యువహీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా 'క'. గురువారం ట్రైలర్ రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సాంకేతిక కారణాల వల్ల కుదరలేదు. దీంతో తాజాగా దాన్ని రిలీజ్ చేశారు. పూర్తి రిచ్‌నెస్‌తో థ్రిల్లింగ్‌గా భలే అనిపించింది.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)
'క' ట్రైలర్ చూస్తే.. చుట్టూ కొండల మధ్య కృష్ణగిరి అనే అందమైన ఊరి. అక్కడ పోస్ట్ మ్యాన్ అభినయ వాసుదేవ్. మధ్యాహ్నమే చీకటి పడే ఈ ఊరు. 1979 ఏప్రిల్ 22న అభిషేక్ పేరుతో వచ్చిన ఉత్తరం వాసుదేవ్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ ఉత్తరంలో ఏముందో చెప్పమంటూ ఓ ముసుగు వ్యక్తి వాసుదేవ్‌ని బెదిరిస్తాడు. ఆ ఉత్తరంలో ఏముంది ?, వాసుదేవ్ ను ఆ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు ? అనేదే స్టోరీ.
గ్రిప్పింగ్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా 'క' సినిమా ఉండబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. ఈ సినిమాలో కిరణ్ సరసన నయన్ సారిక, తన్వీ రామ్ నటించారు. సుజీత్-సందీప్ దర్శకులు. దీపావళి సందర్భంగా ఈ నెల 31న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో థియేటర్లలో రిలీజ్ అవుతోంది.
(ఇదీ చదవండి: 'నరుడి బ్రతుకు నటన' సినిమా రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment