Kiran Abbavaram's 'Meter' Movie Locks This OTT Platform - Sakshi
Sakshi News home page

Meter Movie OTT: ‘మీటర్‌’ మూవీ ఓటీటీ ఓటీటీ పార్ట్‌నర్‌ ఇదే! స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే

Published Sat, Apr 8 2023 8:09 AM | Last Updated on Sat, Apr 8 2023 8:38 AM

Kiran Abbavaram Meter Movie Locks The OTT Platform - Sakshi

యంగ్‌ టాలంటెడ్‌ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం నటించిన లేటెస్ట్‌ మూవీ మీటర్‌. రివేంజ్ డ్రామాతో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈసినిమా శుక్రవారం(ఏప్రిల్‌ 7న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ర‌మేష్ క‌దూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో  కిరణ్‌ అబ్బవరంకు జోడిగా అతుల్యా రవి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించారు. థియేటర్లో విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనను అందుకుంటోంది. రొటీన్‌ రివెంజ్‌ ఫార్ములా ఉందంటూ ఓ వర్గం ప్రేక్షకులు సినిమాపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి నెలకొంది.  ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. థియేట్రికల్‌ రన్‌ అనంతరం రెండు నెలల తర్వాతే ఏ చిత్రమైన ఓటీటీలోకి వస్తుంది. ఈ లెక్కన మే మొదటి వారంలో మీటర్‌ ఓటీటీకు రానుంది. కానీ ఈ మధ్య సినిమా ఫలితాన్ని బట్టి డిజిటల్‌లో రిలీజ్‌ చేస్తున్నారు. కొన్ని సినిమాలైతే విడుదలైన నెల రోజులకే ఓటీటీ బాటపడుతున్నాయి. మరి మీటర్‌ మూవీ ఎప్పుడు ఓటీటీకి వస్తుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. 

మీట‌ర్ క‌థేమిటంటే...
ఇష్టం లేక‌పోయినా తండ్రి కోరిక మేర‌కు పోలీస్‌ జాబ్‌లో(ఎస్ఐగా) జాయిన్ అవుతాడు అర్జున్ క‌ళ్యాణ్ (కిర‌ణ్ అబ్బ‌వ‌రం). అయితే ఈ ఉద్యోగాన్ని వ‌దిలిపెట్టే అవ‌కాశం కోసం ఎదురుచూస్తుంటాడు. ఎలక్ష‌న్స్‌లో గెలిచి తిరిగి అధికారం చేప‌ట్టేందుకు హోమ్ మినిస్ట‌ర్ బైరెడ్డి వేసిన ఓ ప్లాన్ కార‌ణంగా అర్జున్ క‌ళ్యాణ్ జీవితం ఎలాంటి మ‌లుపులు తిరిగింద‌నే పాయింట్‌తో ర‌మేష్ క‌దూరి మీట‌ర్ సినిమాను రూపొందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement