ప్లీజ్‌ సాయం చేసి కాపాడండి.. దీనస్థితిలో నటి గాయత్రి | Gayathri Gupta Hospitalized Now She Asked Help | Sakshi
Sakshi News home page

Gayathri Gupta: ప్లీజ్‌ సాయం చేసి కాపాడండి.. దీనస్థితిలో నటి గాయత్రి.. స్పందించిన అఖిల్‌

Oct 13 2023 5:03 PM | Updated on Oct 13 2023 6:07 PM

Gayathri Gupta Hospitalized Now She Asked Help - Sakshi

సినిమా ఇండస్ట్రీ అంటే రంగుల ప్రపంచం అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ రంగుల ప్రపంచంలో అందరి జీవితాల్లో వెలుగులు కనిపించవు. సెలబ్రిటీల లైఫ్ అంటేనే లగ్జరీ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కానీ.. అది అందరి జీవితాల్లో ఉండదు. వెండితెరపై ఎంతో సంతోషంగా కనిపించే చాలా మంది నటీ, నటుల జీవితాల్లో ఎన్నో కన్నీళ్లు ఉంటాయి.

ఐస్‌క్రీమ్‌ 2, ఫిదా, మిఠాయి, అమర్‌ అక్బర్‌ ఆంటోని, కొబ్బరిమట్ట.. ఇలా అనేక చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న గాయత్రి గుప్తా జీవితంలో ఎన్నో కన్నీళ్లు ఉన్నాయి. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే గాయత్రి చాలాకాలంగా ఓ వ్యాధితో బాధపడుతోంది. 'ఆర్థరైటిస్‌' జబ్బుతో పోరాడుతున్నట్లు ఆమె గతంలో చెప్పింది. ఇది డిప్రెషన్‌ వల్ల వచ్చే శారీరక వ్యాధని ఆమె చెప్పింది.

అందుకు ట్రీట్‌మెంట్‌ తీసుకుంటే నయం అవతుందని అందుకు సరిపడా డబ్బులు తన వద్దలేవని గాయత్రి బాధపడింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత ఆందోళనగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఒక ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆమె వైద్యానికి రూ. 12 లక్షలు ఖర్చు అవుతుందని ఈ మేరకు ఎవరైనా దాతలు విరాళాలు అందిస్తారేమోనని గాయత్ర గుప్తా ఎదురు చూస్తుంది.

దాతలు సాయం చేయాలంటే
ఇంపాక్ట్ గురు అనే స్వచ్చంద సంస్థ ఈ విరాళాల సేకరణకు ముందుకు వచ్చింది. ఆమె వైద్యానికి రూ. 12 లక్షల ఖర్చు అవుతుండగా.. ఇప్పటి వరకు ఆమెకు కేవలం రూ.1.5 లక్షలు మాత్రమే వచ్చినట్టుగా తెలుస్తోంది. ఆమెకు ఇంకా సుమారుగా రూ. 10 లక్షలకు పైగా డబ్బు కావాల్సి వస్తుంది. ఈ మేరకు బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ తన వంతుగా సాయం చేసినట్టు కనిపిస్తోంది. అంతేకాకుండా త్వరగా కోలుకుంటావని ఆమెకు భరోసా కల్పించాడు. అంతేకాకుండా గాయిత్రికి దాతలు సాయం చేయాలని ఆయన కోరాడు. ఫిదా సినిమాలో సాయిపల్లవి ఫ్రెండ్‌గా కనిపించిన గాయత్రి గుప్తాకు ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ప్రముఖులు సాయం చేస్తారేమో తెలియాల్సి ఉంది.

దయచేసి నాకు సాయం చేయండి: గాయత్రి
నా ఆరోగ్య పరిస్థితి మరింతి ప్రమాదంగా మారింది. దీంతో తక్షణమే నేను ట్రీట్‌మెంట్‌ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది నా జీవితంలో చాల సంక్లిష్టమైన సమయం. నా వైద్యానికి అవసరం అయ్యే డబ్బు నా వద్ద లేదు. దయచేసి నాకు సాయం చేయండి. ఇంపాక్ట్‌గురు. కామ్‌ అనే ఫండింగ్‌ సంస్థ ద్వారా నాకు సాయం చేయండి. మీకు తోచినంత మొత్తాన్ని నా వైద్య ఖర్చులకు ఇస్తారని ఆశిస్తున్నాను. 

ఈ వ్యాఖ్యలతో అవకాశాలకు బ్రేక్‌
టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌తో పాటు బిగ్‌బాస్‌ టీమ్‌పై లైంగిక ఆరోపణలతో గాయిత్రి గుప్తా తెరపైకి వచ్చింది. బిగ్‌బాస్‌ మూడో సీజన్‌కు పోటీదారుగా పాల్గొనేందుకు తనకు ఆసక్తి ఉందా అని ముగ్గురు సభ్యులు తనను సంప్రదించారని.. ఒకవేళ 'బిగ్ బాస్' ఎంపికైతే తమను ఎలా సంతృప్తి పరుస్తారని టీమ్ సభ్యులు అడిగినట్లు గాయత్రి గుప్తా సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా టాలీవుడ్‌లోని పలువురు ప్రముఖులు కూడా తనను ఇబ్బంది పెట్టినట్లు ఆమె బహిరంగంగానే చెప్పింది. దీంతో ఆమెకు ఎవరూ సినిమా అవకాశాలు ఇవ్వలేదని చెప్పవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement