ఐస్‌క్రీమ్ 2, ఫిదా, మిఠాయి, అమర్ అక్బర్ ఆంటోని, కొబ్బరిమట్ట.. ఇలా అనేక చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది గాయత్రి గుప్తా. అంతకంటే ముందే యాంకర్‌గా, షార్ట్ ఫిలింస్ చేస్తూ కూడా ఫేమస్ అయింది. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌తో పాటు బిగ్‌బాస్ టీమ్‌పై లైంగిక ఆరోపణలతో వార్తల్లోకెక్కింది. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే గాయత్రి చాలాకాలంగా ఓ వ్యాధితో బాధపడుతోంది. తాజాగా ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.
పదేళ్లపాటు బెడ్ రెస్ట్..
గాయత్రి గుప్తా మాట్లాడుతూ.. 'సినిమా ఇండస్ట్రీకి వెళ్తానంటే ఇంట్లో ఒప్పుకోలేదు. పాతికేళ్ల వయసులో ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. నాకు యాంక్లోసింగ్ స్పాండిలైటిస్ అనే వ్యాధి ఉంది. అది ఎందుకు? ఎలా వచ్చిందో అర్థం కాలేదు. పదేళ్లపాటు బెడ్ రెస్ట్ తీసుకున్నాను. ఇది డిప్రెషన్ వల్ల వచ్చే శారీరక వ్యాధి. ఈ విషయం నాకు ఆరు నెలల క్రితం తెలిసింది. చాలామంది డాక్టర్లు నేను ఎక్కువ కాలం బతకనని చెప్పారు. ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం బతకడం కష్టమని మూడేళ్ల కిందట డాక్టర్స్ చెప్పారు.
ఊహ తెలిసినప్పటినుంచి రాత్రిళ్లు నిద్ర లేదు
ఊహ తెలిసినప్పటి నుంచి రాత్రిళ్లు సరిగా పడుకోలేదు. డిప్రెషన్ వల్లే నాకు నిద్ర దూరమైంది. నెలకు రెండు బయాలాజిక్స్ ఇంజక్షన్స్ తీసుకున్నాను. ఇంజక్షన్స్ వేసుకోకపోతే కదలడానికి కూడా కష్టమయ్యేది. అలాగే విపరతీమైన బ్యాక్ పెయిన్ ఉండేది. పెయిన్ కిల్లర్ వేసుకున్న ప్రతిసారి నాకు గుండెదడ వస్తుంది. దాదాపు 10 ఏళ్ల నుంచి తరచూ పెయిన్ కిల్లర్స్ వాడుతూనే ఉన్నాను. డాక్టర్స్ నేను చనిపోతానని చెప్పినప్పుడు ఈ నొప్పి భరించడం కంటే అదే నయం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ బాధ నుంచి నెమ్మదిగా బయటకు వస్తుంటే బతుకుపై ఆశ కలుగుతోంది. సైకాలజీ థెరపీ వచ్చాక ఈ వ్యాధిపై మరింత క్లారిటీ వచ్చింది. సమయానికి పడుకోవడం, యోగా చేయడం.. ఇలా అన్నీ చేస్తున్నాను' అని చెప్పుకొచ్చింది గాయత్రి గుప్త.
చదవండి: ఘనంగా బిగ్‌బాస్ బ్యూటీ కీర్తి నిశ్చితార్థం.. కాలికి పట్టీలు, చేతికి ఉంగరం తొడుగుతూ..
Comments
Please login to add a commentAdd a comment