టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల ఇటీవలే డార్లింగ్ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. అంతకుముందు తంత్ర అనే హారర్ మూవీతో మెప్పించింది. ప్రస్తుతం పొట్టేల్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇటీవల అనన్య ఓ వీడియో షేర్ చేసింది. దానిపై ఓ రేంజ్‌లో నెగెటివ్ ట్రోల్స్ వచ్చాయి.
దీంతో తన వీడియోపై వస్తున్న ట్రోల్స్‌పై అనన్య స్పందించింది. ఎందుకింత నెగెటివీటీ అంటూ మండపడింది. ప్లాస్టిక్ వాడకం తగ్గించమని వీడియో షేర్ చేశా. దానిపై కొందరు విమర్శలు చేశారు. నేను చెప్పిన విషయం నచ్చితే చేయండి.. అంతేకానీ ఎందుకింత నెగటివిటీ ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించింది. అది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా.. సోషల్‌మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే అనన్య.. ఇటీవల ఓ వీడియో షేర్ చేశారు. అందులో స్ట్రా సాయం లేకుండా కొబ్బరిబొండం నీళ్లు తాగుతూ కనిపించారు. మాములుగా నేను స్టీల్ స్ట్రా వెంట తెచ్చుకుంటాను.. అది లేని పక్షంలో ఈ విధంగా కొబ్బరినీళ్లు తాగుతా. ప్లాస్టిక్ వాడకాన్ని కాస్త తగ్గిద్దాం. చిన్న చిన్న పనులే పెద్ద మార్పులకు శ్రీకారం చుడతాయి అని రాసుకొచ్చారు. దీనిపై పలువురు నెటిజన్లు నెగెటివ్ కామెంట్స్ చేశారు.
2019లో విడుదలైన 'మల్లేశం' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. ఆ తర్వాత పవన్ కల్యాణ్ చిత్రం 'వకీల్ సాబ్'తో మరింత ఫేమస్ అయింది. గతేడాది సమంత లీడ్ రోల్ పోషించిన శాకుంతల చిత్రంలోనూ అనన్య ఓ పాత్రలో అభిమానులను మెప్పించింది. తాజాగా ఆమె నటించిన పొట్టేల్ అక్టోబర్ 25న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment