీలవుతుంది. ఈ క్రమంలో మన జీర్ణవ్యవస్థ, పేగుల్లో ఉండే ఒక రకం బ్యాక్టీరియా విడుదల చేసే రెండు ఎంజైమ్‌లు (ఎఫ్పీగాలెనేస్ డీసెటైలేజ్, ఎఫ్పీగలాక్టోసమినిడేజ్) దీనికి తోడ్పడతాయని గుర్తించారు. ఆ పరిశోధనను టొరొంటో శాస్త్రవేత్తలు పరిగణనలోకి తీసుకున్నారు. ►సదరు బ్యాక్టీరియా ఎంజైమ్‌లను సేకరించారు. ఈవీఎల్పీ పరికరంలో ఊపిరితిత్తులకు పంపే పోషకాలతో పాటు ఆ ఎంజైమ్‌లను కూడా పంపారు. ►ఈ ఎంజైమ్‌లు ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల ద్వారా ప్రయాణిస్తూ.. వాటిలో ఉన్న ‘ఏ, బీ యాంటీజెన్’లను నిర్వీర్యం చేశాయి. దీనితో సదరు ఊపిరితిత్తులు ‘ఓ’ గ్రూపు కిందకి మారాయి. అంతేకాదు ఈ ప్రక్రియలో సదరు ఊపిరితిత్తులకు ఎటువంటి హాని జరగలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంటే అవయవం కోసం ఎదురుచూస్తున్న ఎవరికైనా ఈ ఊపిరితిత్తులను అమర్చేందుకు వీలైనట్టే. ‘ఓ’ గ్రూపు వారికి ఎక్కువగా.. ఓ గ్రూప్ రక్తం ఉన్న వారి అవయవాలను అందరికీ అమర్చవచ్చు. దీంతో ఈ గ్రూప్ అవయవాలకు డిమాండ్ పెరిగింది. మరోవైపు ఓ గ్రూప్ వాళ్లకు అదే గ్రూప్ వాళ్ల అవయవాలే సరిపోతాయి. డిమాండ్ పెరగడంతో సొంత ఓ గ్రూప్ వాళ్లకే ఆర్గాన్స్ దొరకని పరిస్థితి ఏర్ప డింది. అవయవ మార్పిడి కోసం ఈ గ్రూప్ వాళ్లు ఎదురుచూస్తూ చూస్తూ మరణిస్తున్నారు. ఏడాదిన్నరలో మనుషులపై.. యూనివర్సల్ లంగ్స్‌కు సంబంధించి మరింత పరిశోధన చేసి, భద్రతపై పూర్తిస్థాయి స్పష్టతకు వస్తామని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ మార్సెలో సైపెల్ తెలిపారు. ఏడాదిన్నరలో మనుషులపై పూర్తిస్థాయి క్లినికల్ ట్రయల్స్ చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఇది విజయవంతమైతే.. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు. రక్తం కొరత ఉండనట్టే.. రక్తం నుంచి యాంటీజెన్లను తొలగించేందుకు చేపట్టిన పరిశోధన దాదాపు కొలిక్కి వచ్చినట్టు బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. యాంటీజెన్లను నిర్వీర్యం చేసే ఎంజైమ్‌లను కృత్రిమంగా ఉత్పత్తి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఏ రక్తాన్ని ఎవరికైనా ఎక్కించవచ్చని, రక్తం కొరత అనేదే ఉండకపోవచ్చని స్పష్టం చేస్తున్నారు. -
హీరోయిన్; పోర్న్ స్టార్‌గా నటి ఎస్తేర్..
1000 అబద్దాలు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన నటి ఎస్తేర్ ఆ తర్వాత పలు సినిమాల్లోనూ నటించింది. సునీల్‌తో కలిసి నటించిన భీమవరం బుల్లోడు చిత్రం ఆమెకు మంచి పేరును తీసుకొచ్చింది. అనంతరం గరం, జయ జానకి నాయక వంటి ఒకటి రెండు సినిమాల్లో కనిపించినా.. పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో తమిళ, కన్నడ భాషలపు దృష్టి సారించింది. 2019లో సింగర్ నోయల్‌ను ప్రేమ వివాహం చేసుకున్న ఎస్తేర్.. వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో ఏడాదికే అతనితో విడాకులు తీసుకొని వార్తల్లో నిలిచింది. ఇక ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, అయితే ఢిఫరెంట్ పాత్ర కోసం ఎదురు చూస్తున్నట్లు ఎస్తేర్ చెప్పిన విషయం తెలిసిందే. చదవండి: బిగ్‌బాస్ : అభిజిత్‌కి రోహిత్ శర్మ ఊహించని గిఫ్ట్ చెప్పిన మాట ప్రకారమే తాజాగా ఓ తెలుగు సినిమా ద్వారా టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో ఇంతకముందెప్పుడూ చేయని బోల్డ్ క్యారెక్టర్‌ను ఎస్తేర్ పోషించనున్నారు. ‘హీరోయిన్’ అనే టైటిల్‌తో ఫోర్న్ స్టార్ కథగా తెరకెక్కనున్న ఈ సినిమాలో టైటిల్ రోల్లో కనిపించనుది. ఈ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌లో ఏస్తేర్ పోర్న్ స్టార్‌గా నటించనుంది. ‘ఉత్తర’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు తిరుపతి ఎస్ఆర్ తన రెండో ప్రయత్నంగా ‘‘హీరోయిన్’’ అనే సినిమాను రూపొందించబోతున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ‘ప్రపంచం కీర్తించే ఇండియా సాంప్రదాయం ముసుగులో మలినం ఉంది. సొసైటీ కళ్ళప్పగించి చూసే కళా రంగం వెనక గుండె పగిలే గాయం ఉంది. మనం చూసే ప్రతి అద్బుతం వెనుక మరో నిజం ఒకటి దాగి ఉంది” అని అంటున్నారు దర్శకుడు ఎస్ఆర్ తిరుపతి. ఎరోటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎస్తేర్ కొన్ని సీన్స్‌లో బోల్డ్‌గా కనిపిస్తుందన్నారు. ప్రస్తుతం షూటింగ్ సన్నాహాల్లో ఉన్నామని, త్వరలో సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల పేర్లు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఎస్తేర్ కెరీర్లో ఈ సినిమా ఓ మలుపు తిరగనుందని అభిప్రాయపడుతున్నారు. చాలా రోజుల గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ సినిమా తనకు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌లో గుర్తింపు తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. చూడండి: ఎస్తేర్ గ్లామర్ ఫొటోస్ -
‘మగవారిని కూడా ‘బోల్డ్ యాక్టర్’ అనగలరా’
ఫ్లోరా షైనీ (ఆశా షైనీ).. ‘చాలా బాగుంది, సర్దుకుపోదాం రండి, నరసింహ నాయుడు, నువ్వు నాకు నచ్చావ్, ఆ ఇంట్లో’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరమైన ఫ్లోరా షైనీ గందీ బాత్, మెయిడ్ ఇన్ ఇండియా వంటి వెబ్ సిరీస్‌ల్లో నటించారు. ఈ క్రమంలో తనను బోల్డ్ యాక్ట్రెస్ అని పిలవడం పట్ల తీవ్రంగా మండిపడ్డారు ఫ్లోరా షైనీ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులు, మీడియా చాలా ఎదగాలని నా అభిప్రాయం. ఎందుకంటే వారు నేను ఎంచుకునే పాత్రలను, జానర్లను పట్టించుకోకుండా కేవలం బోల్డ్ యాక్ట్రెస్‌గా మాత్రమే గుర్తిస్తున్నారు. మరి అలాంటి సన్నివేశాల్లో నాతో పాటు నటించే నటులను కూడా బోల్డ్ అనాలి. మరి మీడియాకు, జనాలకు మగ నటులను అలా పిలిచే ధైర్యం ఉందా’ అని ప్రశ్నించారు. ‘కేవలం మహిళననే సాకుతో నన్ను ఇలా పిలవగల్గుతున్నారు. లింగవివక్షకు ఇదే అసలైన నిదర్శనం. ఇలాంటి మైండ్ సెట్ మారాలి. మనం ఎదగాలి.. మన సమాజం కూడా లింగవివక్షకు తావులేకుండా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను’ అన్నారు. అంతేకాక ‘నేను పోషించిన ప్రతి పాత్ర పట్ల చాలా గర్వంగా ఫీలవుతాను. కేవలం బోల్డ్ పాత్రలనే కాకుండా అన్ని రకాల పాత్రలు నేను చేయగలను. భవిష్యత్తులో కూడా నాలోని నటిని వెలికితీసే మరిన్ని మంచి పాత్రలు వస్తాయని ఆశిస్తున్నాను’ అన్నారు. శ్రద్ధాకపూర్, రాజ్‌కుమార్ రావ్ ప్రధాన పాత్రల్లో హర్రర్ కామెడీగా తెరకెక్కిన స్త్రీ చిత్రంలో ఫ్లోరా నటించారు. -
బోల్డ్ స్టూడెంట్
ఈశ్వర్, టువ చక్రవర్తి, అంకిత మహారాణా ముఖ్య తారలుగా ఆర్. రఘురాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘4 లెటర్స్’. దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా అంకిత మహారాణా మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో బోల్డ్‌గా ఉండే ఫ్యాషన్ డిజైనింగ్ స్టూడెంట్ పాత్ర చేశాను. కాలేజ్ స్టూడెంట్స్ మాట్లాడుకుంటున్నట్లే నా డైలాగ్స్ చాలా సహజంగా ఉండేలా దర్శకులు జాగ్రత్త తీసుకున్నారు. అందుకు రఘురాజ్గారికి థ్యాంక్స్. పాత్ర పరంగా నా లుక్‌లో కొంచెం ఎక్కువ గ్లామర్ కనిపిస్తుంది. బాగా నటించాను. సినిమాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. టాలీవుడ్లో నాకు టర్నింగ్ పాయింట్ అవుతుందనుకుంటున్నాను. ఈశ్వర్, టువ మంచి కో స్టార్స్. నిర్మాతలు బాగా సహకరించారు’’ అని అన్నారు. -
బోల్డ్ ఈజ్ గోల్డ్
బోల్డ్ ఈజ్ గోల్డ్. ఏమిటీ కొత్త నిర్వచనం అనుకుంటున్నారా? ఇది నటి రాధికాఆప్తే అంటున్న మాట. నిజమే ఈ పదానికి నప్పే నటే ఈమె.అందాలారబోతకు హద్దులు తుడిచేసే రాధికాఆప్తే దక్షిణాదిలోనే కాస్త సంసార పక్ష పాత్రల్లో కనిపించారు. ఉత్తరాదిలో ఈ అమ్మడి నటన అందర్నీ ముక్కుమీద వేలేసుకునేలా చేసింది. అర్ధనగ్నంగానే కాదు నగ్నంగా నటించడానికీ ఏమాత్రం వెనుకాడని నటి రాధికాఆప్తే. పూణేకు చెందిన ఈ బోల్డ్ నటి స్టేజ్ ఆర్టిస్ట్ నుంచి సినీ ఆర్టిస్ట్‌గా ప్రమోట్ అయ్యింది. మొదట హిందీ, ఆ తరువాత బెంగాలీ, మరాఠి చిత్రాల్లో నటించి ఆపై దక్షిణాదికి దిగుమతి అయిన ఉత్తరాది భామ రాధికాఆప్తే. ఇటీవల కబాలి చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు భార్యగా నటించి మంచి ప్రాచుర్యం పొందిన ఈ జాణ ఆ ఇమేజ్ను తుడిచేసే విధంగా పర్చడ్ అనే హిందీ చిత్రంలో అర్ధనగ్నంగానూ, అహల్య అనే బెంగాలీ షార్ట్ ఫిలింలో నగ్నంగా నటించి పెద్ద చర్చకే దారి తీసింది. ఎలా అంత ధైర్యంగా నటించగలుగుతున్నారు? నగ్నంగా నటించడానికి మీ భర్త అభ్యంతరం చెప్పరా? అన్న ప్రశ్నలకు రాధికాఆప్తే చాలా బోల్డ్‌గా బదులిచ్చారు. అవేమిటో ఆమె మాటల్లోనే చూద్దాం. కథకు అవసరం లేకుండా అర్ధనగ్నంగా నటించడం నాకూ సమర్థనీయం కాదు. అదే కథ డిమాండ్ చేస్తే నగ్నంగా నటించడానికైనా నాకు ఆక్షేపణ లేదు. ఎందుకంటే బోల్డ్ ఈజ్ గోల్డ్. వివాహమైన స్త్రీని మీ భర్త అభ్యంతరం చెప్పరా? అని అడుగుతున్నారు. గ్లామరస్‌గా నటించడానికి.. ముఖ్యంగా నగ్నంగా నటించడానికి నా భర్త బెనెడిక్ట్ టె యిలర్ అభ్యంతరం చెప్పరు కదా, సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ సన్నివేశాల్లో తను కథా పాత్రల్నే చూస్తారు కానీ నన్ను చూడరు అని రాధికాఆప్తే చెప్పుకొచ్చింది. చూశారా ఎంత బోల్డ్‌గా బదులిచ్చిందో. -
మరీ బొద్దుగా ఉంటే...
పేరెంటింగ్ పిల్లలు బొద్దుగా, ముద్దుగా ఉంటే బాగుంటారు. అదే... బొద్దు ఎక్కువై, మరీ లావుగా కనిపిస్తే? అప్పటి దాకా ముద్దు అనుకున్నది కాస్తా, ముప్పుగా మారుతుంది. ఆరేళ్ళ వయసు పిల్లలకే ‘టైప్ 2’ డయాబెటిస్ వచ్చిందనీ, నిండా పన్నెండేళ్ళు కూడా లేని అమ్మాయికి... లావు తగ్గడం కోసం ‘బేరియాట్రిక్ సర్జరీ’ చేయించారని ఇటీవల షాకింగ్ వార్తలు వస్తున్నాయి. నిజం చెప్పాలంటే, మన దేశంలో ఇప్పుడు స్థూలకాయం ఓ పెద్ద సమస్యగా మారుతోంది. రెండు నుంచి 17 ఏళ్ళ లోపు పిల్లల్లో దాదాపు నూటికి 18 మందికి పైగా స్థూలకాయంతో బాధపడుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే, చాలామంది తల్లితండ్రులు తమ పిల్లలు స్థూలకాయులన్న విషయం గుర్తించరు. ఇలాంటి పిల్లల్లో చిన్న వయసులోనే అధిక రక్తపోటు, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు, కాళ్ళ నొప్పులు, అలసట లాంటి లక్షణాలు కనిపిస్తాయి. చివరకు ఇవన్నీ గుండె సంబంధమైన ఇబ్బందులకు దారి తీయవచ్చు. పట్టణ ప్రాంతాల్లో ఇటీవల పిల్లల్లో స్థూలకాయం ఎక్కువగా కనిపిస్తోంది. సందు సందుకీ ఏదో ఒక జంక్ ఫుడ్ స్టాల్ రావడం, వాటి తిండికి పిల్లలు అలవాటుపడడం, పిల్లల ఆహారపుటలవాట్లను పట్టించుకొనే తీరిక, ఓపిక తల్లితండ్రులకు లేకపోవడం - లాంటివన్నీ ఈ సమస్యకు కారణాలే. శారీరక ఆరోగ్యాన్నే కాక, స్నేహితుల మధ్య ఎగతాళికి గురవడం ద్వారా పిల్లల మానసిక స్థైర్యాన్ని కూడా స్థూలకాయం దెబ్బతీస్తుంది. అందుకే, పిల్లలు కాస్త స్థూలకాయంతో కనిపిస్తున్నారంటే, పెద్దలు వెంటనే అప్రమత్తం కావాలి. అలాంటి సందర్భంలో పెద్దలు చేయాల్సిందేమిటంటే... ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు. పిల్లలు ముద్దుగా, బొద్దుగా ఉన్నారని సరిపెట్టుకుంటూ, వాస్తవాన్ని విస్మరించకూడదు. ఉండాల్సిన దాని కన్నా పిల్లలు లావుగా కనిపిస్తే, తల్లితండ్రులు తక్షణమే దాని మీద దృష్టి పెట్టాలి.స్థూలకాయాన్ని ఒక సమస్యగా గుర్తించిన తరువాత, పిల్లలు వెంటనే లావు తగ్గిపోవా లని కంగారు పడితే కుదరదు. సహనంతో విషయాన్ని డీల్ చేయాలి. ముందుగా పిల్లలకు సమస్య పట్ల అవగాహన కల్పించాలి. ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్ల గురించి పిల్లలకు నచ్చజెప్పాలి. ఆహార విహారాల విషయంలో పిల్లలకు పెద్దలే ఆదర్శంగా నిలవాలి. జంక్ ఫుడ్‌కు తాము దూరంగా ఉంటూ, పిల్లలు కూడా దూరంగా ఉండేలా వాళ్ళకు నష్టాలను వివరించాలి. ఒకసారి అలవాటైపోయిన ఆహారాన్ని మార్చడం అంత సులభం కాదు. ముఖ్యంగా, పిల్లలకు ఒకటి అలవాటైతే, దాన్ని మాన్పించడం అప్పటికప్పుడు కష్టం. కాబట్టి, రాత్రికి రాత్రికి జంక్‌ఫుడ్ మానుకొమ్మని బలవంత పెడితే, మొదటికే మోసం రావచ్చు. అందుకని, పిల్లలకు నిదానంగా నచ్చజెప్పాలే తప్ప, వారిని తిట్టడం, కొట్టడం లాంటివి చేయకండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని రోజు వారీ తిండిలో భాగం చేయాలి. శారీరక శ్రమ చేయడం ముఖ్యం. పిల్లలు శారీరకంగా ఎంత చురుకుగా ఉండి, ఎంతగా ఆటపాటల్లో పాల్గొంటే అంత మంచిది. ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం, జాగింగ్, టెన్నిస్ - బ్యాడ్మింటన్ లాంటివి ఆడడం - ఇలా శారీరక శ్రమ ఉండే ఆటల్లో పిల్లల్ని ప్రోత్సహించాలి. దాని వల్ల స్థూలకాయం సమస్యను బలంగా ఎదుర్కోవచ్చు. రోజూ కనీసం అరగంట పైన శారీరక శ్రమ చేస్తే, పిల్లలు ఇట్టే లావు తగ్గిపోతారు. పిల్లలకు ఆదర్శంగా ఉండాలంటే, తల్లితండ్రులు కూడా ఉదయాన్నే లేచి, కుటుంబమంతా కలసి వ్యాయామం చేయడం మంచిది.రోజు వారీ భోజనంలో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారాన్నే అందించాలి. జంక్ ఫుడ్‌కు బదులు ప్రత్యామ్నాయాలను చూపాలి. పిల్లలకు కొవ్వు తక్కువగా ఉండే పాలు, గింజ ధాన్యాలు, పండ్లు, తాజా కాయగూరలు పెట్టాలి. వీటి వల్ల పిల్లలకు తగినన్ని పోషకపదార్థాలు అందుబాటులోకి వస్తాయి. చిన్న పిల్లల డాక్టర్ ద్వారా ఎప్పటికప్పుడు పిల్లల ‘బాడీ - మాస్ ఇండెక్స్’ను లెక్కించాలి. బాడీ ఫ్యాట్‌కు ప్రమాణమైన ఈ లెక్కను బట్టి, ఎప్పటికప్పుడు ఏ మేరకు స్థూలకాయం తగ్గిందీ తెలుసుకోవచ్చు.రోజువారీ ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు, వ్యాయామం కలగలిస్తే - పిల్లల్లో స్థూలకాయం తగ్గుతుంది. దీని వల్ల పిల్లల్లో మానసిక స్థైర్యం పెరుగుతుంది. ఆ దోవలో పిల్లల్ని ప్రోత్సహించి, వాళ్ళకు ఆద్యంతం అండగా నిలవాల్సింది తల్లితండ్రులే! - మహతి -
బొద్దుమల్లె తీగ
బొద్దుగా ఉన్నామా... సన్నగా ఉన్నామా అని కాదన్నయ్యా... మనం చెప్పినట్లు ఒళ్లొంగిందా లేదా..? అనేదే పాయింటు అంటోంది ఈ బొద్దుమల్లె తీగ. గునగునలాడే గుజ్జురూపంతో కనిపించే ఈమె పేరు వాలెరీ సాగన్. కాలిఫోర్నియాలోని శాన్‌జోస్ ప్రాంతంలో ఉండే ఈమెకు యోగాపై ఎనలేని మక్కువ. బరువు తగ్గందే ఒళ్లు విల్లులా వంచడం సాధ్యం కాదని, కఠినమైన యోగాసనాలు వేసే ముందు బరువు తగ్గాలని ఎవరెన్ని విధాలుగా వారించినా, అవేమీ పట్టించుకోకుండా కొన్నేళ్ల కిందట హఠయోగ సాధన ప్రారంభించింది. అంతటితోనే ఆమె ఆగలేదు... బరువు ఏమాత్రం తగ్గించుకోకుండానే, ఒంటిని రబ్బరులా వంచడంలో ప్రావీణ్యం సాధించింది. ఆమె అవలీలగా శీర్షాసనం, హలాసనం, చక్రాసనం, మయూరాసనం వంటి అత్యంత కఠినమైన యోగాసనాలు వేస్తుంటే, అబ్బురపడటం చూసేవారి వంతవుతోంది. ఇటీవల ఈమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన యోగా ఫొటోలకు ఒక్కరోజులోనే ఏకంగా 80 వేల హిట్లు పడ్డాయంటే, ఈమె ఏ రీతిలో సంచలనం రేకెత్తిస్తోందో ఊహించుకోవచ్చు. -
అటెండరే వైద్యుడు..
ఆలూర్(ఆర్మూర్‌రూరల్), న్యూస్‌లైన్ : ఆర్మూర్ మండలం ఆలూర్లోని పశువైద్యశాలలో సమయపాలన కరువైంది. ఇక్కడ పనిచేస్తున్న వైద్యురాలు శైలజ అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఆస్పత్రి పరిధిలో ఆలూర్, మిర్ధాపల్లి, రాంపూర్, గగ్గుపల్లి గ్రామాలు వస్తాయి. సుమారు ఐదారు వేల గేదెలు, ఆవులు, మేకలు తదితర పశువులు ఈ గ్రామాలలో ఉంటాయి. రెండేళ్ల క్రితం పశు వైద్యురాలిగా ప్రభుత్వం శైలజను నియమించింది. పశువులకు చికిత్స చేయడానికి వైద్యురాలు గ్రామంలోనే నివాసం ఉండాల్సి ఉండగా, నిజామాబాద్‌లో ఉంటున్నారు. పశు వైద్యశాలలో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్యురాలు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వివిధ గ్రామాల నుంచి వచ్చే పశువులకు వచ్చే సీజనల్, గాలికుంటు వ్యాధులు, కృత్రిమ గర్భాధారణపై రైతులకు ఎలాంటి అవగాహన కల్పించడంలేదనే ఆరోప ణలున్నాయి. అలాగే ప్రతి రోజు వైద్యశాలలో వైద్యురాలు అందుబాటులో ఉండడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల సమాచారం మేరకు విలేకరులు సోమవారం పశువైద్యశాలకు ఉదయం 10 గంటలకు వెళ్లగా, వైద్యురాలు లేకపోవడంతో ఖాళీ కుర్చీ దర్శనమిచ్చింది. వారిని చూసిన అటెండర్ నర్సయ్య వెంటనే వైద్యురాలు శైలజకు ఫోన్ చేసి విలేకరులు వచ్చారని చెప్పాడు. దీంతో సెలవులో ఉన్నట్లు చెప్పమని ఫోన్లో సూచన చేయడంతో అటెండర్, వైద్యురాలు సెలవులో ఉన్నట్లు తెలిపాడు. పశువైద్యురాలు చేయాల్సిన చికిత్స అటెం డర్ నర్సయ్య చేస్తున్నాడని రైతులు పేర్కొన్నారు. పశువులకు వ్యాధులు వస్తే వైద్యురాలు అందుబాటులో ఉండకపోవడంతో ప్రైవేట్ వారితో పశువులకు చికిత్స చేయిస్తున్నామని రైతులు వాపోయారు. విధులకు సక్రమంగా హాజరు కాని వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.