Gayathri Gupta
-
వాళ్లకు కూడా ‘భవానీ వార్డ్’ నచ్చుతుంది: దర్శకుడు
‘భవానీ వార్డ్’ హారర్ చిత్రం అయినప్పటికీ.. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించాను. హారర్ సినిమాలు ఇష్టపడేవారికి బాగా నచ్చుతుంది’ అని అన్నారు దర్శకుడు నరసింహ. గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన హారర్, థ్రిల్లర్ మూవీ ‘భవానీ వార్డ్’. అవి క్రియేషన్స్, విభు ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీని కళ్యాణ్ చక్రవర్తి, చంద్రకాంత్ సోలంకి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా గాయత్రీ గుప్తా మాట్లాడుతూ.. ‘సీనియర్ నటి అంటే కాస్త ఆనందంగా, కాస్త ఇబ్బందిగానూ ఉంటుంది. ఈ చిత్రాన్ని నరసింహా అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన సెట్స్‌పై ఎంతో సరదాగా ఉండేవారు. ఆయన చాలా మంచి దర్శకులు. ఈ చిత్రం టెక్నీకల్‌గా బాగుంటుంది. ఇలాంటి మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్స్’ అని అన్నారు. ఈ చిత్రంఅఓ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థ్యాంక్స్ అని సాయి సతీస్, గణేష్ రెడ్డి అన్నారు. -
సినిమా రిలీజ్.. ఏడుస్తూ వీడియో షేర్ చేసిన హీరోయిన్!
ఇటీవలే దయా వెబ్ సిరీస్‌లో ప్రేక్షకులను పలకరించిన నటి గాయత్రి గుప్తా. అంతకంటే ముందే యాంకర్‌గా, షార్ట్ ఫిలింస్ చేస్తూ కూడా ఫేమస్ అయింది. ఆ తర్వాత ఐస్‌క్రీమ్ 2, ఫిదా, మిఠాయి, అమర్ అక్బర్ ఆంటోని, కొబ్బరిమట్ట లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. గతంలో టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్‌తో పాటు బిగ్‌బాస్ టీమ్‌పై లైంగిక ఆరోపణలతో వార్తల్లోకెక్కింది. తాజాగా ప్లాట్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ముద్దుగుమ్మ. భాను భవతారక దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో వికాస్, గాయత్రి గుప్తా ప్రధాన పాత్రలో పోషించారు. అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తూ ఉంటోంది గాయత్రి గుప్తా. ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ టచ్‌లో ఉంటోంది. గతంలో ఓ బోల్డ్ వీడియో షేర్ చేసి వార్తల్లో నిలిచింది. తాజాగా తన చిత్రం ప్లాట్ మూవీ రిలీజ్ సందర్భంగా మరో వీడియోను షేర్ చేసింది. అభిమానులతో లైవ్ తీసిన వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఈ రోజు ప్లాట్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్దామనుకున్నా..కానీ కుదరలేదు అంటూ ఏడుస్తూ కనిపించింది. అందరూ థియేటర్‌కు వెళ్లి ప్లాట్ సినిమా చూడండి అంటూ అభిమానులను కోరింది. అయితే ఈ వీడియోలోనూ మరింత బోల్డ్‌గా కనిపించి అభిమానులకు షాకిచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ గాయత్రికి ఏమైందంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. గెట్ వెల్ సూన్ మేడం అంటూ పోస్టులు పెడుతున్నారు. సినిమా రిలీజ్ రోజే ఇలాంటి వీడియో ఏంటీ మేడం అని ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యాంక్లోసింగ్ స్పాండిలైటిస్ అనే వ్యాధి ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇది డిప్రెషన్ వల్ల వచ్చే శారీరక వ్యాధి అని ఈ విషయం నాకు ఆరు నెలల క్రితం తెలిసింది. చాలామంది డాక్టర్లు నేను ఎక్కువ కాలం బతకనని చెప్పారని తెలిపింది. అయితే సైకాలజీ థెరపీ వచ్చాక ఈ వ్యాధిపై మరింత క్లారిటీ వచ్చింది. సమయానికి పడుకోవడం, యోగా చేయడం.. ఇలా అన్నీ చేస్తున్నానని తెలిపింది. View this post on Instagram A post shared by Gayathri Gupta (@gayathrigupta) View this post on Instagram A post shared by Gayathri Gupta (@gayathrigupta) -
ప్లీజ్ సాయం చేసి కాపాడండి.. దీనస్థితిలో నటి గాయత్రి
సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ రంగుల ప్రపంచంలో అందరి జీవితాల్లో వెలుగులు కనిపించవు. సెలబ్రిటీల లైఫ్ అంటేనే లగ్జరీ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ.. అది అందరి జీవితాల్లో ఉండదు. వెండితెరపై ఎంతో సంతోషంగా కనిపించే చాలా మంది నటీ, నటుల జీవితాల్లో ఎన్నో కన్నీళ్లు ఉంటాయి. ఐస్‌క్రీమ్ 2, ఫిదా, మిఠాయి, అమర్ అక్బర్ ఆంటోని, కొబ్బరిమట్ట.. ఇలా అనేక చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న గాయత్రి గుప్తా జీవితంలో ఎన్నో కన్నీళ్లు ఉన్నాయి. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే గాయత్రి చాలాకాలంగా ఓ వ్యాధితో బాధపడుతోంది. 'ఆర్థరైటిస్' జబ్బుతో పోరాడుతున్నట్లు ఆమె గతంలో చెప్పింది. ఇది డిప్రెషన్ వల్ల వచ్చే శారీరక వ్యాధని ఆమె చెప్పింది. అందుకు ట్రీట్మెంట్ తీసుకుంటే నయం అవతుందని అందుకు సరిపడా డబ్బులు తన వద్దలేవని గాయత్రి బాధపడింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత ఆందోళనగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఒక ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆమె వైద్యానికి రూ. 12 లక్షలు ఖర్చు అవుతుందని ఈ మేరకు ఎవరైనా దాతలు విరాళాలు అందిస్తారేమోనని గాయత్ర గుప్తా ఎదురు చూస్తుంది. దాతలు సాయం చేయాలంటే ఇంపాక్ట్ గురు అనే స్వచ్చంద సంస్థ ఈ విరాళాల సేకరణకు ముందుకు వచ్చింది. ఆమె వైద్యానికి రూ. 12 లక్షల ఖర్చు అవుతుండగా.. ఇప్పటి వరకు ఆమెకు కేవలం రూ.1.5 లక్షలు మాత్రమే వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆమెకు ఇంకా సుమారుగా రూ. 10 లక్షలకు పైగా డబ్బు కావాల్సి వస్తుంది. ఈ మేరకు బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ తన వంతుగా సాయం చేసినట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా త్వరగా కోలుకుంటావని ఆమెకు భరోసా కల్పించాడు. అంతేకాకుండా గాయిత్రికి దాతలు సాయం చేయాలని ఆయన కోరాడు. ఫిదా సినిమాలో సాయిపల్లవి ఫ్రెండ్‌గా కనిపించిన గాయత్రి గుప్తాకు ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ప్రముఖులు సాయం చేస్తారేమో తెలియాల్సి ఉంది. దయచేసి నాకు సాయం చేయండి: గాయత్రి నా ఆరోగ్య పరిస్థితి మరింతి ప్రమాదంగా మారింది. దీంతో తక్షణమే నేను ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది నా జీవితంలో చాల సంక్లిష్టమైన సమయం. నా వైద్యానికి అవసరం అయ్యే డబ్బు నా వద్ద లేదు. దయచేసి నాకు సాయం చేయండి. ఇంపాక్ట్‌గురు. కామ్ అనే ఫండింగ్ సంస్థ ద్వారా నాకు సాయం చేయండి. మీకు తోచినంత మొత్తాన్ని నా వైద్య ఖర్చులకు ఇస్తారని ఆశిస్తున్నాను. ఈ వ్యాఖ్యలతో అవకాశాలకు బ్రేక్ టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్‌తో పాటు బిగ్‌బాస్ టీమ్‌పై లైంగిక ఆరోపణలతో గాయిత్రి గుప్తా తెరపైకి వచ్చింది. బిగ్‌బాస్ మూడో సీజన్‌కు పోటీదారుగా పాల్గొనేందుకు తనకు ఆసక్తి ఉందా అని ముగ్గురు సభ్యులు తనను సంప్రదించారని.. ఒకవేళ 'బిగ్ బాస్' ఎంపికైతే తమను ఎలా సంతృప్తి పరుస్తారని టీమ్ సభ్యులు అడిగినట్లు గాయత్రి గుప్తా సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు కూడా తనను ఇబ్బంది పెట్టినట్లు ఆమె బహిరంగంగానే చెప్పింది. దీంతో ఆమెకు ఎవరూ సినిమా అవకాశాలు ఇవ్వలేదని చెప్పవచ్చు. -
'రేపు ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు'.. ఆరోగ్యంపై నటి షాకింగ్ కామెంట్స్!
షార్ట్ ఫిల్మ్స్‌తో కెరియర్ స్టార్ట్ చేసి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి గాయత్రి గుప్తా. ఆ తర్వాత ఫిదా, కొబ్బరి మట్ట, ఐస్ క్రీం లాంటి చిత్రాల్లో నటించింది. అయితే గాయత్రి గుప్తా హీరోయిన్గా చేయకపోయినప్పటికీ చాలా చిత్రాల్లో కనిపించింది. మాస్ మహారాజా రవితేజ మూవీ అమర్ అక్బర్ ఆంటోనీ, బుర్రకథ, ఐస్‌క్రీమ్-2, దుబాయ్ రిటర్న్, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీతా అన్ ది రోడ్, కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ లాంటి సినిమాలు చేసింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ ముద్దుగుమ్మ తన గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అంతే కాకుండా తన ఆరోగ్యం గురించి ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేసింది. (ఇది చదవండి: ఐకాన్ స్టార్ 'పుష్ప-2'.. ఆ ఫోటో లీక్ చేసిన శ్రీవల్లి!) గాయత్రి గుప్తా మాట్లాడుతూ..'ప్రస్తుతం నా హెల్త్ కండీషన్ క్రిటికల్ గానే ఉంది. రేపు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నాం. నా ఆరోగ్యం కోసం విరాళాలు సేకరించాలనుకుంటున్నా. అంతే కాకుండా తన తండ్రిని నేను ఎప్పుడు కూడా ఫాదర్‌గా భావించలేదు.' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతే కాకుండా ఆమెను బోల్డ్ అనడంపై స్పందించింది. డైరెక్టర్స్‌కు కావాల్సిన క్యారెక్టర్‌కు తగినంత పొటెన్షియల్ ఉన్నవాళ్లనే సెలెక్ట్ చేసుకుంటారంటూ తెలిపింది. గతంలో ఆమె ఓ వీడియో ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. మరి ఇంత బోల్డ్ వీడియో చేయడమేంటని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా గతంలో తన బాయ్‌ఫ్రెండ్ తనను మోసం చేశాడని తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య, విష్ణుప్రియ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన వెబ్ సిరీస్‌లో గాయత్రి గుప్తా నటించింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్‌పామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. (ఇది చదవండి: 'స్వీటీ చాలా అందంగా కనిపించింది'.. రాజమౌళి ట్వీట్ వైరల్! ) -
నాకున్న జబ్బు ఇదే, ఎక్కువ రోజులు బతకనని చెప్పారు: నటి
ఐస్‌క్రీమ్ 2, ఫిదా, మిఠాయి, అమర్ అక్బర్ ఆంటోని, కొబ్బరిమట్ట.. ఇలా అనేక చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది గాయత్రి గుప్తా. అంతకంటే ముందే యాంకర్‌గా, షార్ట్ ఫిలింస్ చేస్తూ కూడా ఫేమస్ అయింది. టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్‌తో పాటు బిగ్‌బాస్ టీమ్‌పై లైంగిక ఆరోపణలతో వార్తల్లోకెక్కింది. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే గాయత్రి చాలాకాలంగా ఓ వ్యాధితో బాధపడుతోంది. తాజాగా ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. పదేళ్లపాటు బెడ్ రెస్ట్.. గాయత్రి గుప్తా మాట్లాడుతూ.. 'సినిమా ఇండస్ట్రీకి వెళ్తానంటే ఇంట్లో ఒప్పుకోలేదు. పాతికేళ్ల వయసులో ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. నాకు యాంక్లోసింగ్ స్పాండిలైటిస్ అనే వ్యాధి ఉంది. అది ఎందుకు? ఎలా వచ్చిందో అర్థం కాలేదు. పదేళ్లపాటు బెడ్ రెస్ట్ తీసుకున్నాను. ఇది డిప్రెషన్ వల్ల వచ్చే శారీరక వ్యాధి. ఈ విషయం నాకు ఆరు నెలల క్రితం తెలిసింది. చాలామంది డాక్టర్లు నేను ఎక్కువ కాలం బతకనని చెప్పారు. ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం బతకడం కష్టమని మూడేళ్ల కిందట డాక్టర్స్ చెప్పారు. ఊహ తెలిసినప్పటినుంచి రాత్రిళ్లు నిద్ర లేదు ఊహ తెలిసినప్పటి నుంచి రాత్రిళ్లు సరిగా పడుకోలేదు. డిప్రెషన్ వల్లే నాకు నిద్ర దూరమైంది. నెలకు రెండు బయాలాజిక్స్ ఇంజక్షన్స్ తీసుకున్నాను. ఇంజక్షన్స్ వేసుకోకపోతే కదలడానికి కూడా కష్టమయ్యేది. అలాగే విపరతీమైన బ్యాక్ పెయిన్ ఉండేది. పెయిన్ కిల్లర్ వేసుకున్న ప్రతిసారి నాకు గుండెదడ వస్తుంది. దాదాపు 10 ఏళ్ల నుంచి తరచూ పెయిన్ కిల్లర్స్ వాడుతూనే ఉన్నాను. డాక్టర్స్ నేను చనిపోతానని చెప్పినప్పుడు ఈ నొప్పి భరించడం కంటే అదే నయం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ బాధ నుంచి నెమ్మదిగా బయటకు వస్తుంటే బతుకుపై ఆశ కలుగుతోంది. సైకాలజీ థెరపీ వచ్చాక ఈ వ్యాధిపై మరింత క్లారిటీ వచ్చింది. సమయానికి పడుకోవడం, యోగా చేయడం.. ఇలా అన్నీ చేస్తున్నాను' అని చెప్పుకొచ్చింది గాయత్రి గుప్త. చదవండి: ఘనంగా బిగ్‌బాస్ బ్యూటీ కీర్తి నిశ్చితార్థం.. కాలికి పట్టీలు, చేతికి ఉంగరం తొడుగుతూ.. -
దయా వెబ్ సిరీస్ నటి.. మరి ఇంత బోల్డ్‌గా ఉందేంటి బ్రో!
షార్ట్ ఫిల్మ్స్‌తో కెరియర్ స్టార్ట్ చేసి గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి గాయత్రి గుప్తా. ఆ తర్వాత ఫిదా, కొబ్బరి మట్ట, ఐస్ క్రీం లాంటి చిత్రాల్లో నటించింది. అయితే గాయత్రి గుప్తా హీరోయిన్గా చేయకపోయినప్పటికీ పలు చిత్రాల్లో కనిపించింది. రవితేజ మూవీ అమర్ అక్బర్ ఆంటోనీ, బుర్రకథ, ఐస్‌క్రీమ్-2, దుబాయ్ రిటర్న్, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీతా అన్ ది రోడ్, కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ లాంటి సినిమాలు చేసింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: 'దేవర' తర్వాత జాన్వీని తమిళ్‌కు పరిచయం చేయనున్న టాప్ హీరో) సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే అమ్మడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. తాజాగా గాయత్రి తన ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరి ఇంత బోల్డ్‌గా వీడియో చేయడమేంటని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా బోల్డ్ కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. గతంలో తన బాయ్‌ఫ్రెండ్ తనను మోసం చేశాడని తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. గాయత్రికి గతంలోనే పెళ్లి కాగా.. అతనితో విడాకులు తీసుకుంది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. కాగా.. ప్రస్తుతం జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, రమ్య, విష్ణుప్రియ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన వెబ్ సిరీస్‌లో గాయత్రి గుప్తా నటించింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్‌పామ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. (ఇది చదవండి: జూనియర్ ఎన్టీఆర్ న్యూ లుక్.. అదిరిపోయిందిగా! ) View this post on Instagram A post shared by Gayathri Gupta (@gayathrigupta) -
‘బిగ్‌బాస్’ను వదలను: శ్వేత
సాక్షి, హైదరాబాద్: రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ ప్రసారాలను నిలిపివేసేంత వరకు తన పోరాటం ఆగదని జర్నలిస్టు శ్వేతా రెడ్డి అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నటి గాయత్రి గుప్తా, పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్యతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. సినిమా తరహాలో బిగ్‌బాస్‌లోనూ క్యాస్టింగ్ కౌచ్ జరుగుతోందని ఆరోపించారు. మహిళల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా షోలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తాను చేస్తున్న పోరాటానికి ఇప్పటికే పలు సంఘాల మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వి.హన్మంతరావు కూడా తన పోరాటానికి మద్దతు తెలిపారన్నారు. సినిమా రంగంలో ఎంతో గౌరవం ఉన్న అక్కినేని నాగార్జున ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించడం సరికాదన్నారు. తమిళనాడులో రాజకీయ పార్టీ పెట్టి మార్పులు తీసుకువస్తానని ప్రకటించిన విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా తమిళ బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తుండటం బాధాకరమని వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24, 25 తేదీల్లో తమిళనాడుకు వస్తున్నారని, తమిళనాడుకు చెందిన సామాజిక కార్యకర్త రాజేశ్వరి ప్రియతో ప్రధానిని కలిసి ‘బిగ్‌బాస్’పై వినతిపత్రం సమర్పిస్తామని శ్వేతా రెడ్డి తెలిపారు. ‘బిగ్‌బాస్’ను నిలిపివేయాలని కోరుతూ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలో హైకోర్టును ఆశ్రయించామని, దీనిపై ఈ నెల 29న విచారణ జరుగుతుందని వెల్లడించారు. (చదవండి: ఫస్ట్‌రోజే ఫిట్టింగ్ పెట్టిన బిగ్‌బాస్)