టాలీవుడ్ హీరోయిన్ సమంత సలహా ఆరోగ్యానికి సంబంధించిన సలహాలు ఇవ్వడం వివాదంగా మారింది. ఇటీవల ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. కొందరు వైద్యులు ఆమె సలహాలు పాటిస్తే ప్రాణాలకే ముప్పు అంటూ మాట్లాడారు. తాజాగా సామ్ విమర్శించిన వారిలో గ్రామీ అవార్డు గ్రహీత, మ్యూజిక్ కంపోజర్ రికీ కేజ్ కూడా చేరిపోయారు. సమంత అలా చేయడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. కాగా.. వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం పొందడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజర్ ద్వారా తీసుకోవాలని సూచించారు.
తాజా ఇంటర్వ్యూలో రికీ కేజ్ మాట్లాడుతూ.. "విపరీతమైన క్రేజ్ ఉన్న ఓ ప్రముఖ వ్యక్తి వైద్య సలహాలు ఇచ్చారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఈ ప్రత్యేక వైద్య చికిత్స ప్రాణాంతకం కావచ్చు. ఇది ఆమె బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోంది. ఆమె ప్రాణహాని కలిగించే వాటి గురించే మాట్లాడుతోంది. ప్రత్యామ్నాయ వైద్యం కోసం నిరంతరం వెతుకుతున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే సాంప్రదాయ ఔషధాలు పని చేయవని వారంతా భావిస్తారు. ప్రత్యేకించి ఒక సెలబ్రిటీ ఏదైనా చెబితే అట్రాక్ట్ అవుతారు. అందుకే సెలబ్రిటీలు ఎలాంటి వైద్య ప్రక్రియను ఆమోదించకుండా ఉండేందుకు కఠిన నిబంధనలు అమలు చేయాలి." అని అన్నారు. ఇలా చెప్పినందుకు సమంతను సైన్స్ నిరక్షరాస్యురాలని ఓ వైద్యుడు విమర్శించారు. సమంత ఇలాంటి వైద్యపరమైన ప్రచారం చేయడంతో తాను షాక్ అయ్యానని పేర్కొన్నాడు.
కాగా.. గతేడాది మైయోసిటిస్ బారిన పడిన సమంత ఆ తర్వాత కోలుకుంది. తన వైద్యంలో భాగంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజేషన్ ప్రయోజనాలను ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment