గాయత్రీ గుప్తా, గణేశ్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘భవానీ వార్డ్ 1997’. జీడీ నరసింహా దర్శకత్వంలో జీడీఆర్ మోషన్ పిక్చర్, విభూ మీడియా సమర్పణలో చంద్రకాంత సోలంకి, జీడీ నరసింహా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా హాజరైన నిర్మాత రాజ్ కందుకూరి(Raj Kandukuri ) మాట్లాడుతూ– ‘‘ఇప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలే ఆడుతున్నాయి. చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో కంటెంట్ ఉందని నమ్ముతున్నాను. ఈ మూవీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
‘‘హారర్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ మూవీ నచ్చుతుంది’’ అని పేర్కొన్నారు జీడీ నరసింహా. ‘‘ఈ మూవీలో ప్రతి సీన్‌కి ప్రాధాన్యం ఉంటుంది’’ అని తెలిపారు పూజా కేంద్రే. ‘ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన మా దర్శకుడు జీడీ నరసింహకు థాంక్స్. ట్రైలర్ అందరికీ నచ్చింది. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది. ఫిబ్రవరి 7న మా చిత్రం రాబోతోంది. అందరూ చూడండి’ అని సాయి సతీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ నిస్సీ జస్టిన్, కెమేరామేన్ అరవింద్, గణేశ్ రెడ్డి, పర్వతనేని రాంబాబు, సాయి సతీష్ మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment