Phalana Abbayi Phalana Ammayi Movie
-
ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలివే!
ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఓటీటీలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. ప్రతి వారం కొత్త సినిమాలు విడుదలవుతున్నా థియేటర్ల కంటే ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నారు. అసలే సమ్మర్ హాలీడేస్ కావడంతో కుటుంబమంతా ఇంట్లో కూర్చుని ఎంచక్కా సినిమాలు చూసేస్తున్నారు. అలాంటి సినీ ప్రియుల కోసమ సరికొత్త సినిమాలు ఓటీటీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ చిత్రాలేలో ఓ లుక్కేద్దాం. 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' లవ్ స్టోరీ ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత నాగశౌర్య, శ్రీనివాస అవసరాల కాంబినేష్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. మార్చి 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం మే 5వ తేదీ నుంచి సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కిరణ్ అబ్బవరం మీటర్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన చిత్రం మీటర్. రమేష్ కాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా అతుల్య రవి నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా కిరణ్ అబ్బవరం పోలీస్ పాత్రలో కనిపించారు. ఈ మూవీ ఏప్రిల్ 7న విడుదల కాగా.. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో మే 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 16 ఆగస్టు 1947’న ఏం జరిగింది? గౌతమ్ కార్తీక్ హీరోగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ సమర్పణలో రూపొందించిన చిత్రం 'ఆగస్టు 16.. 1947'. ఈ చిత్రంలో రేవతి శర్మ, పుగాజ్, రిచర్డ్ ఆష్టన్, జాసన్ షా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 14న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. టెంట్ కొట్ట ఓటీటీ ఫ్లాట్‌ఫాం వేదికగా మే 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే వెబ్ సిరీస్‌లు/ చిత్రాలివే నెట్‌ఫ్లిక్స్ శాంక్చురీ - మే 4 ది లార్వా ఫ్యామిలీ-యామినేషన్- మే 4 తూ ఝూటీ మై మక్కార్ -హిందీ- మే 5 3-తెలుగు- మే 5 అమృతం చందమామలో -తెలుగు- మే 5 యోగి -తెలుగు- మే5 రౌడీ ఫెలో -తెలుగు- మే 5 తమ్ముడు -తెలుగు- మే 5 జీ 5 ఫైర్ ఫ్లైస్ -హిందీ సిరీస్- మే 5 షెభాష్ ఫెలూద -బెంగాలీ- మే 5 డిస్నీప్లస్ హాట్‌స్టార్ కరోనా పేపర్స్ -మలయాళ మూవీ- మే 5 సాస్ బహూ ఔర్ ఫ్లమింగో -హిందీ- మే 5 -
పలానా అబ్బాయి పలానా అమ్మాయి మూవీ పబ్లిక్ టాక్ వీడియో
-
PAPA Review: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' రివ్యూ
టైటిల్: 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' నటీనటులు - నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య తదితరులు నిర్మాణ సంస్థలు : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి దర్శకుడు: శ్రీనివాస్ అవసరాల సంగీతం: కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్(కాఫీఫై సాంగ్) సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామ ఎడిటర్ : కిరణ్ గంటి విడుదల తేది: మార్చి 17, 2023 Rating: 2.5/5 Phalana Abbayi Phalana Ammayi Review: 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత నాగశౌర్య, శ్రీనివాస అవరాల కాంబినేష్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(మార్చి 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2000 నుంచి 2010 మధ్యకాలంలో సాగుతుంది. బీటెక్‌లో జాయిన్ అయిన సంజయ్‌ని సీనియర్స్ ర్యాగింగ్ చేస్తుంటే.. అతన్ని సేవ్ చేస్తుంది అనుపమ(మాళవికా నాయర్). అప్పటి నుంచి ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. ఇక ఎంఎస్ కోసం ఇద్దరు కలిసి యూకేకి వెళ్తారు. అక్కడ ఇద్దరు ప్రేమలో పడతారు. సహజీవనం కూడా చేస్తారు. ఎంఎస్ పూర్తవ్వగానే అనుపమకు వేరే సిటీలో ఉద్యోగం వస్తుంది. తనకు చెప్పకుండా ఉద్యోగానికి అప్లై చేసిందని అనుపమపై కోపంగా ఉంటాడు సంజయ్. అదే సమయంలో అతనికి పూజ(మేఘా చౌదరి)దగ్గరవుతుంది. ఆమె కారణంగా సంజయ్, అనుపమల మధ్య దూరం పెరుగుతుంది. ఇద్దరు విడిపోతారు. కొన్నాళ్ల తర్వాత అనుకోకుండా ఇద్దరు కలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? పూజ ప్రేమను సంజయ్ అంగీకరించాడా? అనుపమ జీవితంలోకి గిరి(అవసరాల శ్రీనివాస్) ఎలా వచ్చాడు? చివరికి సంజయ్, అనుపమలు కలిశారా? లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. సినిమా భాషలో కాంబినేషన్ అనే మాటకి విలువెక్కువ. ఓ హీరో, డైరెక్టర్ కలిసి చేసిన సినిమా హిట్ అయితే.. అదే కాంబోలో వస్తున్న కొత్త చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడటం సహజం. కానీ ఆ అంచనాలను దర్శకుడు అవసరాల శ్రీనివాస్ నిలబెట్టుకోలేకపోయాడు. ‘ఉహాలు గుస గుస లాడే , జ్యో అచ్యుతానంద’ బ్లాక్‌బస్టర్స్ తర్వాత నాగశౌర్యతో కలిసి చేసిన హ్యాట్రిక్ మూవీ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ఆ స్థాయిలో ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. కథలో చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఎలాంటి ట్విస్టులు లేకుండా చాలా రొటీన్‌గా కథనం సాగుతుంది. కొన్ని సీన్లలో శ్రీనివాస అవసరాల మార్క్ కామెడీ కనిపిస్తుంది. కానీ మొత్తంగా ఎక్కడో క్లారిటీ మిస్ అయిందనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో మొత్తం ఏడు చాప్టర్లు ఉంటాయి. ఒక్కో చాప్టర్ ఒక్కో థీమ్ తో ఉంటుంది. ప్రేమ, ద్వేషం, హాస్యం ఇలా అన్ని భావోద్వేగాలు ఉంటాయి. కానీ వాటిని ఆకట్టుకునే విధంగా తెరకెక్కించడంతో దర్శకుడు విఫలమయ్యాడు. కాలేజీలో హీరోహీరోయిన్ల స్నేహం.. ప్రేమ.. సహజీవనం తదితర సన్నివేశాలతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్ ఇద్దరి మధ్య మనస్పర్థలు.. విడిపోవడం.. ఇలా భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. అయితే కలిసి జీవించాలనుకున్న ఈ జంట.. విడిపోవడానికి గల కారణాలను బలంగా చూపించలేకపోయారు. పార్ట్ పార్ట్‌లుగా చూస్తే కొన్ని సీన్స్ ఆకట్టుకుంటాయి. కానీ ఓవరాల్‌గా మాత్రం అంతగా మెప్పించదు. ఎవరెలా చేశారంటే... సంజయ్గా నాగశౌర్య మెప్పించాడు. లుక్స్ పరంగా చాలా మార్పులు ఉన్న పాత్ర తనది. ఇలాంటి రొమాంటిక్ ఫీల్ గుడ్ సినిమాలు.. పాత్రలు నాగశౌర్యకు కొత్తేమి కాదు. గత సినిమాల్లో మాదిరే లవర్ బాయ్‌గా సంజయ్ చక్కగా నటించాడు. ఇక అనుపమగా మాళవికా నాయర్ తనదైన నటనతో ఆకట్టుకుంది. సినిమా మొత్తం వీరిద్దరి పాత్రల చుట్టే తిరుగుతుంది. గిరిగా అవసరాల శ్రీనివాస్ ఉన్నంతలో మెప్పించాడు. వాలెంటైన్ గాఅభిషేక్ మహర్షి తనదైన కామెడీతో నవ్వించాడు, కీర్తిగా శ్రీవిద్య, పూజగా మేఘ చౌదరితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. కళ్యాణి మాలిక్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు కథకి తగ్గట్టుగా ఉన్నాయి. సునీల్ కుమార్ నామ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
ఈ సినిమాలో వచ్చే ఎమోషన్ ఏ తెలుగు సినిమాలోనూ చూడలేదు: అవసరాల
నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టీజీ విశ్వప్రసాద్, దాసరి పద్మజ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం మేం చాలా కష్టపడ్డాం. మా కష్టం థియేటర్స్‌లో తెలుస్తుంది. నా కెరీర్లో ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాల గురించి ఎలా చెప్పుకున్నానో ‘ఫలానా..’ సినిమా గురించి అంతే బాగా చెప్పుకుంటాను. ఈ సినిమా విజయం పట్ల నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలోని పాత్రలు నిజజీవితంలో చూసినట్లుగా ఉంటాయి. ఎమోషనల్ మూవీ ఇది. నటనపై ఆధారపడ్డ సినిమా కాబట్టే సింక్ సౌండ్ ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమాలోని సంజయ్ పాత్రకు నాగశౌర్య బాగా సరిపోయాడు. ఏడు చాప్టర్లు ఉండే ఈ సినిమాలోని నాలుగో చాప్టర్ నాకు చాలా ఇష్టం. ఇంటర్వెల్‌కి ముందు వచ్చే ఈ చాప్టర్లో వచ్చే ఎమోషన్ ఇంతవరకు నేను తెలుగు సినిమాల్లో చూడలేదనేది నా అభిప్రాయం’’ అన్నారు అవసరాల శ్రీనివాస్. ‘‘నాగశౌర్య, మాళవికల సహజ నటన కోసం ఈ సినిమా చూడొచ్చు’’ అన్నారు చిత్ర సహనిర్మాత వివేక్ కూచిభొట్ల.‘‘ఇంత మంచి సినిమాలో మమ్మల్ని భాగం చేసిన విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్లగారికి థ్యాంక్స్’’ అన్నారు దాసరి ప్రసాద్. -
ఈ వారం థియేటర్/ ఓటీటీలో అలరించే చిత్రాలివే
టాలీవుడ్లో ప్రస్తుతం చిన్న చిత్రాల హవా కొనసాగుతుంది. గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్ బరిలో పెద్ద చిత్రాలేవి లేకపోవడంతో.. వరుసగా చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ వారం కూడా అటు ఓటీటీలో ఇటు థియేటర్స్‌లో చిన్న చిత్రాలే రిలీజ్ కాబోతున్నాయి. మార్చి మూడో వారంలో రిలీజ్ కాబోతున్న సినిమాలపై ఓ లుక్కేయండి. కబ్జ కన్నడ స్టార్స్ ఉపేంద్ర, సుదీప్, శివరాజ్ కుమార్ హీరోలుగా నటంచిన మల్టీస్టారర్ ‘కబ్జ’. ఆర్. చంద్రు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రముఖ హీరో పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 17న తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత నటుడు నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 'కళ్యాణ వైభోగమే' చిత్రంలో నాగశౌర్యకు జోడిగా నటించి వెండితెరపై మ్యాజిక్ చేసిన మాళవిక నాయర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 17న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ‘సార్’ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తొలిసారిగా తెలుగులో కథానాయకుడిగా నటించిన చిత్రం సార్. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి 17న విడుదలై సూపర్ హిట్ కొట్టింది. సంయుక్తా మీనన్ హీరోయిన్. సముద్రఖని, హైపర్ ఆది, తనికెళ్ళ భరణి, అక్కినేని సుమంత్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించారు. ఇక థియేటర్ ఆడియన్స్‌ను అలరించిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్దమైంది. ఈ నెల 17 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. సత్తిగాని రెండెకరాలు ‘పుష్ప’ స్నేహితుడిగా నటనకు గానూ మంచి మార్కులు కొట్టేసిన జగదీశ్ ప్రతాప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సత్తిగాని రెండెకరాలు’. దీనికి అభినవ్ రెడ్డి దర్శకుడు. వెన్నెల కిశోర్ .. మోహనశ్రీ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్న ఈ మూవీ మార్చి 17వ తేదీ నుంచి ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. రైటర్ పద్మభూషన్ కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రైటర్ పద్మభూషన్’. ఫిబ్రవరి 3న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొని మంచి విజయం సాధించింది. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్దమైంది. మార్చి 17నుంచి ప్రముఖ ఓటీటీ జీ5లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు.. మనీషాట్- మార్చి 15 కుత్తే (హిందీ చిత్రం)- మార్చి 16 షాడో అండ్ బోన్(వెబ్ సిరీస్-సీజన్ 2)- మార్చి 16 మేస్ట్రో(వెబ్ సిరీస్)- మార్చి 17 ఇన్ హిజ్ షాడో మార్చి(సినిమా)- మార్చి 17 ది మెజిషియన్ ఎలిఫెంట్(సినిమా)- మార్చి 17 అమెజాన్ ప్రైమ్ వీడియో బ్లాక్ ఆడమ్(ఇంగ్లీష్)- మార్చి 15 డోమ్ (వెబ్ సిరీస్-సీజన్ 2)- మార్చి 17 ఆహా.. సత్తిగాని రెండెకరాలు(తెలుగు)- మార్చి 17 లాక్డ్ (వెబ్ సిరీస్ సీజన్ 2)- మార్చి 17 జీ5 లాక్(తమిళం)- మార్చి 17 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.. పాప్ కౌన్(హిందీ సిరీస్)- మార్చి 17 సోనీ లివ్.. రాకెట్ బాయ్స్(హిందీ సిరీస్ 2)- మార్చి 16 -
అదిరిపోయే అందాలతో మెస్మరైజ్ చేస్తున్న మాళవిక నాయర్ (ఫోటోలు)
-
‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అవార్డులపై నమ్మకం పోయింది : మ్యూజిక్ డైరెక్టర్
‘‘ఓ సినిమా సంగీతం విషయంలో అధిక భాగం దర్శకుల పాత్ర ఉంటుంది. దర్శకుడి అభిరుచిని బట్టే సినిమా, సంగీతం ఉంటాయి. నా సంగీతం బాగుందంటే అందులో ఎక్కువ క్రెడిట్ నా దర్శకులకే ఇస్తాను’’ అన్నారు సంగీత దర్శకుడు కళ్యాణీ మాలిక్. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు కళ్యాణీ మాలిక్ మాట్లాడుతూ– ‘‘2003లో నా తొలి సినిమా ‘ఐతే’ రిలీజైంది. ఈ 20 ఏళ్లలో ‘ఫలానా అబ్బాయి..’ నా 19వ సినిమా. సంవత్సరానికో సినిమా చేస్తున్నాను. ఈ ప్రయాణంలో నా సంగీతానికి ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఆ విషయంలో సంతృప్తిగా ఉన్నాను. నా కెరీర్లో ‘ఫలానా అబ్బాయి..’ లోని ‘కనుల చాటు మేఘమా..’ ఉత్తమ పాట అని చెప్పగలను. ఈ పాటకు జాతీయ అవార్డు వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాను. కానీ జాతీయ అవార్డులు ఎవరికి ఇస్తారో, అవి ఎలా వస్తాయో ఈ మధ్య ఓ ఫ్రెండ్ చెప్పాడు. దాంతో అవార్డులపై నమ్మకం పోయింది. నాకిప్పటివరకూ ఒక్క అవార్డు కూడా రాలేదు. ‘ఊహలు గుసగుసలాడే’లోని ‘ఏం సందేహం లేదు..’ పాటని నేను, సునీత పాడాం. సునీతకు అవార్డు వచ్చింది కానీ నాకు రాలేదు. అప్పటి నుంచి అవార్డుల గురించి పట్టించుకోవడం మానేశా. నా సినిమా, నా పాట నచ్చి ఎవరైనా నిర్మాత నాకు మరో చాన్స్ ఇస్తే అదే పెద్ద అవార్డుగా భావిస్తాను. మా అన్నయ్య (కీరవాణి) స్వరపరిచిన ‘నాటు నాటు..’ ఆస్కార్ బరిలో నిలవడం గర్వంగా ఉంది. ఇక నేను సంగీతం అందించిన ‘ఇంటింటి రామాయణం’, ‘విద్య వాసుల అహం’ చిత్రాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నా యి. రెండు వెబ్ సిరీస్‌లు చేస్తున్నా’’ అన్నారు. -
ఇవాళే కలిశారు తొలిసారిగా..
నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్ కానుంది. కళ్యాణీ మాలిక్ సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచి ‘ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయ్.. ఫలానా అబ్బాయ్ ఫలానా అమ్మాయ్.. ఇవాళే కలిశారు తొలిసారిగా..’ అంటూ సాగే రెండో పాటని సోమవారం విడుదల చేశారు. గాయని నూతన మోహన్, కళ్యాణీ మాలిక్ పాడిన ఈ పాటకి భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించారు. ‘‘హీరో, హీరోయిన్ల పరిచయ గీతం ఇది. ఈ చిత్రంలో మూడు పాటలు రాశాను’’ అన్నారు భాస్కరభట్ల రవికుమార్. ఈ చిత్రానికి సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, కెమెరా: సునీల్ కుమార్ నామ, సంగీతం: కళ్యాణీ మాలిక్, వివేక్ సాగర్ (కాఫీఫై సాంగ్). -
ముద్దు సీన్ గురించి మాళవికకు ముందే చెప్పాను: అవసరాల శ్రీనివాస్
‘‘నటీనటుల నుంచి సహజమైన నటనను రాబట్టుకోవడం అనేది దర్శకుడిగా నాకున్న బలం. ఫ్రేమ్‌లో నటీనటులు ఎలా యాక్ట్ చేస్తున్నారనే విషయాన్నే నేను ముందు చూస్తాను. నన్ను, నా కథను, నా కొత్త ప్రయోగాన్ని మా నిర్మాతలు నమ్మారు. ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమా విజయం సాధిస్తుంది’’ అన్నారు రచయిత, దర్శక–నటుడు అవసరాల శ్రీనివాస్. నాగర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటించారు. టీజీ విశ్వప్రసాద్, దాసరి పద్మజ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకర్ల సమావేశంలో చిత్రదర్శకుడు అవసరాల శ్రీనివాస్ పంచుకున్న విశేషాలు. ► ఈ సినిమాలో ఏడు అధ్యాయాలు ఉన్నాయి. ప్రతి అధ్యాయం నిడివి దాదాపు 20 నిమిషాలు ఉంటుంది. కథ రీత్యా 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వయసు వరకు నాశౌర్య, మాళవిక పాత్రల ప్రయాణం ఉంటుంది. ఏడు చాప్టర్లూ ఈ పదేళ్ల వ్యవధిలోనే జరుగుతాయి. ► వయసుకి తగ్గట్లుగా పాత్ర తాలూకు ప్రవర్తన, ఆహార్యంలో వ్యత్యాసం చూపించడానికి నాగశౌర్య ఎంతో కష్టపడ్డారు. నిజజీవితంలో నేను చూసిన కొన్ని ఘటనల ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నాను. పాత్రలు, సంభాషణలు చాలా సహజంగా ఉంటాయి. మనకు తెలిసిన కథలా, మనలో ఎవరో ఒకరి కథలా ఈ సినిమా ఉంటుంది. ► నాకు ఇష్టమైన యాక్టర్స్‌లో నాగశౌర్య ఒకరు. ఈ సినిమా యూకే షెడ్యూల్ కోసం 40 మందికి వీసాలు అప్లయ్ చేస్తే పదిమందికే ఓకే అయ్యాయి. దీంతో షూటింగ్ కోసం కొన్ని ఇబ్బందులు పడ్డాం. కానీ సెట్స్‌లో తన యాక్టింగ్‌తో నాగశౌర్య ఆ ఇబ్బందులను మర్చిపోయేలా చేసేవారు. ఈ సిని మాలో నాగశౌర్య పెర్ఫార్మెన్స్ ఎంత బాగుందనేది థియేటర్స్‌లో చూస్తారు. అలాగే ఈ సినిమాలో ముద్దు సీన్ ఉన్నట్లు మాళవికకు ముందే చెప్పాను. ఓ సన్నివేశానికి సరైన కారణాలు ఉంటే, కథకి ఖచ్చితంగా అవసరం అనిపిస్తే నటీనటులు ఆ సీన్లో యాక్ట్ చేయడానికి ఓకే అంటారన్నది నా అభిప్రాయం. ‘అష్టా చమ్మా’ చిత్రం నుంచే నాకు సంగీత దర్శకుడు కళ్యాణీ మాలిక్ తెలుసు. ఈ సినిమాకు ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చారు. ‘కనుల చాటు..’ పాటను కీరవాణిగారు మెచ్చుకోవడంతో కళ్యాణీగారు ఇంకా సంతోషంగా ఉన్నారు. ► హిందీ ‘బ్రహ్మాస్త్రం’ టీమ్ ఓ సారి నాకు ఫోన్ చేసి తెలుగు డైలాగ్స్ రాస్తారా? అని అడిగారు. అప్పటికే ఆ సినిమా గురించి నాకు అవగాహన ఉండటంతో సరే అన్నాను. అలా ‘అవతార్ 2’కూ అవకాశం వచ్చింది. అయితే ఇంగ్లిష్ సినిమాలకు తెలుగు డైలాగ్స్ రాయడం చాలా కష్టం. కానీ చాలెంజ్‌గా తీసుకుని రాశాను. ఇక నటుడిగా ‘కన్యాశుల్కం’ వెబ్ సిరీస్ చేశాను. దర్శకుడిగా నా తర్వాతి చిత్రం గురించి త్వరలో అధికారికంగా చెబుతాను.