ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఓటీటీలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ప్రతి వారం కొత్త సినిమాలు విడుదలవుతున్నా థియేటర్ల కంటే ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నారు. అసలే సమ్మర్ హాలీడేస్ కావడంతో కుటుంబమంతా ఇంట్లో కూర్చుని ఎంచక్కా సినిమాలు చూసేస్తున్నారు. అలాంటి సినీ ప్రియుల కోసమ సరికొత్త సినిమాలు ఓటీటీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ చిత్రాలేలో ఓ లుక్కేద్దాం.
'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' లవ్ స్టోరీ
ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత నాగశౌర్య, శ్రీనివాస అవసరాల కాంబినేష్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. మార్చి 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మే 5వ తేదీ నుంచి సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.
కిరణ్ అబ్బవరం మీటర్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన చిత్రం మీటర్. రమేష్ కాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా అతుల్య రవి నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా కిరణ్ అబ్బవరం పోలీస్ పాత్రలో కనిపించారు. ఈ మూవీ ఏప్రిల్ 7న విడుదల కాగా.. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో మే 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
16 ఆగస్టు 1947’న ఏం జరిగింది?
గౌతమ్ కార్తీక్ హీరోగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ సమర్పణలో రూపొందించిన చిత్రం 'ఆగస్టు 16.. 1947'. ఈ చిత్రంలో రేవతి శర్మ, పుగాజ్, రిచర్డ్ ఆష్టన్, జాసన్ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 14న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. టెంట్ కొట్ట ఓటీటీ ఫ్లాట్‌ఫాం వేదికగా మే 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే వెబ్ సిరీస్‌లు/ చిత్రాలివే
నెట్‌ఫ్లిక్స్
శాంక్చురీ - మే 4
ది లార్వా ఫ్యామిలీ-యామినేషన్- మే 4
తూ ఝూటీ మై మక్కార్ -హిందీ- మే 5
3-తెలుగు- మే 5
అమృతం చందమామలో -తెలుగు- మే 5
యోగి -తెలుగు- మే5
రౌడీ ఫెలో -తెలుగు- మే 5
తమ్ముడు -తెలుగు- మే 5
జీ 5
ఫైర్ ఫ్లైస్ -హిందీ సిరీస్- మే 5
షెభాష్ ఫెలూద -బెంగాలీ- మే 5
డిస్నీప్లస్ హాట్‌స్టార్
కరోనా పేపర్స్ -మలయాళ మూవీ- మే 5
సాస్ బహూ ఔర్ ఫ్లమింగో -హిందీ- మే 5
Comments
Please login to add a commentAdd a comment