Nargis Fakhri Reveals She Has A Problem With Nudity - Sakshi
Sakshi News home page

Nargis Fakhri: స్క్రీన్‌పై లెస్బియన్‌గా నటించడం నచ్చదు: నర్గీస్ ఫక్రీ

Published Tue, Jul 11 2023 5:24 PM | Last Updated on Tue, Jul 11 2023 6:26 PM

Nargis Fakhri reveals she has a problem with OTT Bold Content - Sakshi

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఓటీటీల హవా నడుస్తోంది. పెద్ద  సినిమాలు థియేటర్లో సందడి చేస్తుండగా.. చిన్న సినిమాలు మాత్రం నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. అయితే ఓటీటీలో వచ్చే సినిమాలకు సెన్సార్ లేకపోవడంతో కొన్ని సీన్స్ మరింత బోల్డ్‌గా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఓటీటీలో వచ్చే సినిమాల్లో శృంగార సన్నివేశాలు ఎక్కువగానే చూపిస్తున్నారని అన్నారు.

(ఇది చదవండి: లేటు వయసులో నటుడి పెళ్లి.. మళ్లీ హనీమూన్ కూడానా?)

అయితే ఓటీటీలో అలాంటి సీన్స్‌ పట్ల తాజాగా తన అభిప్రాయం చెప్పుకొచ్చింది నర్గీస్ ఫక్రీ. అయితే ప్రస్తుతం నర్గీస్ ఫక్రీ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నటి ఓటీటీలో బోల్ట్‌ కంటెంట్‌పై పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. వెబ్ సిరీస్‌లో శృంగార సన్నివేశాల్లో నటించాల్సి వస్తే తన దుస్తులు తీసివేయనని స్పష్టం చేసింది.

ఇంటర్వ్యూలో నర్గీస్ మాట్లాడుతూ.. 'నాకు నగ్నంగా ఉండాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏ ప్రాజెక్ట్‌లోనూ నగ్నంగా నటించను. అలాంటి సీన్స్ చేయాల్సి వస్తే తన దుస్తులు మాత్రం తీసివేయను. అంతే కాకుండా స్క్రీన్‌పై లెస్బియన్‌గా నటించడం, మరొక స్త్రీని వివాహం చేసుకున్న స్త్రీగా చూపించడం తనకు ఇష్టముండదు. నేను దానిని పట్టించుకోను కూడా. ఏ పాత్ర అయినా అది కచ్చితంగా నటనలో ఓ భాగం.' ‍అని అన్నారు.

(ఇది చదవండి: టమాటా ధరల ఎఫెక్ట్.. స్టార్ హీరో అభిమానులు ఏం చేశారంటే?)

కుటుంబ సభ్యులతో కలిసి ఓటీటీ కంటెంట్ చూడటం అసౌకర్యంగా అనిపిస్తోందా? అని ప్రశ్నించగా.. అది వారి వ్యక్తిగత విషయమని చెప్పుకొచ్చింది. కాగా.. నర్గీస్ ఫక్రీ త్వరలోనే పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లులో కనిపించనుంది.  అంతే కాకుండా ఓటీటీల వల్ల నటీనటులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. విభిన్నమైన పాత్రల్లో నటించేందుకు అవకాశముందని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement