పెళ్లికి ముందు అలాంటి రిలేషన్ ఓకేనా?.. హీరోయిన్ కామెంట్స్ వైరల్! | Athulya Ravi Bold Comments On Releationships In Now A Days | Sakshi
Sakshi News home page

Athulya Ravi: పెళ్లికి ముందే ఒకరితో సహజీవనం ఇప్పటి ట్రెండ్‌.. కానీ అదే బెస్ట్..

Published Sun, Sep 10 2023 4:34 PM | Last Updated on Sun, Sep 10 2023 5:14 PM

 Athulya Ravi Bold Comments On Releationships In Now A Days - Sakshi

కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ అతుల్య. 2017లో కాదల్ కన్ కట్టుడే అనే తమిళ సినిమాతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అదే ఏడాదిలోనే కథానాయకన్ చిత్రంలో నటించారు. అంతేకాకుండా కిరణ్ అబ్బవరం నటించిన మీటర్‌ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లోకి రాకముందు అతుల్య పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో సినిమాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ ఏడాదికి మూడు నాలుగు సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతుల్యకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. అదేంటో తెలుసుకుందాం.  

(ఇది చదవండి: ఓ ఇంటివాడు కాబోతున్న మానస్‌.. హల్దీ వేడుకలు షురూ)

ఇంటర్వ్యూలో పాల్గొన్న అతుల్య రవికి కన్యత్వంపై ప్రశ్న ఎదురైంది. వర్జినీటి కోల్పోవడానికి సరైన వయస్సు ఏదని మీరు అనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. దీనికి ఆమె బదులిస్తూ..  'ఈ విషయంలో నా అభిప్రాయం ప్రకారం 21 నుంచి 25 ఏళ్లు వయస్సు కరెక్ట్ అనిపిస్తోంది.'  అని చెప్పింది. ఆ తర్వాత పెళ్లికి ముందు లైంగిక చర్యలో పాల్గొనడం సరైందేనా? లేక పెళ్లి తర్వాత మంచిదా? అని ప్రశ్నించగా.. దీనికి కూడా నటి సూటిగానే స్పందించింది.
 
అతుల్య రవి మాట్లాడుతూ.. "నా అభిప్రాయం ప్రకారమైతే పెళ్లి తర్వాతే లైంగికపరమైన రిలేషన్‌షిప్‌ ఉత్తమం. ఇది మన ఆచార వ్యవహారాలు, సంస్కృతికి అద్దం పడుతోంది. అయితే ప్రస్తుతం లివ్ ఇన్ రిలేషన్ షిప్స్(సహజీవనం) వల్ల ఈ మధ్య కాలంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ జనరేషన్‌లో రిలేషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకరితో రిలేషన్‌లో ఉండడమనేది అది వారి వ్యక్తిగత నిర్ణయం. దీనిపై ఎవరికీ అధికారం లేదు. అయితే వివాహమే అన్నింటికంటే ఉత్తమమైన రిలేషన్ " అని అన్నారు.

(ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్‌ మూవీ, మరో థ్రిల్లర్‌ సిరీస్‌ కూడా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement