టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతేడాది శాకుంతలం, ఖుషీ సినిమాతో అభిమానులను అలరించింది. ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సామ్ చికిత్స తీసుకుంది. పూర్తిగా కోలుకున్న సమంత ప్రస్తుతం సిటాడెల్: హనీ-బన్నీ, మా ఇంటి బంగారం లాంటి ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే మయోసైటిస్ నుంచి కోలుకున్న సామ్ ఆరోగ్యానికి సంబంధించిన జాగ్రత్తలపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఉంటోంది. పలు సార్లు తన ఇన్‌స్టా వేదికగా ఫోటోలు, వీడియోలను పంచుకుంది. అయితే సామ్ ఇటీవల చేసిన పోస్ట్‌పై నెట్టింట పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. సమంత సలహాలు పాటిస్తే డైరెక్ట్‌గా చావేనంటూ ఓ వైద్యుడు ట్విటర్‌లో రాసుకొచ్చారు. దీంతో పాటు సామ్ పోస్ట్ చేసిన క్లిప్‌ను షేర్ చేశారు.
వైద్యుడు ట్విటర్‌లో రాస్తూ..'నటి సమంత వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజ్ (పీల్చడం) చెయ్యండని చెప్తూ తన ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టినట్లు లివర్ డాక్టర్ పెట్టారు. ఇదే నిజమైతే ఇంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదు. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక అన్‌స్టేబుల్ రసాయనం, ఇది నీరు, ఆక్సిజన్‌గా మారుతుంది. అయితే ఈ ఆక్సిజన్ అణువులుగా మారేముందు పరమాణువులుగా ఉన్నప్పుడు ఫ్రీ రాడికల్స్‌లా పనిచేసి అవి అప్పటికే వైరస్ వలన దెబ్బతిన్న ఊపిరితిత్తుల లోపలి పలుచని పొరల్ని బాగా దెబ్బ తీసి, న్యుమోనియా గానీ, ఏక్యూట్ రెస్పిటేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్‌కు గానీ దారి తీస్తుంది. ఇదొస్తే డైరెక్టు సావే. ఇక మీ ఇష్టం' అంటూ పోస్ట్ చేశారు.
అయితే నిజంగానే సమంత సోషల్ మీడియా ఖాతా చెక్ చేస్తే ఆమె షేర్ చేసిన స్టోరీస్‌లో ఇదే విషయాన్ని ప్రస్తావించింది. అంతేకాదు దానికి సంబందించిన ఒక వీడియో లింక్‌ను కూడా షేర్ చేసింది. ది లివర్ డాక్ అనే పేరుతో ఉన్న డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ ఈ విషయం మీద ముందుగా స్పందిస్తూ ఈ నెబ్యులైజేషన్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని చెప్పడమే కాక.. సమంత హెల్త్ అండ్ సైన్స్ నిరక్షరాస్యురాలు' అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
అయితే దీనిపై సమంత మరోసారి తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. వైద్యులు చెప్పిన సలహాలేనంటూ వాటి క్లిప్‌లను ఇన్‌స్టా స్టోరీస్‌లో మరోసారి పంచుకుంది. ఏదేమైనా ప్రస్తుతం ఇదంతా చర్చనీయాంశంగా మారింది.
నటి సమంత వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజ్ (పీల్చడం) చెయ్యండని చెప్తూ తన ఇన్‌స్టాలో పెట్టినట్లు లివర్ డాక్టర్ పెట్టారు. ఇదే నిజమైతే ఇంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదు.
హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక అన్‌స్టేబుల్ రసాయనం, ఇది నీరు మరియు… pic.twitter.com/g4gEaBeQfp— Srikanth Miryala (@miryalasrikanth) July 4, 2024
Comments
Please login to add a commentAdd a comment