Nia Sharma Brutally Trolled for Wearing Backless Top - Sakshi
Sakshi News home page

Nia Sharma: డ్రెస్ వేసుకునేందుకు కూడా టైం లేదా?.. నెటిజన్స్ దారుణ ట్రోల్స్!

Published Tue, Jul 11 2023 2:14 PM | Last Updated on Tue, Jul 11 2023 3:42 PM

Nia Sharma Mercilessly Trolled For Wearing Bold Backless Outfit - Sakshi

బాలీవుడ్ బుల్లితెర భామ నియా శర్మ బీ టౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఆమె ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై, జమై రాజా, ఇష్క్ మే మార్జవాన్, నాగిన్ -4 సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఆమెకు ఇన్‌స్టాలో దాదాపు 8 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్కడికెళ్లినా ప్రతిసారి ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ ముద్దు గుమ్మ షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. 

(ఇది చదవండి: లేటు వయసులో నటుడి పెళ్లి.. మళ్లీ హనీమూన్ కూడానా?)

తాజాగా ఆమె తన స్నేహితుడి పుట్టినరోజు పార్టీలో నియా శర్మ బ్యాక్‌సైడ్ ఎలాంటి దుస్తులు లేకుండా కనిపించి అభిమానులకు షాకిచ్చింది. అయితే ఆ వీడియోలో నియా శర్మ పూర్తిగా బ్యాక్ లెస్‌గా కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. 

ఓ నెటిజన్‌ రాస్తూ ఉర్ఫీ జావెద్‌ను ఆదర్శంగా తీసుకున్నారా? అంటూ రాసుకొచ్చాడు. ఆమెకు కనీసం దుస్తులు వేసుకోనేందుకు కూడా టైం లేదా అంటూ రాశారు. అంతేకాకుండా మరో నెటిజన్ రాస్తూ ఏకంగా దుపట్టానే డ్రెస్‌గా మార్చిసేంది అంటూ కామెంట్ చేశాడు. మరికొందరేమో చీప్ డ్రెస్సింగ్ అంటూ ట్రోల్స్ చేశారు.  కాగా.. 'ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై' షోతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఆమె రవి దూబేతో కలిసి 'జమై రాజా' అనే ప్రముఖ షోలో కనిపించింది. నియా శర్మ బాక్స్ క్రికెట్ లీగ్, ఖత్రోన్ కే ఖిలాడీ -8, బిగ్ బాస్ ఓటీటీ లాంటి రియాలిటీ షోలలో పాల్గొంది.

(ఇది చదవండి: 14 సార్లు ప్రయత్నించా.. కానీ స్టార్‌ హీరో వల్లే తల్లినయ్యా: బుల్లితెర నటి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement