రేణు దేశాయ్ ఇటీవలే టైగర్ నాగేశ్వరరావు చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. హేమలత లవణం పాత్రలో సినీ ప్రేక్షకులను అలరించారు. చాలా ఏళ్ల తర్వాత సినిమాల్లో కనిపించడంతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. రవితేజ, నుపుర్ సనన్ జంటగా ఈ చిత్రాన్ని వంశీకృష్ణ నాయుడు తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 20న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమాతో రీ ఎంట్రీ రేణు దేశాయ్ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన కెరీర్, ఆరోగ్యం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
(ఇది చదవండి: రన్ టైమ్ తగ్గించినా కలిసిరాలేదు.. టైగర్ నాగేశ్వరరావు కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే?)
రేణు దేశాయ్ మాట్లాడుతూ.. 'లాక్ డౌన్ సమయంలో నాకు హెల్త్ సమస్యలు వచ్చాయి. నాకు గుండెకు సంబంధించి ప్రాబ్లమ్ ఉంది. ఈ సమస్య నాకు పుట్టినప్పటి నుంచే ఉంది. కాబట్టి దాన్ని మనం మార్చలేం. ఈ సమస్య ఉందని నాకు ముందే తెలియదు. కానీ చిన్న చిన్న టెస్టులు, సిటీ స్కాన్ చేశాక తెలిసింది. ఈ సమస్య మా నానమ్మకు ఉండేది. అందువల్లే 47 ఏళ్లకే ఆమె చనిపోయారు. నాకు డయాగ్నోసిస్ కూడా అయింది.' అని అన్నారు.
తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ.. 'నేను ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటా. డైలీ యోగా చేస్తా. బైపాస్ సర్జరీ అలాంటిదేం జరగలేదు. నాకు హార్ట్ రేట్ కాస్తా ఎక్కువగానే ఉంటుంది. అందుకే మందులు వాడుతున్నా. వాటివల్లే కాస్తా లావు కూడా అయ్యా. రెగ్యులర్‌గా మెడిసిన్ తీసుకోవాల్సిందే తప్పనిసరి. రన్నింగ్ చేయడం, స్టెప్స్ ఎక్కడం లాంటివి చేయకూడదు. మా నానమ్మ 1974లో నాన్న పెళ్లికి ముందే చనిపోయారు. నాన్న కూడా చిన్న వయసులో హార్ట్ ఎటాక్‌తోనే చనిపోయారు. చాలా మందికి ఇలాంటి సమస్య ఉంటుంది. నాకైతే సీరియస్ సమస్య అయితే లేదు కానీ.. కొంత అయితే ఉంది.' అని చెప్పుకొచ్చింది. టైగర్ నాగేశ్వరరావు సినిమాతో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. కాగా.. ఇటీవలే రెండేళ్ల తర్వాత రెండో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందని తెలిపింది రేణు దేశాయ్.
(ఇది చదవండి: కనీసం రూ.100 అయినా ఇవ్వండి.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్)
Comments
Please login to add a commentAdd a comment