meter movie
-
పెళ్లికి ముందు అలాంటి రిలేషన్ ఓకేనా?.. హీరోయిన్ కామెంట్స్ వైరల్!
కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ అతుల్య. 2017లో కాదల్ కన్ కట్టుడే అనే తమిళ సినిమాతో కోలీవుడ్లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అదే ఏడాదిలోనే కథానాయకన్ చిత్రంలో నటించారు. అంతేకాకుండా కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లోకి రాకముందు అతుల్య పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. ప్రస్తుతం కోలీవుడ్‌లో సినిమాలతో బిజీగా ఉన్న ముద్దుగుమ్మ ఏడాదికి మూడు నాలుగు సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతుల్యకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: ఓ ఇంటివాడు కాబోతున్న మానస్.. హల్దీ వేడుకలు షురూ) ఇంటర్వ్యూలో పాల్గొన్న అతుల్య రవికి కన్యత్వంపై ప్రశ్న ఎదురైంది. వర్జినీటి కోల్పోవడానికి సరైన వయస్సు ఏదని మీరు అనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. దీనికి ఆమె బదులిస్తూ.. 'ఈ విషయంలో నా అభిప్రాయం ప్రకారం 21 నుంచి 25 ఏళ్లు వయస్సు కరెక్ట్ అనిపిస్తోంది.' అని చెప్పింది. ఆ తర్వాత పెళ్లికి ముందు లైంగిక చర్యలో పాల్గొనడం సరైందేనా? లేక పెళ్లి తర్వాత మంచిదా? అని ప్రశ్నించగా.. దీనికి కూడా నటి సూటిగానే స్పందించింది. అతుల్య రవి మాట్లాడుతూ.. "నా అభిప్రాయం ప్రకారమైతే పెళ్లి తర్వాతే లైంగికపరమైన రిలేషన్షిప్ ఉత్తమం. ఇది మన ఆచార వ్యవహారాలు, సంస్కృతికి అద్దం పడుతోంది. అయితే ప్రస్తుతం లివ్ ఇన్ రిలేషన్ షిప్స్(సహజీవనం) వల్ల ఈ మధ్య కాలంలో చాలా మార్పులు వచ్చాయి. ఈ జనరేషన్లో రిలేషన్స్ కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకరితో రిలేషన్లో ఉండడమనేది అది వారి వ్యక్తిగత నిర్ణయం. దీనిపై ఎవరికీ అధికారం లేదు. అయితే వివాహమే అన్నింటికంటే ఉత్తమమైన రిలేషన్ " అని అన్నారు. (ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్ మూవీ, మరో థ్రిల్లర్ సిరీస్ కూడా!) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) -
ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలివే!
ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఓటీటీలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ప్రతి వారం కొత్త సినిమాలు విడుదలవుతున్నా థియేటర్ల కంటే ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నారు. అసలే సమ్మర్ హాలీడేస్ కావడంతో కుటుంబమంతా ఇంట్లో కూర్చుని ఎంచక్కా సినిమాలు చూసేస్తున్నారు. అలాంటి సినీ ప్రియుల కోసమ సరికొత్త సినిమాలు ఓటీటీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ చిత్రాలేలో ఓ లుక్కేద్దాం. 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' లవ్ స్టోరీ ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత నాగశౌర్య, శ్రీనివాస అవసరాల కాంబినేష్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. మార్చి 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మే 5వ తేదీ నుంచి సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కిరణ్ అబ్బవరం మీటర్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన చిత్రం మీటర్. రమేష్ కాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా అతుల్య రవి నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా కిరణ్ అబ్బవరం పోలీస్ పాత్రలో కనిపించారు. ఈ మూవీ ఏప్రిల్ 7న విడుదల కాగా.. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో మే 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 16 ఆగస్టు 1947’న ఏం జరిగింది? గౌతమ్ కార్తీక్ హీరోగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ సమర్పణలో రూపొందించిన చిత్రం 'ఆగస్టు 16.. 1947'. ఈ చిత్రంలో రేవతి శర్మ, పుగాజ్, రిచర్డ్ ఆష్టన్, జాసన్ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 14న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. టెంట్ కొట్ట ఓటీటీ ఫ్లాట్‌ఫాం వేదికగా మే 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే వెబ్ సిరీస్‌లు/ చిత్రాలివే నెట్‌ఫ్లిక్స్ శాంక్చురీ - మే 4 ది లార్వా ఫ్యామిలీ-యామినేషన్- మే 4 తూ ఝూటీ మై మక్కార్ -హిందీ- మే 5 3-తెలుగు- మే 5 అమృతం చందమామలో -తెలుగు- మే 5 యోగి -తెలుగు- మే5 రౌడీ ఫెలో -తెలుగు- మే 5 తమ్ముడు -తెలుగు- మే 5 జీ 5 ఫైర్ ఫ్లైస్ -హిందీ సిరీస్- మే 5 షెభాష్ ఫెలూద -బెంగాలీ- మే 5 డిస్నీప్లస్ హాట్‌స్టార్ కరోనా పేపర్స్ -మలయాళ మూవీ- మే 5 సాస్ బహూ ఔర్ ఫ్లమింగో -హిందీ- మే 5 -
అప్పుడే ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం మీటర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ మీటర్. రమేష్ కాడూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. రిలీజ్‌కు ముందు మాంచి హైప్ క్రియేట్ చేసినా బాక్సాఫీస్ వద్ద రిజల్ట్ మాత్రం తారుమారు అయ్యింది. చదవండి: కొడుకుపై ట్రోలింగ్.. తొలిసారి రియాక్ట్ అయిన అమల అక్కినేని ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుంది. మే 5 నుంచి మీరట్ మూవీ ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ లెక్కన సినిమా విడుదలైన నాలుగు వారాల్లోనే మీటర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది. కిరణ్ అబ్బవరంకు జోడీగా కోలీవుడ్ బ్యూటీ అతుల్య రవి నటించింది. కాగా కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే.. ఓ మల్టీస్టారర్ మూవీలో ఆయన నటించనున్నట్లు తెలుస్తుంది. దీంతో పాటు మరో మూడు మరో మూడు భారీ ప్రాజెక్టుల్లో నటించనున్నారు కిరణ్. చదవండి: ‘ఏజెంట్’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..? -
‘మీటర్’ మూవీ ఓటీటీ పార్ట్నర్ ఇదే! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే
యంగ్ టాలంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ మీటర్. రివేంజ్ డ్రామాతో కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈసినిమా శుక్రవారం(ఏప్రిల్ 7న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రమేష్ కదూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంకు జోడిగా అతుల్యా రవి హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించారు. థియేటర్లో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనను అందుకుంటోంది. రొటీన్ రివెంజ్ ఫార్ములా ఉందంటూ ఓ వర్గం ప్రేక్షకులు సినిమాపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ అనంతరం రెండు నెలల తర్వాతే ఏ చిత్రమైన ఓటీటీలోకి వస్తుంది. ఈ లెక్కన మే మొదటి వారంలో మీటర్ ఓటీటీకు రానుంది. కానీ ఈ మధ్య సినిమా ఫలితాన్ని బట్టి డిజిటల్లో రిలీజ్ చేస్తున్నారు. కొన్ని సినిమాలైతే విడుదలైన నెల రోజులకే ఓటీటీ బాటపడుతున్నాయి. మరి మీటర్ మూవీ ఎప్పుడు ఓటీటీకి వస్తుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. మీటర్ కథేమిటంటే... ఇష్టం లేకపోయినా తండ్రి కోరిక మేరకు పోలీస్ జాబ్‌లో(ఎస్ఐగా) జాయిన్ అవుతాడు అర్జున్ కళ్యాణ్ (కిరణ్ అబ్బవరం). అయితే ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టే అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. ఎలక్షన్స్‌లో గెలిచి తిరిగి అధికారం చేపట్టేందుకు హోమ్ మినిస్టర్ బైరెడ్డి వేసిన ఓ ప్లాన్ కారణంగా అర్జున్ కళ్యాణ్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనే పాయింట్‌తో రమేష్ కదూరి మీటర్ సినిమాను రూపొందించారు. -
Meter Movie Review: 'మీటర్' మూవీ రివ్యూ
టైటిల్: మీటర్ నటీనటులు: కిరణ్ అబ్బవరం, అతుల్య రవి, పోసాని కృష్ణమురళి, సప్తగిరి, ధనుష్ పవన్ నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు :చిరంజీవి ( చెర్రీ), హేమలత పెదమల్లు దర్శకుడు : రమేష్ కడూరి సంగీతం : సాయి కార్తీక్ సినిమాటోగ్రఫీ: వెంకట్ సి దిలీప్ ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ విడుదల తేది: ఏప్రిల్ 07, 2023 టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. 2019లో రాజావారు రాణిగారు చిత్రంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు కిరణ్. ఇటీవలే వినరో భాగ్యము విష్ణుకథ అంటూ అలరించిన ఈ యంగ్ హీరో మరోసారి 'మీటర్'తో ఆడియన్స్‌ను అలరించేందుకు వచ్చాడు. కిరణ్ అబ్బవరం, అతుల్య రవి జంటగా నటించిన 'మీటర్' ఏప్రిల్ 7న థియేటర్లలో రిలీజైంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై దర్శకుడు రమేశ్ కడూరి తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే.. అర్జున్ కల్యాణ్( కిరణ్ అబ్బవరం) తండ్రి ఓ కానిస్టేబుల్. వెంకటరత్నం కానిస్టేబుల్‌గా ఎంతో నిజాయితీగా పనిచేస్తుంటాడు. అందువల్ల డిపార్ట్మెంట్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటాడు. తన కుమారున్ని ఎప్పటికైనా ఎస్సైగా చూడాలనేదే ఆయన కోరిక. కానీ హీరోకు పోలీస్ జాబ్ చేయడం ఇష్టముండదు. కానీ అనూహ్యంగా ఎస్సై జాబ్‌కు సెలెక్ట్ అయి ఉద్యోగంలో చేరుతాడు. ఎప్పుడెప్పుడు జాబ్ మానేయాలా? అని ఎదురుచూసే అర్జున్‌కు ఊహించని విధంగా మంచి పోలీస్ అధికారిగా గుర్తింపు వస్తుంది. అదే సమయంలో అబ్బాయిలంటేనే ఇష్టం లేని అతుల్య రవితో అతడికి పరిచయం ఏర్పడుతుంది. అబ్బాయిలంటేనే గిట్టని అమ్మాయిని మన హీరో ఎలా పడగొట్టాడు?ఇష్టంలేని పోలీస్ జాబ్‌లో కొనసాగాడా? హోం మినిస్టర్ కంఠం బైరెడ్డి (ధనుశ్ పవన్)తో హీరోకు వివాదం ఎందుకు మొదలైంది? హోం మినిస్టర్‌తో ఉన్న వివాదం నుంచి అర్జున్ కల్యాణ్ ఎలా బయటపడ్డాడు? మరి చివరికి తండ్రి ఆశయాన్ని హీరో నెరవేర్చాడా? లేదా? అన్నదే అసలు కథ. కథనం ఎలా సాగిందంటే.. కథ విషయానికొస్తే హీరో బాల్యంతో కథ మొదలవుతుంది. చిన్నతనంలోనే ఎస్సై కావాలన్న తండ్రి కోరికను కాదనలేడు.. అలా అని ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు. ఈ రెండింటి మధ్యలో హీరో నలిగిపోతుంటాడు. ఇష్టం లేకపోయినా ఎస్సై కావడం, ఆ మధ్యలో హీరోయిన్ అతుల్య రవితో పరిచయం రొటీన్‌గా అనిపిస్తుంది. పోలీస్ కమిషనర్‌గా పోసాని కృష్ణమురళి, హీరోకు మామగా సప్తగిరి కామెడీ ఫస్ట్ హాఫ్‌లో నవ్వులు పూయిస్తాయి. హోం మినిస్టర్ కంఠం బైరెడ్డితో అర్జున్ కల్యాణ్‌కు వివాదం రొడ్డకొట్టుడులా అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్‌కు ముందు ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. అలా ఫస్టాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్‌లో కథను అదే కోణంలో తీసుకెళ్లాడు డైరెక్టర్ రమేశ్. కథలో ఏమాత్రం కొత్తదనం చూపించలేదు. హీరోకు, విలన్‌కు మధ్య సీన్స్ సాదాసీదాగా ఉంటాయి. క్లాస్‌కు భిన్నంగా కిరణ్ అబ్బవరాన్ని మాస్‌గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అలాగే తండ్రి, కుమారుల మధ్య ఎమోషనల్ ఎలిమెంట్స్ కాస్త పర్వాలేదనిపించేలా ఉన్నాయి. ఎలాగైనా సరే మళ్లీ అధికారంలోకి రావాలన్న హోంమినిస్టర్ కంఠం బైరెడ్డితో.. హీరో మధ్య జరిగే సన్నివేశాల చుట్టే కథ మొత్తం తిరుగుతుంది. క్లైమాక్స్ కూడా ఆడియన్స్‌కు అంతగా కనెక్ట్ కాలేదు. కథలో చాలా సన్నివేశాలు లాజిక్ లెస్‌గా అనిపిస్తాయి. కిరణ్ అబ్బవరం డైలాగ్ డెలివరీతో పర్వాలేదనిపించాడు. కామెడీ సన్నివేశాల పరంగా డైరెక్టర్ ఓకే అనిపించాడు. పక్కా కమర్షియల్ మూవీ అయినా ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు విఫలమైనట్లు కనిపిస్తోంది. ఎవరెలా చేశారంటే.. హీరో కిరణ్ అబ్బవరం క్లాస్‌కు భిన్నంగా ప్రయత్నించాడు. మాస్ యాక్షన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అతుల్య రవి తన గ్లామర్, పాటలతో అదరగొట్టింది. సప్తగిరి తన కామెడీతో మరోసారి అలరించాడు. పోసాని కృష్ణమురళి పోలీస్ కమిషనర్ పాత్రలో కామెడీ చేస్తూ అదరగొట్టాడె. విలన్‌గా ధనుశ్ పవన్ ఫర్వాలేదనిపించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు బాగానే చేశారు. దర్శకుడు రమేశ్ కథపై మరింత దృష్టి పెట్టాల్సింది. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గుట్టుగా ఉన్నాయి. సాయి కార్తీక్ సంగీతం పర్వాలేదు. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ కార్తీక శ్రీనివాస్ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. -
నాని దసరా ..కిరణ్ అబ్బవరం మీటర్ ..పబ్లిక్ టాక్ మాములుగా లేదు
-
మీటర్ మూవీ పబ్లిక్ టాక్
-
సిల్వర్ స్క్రీన్ మీదకు మరో షార్ట్ ఫిల్మ్ హీరో
మీటర్ సినిమాతో తన కల నెరవేరిందంటున్నాడు నటుడు కుమార్ కాసారం. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘మీటర్’ సినిమాలో కుమార్ కాసారంకు మంచి పాత్ర లభించింది. యూట్యూబ్‌లో కుమార్ షార్ట్ ఫిల్మ్ చూసి ఇంప్రెస్ అవ్వడంతో దర్శకుడు రమేశ్ ‘మీటర్’లో నటించే అవకాశం ఇచ్చారట. ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో కిరణ్ మాట్లాడుతూ.. కుమార్ కాసారంపై ప్రశంసలు కురించాడు. అతనితో కలిసి చేసిన షార్ట్ ఫిల్మ్ జర్నీని గుర్తు చేసుకుంటూ.. కుమార్ చాలా ప్రతిభావంతుడని కితాబిచ్చాడు. ‘మీటర్’ ప్రిరిలీజ్ తర్వాత తనకు వరుస ఆఫర్లు వస్తున్నాయని కుమార్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే హీరోగా ఓ చిత్రాన్ని పూర్తి చేశానని.. త్వరలోనే ఓ కొత్త బ్యానర్లో మరో చిత్రాన్ని చేయబోతున్నట్లు వెల్లడించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన ‘కుమార్ కాసారం’కు చిన్నప్పటి నుంచి సినిమాలంటే మక్కువ. బీటెక్ పూర్తి చేసిన తర్వాత సాఫ్ట్ వేర్ కంపెనీ లో పనిచేస్తూ షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేయడం మొదలుపెట్టారు. అయినప్పటికీ, సినిమాలపై అతని ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు. సినిమా పరిశ్రమలో వృత్తిని కొనసాగించడానికి తన ఉద్యోగాన్ని సైతం విడిచిపెట్టాడు. మజిలీ, ఓ బేబీ, సర్ & కొండ వంటి సినిమాల్లో యాక్టర్ గా నిడివి తక్కువ ఉన్నప్పటికీ ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు సైన్ చేస్తున్నాడు. మరి షార్ట్ ఫిల్మ్ హీరో సిల్వర్ స్క్రీన్‌పై ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. -
హీరోయిన్ ఫోన్ నెంబర్ చెప్పి ఒక ఆట ఆడుకున్న సప్తగిరి
-
హీరోయిన్ ఫోన్ నెంబర్ చెప్పి ఒక ఆట ఆడుకున్న సప్తగిరి
-
రవితేజ, నానీగార్ల తర్వాత కిరణ్ అబ్బవరమే: గోపిచంద్ మలినేని
‘రవితేజ, నానీగార్ల తర్వాత ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు కిరణ్. అతని ప్రధాన బలం సహజమైన నటన, డైలాగ్ డెలివరీ. ‘మీటర్’తో తనకి మాస్ హిట్ రావాలి’’ అని డైరెక్టర్ గోపీచంద్ మలినేని అన్నారు. కిరణ్ అబ్బవరం, అతుల్యా రవి జంటగా రమేష్ కడూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘మీటర్’. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘అసలు సిసలైన కమర్షియల్ ఎంటర్టైనర్ ‘మీటర్’. రమేష్‌గారు ఈ సినిమాలో నన్ను వైవిధ్యంగా చూపించారు. ఏప్రిల్ 7న మీటర్లు బ్లాస్ట్ అవుతాయి.. నన్ను నమ్మండి’’ అన్నారు. ‘‘మీటర్’ ప్రీమియర్ చూశాను.. చాలా బావుంది. ఈ వేసవిలో మంచి కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ ఇది’’ అన్నారు నవీన్ యెర్నేని. ‘‘ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. ‘‘ఈ సినిమా ఫుల్ మీల్స్‌లా ఉంటుంది’’ అన్నారు రమేష్ కడూరి. -
బుచ్చిబాబు,రామ్ చరణ్ సినిమా పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం
-
కిరణ్ అబ్బవరం కెరీర్లో అత్యధిక బడ్జెట్ మూవీ ‘మీటర్’: చెర్రీ
‘‘కథ పరంగా ‘మీటర్’ సినిమా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మంచి కథని ప్రయోగాత్మకంగా చెప్పొచ్చు.. కమర్షియల్‌గా కూడా చూపించొచ్చు. డైరెక్టర్లు బాబీ, గోపీచంద్ మలినేని వద్ద పని చేసిన అనుభవంతో దర్శకుడు రమేష్ ‘మీటర్’ని కమర్షియల్ ఎంటర్టైనర్గా చక్కగా తీశాడు’’ అని నిర్మాత చిరంజీవి (చెర్రీ) అన్నారు. కిరణ్ అబ్బవరం, అతుల్యా రవి జంటగా రమేష్ కడూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘మీటర్’. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిరంజీవి (చెర్రీ) మాట్లాడుతూ– ‘‘మా క్లాప్ ఎంటర్టైన్మెంట్లో ‘ఒక్కడున్నాడు, మత్తు వదలరా, హ్యాపీ బర్త్ డే’ వంటి ప్రయోగాత్మక చిత్రాలు తీశాం. తొలిసారి కమర్షియల్ ఎంటర్టైనర్ చేస్తే బాగుంటుందని ‘మీటర్’ చేశాం. చాలా బలమైన కథతో రమేష్ ఈ సినిమాని తీశాడు. ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’ చూసి కిరణ్‌ని ‘మీటర్’కి తీసుకున్నాం. ఏ పాత్ర అయినా చేయగల సత్తా ఉన్న నటుడు కిరణ్. తన కెరీర్లో అత్యధిక బడ్జెట్ మూవీ ఇది. ప్రయోగాత్మక చిత్రాలకు మంచి పేరు రావచ్చు కానీ డబ్బులు రావు. ‘మీటర్’ లాంటి మూవీస్‌కి సినిమా బావుందంటే మాత్రం బాక్సాఫీస్ కలెక్షన్స్ బెటర్‌గా ఉండే అవకాశం ఉంటుంది. ఓటీటీల ప్రభావం థియేటర్స్పై పెద్దగా ఉండదు. సినిమా బావుంది అంటే తప్పకుండా థియేటర్లకి వెళతారు. ఇందుకు ఉదాహరణ ఇటీవల రిలీజైన ‘వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య’. చిన్న సినిమాలకు స్కోప్ లేదని నేనెప్పుడూ అనుకోలేదు. మంచి కథ కుదిరితే మళ్లీ ప్రయోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం రితేష్ రానా దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్నాం. అలాగే ఓ కొత్త దర్శకుడితో మరో సినిమా ఉంటుంది’’ అన్నారు. -
'అడ్డేలేదు.. అడ్డాలేదు'.. ఆసక్తిగా పెంచుతోన్న టైటిల్ సాంగ్
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. తాజాగా ఆయన మీటర్ అనే సినిమాతో మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యారు. రమేష్ కాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. యంగ్ హీరోయిన్ అతుల్య రవి జోడీగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా కిరణ్ అబ్బవరం పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. 'అడ్డేలేదు.. అడ్డాలేదు.. పడిలేచాడో ఉప్పెనలా ఒడ్డేలేదు' అంటూ సాగే లిరికల్ సాంగ్ ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ సాంగ్‌ను జనగామ డీసీపీ సీతారాం చేతులమీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కిరణ్ అబ్బవరం, అతల్యరవి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కాగా.. ఈ మూవీ ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది చిత్ర బృందం. ఇప్పటికే రిలీజైన మూవీ ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తి పెంచింది. ఈ చిత్రంలో లవ్, రొమాన్స్, కామెడీ, పైట్స్‌తో ఫుల్ ఎంటర్టైన్ ఇవ్వబోతున్నాడని అర్థమవుతోంది. కిరణ్ అబ్బవరం కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇది. ఈ చిత్రానికి సాయి కార్తిక్ సంగీతం అందించాడు. -
'మీటర్'కు అనుకున్నదానికంటే ఎక్కువే బడ్జెట్ అయ్యింది : డైరెక్టర్
‘మీటర్’ మంచి ఎంటర్టైనర్. తండ్రీ కొడుకుల మధ్య మంచి ఎమోషన్ ఉంటుంది. సినిమా అంతా ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది’’ అని డైరెక్టర్ రమేష్ కడూరి అన్నారు. కిరణ్ అబ్బవరం, అతుల్యా రవి జంటగా రూపొందిన చిత్రం ‘మీటర్’. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదలకానుంది. ఈ సందర్భంగా రమేష్ కడూరి మాట్లాడుతూ– ‘‘నాది విజయనగరం జిల్లా గరివిడి మండలం. దర్శకులు బాబీ, గోపీచంద్ మలినేనిగార్ల వద్ద సహాయ దర్శకుడిగా చేశాను. ‘మీటర్’తో దర్శకుడిగా పరిచయమవుతున్నాను. కరోనా లాక్ డౌన్ తర్వాత ‘మీటర్’ ఓకే అయ్యింది. ఈ మూవీలో కిరణ్ వైవిధ్యమైన పోలీసాఫీసర్ పాత్ర చేశారు. సెకండాఫ్‌లో ఓ పది నిమిషాలు ఆయన పాత్ర సీరియస్‌గా ఉంటుంది. ఆ పది నిముషాలు థియేటర్లో రఫ్ఫాడిస్తాడు. ఈ సినిమాకి సాయి కార్తీక్ నెక్ట్స్ లెవల్ మ్యూజిక్ ఇచ్చాడు. అనుకున్నదానికంటే బడ్జెట్ ఎక్కువైనా వెనకడుగు వేయని చెర్రీ, రవిశంకర్, నవీన్‌గార్లకు రుణపడి ఉంటాను’’ అన్నారు. – రమేష్ కడూరి -
ఔట్ అండ్ ఔట్ యాక్షన్‌తో మీటర్ ట్రైలర్.. దుమ్ములేపిన కిరణ్ అబ్బవరం
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. తాజాగా ఆయన మీటర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రమేష్ కాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా యంగ్ హీరోయిన్ అతుల్య రవి ఇందులో నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా కిరణ్ అబ్బవరం పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేసింది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సీక్వెన్స్ ట్రైలర్ ఆసక్తిగా మలిచారు. ఈ ట్రైలర్ చూస్తుంటే కిరణ్ అబ్బవరం ఈసారి లవ్, రొమాన్స్, కామెడీ, పైట్స్‌తో ఫుల్ ఎంటర్టైన్ ఇవ్వబోతున్నాడని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. ఇందులోనిపవర్ ఫుల్ డైలాగ్స్ అయితే బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘భగవంతుడి ముందు భక్తితోను .. బలవంతుడి ముందు భయంతోను ఉండాలి’ అనే డైలాగ్ ట్రైలర్ కి హైలైట్‌గా నిలిచింది. కాగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. కిరణ్ అబ్బవరం కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇది. ఈ చిత్రానికి సాయి కార్తిక్ సంగీతం అందించాడు. ఇందులో కిరణ్ సరసన అతుల్యా రవి కథానాయికగా నటించింది. -
ఇంత అభిమానం ఊహించలేదు: అతుల్యా రవి
‘‘మీటర్’ పక్కా కమర్షియల్ మూవీ. పాటలు, డ్యాన్సులు, మాస్ ఫైట్స్, రొమాన్స్, లవ్.. ఇలా అన్ని అంశాలుంటాయి. తండ్రి సెంటిమెంట్ కీలకంగా ఉంటుంది’’ అని హీరోయిన్ అతుల్యా రవి అన్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా రమేష్ కడూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మీటర్’. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా అతుల్యా రవి మాట్లాడుతూ– ‘‘తమిళంలో చాలా సినిమాల్లో నటించాను. తెలుగు పరిశ్రమలోకి రావాలని కోరుకున్నాను. దేవుడి దయ వల్ల మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌లాంటి ప్రముఖ సంస్థలు నిర్మించిన ‘మీటర్’లో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో అబ్బాయిలంటే ఇష్టం లేని పాత్రలో కనిపిస్తాను. అయితే నా పాత్ర ఫస్ట్ హాఫ్‌లో కామెడీగా ఉంటుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకులు చూపిస్తున్న అభిమానానికి హ్యాపీగా ఉంది.. ఇంత అభిమానం ఊహించలేదు. ప్రస్తుతం తమిళ్లో ‘డీజిల్’ సినిమా చేస్తున్నాను’’ అన్నారు.