
హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. తాజాగా ఆయన మీటర్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రమేష్ కాడూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా యంగ్ హీరోయిన్ అతుల్య రవి ఇందులో నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో తొలిసారిగా కిరణ్ అబ్బవరం పోలీస్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది.
ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేసింది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సీక్వెన్స్ ట్రైలర్ ఆసక్తిగా మలిచారు. ఈ ట్రైలర్ చూస్తుంటే కిరణ్ అబ్బవరం ఈసారి లవ్, రొమాన్స్, కామెడీ, పైట్స్‌తో ఫుల్ ఎంటర్‌టైన్ ఇవ్వబోతున్నాడని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. ఇందులోనిపవర్ ఫుల్ డైలాగ్స్ అయితే బాగా ఆకట్టుకుంటున్నాయి.
‘భగవంతుడి ముందు భక్తితోను .. బలవంతుడి ముందు భయంతోను ఉండాలి’ అనే డైలాగ్ ట్రైలర్ కి హైలైట్‌గా నిలిచింది. కాగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. కిరణ్ అబ్బవరం కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇది. ఈ చిత్రానికి సాయి కార్తిక్ సంగీతం అందించాడు. ఇందులో కిరణ్ సరసన అతుల్యా రవి కథానాయికగా నటించింది.