ఇవాళే కలిశారు తొలిసారిగా.. | Phalana Abbayi Phalana Ammayi second song launch | Sakshi
Sakshi News home page

ఇవాళే కలిశారు తొలిసారిగా..

Published Tue, Mar 7 2023 4:58 AM | Last Updated on Tue, Mar 7 2023 4:58 AM

Phalana Abbayi Phalana Ammayi second song launch - Sakshi

నాగశౌర్య, మాళవికా నాయర్‌

నాగశౌర్య, మాళవికా నాయర్‌ జంటగా శ్రీనివాస్‌ అవసరాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న రిలీజ్‌ కానుంది. కళ్యాణీ మాలిక్‌ సంగీతం అందించారు.

ఈ చిత్రం నుంచి ‘ఫలానా అబ్బాయ్‌ ఫలానా అమ్మాయ్‌.. ఫలానా అబ్బాయ్‌ ఫలానా అమ్మాయ్‌.. ఇవాళే కలిశారు తొలిసారిగా..’ అంటూ సాగే రెండో పాటని సోమవారం విడుదల చేశారు. గాయని నూతన మోహన్, కళ్యాణీ మాలిక్‌ పాడిన ఈ పాటకి భాస్కరభట్ల రవికుమార్‌ సాహిత్యం అందించారు. ‘‘హీరో, హీరోయిన్ల పరిచయ గీతం ఇది. ఈ చిత్రంలో మూడు పాటలు రాశాను’’ అన్నారు భాస్కరభట్ల రవికుమార్‌. ఈ చిత్రానికి సహనిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, కెమెరా: సునీల్‌ కుమార్‌ నామ, సంగీతం: కళ్యాణీ మాలిక్, వివేక్‌ సాగర్‌ (కాఫీఫై సాంగ్‌).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement