వాళ్లకు కూడా ‘భవానీ వార్డ్‌’ నచ్చుతుంది: దర్శకుడు | Bhavani Ward Movie First Look Launch Highlights | Sakshi
Sakshi News home page

వాళ్లకు కూడా ‘భవానీ వార్డ్‌’ నచ్చుతుంది: దర్శకుడు

Published Tue, Feb 27 2024 5:00 PM | Last Updated on Tue, Feb 27 2024 5:00 PM

Bhavani Ward Movie First Look Launch Highlights - Sakshi

‘భవానీ వార్డ్‌’ హారర్‌ చిత్రం అయినప్పటికీ.. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తెరకెక్కించాను. హారర్‌ సినిమాలు ఇష్టపడేవారికి బాగా నచ్చుతుంది’ అని అన్నారు దర్శకుడు నరసింహ. గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన హారర్, థ్రిల్లర్ మూవీ ‘భవానీ వార్డ్’. అవి క్రియేషన్స్, విభు ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీని కళ్యాణ్ చక్రవర్తి, చంద్రకాంత్ సోలంకి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు మేకర్స్‌.

 ఈ సందర్భంగా  గాయత్రీ గుప్తా మాట్లాడుతూ.. ‘సీనియర్ నటి అంటే కాస్త ఆనందంగా, కాస్త ఇబ్బందిగానూ ఉంటుంది. ఈ చిత్రాన్ని నరసింహా అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన సెట్స్‌పై ఎంతో సరదాగా ఉండేవారు. ఆయన చాలా మంచి దర్శకులు. ఈ చిత్రం టెక్నీకల్‌గా బాగుంటుంది. ఇలాంటి మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చినందుకు థాంక్స్’ అని అన్నారు. ఈ చిత్రంఅఓ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థ్యాంక్స్‌ అని సాయి సతీస్‌, గణేష్‌ రెడ్డి అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement