మీటర్ సినిమాతో తన కల నెరవేరిందంటున్నాడు నటుడు కుమార్ కాసారం. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ‘మీటర్’ సినిమాలో కుమార్ కాసారంకు మంచి పాత్ర లభించింది. యూట్యూబ్‌లో కుమార్ షార్ట్ ఫిల్మ్ చూసి ఇంప్రెస్ అవ్వడంతో దర్శకుడు రమేశ్ ‘మీటర్’లో నటించే అవకాశం ఇచ్చారట. ఇటీవల జరిగిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో కిరణ్ మాట్లాడుతూ.. కుమార్ కాసారంపై ప్రశంసలు కురించాడు. అతనితో కలిసి చేసిన షార్ట్ ఫిల్మ్ జర్నీని గుర్తు చేసుకుంటూ.. కుమార్ చాలా ప్రతిభావంతుడని కితాబిచ్చాడు. ‘మీటర్’ ప్రిరిలీజ్ తర్వాత తనకు వరుస ఆఫర్లు వస్తున్నాయని కుమార్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే హీరోగా ఓ చిత్రాన్ని పూర్తి చేశానని.. త్వరలోనే ఓ కొత్త బ్యానర్‌లో మరో చిత్రాన్ని చేయబోతున్నట్లు వెల్లడించారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన ‘కుమార్ కాసారం’కు చిన్నప్పటి నుంచి సినిమాలంటే మక్కువ. బీటెక్ పూర్తి చేసిన తర్వాత సాఫ్ట్ వేర్ కంపెనీ లో పనిచేస్తూ షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేయడం మొదలుపెట్టారు. అయినప్పటికీ, సినిమాలపై అతని ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు. సినిమా పరిశ్రమలో వృత్తిని కొనసాగించడానికి తన ఉద్యోగాన్ని సైతం విడిచిపెట్టాడు. మజిలీ, ఓ బేబీ, సర్ & కొండ వంటి సినిమాల్లో యాక్టర్ గా నిడివి తక్కువ ఉన్నప్పటికీ ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు సైన్ చేస్తున్నాడు. మరి షార్ట్ ఫిల్మ్ హీరో సిల్వర్ స్క్రీన్‌పై ఏ మేరకు రాణిస్తాడో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment