బొద్దుమల్లె తీగ | Hatha yoga practice | Sakshi
Sakshi News home page

బొద్దుమల్లె తీగ

Published Thu, Sep 24 2015 11:17 PM | Last Updated on Sun, Sep 3 2017 9:54 AM

బొద్దుమల్లె తీగ

బొద్దుమల్లె తీగ

బొద్దుగా ఉన్నామా... సన్నగా ఉన్నామా అని కాదన్నయ్యా... మనం చెప్పినట్లు ఒళ్లొంగిందా లేదా..? అనేదే పాయింటు అంటోంది ఈ బొద్దుమల్లె తీగ. గునగునలాడే గుజ్జురూపంతో కనిపించే ఈమె పేరు వాలెరీ సాగన్. కాలిఫోర్నియాలోని శాన్‌జోస్ ప్రాంతంలో ఉండే ఈమెకు యోగాపై ఎనలేని మక్కువ. బరువు తగ్గందే ఒళ్లు విల్లులా వంచడం సాధ్యం కాదని, కఠినమైన యోగాసనాలు వేసే ముందు బరువు తగ్గాలని ఎవరెన్ని విధాలుగా వారించినా, అవేమీ పట్టించుకోకుండా కొన్నేళ్ల కిందట హఠయోగ సాధన ప్రారంభించింది. అంతటితోనే ఆమె ఆగలేదు... బరువు ఏమాత్రం తగ్గించుకోకుండానే, ఒంటిని రబ్బరులా వంచడంలో ప్రావీణ్యం సాధించింది. ఆమె అవలీలగా శీర్షాసనం, హలాసనం, చక్రాసనం, మయూరాసనం వంటి అత్యంత కఠినమైన యోగాసనాలు వేస్తుంటే, అబ్బురపడటం చూసేవారి వంతవుతోంది. ఇటీవల ఈమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన యోగా ఫొటోలకు ఒక్కరోజులోనే ఏకంగా 80 వేల హిట్లు పడ్డాయంటే, ఈమె ఏ రీతిలో సంచలనం రేకెత్తిస్తోందో ఊహించుకోవచ్చు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement