‘రవితేజ, నానీగార్ల తర్వాత ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు కిరణ్. అతని ప్రధాన బలం సహజమైన నటన, డైలాగ్ డెలివరీ. ‘మీటర్’తో తనకి మాస్ హిట్ రావాలి’’ అని డైరెక్టర్ గోపీచంద్ మలినేని అన్నారు. కిరణ్ అబ్బవరం, అతుల్యా రవి జంటగా రమేష్ కడూరి దర్శకత్వం వహించిన చిత్రం ‘మీటర్’. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ– ‘‘అసలు సిసలైన కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘మీటర్’. రమేష్‌గారు ఈ సినిమాలో నన్ను వైవిధ్యంగా చూపించారు. ఏప్రిల్ 7న మీటర్లు బ్లాస్ట్ అవుతాయి.. నన్ను నమ్మండి’’ అన్నారు. ‘‘మీటర్’ ప్రీమియర్ చూశాను.. చాలా బావుంది. ఈ వేసవిలో మంచి కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్ ఇది’’ అన్నారు నవీన్ యెర్నేని. ‘‘ఈ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. ‘‘ఈ సినిమా ఫుల్ మీల్స్‌లా ఉంటుంది’’ అన్నారు రమేష్ కడూరి.
Comments
Please login to add a commentAdd a comment