'రేపు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు'.. ఆరోగ్యంపై నటి షాకింగ్ కామెంట్స్! | Actress Gayathri Gupta Shocking Comments On Her Health Issue - Sakshi
Sakshi News home page

Gayathri Gupta: 'మా నాన్నను ఎప్పుడలా చూడలేదు'.. గాయత్రి షాకింగ్ కామెంట్స్!

Published Fri, Sep 8 2023 9:22 PM | Last Updated on Sat, Sep 9 2023 9:20 AM

Actress Gayathri Gupta Shocking Comments On Her Health Issue - Sakshi

షార్ట్ ఫిల్మ్స్‌తో కెరియర్ స్టార్ట్ చేసి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి గాయత్రి గుప్తా. ఆ తర్వాత ఫిదా, కొబ్బరి మట్ట, ఐస్ క్రీం లాంటి చిత్రాల్లో నటించింది. అయితే గాయత్రి గుప్తా హీరోయిన్‌గా చేయకపోయినప్పటికీ చాలా చిత్రాల్లో కనిపించింది. మాస్ మహారాజా రవితేజ మూవీ అమర్ అక్బర్ ఆంటోనీ, బుర్రకథ, ఐస్‌క్రీమ్-2, దుబాయ్ రిటర్న్, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీతా అన్‌ ది రోడ్, కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ లాంటి సినిమాలు చేసింది.  అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ తన గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అంతే కాకుండా తన ఆరోగ్యం గురించి ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేసింది. 

(ఇది చదవండి: ఐకాన్ స్టార్ 'పుష్ప-2'.. ఆ ఫోటో లీక్‌ చేసిన శ్రీవల్లి!)

గాయత్రి గుప్తా మాట్లాడుతూ..'ప్రస్తుతం నా హెల్త్ కండీషన్‌ క్రిటికల్‌ గానే ఉంది. రేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం.  నా ఆరోగ్యం కోసం విరాళాలు సేకరించాలనుకుంటున్నా. అంతే కాకుండా తన తండ్రిని నేను ఎప్పుడు కూడా ఫాదర్‌గా భావించలేదు.' అంటూ షాకింగ్‌ కామెంట్స్ చేసింది. అంతే కాకుండా ఆమెను బోల్డ్‌ అనడంపై స్పందించింది. డైరెక్టర్స్‌కు కావాల్సిన క్యారెక్టర్‌కు తగినంత పొటెన్షియల్‌ ఉన్నవాళ్లనే సెలెక్ట్ చేసుకుంటారంటూ తెలిపింది.

గతంలో ఆమె ఓ వీడియో ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. మరి ఇంత బోల్డ్‌ వీడియో చేయడమేంటని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా గతంలో తన బాయ్‌ఫ్రెండ్‌ తనను మోసం చేశాడని తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య, విష్ణుప్రియ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన వెబ్ సిరీస్‌లో గాయత్రి గుప్తా నటించింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్‌పామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 

(ఇది చదవండి: 'స్వీటీ చాలా అందంగా కనిపించింది'.. రాజమౌళి ట్వీట్ వైరల్! )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement