ముద్దు సీన్‌ కావాలని చేసింది కాదు: మాళవిక నాయర్ | Malvika Nair Clarity On Kiss Scenes with Naga Shaurya | Sakshi
Sakshi News home page

Malvika Nair: ముద్దు సీన్లతో నాకేలాంటి సమస్య లేదు: మాళవిక నాయర్

Published Tue, Mar 14 2023 3:22 PM | Last Updated on Tue, Mar 14 2023 3:41 PM

Malvika Nair Clarity On Kiss Scenes with Naga Shaurya - Sakshi

‘ఎవడే సుబ్రమణ్యం’తో టాలీవుడ్ పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ మాళవిక నాయర్. ప్రస్తుతం నాగశౌర్యకు జంటగా ఫలానా అబ్బాయి- ఫలానా అమ్మాయి సినిమాలో నటిస్తోంది. అవసరాస శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవిక సినిమాకు సంబంధించి పలు ఆసక్తిసకర విషయాలను పంచుకున్నారు. సినిమాల్లో బోల్ట్ సీన్ అంటే హీరోయిన్లకు కాస్తా కష్టంగానే ఫీలవుతారు. ఈ సినిమాలో అలాంటి సీన్లలో నటించడంపై మాళవిక స్పందించింది. ఈ చిత్రంలో బోల్డ్ సీన్స్ చేసి ఆడియన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది ముద్దుగుమ్మ. ఈ సినిమాలో తొలిసారి మాళవిక ముద్దు సీన్లలో నటించడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

ముద్దు సీన్‌పై మాళవిక మాట్లాడుతూ..'ముద్దు సీన్‌లో నటించినందుకు నాకు ఎలాంటి ఇబ్బందిగా లేదు. ఎందుకంటే అది కావాలని పెట్టిన సీన్ కాదు. కథలో భాగమే. ఆ సీన్ కథకు చాలా అవసరమైన సన్నివేశం. అందుకే ముద్దు సీన్‌లో నటించాల్సి వచ్చింది. సాధారణ ప్రేమ కథా చిత్రాల కంటే ఈ సినిమా భిన్నంగా ఉంటుంది. ఇందులో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి. ఈ సినిమాలో నా అనుపమ పాత్ర ఎంతో నచ్చింది. నటిగా నన్ను నేను నిరూపించుకునే పాత్రలో నటించడం ఆనందంగా ఉంది.'  అని అన్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement