'అడ్డేలేదు.. అడ్డాలేదు'.. ఆసక్తిగా పెంచుతోన్న టైటిల్ సాంగ్ | Kiran Abbavaram Meter Movie Title Song Out Now | Sakshi
Sakshi News home page

Meter Movie: 'మీటర్‌'కు అడ్డేలేదంటున్న కిరణ్ అబ్బవరం.. టైటిల్ సాంగ్ రిలీజ్

Published Tue, Apr 4 2023 7:48 PM | Last Updated on Tue, Apr 4 2023 7:50 PM

Kiran Abbavaram Meter Movie Title Song Out Now - Sakshi

హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం. తాజాగా ఆయన మీటర్‌ అనే సినిమాతో మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యారు. రమేష్ కాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. యంగ్‌ హీరోయిన్‌ అతుల్య రవి జోడీగా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా కిరణ్‌ అబ్బవరం పోలీస్‌ పాత్రలో నటిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ సాంగ్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. 'అడ్డేలేదు.. అడ్డాలేదు.. పడిలేచాడో ఉప్పెనలా ఒడ్డేలేదు' అంటూ సాగే లిరికల్ సాంగ్‌ ఈ చిత్రంపై మరింత ఆసక్తి పెంచుతోంది. ఈ సాంగ్‌ను జనగామ డీసీపీ సీతారాం చేతులమీదుగా విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కిరణ్ అబ్బవరం, అతల్యరవి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

కాగా.. ఈ మూవీ ఏప్రిల్‌ 7న విడుదల కాబోతోంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది చిత్ర బృందం. ఇప్పటికే రిలీజైన మూవీ ట్రైలర్‌ సినిమాపై మరింత ఆసక్తి పెంచింది. ఈ చిత్రంలో లవ్‌, రొమాన్స్‌, కామెడీ, పైట్స్‌తో ఫుల్‌ ఎంటర్‌టైన్‌ ఇవ్వబోతున్నాడని అర్థమవుతోంది. కిరణ్‌ అబ్బవరం కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇది. ఈ చిత్రానికి సాయి కార్తిక్‌ సంగీతం అందించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement